Excessive speed
-
మితిమీరిన వేగం వల్లే... మిస్త్రీ మృతి
ముంబై: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) అంత్యక్రియలు మంగళవారం ముంబైలో జరగనున్నాయి. మృతదేహానికి సోమవారం అటాప్సీ పూర్తయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ అనాహిత పండోలే, ఆమె భర్త డేరియస్ పండోలే ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఆదివారం మధ్యాహ్నం ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురవడం తెలిసిందే. వెనక సీట్లో ఉన్న మిస్త్రీ, ఆయన మిత్రుడు జహంగీర్ పండోలే అక్కడికక్కడే మరణించారు. వాళ్లిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం, మరో వాహనాన్ని రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కారు అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమన్నారు. చరోటీ చెక్ పోస్టు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి కారు 9 నిమిషాల్లో చేరుకుందని వివరించారు. జర్మనీ నుంచి వచ్చిన బెంజ్ సంస్థ బృందం ఘటనా స్థలిని పరిశీలించింది. -
కొన్నాళ్లక్రితం.. నటి ప్రణీతకు తప్పిన ముప్పు..
తాళ్లగడ్డ (సూర్యాపేట) : సరిగ్గా తొమ్మిది సంవత్సరాల ఐదునెలల క్రితం ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియడంతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మోతె మండల కేంద్రం సమీపంలోని తిరుపతమ్మగుడి మూలమలుపు వద్ద సూర్యాపేట ఖమ్మం ప్రధాన రహదారిపై 2009 మార్చి 26వ తేదీ అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్‌కు జరిగిన ప్రమాదం ఒక్కసారిగా అలజడి సృష్టించింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌తో సహా పలువురికి గాయాలు కాగా ఒకరికి తీవ్ర గాయాలైన విషయం విధితమే. వీరికి సూర్యాపేటలోని న్యూలైఫ్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా అతివేగం, అజా గ్రత్తగా వాహనం నడిపి పలువురికి గాయాలు కావడానికి కారణమయ్యారని మోతె పోలీసులు నిర్ధారించారు. వాహనంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు అప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, చంద్రమౌళి ప్రసాద్, బాబావలి, రాజీవ్‌కనకాల ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సూర్యాపేటలోని న్యూలైఫ్ ఆస్పత్రికి సుమారు ఆరు వాహనాల్లో 15మంది వరకు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తప్పిన పెను ప్రమాదం మోతె మండల కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు మితిమీరిన వేగంతో వెళ్లి అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఆ మూలమలుపు వద్ద పెద్ద బావి ఉంది. కానీ కొద్దితేడాతో కారు ఆగిపోవడంతో ప్రాణనష్టం నుంచి తప్పినట్లయింది. నాడు జూనియర్ ఎన్టీఆర్ సొంత డ్రైవింగ్.. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని అర్ధరాత్రి బయలుదేరారు. తన స్నేహితులతో కలిసి సఫారీ కారును సొంతంగా జూనియర్ ఎన్టీఆరే డ్రైవింగ్ చేస్తూ వచ్చారు. మోతె సమీపంలోకి రాగానే.. అతివేగంగా నడుపుతున్న కారుఅదుపు చేయలేకపోవడంతో ప్రమాదానికి గురైంది. ప్రమాదకర మలుపు.. జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారుబోల్తా పడిన స్థలం వద్ద ఇప్పటికీ ఎన్నోమార్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒకసారి బస్సుబోల్తా కొట్టింది. కాకినాడ మున్సిపల్ కమిషనర్ వాహనం కూడా ఇదే మలుపు వద్ద బోల్తా పడింది. 2008లో బస్సును ఆటో ఢీకొట్టిన ఘటనలో 13 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి నెల రోజుల క్రితం లారీ బావిలోపడి ఇద్దరు మృతిచెందారు. నటి ప్రణీతకు తప్పిన ముప్పు.. మోతె మండల కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదానికి కూతవేటు దూరంలోని మూ లమలుపు వద్దనే నటి ప్రణీత ప్రయాణిస్తున్న కారు 2016 ఫిబ్రవరి 14 పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ వెంకటేశ్వరరావు, మేకప్ అసిస్టెంట్ విజయలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. కానీ నటి ప్రణీతకు మాత్రం ఎలాంటి గాయం కూడా కాకుండా బయటపడింది. -
మృత్యుగీతిక
సాక్షి, వనపర్తి: పెళ్లిలో బంధుమిత్రులతో ఆనందంగా గడిపి తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం.. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళుతున్న బంధువుల బృందం.. ఇంటికి వెళ్లాలన్న తొందర ఒకరిది.. పెళ్లి ముహూర్తం దాటిపోతుందన్న ఆత్రుత మరొకరిది.. వాహనాల వేగం పెరిగింది.. కానీ ఒక్క క్షణంలో అంతా తారుమారు.. మితిమీరిన వేగంతో అదుపు తప్పిన ఓ కారు.. డివైడర్‌పైకి ఎక్కి అవతలివైపు ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది..ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఏడుగురి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరిని, చికిత్స పొందుతూ మరొకరిని మృత్యువు కబళించింది. మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరు కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచేసిన ఈ దుర్ఘటన.. 44వ నంబర్ జాతీయ రహదారిపై వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద బుధవారం ఉదయం 7.45 గంటల సమయంలో జరిగింది. పెళ్లి ముహూర్తం దాటిపోతుందని.. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్లకు చెందిన ఆంజనేయులు (35), మదనాపురం మండలం అజ్జకొల్లుకు చెందిన పత్తోల్ల రాజు (34), అమరచింత మండలం మస్తీపూర్‌కు చెందిన కుర్వ మల్లేశ్ (28), మొగిలయ్య, నందిమల్ల గ్రామానికి చెందిన నరేశ్ (25) హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉంటూ పళ్ల వ్యాపారం చేస్తుంటారు. అప్పుడప్పుడూ స్వగ్రామాలకు వచ్చి వెళ్తుంటారు. వీరి బంధువు మూలమల్ల గ్రామానికి చెందిన కుర్వ బుడ్డమ్మ కుమారుడు శ్రీకాంత్ వివాహం బుధవారం జరగాల్సి ఉంది. ఈ వివాహంతో పాటు చిన్నచింతకుంట మండలం నెల్లికొండిలో జరిగే అమ్మవారి పండుగకు వెళ్లాలని వారంతా నిర్ణయించుకున్నారు. వారికి బంధువైన మదనాపురం మండలం గోపన్‌పేటకు చెందిన బీరప్ప (24) కారు (మహీంద్రా వెరిటో)లో హైదరాబాద్ నుంచి బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో బయలుదేరారు. పెళ్లి ముహూర్తం 8 గంటలకే ఉండడంతో త్వరగా చేరుకోవాలన్న ఆత్రుతలో వేగంగా వస్తున్నారు. పెళ్లికి హాజరై వస్తూ.. కడప జిల్లా కేంద్రానికి చెందిన సూరిబాబు (52) హైదరాబాద్‌లోని బడంగ్‌పేటలో పరుపులు, దిండ్ల వ్యాపారం చేస్తున్నారు. ఆయన భార్య సునీత, కుమా ర్తెలు మౌనిక, కల్పన ఉన్నారు. మౌనికకు వివాహం కాగా.. కల్పన ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. ఈ నెల 20న (మంగళవారం) కర్నూలు జిల్లా కల్లూరులో సూరిబాబు మేనత్త ప్రసూన మనవడు సాయి వివాహం జరిగింది. దానికి సూరిబాబు, సునీత, కల్పనతో పాటు అనంతపురం జిల్లా పూలకుండ్ల మండలం మేకల చెరువు గ్రామానికి చెందిన అత్త రాజమ్మతో కలసి హాజరయ్యారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటల సమయంలో తమ కారు (రెనాల్ట్ పల్స్)లో హైదరాబాద్‌కు బయలుదేరారు. వారితోపాటు సూరిబాబు మేనత్త ప్రసూన ఉన్నారు. రెప్పపాటులో ప్రమాదం.. సూరిబాబు కుటుంబం పెళ్లికి హాజరై హైదరాబాద్‌కు వెళుతుండగా.. ఆంజనేయులు, మిగతావారు మూల మల్లలో వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఉదయం 7.45 గంటల సమ యంలో కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామశివారు వద్ద ఆంజనేయులు బృందం కారు (మహీంద్రా వెరిటో) అదుపుతప్పింది. అత్యంత వేగంతో డివైడర్ ఎక్కి.. అవతలివైపు రోడ్డులో ఎదురుగా వస్తున్న సూరిబాబు కారును బలంగా ఢీకొట్టింది. మహీంద్రా వెరిటో వాహనంలో ఉన్న ఆంజనేయులు, రాజు, మల్లేశ్, బీరప్పతోపాటు రెనాల్ట్ కారులో ఉన్న సూరిబాబు, ప్రసూన, రాజమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. సునీత, కల్పన, నరేశ్, మొగిలయ్యలు తీవ్రంగా గాయపడగా.. మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. సునీత మార్గమధ్యంలోనే మృతి చెందగా.. నరేశ్ చికిత్స పొందుతూ మరణించాడు. మొగిలయ్య, కల్పనల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మితిమీరిన వేగంతో.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే.. ఘటన సమయంలో రెండు కార్లు కూడా గంటకు 100 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకెళుతున్నట్లు తెలు స్తోంది. కార్ల టైర్లు పగిలిపోయి.. ముందు సీటు భాగం వరకు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. రెండు కార్ల డ్రైవర్లు సీటు బెల్ట్ పెట్టుకుని ఉండడంతో.. వారి తలకు గాయాలు కాలేదు. కానీ వాహనాలు స్టీరింగ్ వరకు దెబ్బతినడంతో ఛాతీ, ఇతర శరీర భాగాలపై ఒత్తిడి పడింది. సూరిబాబు నడుపుతున్న వాహనం బెలూన్లు తెరుచుకున్నా ప్రాణనష్టం తప్పలేదు. విషాదంలో కుటుంబాలు రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించడంతో వారి కుటుంబాలన్నీ తీవ్ర విషాదంలో కూరుకు పోయాయి. హైదరాబాద్ నుంచి వెళుతూ మృతి చెందిన బీరప్ప, ఆంజనేయులు, రాజు, మల్లేశ్.. అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మహీంద్రా వెరిటో యజమాని బీరప్పకు రెండేళ్ల క్రితమే రజితతో వివాహం జరిగింది. బీరప్ప మృతితో ఆమె కన్నీట మునిగిపోయింది. ఇక ఆంజనేయులుకు భార్య నర్సమ్మ, ఆరేళ్లలోపు వయసున్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. రాజుకు భార్య రేణుక, పదేళ్లలోపు వయసున్న ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మల్లేశ్‌కు భార్య పద్మ, ఏడేళ్ల కుమారుడు శివ, ఐదేళ్ల కుమార్తె పావని ఉన్నారు. ప్రమాదంలో ఈ కుటుంబాలు తమ పెద్ద దిక్కును కోల్పోవడంతో రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. ఇక రెనాల్ట్ కారులో హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సూరిబాబు, ఆయన భార్య సునీత ఇద్దరు మృతి చెందారు. కుమార్తె కల్పన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డివైడర్ ఎత్తు తగ్గడంతో భారీ ప్రమాదం జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించిన తర్వాత మధ్యలో డివైడర్‌ను తక్కువ ఎత్తుతో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వేసిన రోడ్డుపైనే మళ్లీ రోడ్డు వేస్తూ వెళ్లడంతో రోడ్డు ఎత్తు పెరిగి.. మధ్యలో డివైడర్ ఎత్తు తగ్గినట్లయింది. దీంతో కొద్దిగా అదుపు తప్పిన వాహనాలు కూడా.. డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోకుండా అవతలివైపునకు దూసుకెళ్లి భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలోనూ అవతలి వైపు కారును ఢీకొని ప్రమాద తీవ్రత, మృతుల సంఖ్య పెరగడానికి ఇదే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాంకేతిక లోపాలతో నిత్యం ప్రమాదాలే! హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని నాలుగు లేన్లుగా విస్తరించకముందు ట్రాఫిక్ ఎక్కువగా ఉండి.. ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగాయి. అయితే జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మరో రకంగా ప్రమాదాలు పెరిగిపోయాయి. మలుపులు ఎక్కువగా ఉండడం, కల్వర్టులు, క్రాస్ రోడ్ల వద్ద సరిగా రోడ్డు కనిపించని పరిస్థితి వంటి సాంకేతిక లోపాలే దీనికి కారణం. ఇలాంటి కారణంతోనే వనపర్తి జిల్లా (పాత మహబూబ్‌నగర్ జిల్లా) కొత్తకోట మండలం పాలెం వద్ద 2013 అక్టోబర్ 30న భారీ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి వస్తున్న వోల్వో బస్సు కల్వర్టును ఢీకొనడంతో డీజిల్ ట్యాంకుకు నిప్పంటుకుంది. 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. దాంతో రోడ్డు నిర్మాణ లోపాలపై సందేహాలు వెల్లువెత్తాయి. పాలెం దుర్ఘటన తర్వాత తీరిగ్గా మేల్కొన్న అధికారులు.. 44వ నంబర్ జాతీయ రహదారిపై పలు చోట్ల మరమ్మతులు చేశారు. కల్వర్టులను సరిచేసి, రోడ్డు క్రాసింగ్లను విస్తరించారు. కానీ వేసిన రోడ్డుపైనే మళ్లీ తారుతో రోడ్డు వేయడంతో.. మధ్యలో ఉన్న డివైడర్ ఎత్తు తగ్గిపోయింది. దీంతో వాహనాలు డివైడర్ ఎక్కుతున్నాయి. కొన్నిసార్లు అవతలివైపునకు దూసుకెళ్లి.. ఆ లైన్లో ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంటున్నాయి. ఇలా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు.. నివారణపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారును తొలగిస్తున్న సహాయక సిబ్బంది సూరిబాబు, ఆంజనేయులు, రాజు బీరప్ప, మల్లేశ్, నరేశ్ -
స్పీడున్నోళ్లకు బ్రేక్!
జిల్లాలో ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగినా అందుకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే. కొందరు వాహనచోదకులు నిర్లక్ష్యంగా అతి వేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. అలాంటి వారి ఆటకట్టించేందుకు పోలీసులు నడుంబిగించారు. వాహన వేగ పరిమితిని గుర్తించేందుకు అధునాతన పరికరంతో కూడిన వాహనాన్ని జిల్లాకు తీసుకొచ్చారు. బొబ్బిలి : మితిమీరిన వాహనాల వేగానికి ఇక కళ్లెం పడనుంది. రోడ్డు భద్రతకు విఘాతం కలిగిస్తూ అనేక మంది ప్రాణాలు తీసుకుంటున్న అతి వేగాన్ని నియంత్రించేందుకు జిల్లా పోలీసు శాఖ నడుం బిగించింది.. రహదారులపై వాహన వేగం పరిమితి, దానిని అధిగమించి వస్తున్న వాహనాలను గమనించి సంబంధిత వాహనచోదకులకు ఆటోమేటిక్‌గా చలానా ఇచ్చే ఆధునిక పద్ధతిలతో కూడిన ఇంటరిసెప్టర్ వాహనాన్ని గురువారం జిల్లాలోని బొబ్బిలికి తీసుకొచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒకే వాహనం ఉన్నా మరికొద్ది రోజుల్లో జిల్లాకు పూర్తిస్థాయి వాహనాన్ని తీసుకురానున్నారు. బొబ్బిలి గ్రోత్‌సెంటరులో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడిన నేపథ్యంలో వాహనాన్ని ఇక్కడికి తీసుకొచ్చి వాహనాల వేగాన్ని పరీక్షించారు. దాదాపు సగం వాహనాలు నిర్ణీత వేగానికి మించి రావడం గమనార్హం. అవన్నీ ఇంటరిసెప్టర్ వాహన కెమెరాకు చిక్కాయి. అధిక వేగంతో వెళ్తున్న వారికి అక్కడికక్కడే చెలానాలు ఇచ్చి అపరాధ రుసుం వసూలు చేశారు. వేగాన్ని కొలిచే యంత్రం.. పోలీసు వాహనం లోపలే ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు అరకిలో మీటరు దూరం నుంచి వాహన వేగాన్ని ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ రహదారిపై ఎంత వేగంతో ప్రయాణించవచ్చో ముందుగానే రికార్డు చేస్తారు. అది దాటి ఒక్క కిలోమీటరు స్పీడులో వెళ్తున్నా యంత్రం నుంచి బీప్ సౌండ్ ఇస్తుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేస్తారు. అప్పటికే వాహన నంబరుతో కూడిన ఓవర్ స్పీడ్ చలానా ప్రింట్ వచ్చేస్తుంది. దీని ఆధారంగా 400 రూపాయలకు తక్కువ లేకుండా అపరాధ రుసుం వసూలు చేస్తారు. వాహనంపై పీటీ కెమెరా వాహన వేగంతో పాటు ఎక్కడైనా అల్లర్లు, ఆందోళనలు, వాదనలు జరిగినా వాటిని రికార్డు చేయడానికి వాహనంపై పెన్టిల్ (పీటీ) కెమెరాను అమర్చారు. వాహన వేగాన్ని నియంత్రించిన సమయంలో అక్కడికి వచ్చిన వారు ఏదైనా అలజడి చేసినా, వాదోపవాదాలకు దిగినా వెంటనే దీనిని ఆన్ చేస్తారు. సుమారు 3 కిలోమీటర్లు దూరంలో జరిగిన సంఘటనలు దృశ్యాలు, మాటలన్నీ ఈ యంత్రంలో నమోదవుతాయి. ఈ కెమెరా నాలుగు దిక్కులా తిరుగుతూ దృశ్యాలను రికార్డు చేస్తుంది. వీటిని వాహనంలో కూర్చుని ఎల్సీడీలో ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించవచ్చు. హైదరాబాద్‌లో శిక్షణ పొందాం ఆధునిక యంత్ర పరికరాలతో వేగాన్ని నిర్ధారించడానికి సంబంధించి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు శిక్షణ పొందాం. అనంతరం విజయనగరంలోనూ శిక్షణ తీసుకున్నాం. -సీహెచ్‌వీఎస్ నారాయణ, కానిస్టేబుల్, ఏఆర్ విభాగం