Essar
-
ఎస్సార్ గ్రూప్ వ్యవస్థాపకులు శశి రుయా కన్నుమూత
ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకులు శశికాంత్ రుయా(81) వృద్ధాప్య కారణాలతో మంగళవారం మృతి చెందారు. ఆయన మృతిపట్ల ఎస్సార్ గ్రూప్ సంతాపం తెలియజేసింది. ‘రుయా జీవితకాలంలో లక్షల మందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో మార్పునకు కారణమయ్యారు. ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. తన వినయం, ఆప్యాయతతో అసాధారణ నాయకుడిగా ఎదిగారు’ అని ఎస్సార్ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది.శశి రుయా 1943లో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన సోదరుడు రవి రుయాతో కలిసి 1969లో ఎస్సార్ గ్రూప్‌ను స్థాపించారు. ఈ గ్రూప్ ద్వారా విభిన్న రంగాల్లో సేవలిందిస్తున్నారు. మొదట ఈ గ్రూప్ చేపట్టిన ప్రముఖ ప్రాజెక్ట్‌ల్లో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ ఔటర్ బ్రేక్ వాటర్ నిర్మాణం ప్రధానమైంది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ విలువ రూ.2.5 కోట్లు. దీన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో ఎస్సార్ గ్రూప్‌నకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.మొదట కన్స్ట్రక్షన్, ఇంజినీరింగ్‌పై దృష్టి సారించిన ఎస్సార్ గ్రూప్ క్రమంగా వంతెనలు, ఆనకట్టలు, పవర్ ప్లాంట్లతో సహా ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టింది. 1980ల నాటికి ఇది చమురు, గ్యాస్ రిజర్వ్‌లను కొనుగోలు చేసి ఇంధన రంగంలోకి విస్తరించింది. 1990ల్లో స్టీల్, టెలికమ్యూనికేషన్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. క్రమంగా ఎస్సార్ గ్రూప్ స్టీల్ ఇండస్ట్రీ, చమురు శుద్ధి కర్మాగారాన్ని అభివృద్ధి చేసింది. అప్పట్లో దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ను రూపొందించడానికి ‘హచిసన్(హచ్)’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తర్వాతి కాలంలో టెలికాం వ్యాపారాన్ని విక్రయించింది. చమురు శుద్ధి కర్మాగారాన్ని రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ ఆధ్వర్యంలోని కన్సార్టియంకు మళ్లించింది.ఎస్సార్ గ్రూప్ ఆధ్వర్యంలోని వ్యాపార విభాగాలుఎస్సార్ ఆయిల్ యూకేఎస్సార్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ ప్లోరేషన్ & ప్రొడక్షన్ఎస్సార్ పవర్ఎస్సార్ పోర్ట్స్ఎస్సార్ షిప్పింగ్ఎస్సార్ స్టీల్ఎస్సార్ మిన్మెట్మెసాబి మెటాలిక్స్ఎస్సార్ ప్రాజెక్ట్స్బ్లాక్ బాక్స్ కార్పొరేషన్‌ది మొబైల్ స్టోర్ఎస్సార్ గ్లోబల్ ఫండ్ లిమిటెడ్ (ఈజీఎఫ్ఎల్)ఎస్సార్ క్యాపిటల్ఎక్స్పెన్షియా వెంచర్స్ఇదీ చదవండి: మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన బంగారం ధరలు..పలు హోదాల్లో గుర్తింపుశశి రుయా దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక సంస్థల్లో కీలక పాత్ర పోషించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మేనేజింగ్ కమిటీలో భాగమయ్యారు. ఇండో-యూఎస్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ (ఐఎన్ఎస్ఏ)కు నాయకత్వం వహించారు. ప్రధానమంత్రి ఇండో-యూఎస్ సీఈఓ ఫోరమ్, ఇండియా-జపాన్ బిజినెస్ కౌన్సిల్లో సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2007లో రుయా అంతర్జాతీయ సమస్యలపై పని చేస్తున్న ‘ది ఎల్డర్స్’ కౌన్సిల్ చేరారు. ఇందులో డెస్మండ్ టుటు, కోఫీ అన్నన్, జిమ్మీ కార్టర్ వంటి ప్రముఖులున్నారు. -
కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్సార్
-
వీవీఐపీల ఫోన్ ట్యాపింగ్ సంచలనం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తల దగ్గర్నుంచి, న్యాయవాదుల వరకు ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే వార్త ఇపుడు సంచలనం మారింది. ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ 2001-06 మధ్య కాలంలో ఈ ట్యాపింగ్ కు పాల్పడిందని ఓ సుప్రీంకోర్టు న్యాయవాది వాదిస్తున్నారు. ఈ మేరకు ఆయన పిల్ కూడా దాఖలు చేశారు. క్యాబినెట్ మంత్రులు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి కార్పొరేట్ వేత్తలు, ప్రముఖ న్యాయవాదుల ఫోన్ల ను ఎస్సార్ సంస్థ ట్యాప్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ నెల 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది సురేన్ ఉప్పల్ దీనిపై 29 పేజీల పిర్యాదు చేశారని కథనాలు తెలుపుతున్నాయి. ఈ ఫిర్యాదు మేరకు ఎస్సార్ మాజీ ఉద్యోగి అల్ బాసిత్ ఖాన్ ఈ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్సార్ సంస్థలో భద్రతా అధిపతిగా చేసే కాలంలో ఖాన్ ప్రముఖుల ఫోన్లకు అంతరాయం కలిగిస్తూ వారి సంభాషణలను రికార్డు చేసేవాడని, మేనేజ్ మెంట్ ఆదేశాల మేరకు అతను ఈ చర్యలకు పాల్పడినట్టు న్యాయవాది పేర్కొన్నారు. కొన్నేళ్లపాటు యథేచ్చగా సాగిన ఈ వ్యవహారం, 2011 మేలో తేడా వచ్చి, ఖాన్ ను సంస్థ నుంచి బయటికి పంపేశారని ఫిర్యాదులో చెప్పారు. ఈ పరిమాణానికి షాకైన ఖాన్ తన దగ్గరున్న టేపులను బయటపెట్టాలనుకున్నాడని, తనను కలిసేందుకు కూడా ప్రయత్నించాడని న్యాయవాది పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించడానికి ప్రస్తుతం ఖాన్ అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. ఫోన్లకు, మెసేజ్ లకు అతను అందుబాటులో లేడని ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు చేసింది. ఈ విషయాలపై మరిన్ని నిజనిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ల ట్యాపింగ్ ను ఎస్సార్ సంస్థ ఖండిస్తోంది. న్యాయవాది స్టేట్ మెంట్ పూర్తిగా తప్పుడు సమాచారమని, అసలు దీనికి ఆధారాలే లేవని ఎస్సార్ సంస్థ పేర్కొంది. అతని డిమాండ్లను సంస్థ నెరవేర్చకపోవడం వల్లే, ఇలా నిందలు వేస్తున్నారని మండిపడింది. అసలు ఎస్సార్ సంస్థ ఎవరి పోన్లపై ఎప్పుడు నిఘా ఉంచలేదని, దీనికోసం అసలు వ్యక్తులనే నియమించలేదని తెలిపింది. ప్రస్తుత రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, మాజీ మంత్రి ప్రఫూల్ పటేల్, రామ్ నాయక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, ఏడీఏజీ చైర్మన్ అనిల్ అంబానీ, అతని భార్య టీనా అంబానీ, కంపెనీల్లోని వివిధ ప్రముఖ అధికారులు, మాజీ కేబినెట్ మంత్రి ప్రమోద్ మహాజన్, ఎంపీ అమర్ సింగ్ ల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాని తెలుస్తోంది. ఈ లిస్టులో ఇంకా చాలామందే ప్రముఖులున్నట్టు సమాచారం.ఈ ట్యాపింగ్ వ్యవహరంపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిపై కేంద్రం వెంటనే విచారణ చేపట్టాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఓ దిగ్భ్రాంతికరమైన వ్యవహారమని, ప్రైవేట్ సర్వీసు ప్రొవేడర్లు చేసే ఈ చర్యలు దేశ రక్షణకు, భద్రతకు హానికరమని జేడీయూ అగ్రనేత శరద్ యాదవ్ అన్నారు. -
ఈ ఏడాది విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ అప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2014) తొలి ఐదు నెలల్లో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) డీల్స్ భారీగా పుంజుకున్నాయి. వెరసి జనవరి నుంచి మే వరకూ 16.37 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. ఇందుకు ఒక్క మే నెలలోనే 4.4 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ జరగడం దోహదపడింది. మేలో మొత్తం 52 లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో అంటే 2013 మే నెలలో 1.7 బిలియన్ డాలర్ల విలువైన 44 లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి. కాగా, జనవరి-మే కాలంలో అత్యధికంగా 230 డీల్స్ జరిగాయి. 2013 ఇదే కాలంలో 216 లావాదేవీలు నమోదుకాగా, వీటి విలువ 8.71 బిలియన్ డాలర్లు మాత్రమే. గ్రాంట్ థార్న్టన్ ఇండియా పార్టనర్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 100 మిలియన్ డాలర్ల డీల్స్: మే నెలలో 100 మిలియన్ డాలర్ల డీల్స్ 8 జరిగాయి. వీటిలో ఒక్కొక్కటీ 500 మిలియన్ డాలర్ల విలువైన మూడు డీల్స్ ఉన్నాయి. కాగా, ఈ విభాగంలో మరోవైపు దేశీ కంపెనీల విదేశీ లావాదేవీలు సైతం పుంజుకోవడం గమనార్హం. మే నెలలో ప్రధానంగా అదానీ పోర్ట్స్ డీల్ చెప్పుకోదగ్గది. ధామ్రా పోర్ట్‌ను 932 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. యునెటైడ్ స్పిరిట్స్‌కు చెందిన వైట్ అండ్ మెకేను ఫిలిప్పీన్స్‌కు చెందిన ఎంపెరేడర్ 725 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. ఇక రిలయన్స్-నెట్వర్క్18 మధ్య జరిగిన డీల్ విలువ 678 మిలియన్ డాలర్లుకాగా, టాటా కమ్యూనికేషన్స్‌కు చెందిన నియోటెల్‌లో 68% వాటాను వొడాకామ్ కొనుగోలు చేసింది. ఇందుకు 455 మిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇదే విధంగా వదీనర్ పవర్లో 74% వాటాను ఎస్సార్ ఆయిల్ 356 మిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకుంది. -
ఆ 10 కంపెనీల అప్పు .. రూ. 6 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజాల రుణభారం నానాటికీ పెరిగిపోతోంది. రిలయన్స్ గ్రూప్ (అడాగ్) సహా జీఎంఆర్, జీవీకే, ల్యాంకో వంటి మొత్తం పది కంపెనీల అప్పుల భారం గత ఆర్థిక సంవత్సరం 15 శాతం పెరిగి రూ. 6 లక్షల కోట్లు మించిపోయింది. లాభదాయకత అంతంత మాత్రంగా ఉండటం కంపెనీలను కుదేలు చేస్తోంది. క్రెడిట్ సూసీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి పది గ్రూప్స్ మొత్తం రుణ భారం రూ. 6,31,025 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది రూ. 5,47,361 కోట్లు. ఈ జాబితాలో అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్ (అడాగ్), వేదాంత, ఎస్సార్, అదానీ, వీడియోకాన్, జేపీ అసోసియేట్స్, జేఎస్‌డబ్ల్యూ కూడా ఉన్నాయి. చాలా మటుకు కంపెనీల రుణభారం..వాటి పెట్టుబడి వ్యయాలను మించిపోయిందని క్రెడిట్ సూసీ పేర్కొంది. ఇప్పటికే ల్యాంకో, జేపీ అసోసియేట్స్, అడాగ్ కంపెనీలు రుణ పునర్వ్యవస్థీకరణ బాట పట్టడం వాటిపై ఉన్న వత్తిడిని తెలియజేస్తుందని తెలిపింది. రూపాయి క్షీణతతో మరింత పైకి.. జీవీకే, ల్యాంకో, అడా సంస్థల రుణభారం అత్యధికంగా దాదాపు 24 శాతం దాకా పెరిగిందని క్రెడిట్ సూసీ పేర్కొంది. దీన్ని తగ్గించుకోవడానికి ఆయా కంపెనీలు వివిధ ఆస్తుల విక్రయాన్ని చేపట్టినప్పటికీ.. పూర్తి స్థాయిలో సాకారం కావడం లేదని వివరించింది. జీఎంఆర్, వీడియోకాన్ మాత్రమే ఈ ప్రయత్నాల్లో కాస్త సఫలమైనట్లు తెలిపింది. రూపాయి క్షీణత, ప్రాజెక్టుల అమల్లో జాప్యాలు మొదలైన అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ కంపెనీల రుణభారం మరింతగా పెరిగే అవకాశముందని క్రెడిట్ సూసీ తెలిపింది. దీంతో అటు బ్యాంకుల అసెట్ క్వాలిటీపైనా మరింత భారం పడగలదని హెచ్చరించింది. చాలా కార్పొరేట్ల రుణాలు 40-70 శాతం మేర విదేశీ కరెన్సీ రూపంలోనే ఉన్న నేపథ్యంలో రూపాయి మరింత క్షీణిస్తే.. అప్పుల భారమూ పెరుగుతుందని క్రెడిట్ సూసీ పేర్కొంది. అత్యధిక విదేశీ రుణాలు ఉన్న సంస్థల్లో అదానీ ఎంటర్ప్రైజ్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. అయితే, జీఎంఆర్ ఇన్ఫ్రా, అదానీ పవర్, రిలయన్స్ పవర్ ప్రాజెక్టులు గానీ అమల్లోకి వస్తే వాటి ఆపరేటింగ్ సామర్ధ్యం రెట్టింపై, కొంత ఊరట లభించగలదని క్రెడిట్ సూసీ తెలిపింది.