even odd formula
-
తెలంగాణలోనూ సరి బేసి విధానం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగించడంతో పాటు పలు రకాల సడలింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలోని జిల్లాల్లో ఉన్న పురపాలికల్లో దుకాణాలను ఒకరోజు తప్పించి మరో రోజు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సరి–బేసి సంఖ్యల విధానం ద్వారా దీనిని అమలు పరచనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ బుధవారం జారీ చేశారు. అన్ని జోన్ల పరిధిలో వీటికే అనుమతి.. రెడ్ జోన్ పరిధిలోని పుర పాలికలతో సహా రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో కిరాణం, పాలు, కూరగాయలు, పండ్లు, మందులు వంటి నిత్యావసర సరుకులు దుకాణాలను యథాతథంగా నిర్వహించుకోవచ్చు. అయితే అదనంగా ఈ కింది దుకాణాలను తెరవడానికి కొత్తగా అనుమతి లభించింది. ►నిర్మాణ రంగంతో ముడిపడి ఉన్న సిమెంట్, స్టీల్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వస్తువులు, ఇతర భవన నిర్మాణ సామగ్రికి సంబంధించిన దుకాణాలు. ►వ్యవసాయ రంగానికి సంబంధించిన దుకాణాలు ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన మేరకు కంటైన్మెంట్ జోన్ల పరిధిలోనివి మినహా అన్ని మద్యం దుకాణాలు. దుకాణాలకు సరి–బేసి సంఖ్యలు ఒకరోజు తప్పించి మరో రోజు తెరవాల్సిన దుకాణాలను సులువుగా గుర్తించేందుకు వాటికి సరి–బేసి సంఖ్యలు కేటాయిస్తారు. 1, 3, 5, 7.. ఇలా బేసి సంఖ్య కలిగిన దుకాణాలను సోమ, బుధ, శుక్రవారాల్లో అనుమతిస్తారు. 2, 4, 6, 8.. వంటి సరి సంఖ్యలు కేటాయించిన దుకాణాలను మంగళ, గురు, శనివారాల్లో అనుమతిస్తారు. ఒక రోజు 50 శాతం దుకాణాలను అనుమతిస్తే మరుసటి రోజు మిగిలిన 50 శాతం దుకాణాలకు అనుమతి ఉంటుంది. పక్కపక్కనే ఉండే రెండు దుకాణాలను ఒకే రోజు తెరిచేందుకు అనుమతి ఉండదు. దుకాణాల్లో పనిచేసే వ్యక్తులు, వినియోగదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మాస్కు లేకుంటే సరుకులు/సేవలు లేవనే నినాదంతో పనిచేయాలి. భౌతిక దూరం పాటించడానికి నాలుగు అడుగుల నిడివితో ఫుట్ మార్కింగ్ చేయాలి. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. లిఫ్టుల బటన్లు, డోర్ హ్యాండిల్స్ వంటి కామన్ టచ్ పాయింట్ల వద్ద ఎరుపు రంగు (డేంజర్)లో సూచిక ఏర్పాటు చేయాలి. వీలున్న చోట ఆటోమేటిక్‌గా తెరుచుకునే డోర్లను ఏర్పాటు చేయాలి. అన్ని జోన్లలో నిషేధం వీటిపైనే.. లాక్డౌన్ అమల్లో ఉన్నంత కాలం అన్ని జోన్ల పరిధిలోని పురపాలికల్లో ఈ కింద పేర్కొన్న వాటిపై నిషేధం కొనసాగనుంది. ►అన్ని పాఠశాలలు/కళాశాలలు/విద్యా/శిక్షణ/కోచింగ్ సెంటర్లు ►రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు వంటి ఆతిథ్య సేవలందించేవి (వైద్య/పోలీసు/అధికారులు/ఆరోగ్య కార్యకర్తలు/చిక్కుకున్న ప్రజలు/టూరిస్టులకు వసతి కల్పిస్తున్న, క్వారంటైన్ సేవలందిస్తున్న హోటళ్లకు మినహాయింపు) ►అన్ని సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్‌పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియం, అసెంబ్లీ హాల్స్ ఇతరత్రాలు ►ప్రార్థనా స్థలాల్లో గూమికూడటం ►అన్ని రకాల సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్య/ మతపర కార్యక్రమాలు/ఇతర సామూహిక కార్యక్రమాలు 65 ఏళ్లకు పైగా వయసు కలిగిన వ్యక్తులు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వ్యక్తులు, గర్భిణిలు, 10 ఏళ్లలోపు పిల్లలు ఇళ్లల్లోనే ఉండాలి. చదవండి: తెలంగాణలో మద్యం జాతర గ్రీన్, ఆరెంజ్ జోన్లలో వీటికి అనుమతి.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ –మల్కాజిగిరి, గద్వాల, వరంగల్ (అర్బన్) జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీల్లో నిషేధించినవి మినహా మిగిలిన అన్నింటినీ ఒక రోజు తప్పించి మరో రోజు (ఆల్టర్నేటివ్ డేస్)లో తెరవాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని జిల్లాలు, పురపాలికల్లో ఈ–కామర్స్‌కు అనుమతి. 7 లేదా 8 నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయి. -
సరి-బేసికి బ్రేక్..!
న్యూఢిల్లీ : కాలుష్య నివారణకు ప్రవేశపెట్టిన సరిబేసి విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం పేర్కొంది. మహిళలను, టూవీలర్స్‌ను కూడా సరి బేసి విధానం కిందకు తీసుకురావాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పుపై సోమవారం మళ్లీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తామని చెప్పింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రత రీత్యా వారిని సరి బేసి విధానం కిందకు తీసుకురావడం సరికాదని అన్నారు. అంతకుముందు వాహనాల సరి–బేసి విధానాన్ని ఏ ప్రాతిపదికన అమలు చేసేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) అంగీకరించింది. సరి సంఖ్య నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ్లపైకి రావచ్చని జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ఎన్జీటీ కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ద్విచక్రవాహనదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు కూడా ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కోరింది. చెత్తను తీసుకెళ్లే వాహనాలు, అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లకు మాత్రమే ఈ నిబంధన నుంచి ఎన్జీటీ మినహాయింపు ఇచ్చింది. కాలుష్యం లెవల్ 300 దాటితే తప్పనిసరిగా సరి- బేసి విధానం తీసుకురావాలని ఆదేశించింది. -
మహిళలకూ మినహాయింపు వద్దు
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించాలంటే సరి-బేసి పద్ధతి నుంచి మహిళలకు, ద్విచక్ర వాహనదారులకు కూడా మినహాయింపు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తెలిపింది. ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని అరికట్టేందుకు మూడోసారి సరి-బేసి పద్ధతిని అవలంబించాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం భావిస్ఓతంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ (ఈపీసీఏ) పలు సూచనలు చేసింది. ఏమాత్రం మినహాయింపులు లేకుండా సరి బేసి పద్ధతిని ఢిల్లీ ప్రభుత్వం అవలంబించాలని తెలిపింది. ఢిల్లీలో రవాణా వ్యవస్థ కారణంగా వచ్చే కాలుష్యంలో 32 శాతం బైకులు, స్కూటర్ల వల్లే వస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అయితే, కేవలం కార్లకే తప్ప బైకులకు, స్కూటర్లకు సరి-బేసి విధానం అమలుకాదు. దాంతోపాటు కేవలం మహిళలు మాత్రమే వెళ్లే కార్లను, సీఎన్జీ వాహనాలను కూడా ఈ నిబంధన నుంచి మినహాయించారు. ఈ అంశంపై మరోసారి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఈపీసీఏలో సభ్య సంస్థ అయిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమితా రాయ్ చౌధురి తెలిపారు. త్వరలోనే సరి-బేసి పద్ధతికి సంబంధించిన నియమాలన్నింటినీ చూసి, మరోసారి ఈ విధానాన్ని అమలుచేస్తే తప్ప కాలుష్యం అదుపులోకి రాదని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అన్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థపై కూడా ఆంక్షలు ఉండటం వల్లే ద్విచక్ర వాహనాలను అనుమతించామని ఆయన చెప్పారు. ఢిల్లీలో రోజూ 40 లక్షల మంది బైకులపైనే వెళ్తారని.. వాటిపై కూడా ఆంక్షలు విధిస్తే దాదాపు 20 లక్షల మంది బస్సులు లేదా మెట్రోరైళ్లలో వెళ్లాల్సి ఉంటుందని, కానీ ఇప్పటికిప్పుడు అంత సామర్థ్యం వాటికి లేదని తెలిపారు. తగిన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటేనే బైకులపై కూడా ఆంక్షలు విధించగలమని ఆయన అన్నారు. -
సగం జీతమే వస్తుంది.. మా గతేంటి?
-
సగం జీతమే వస్తుంది.. మా గతేంటి?
దేశ రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన సరి-బేసి వాహనాల విధానం డ్రైవర్ల పొట్ట కొట్టేలా ఉంది. ఇప్పటివరకు ఈ కోణం వెలుగులోకి రాకపోయినా.. తాజాగా ఢిల్లీలో శుక్రవారం నాడు బయటకు వచ్చిన వాహనాల డ్రైవర్లను 'సాక్షి' పలకరించినప్పుడు ఈ విషయం బయటపడింది. కొత్త చట్టం కారణంగా తాము సగం రోజులు మాత్రమే కార్లు బయటకు తీయాల్సి ఉంటుందని, యజమానులు కూడా ఆ లెక్కన సగం జీతమే ఇస్తామని అంటున్నారని, తమ గతేం కానని ఓ కారు డ్రైవర్ ప్రశ్నించాడు. ఒక యజమానికి రెండు కార్లుండి, వాటిలో ఒకటి సరిసంఖ్యతోను, మరొకటి బేసి సంఖ్యతోను ముగిసేటట్లయితే కొంతవరకు పర్వాలేదు. అప్పుడు కూడా ఇద్దరు డ్రైవర్లలో ఒకరికి ఉద్వాసన తప్పదు. ఇలాంటి సమస్య ఒకటి వస్తుందని స్వయంగా కేజ్రీవాల్ కూడా ఊహించి ఉండరు. తొలి ఫైన్ కట్టారు.. మృదుల్ యాదవ్.. నిన్నటి వరకు ఆయన ఓ మామూలు సర్వసాధారణ ఢిల్లీ పౌరుడు. కానీ ఈ రోజు ఉన్నట్టుండి సెలబ్రిటీ అయిపోయారు. దేశ రాజధానిలో బేసి సంఖ్యతో ముగిసే నెంబర్ ఉన్న కార్లు మాత్రమే శుక్రవారం నాడు రోడ్డుమీదకు రావాలని నిబంధన ఉన్నా, సరిసంఖ్యతో ముగిసే నెంబరున్న తన కారులో బయటకు వచ్చాడు. ట్రాఫిక్ పోలీసులు గుర్తించి, అతడిని ఆపి.. రూ. 2 వేల జరిమానా విధించారు. కొత్త చట్టం అమలు అవుతున్న విషయం తనకు తెలుసని, కానీ అర్జంటుగా వెళ్లాల్సి వస్తోందని మృదుల్ అన్నారు. తన వద్ద ఉన్న కార్లన్నింటికీ సరి సంఖ్యలే చివర ఉన్నాయని, తప్పనిసరి కాబట్టి జరిమానా కట్టి వెళ్తాననని ఆయన చెప్పారు.