
న్యూఢిల్లీ : కాలుష్య నివారణకు ప్రవేశపెట్టిన సరిబేసి విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం పేర్కొంది. మహిళలను, టూవీలర్స్‌ను కూడా సరి బేసి విధానం కిందకు తీసుకురావాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పుపై సోమవారం మళ్లీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తామని చెప్పింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు.
మహిళల భద్రత రీత్యా వారిని సరి బేసి విధానం కిందకు తీసుకురావడం సరికాదని అన్నారు. అంతకుముందు వాహనాల సరి–బేసి విధానాన్ని ఏ ప్రాతిపదికన అమలు చేసేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) అంగీకరించింది. సరి సంఖ్య నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు రోడ‍్లపైకి రావచ్చని జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ఎన్జీటీ కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
ద్విచక్రవాహనదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు కూడా ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాలని కోరింది. చెత్తను తీసుకెళ్లే వాహనాలు, అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లకు మాత్రమే ఈ నిబంధన నుంచి ఎన్‌జీటీ మినహాయింపు ఇచ్చింది. కాలుష్యం లెవల్ 300 దాటితే తప్పనిసరిగా సరి- బేసి విధానం తీసుకురావాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment