Everest Moutain
-
వయసుకు సవాలు విసురుతూ.... మరో సాహసానికి సై!
‘ఈ వయసులో సాహసం ఏమిటి!’ అనుకునే వాళ్లు చాలామందే ఉండొచ్చు. ‘సాహసానికి వయసుతో పనేమిటి?’ అని దూసుకుపోయేవాళ్లు చాలా తక్కువమందే ఉండొచ్చు. అయితే రెండో కోవకు చెందిన చాలా తక్కువ మందే చాలా ఎక్కువమందికి స్ఫూర్తి ఇస్తుంటారు బచేంద్రిపాల్ ఈ కోవకు చెందిన మహిళ. బచేంద్రిపాల్... పర్వతాలు పులకరించే పేరు. సాహసాలు అమితంగా ఇష్టపడే పేరు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలిభారతీయ మహిళగా ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. అరవై ఏడు సంవత్సరాల పాల్ ఈ వయసులోనూ మరో సాహసయాత్రకు సిద్ధం అవుతున్నారు. సాహసానికి సై అంటున్నారు. యాభై ఏళ్లు దాటిన తొమ్మిదిమంది మహిళలతో కలిసి అపూర్వ సాహస యాత్ర చేయబోతున్నారు. బృందానికి నాయకత్వం వహిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి మొదలయ్యే యాత్ర లద్దాఖ్‌లో ముగుస్తుంది. హిమాలయపర్వతశ్రేణుల గుండా సుమారు అయిదు నెలల పాటు సాగే యాత్ర ఇది. ఈ యాత్రలో వయసు పరిమితులు, వాతావరణ ప్రతికూలతలు, పదిహేడువందల అడుగులకుౖ పెగా ఎత్తు ఉన్న ‘లంకాగ’లాంటి పర్వతాలు సవాలు విసరనున్నాయి. ఈ సాహస బృందంలోని సభ్యులు: 1. బచేంద్రిపాల్ (67, ఉత్తర్ కాశీ) 2. గంగోత్రి సోనేజి (62, బరోడా) 3. శ్యామలాపద్మనాభన్ (64, మైసూర్) 4. చేతనా సాహు (54, కోల్‌కతా) 5. పాయో ముర్ము (53, జంషెడ్పూర్) 6. చౌలా జాగిర్దార్ (63, పాలన్పుర్) 7. సవితా దప్వాల్ (52, భిలాయ్) 8. డాక్టర్ సుష్మా బిస్సా (55, బికనేర్) 9. బింబ్లా దేవోస్కర్ (55, నాగ్‌పుర్) 10. మేజర్ కృష్ణ దూబే (59, లక్నవూ) ‘సాహసాలకు ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, ఇక చాలు అనిపించవు. ప్రతీ సాహసం దేనికదే ప్రత్యేకతగా నిలుస్తుంది. కొత్త అనుభూతులను ఇస్తుంది. యాభై సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధమైనప్పుడు సాహసయాత్ర కాదు దుస్సాహస యాత్ర చేస్తున్నావు అని హెచ్చరించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. యాభై ఏళ్ల వయసులో ఇదేం పని! అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. అయితే నేను వాటిని మనసులోకి తీసుకోలేదు. లక్ష్యమే నా ప్రాణం అయింది. అలా యాభైఏళ్ల వయసులో నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోగలిగాను. ఇప్పుడు కూడా వెనక్కిలాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాభైనాలుగేళ్ల వయసులో ఈ సాహసం ఏమిటీ అంటున్నారు చాలామంది. ఇప్పుడు కూడా విజయంతోనే సమాధానం చెబుతాను’ అంటుంది ఈ బృందంలో ఒకరైన 54 ఏళ్ల చేతనా సాహు. ఈ పదిమంది ఉత్తరకాశీలో శిక్షణ తీసుకున్నారు. ‘అరవై ఏళ్లు దాటిన తరువాత ఎప్పుడూ నడిచే దారికంటే ఇంకొంచెం ఎక్కువ దూరం నడిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేమిటోగానీ శిక్షణ సమయంలో బాగా అలిసిపోయినట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు. మనోబలం అంటే ఇదేనేమో’ అంటుంది గంగోత్రి సోనేజి. ఆమె వయసు అక్షరాల అరవైరెండు! 4,625 కిలోమీటర్ల ఈ సాహసయాత్ర అంతర్జాతీయ మహిళాదినోత్సవం (మార్చి–8) రోజు ప్రారంభమై ఆగస్టులో ముగుస్తుంది. ‘ఆరోగ్యస్పృహ విషయంలో అన్ని వయసుల మహిళలకు స్ఫూర్తి ఇచ్చే యాత్ర ఇది’ అంటుంది బచేంద్రిపాల్. విజయోస్తు -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై మీర్‌పేట యువకుడు
సాక్షి, మీర్‌పేట: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్న ఆ యువకుడు మొదటి అడుగులో హిమాలయాల్లోని బేస్ క్యాంప్‌ను చేరుకున్నాడు. మీర్‌పేట టీఆర్ఆర్ టౌన్‌షిప్‌కు చెందిన వేముల సందీప్ హైటెక్ సిటీలోని ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్ (ఏడీపీ) కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసున్నాడు. బాల్యం నుంచే ఎత్తయిన కొండలను అధిరోహించాలని బలమైన కోరిక ఉండేది. ఈ క్రమంలో చిన్న చిన్న సాహస యాత్రలకు శ్రీకారం చుట్టాడు. ఎవరెస్ట్ శిఖరంతో పాటు ప్రపంచంలోని ఎత్తయిన 7 శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఈ నెల 4న నేపాల్‌లోని 5,364 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సాహస యాత్రతో ఏడు రోజుల్లో లక్ష్యాన్ని చేరుకున్నాడు. మరో మూడు రోజుల్లో కిందికి చేరుకున్నాడు. సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందీప్ శనివారం అర్ధరాత్రి తిరిగి నగరానికి చేరుకున్నాడు. మైనస్ 18 డిగ్రీల చలిలో.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే నా లక్ష్యం. దేశంలోని పలు ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌లకు వెళ్లాను. కేవలం ఒకే గైడ్ సహాయంతో యాత్రను ప్రారంభించి 7 రోజుల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లక్ష్యానికి చేరుకున్నా. మైనస్ 18 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో, ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేకుండా, మాత్రలు వాడకుండా తిరిగి మూడు రోజుల్లో కిందికి చేరుకుని యాత్రను విజయవంతంగా పూర్తి చేశా. ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే 12 రోజుల్లో పూర్తి చేయాల్సిన సాహసయాత్రను 10 రోజుల్లో పూర్తి చేశా. టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నాను. – వేముల సందీప్ -
బాలికలకు రోల్‌మోడల్‌గా నిలుస్తా
►మారథాన్‌తో 31 జిల్లాల్లో పర్యటన ►జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరవుతా ►మారథాన్ ప్లేయర్ నిఖితాయాదవ్ ► అభినందించిన కలెక్టర్ అమ్రపాలి హన్మకొండ అర్బన్: ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమే తన లక్ష్యమని సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతానికి చెందిన కోర నిఖితాయాదవ్ అన్నారు. అసాధ్యమైన లక్ష్యాలు సుసాధ్యం చేసి బాలికల్లో రోల్ మోడల్‌గా నిలవాలని ఈ సాహస కార్యానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రసుతం మారథాన్‌తో తెలంగాణలోని 31 జిల్లాల్లో పర్యటించి బాలికల్లో ఆత్మస్తైర్యం నిపేందుకు ప్రయత్నిస్తున్న ఆమె.. ఇప్పటికి 13 జిల్లాల్లో పర్యటన ముగించుకుని మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. కలెక్టర్ ఆమ్రపాలిని కలిసి తన లక్ష్యాలను వివరించింది. అనతంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌లోని కస్తూర్భాగాంధీ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేశానని, కుంటుంబ పెద్దలు, యాదవ సంఘాల సహకారంతో ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నానని చెప్పింది. ఆడపిల్ల అబలకాదు సబల అని నిరూపిస్తానని చెప్పింది. ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని తెలిపింది. ప్రస్తుతం మారథాన్‌తో 31జిల్లాలో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్నాని మీడియా ముందు తెలియజేసింది. ఏప్రిల్ 27న ప్రారంభమైన మారథాన్‌లో ఇప్పటి వరకు సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, కొమురంబీం, గోదావరిఖని, కరీంనగర్ జిల్లాల్లో పర్యటనతో 600 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాని వివరించింది. జూన్ 2నాటికి హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటానని నికిత తెలిపింది. కాగా, చిన్న వయస్సులోనే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకని ఆ దిశగా పయనిస్తున్న నిఖితను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పరంగా సహకారం అందిచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కృషి చేస్తా. ఆడపిల్ల అబలకాదు సబల అని నిరూపిస్తా. – నిఖితాయాదవ్