వివాహ వేడుకలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
డీసీఎంఎస్ చైర్మ¯ŒS కుమార్తె వివాహానికి హాజరు
కాకినాడ :
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి గురువారం జిల్లాకు విచ్చేసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న ఆయన మాజీ ఎంపీ హర్షకుమార్ నివాసానికి వెళ్లారు. భోజన విరామం తరువాత కాకినాడ చేరుకుని జీఆర్టీ హోటల్లో బస చేశారు. రాత్రి 8 గంటలకు కాకినాడ ఎస్.ఆర్.ఎం.టి. ఫంక్ష¯ŒS హాలులో డీసీఎంఎస్ ఛైర్మ¯ŒS కె.వి.సత్యనారాయణ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. వధూవరులు శ్రేష్ఠ, వెంకటేశ్వరరెడ్డిలను ఆశీర్వదించారు. కాకినాడ రామారావుపేటలోని రోటరీ డిస్ట్రిక్ మాజీ ఛైర్మ¯ŒS లక్కరాజు సత్యనారాయణ్ (టిక్కు) నివాసానికి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి జీఆర్టీ గ్రాండ్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు.
నేడు శేషారెడ్డి నివాసంలో అల్పాహారం
శుక్రవారం ఉదయం ఆదిత్య విద్యా సంస్థల «అధినేత, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి నివాసానికి వెళ్లి అల్పాహారం అనంతరం అక్కడి నుంచి రాజమండ్రి మధురపూడి చేరుకుని హైదరాబాద్ వెళ్తారు.