expansion cabinet
-
ఏపీ: కేబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభమైంది. దీంతో ఆశావహుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సారి కేబినెట్లోకి ఎవరిని తీసుకుంటారనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా, అంతకు ముందున్న మంత్రులే 7 నుంచి 11 మంది వరకూ కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, 14 నుంచి 17 మంది వరకూ కొత్త మంత్రులు కేబినెట్లో చేరనున్నారు. అయితే, సామాజిక సమతూకం, జిల్లా అవసరాల దృష్ట్యా కొత్త మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఇది చదవండి: ఏపీలో 24 మంది మంత్రుల రాజీనామా -
అసంతృప్తులపై ‘తారక’మంత్రం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంత్రివర్గ విస్తరణ షాక్ నుంచి ఇంకా తేరుకోవడం లేదు. ఏళ్ల తరబడిగా తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీలో గులాబీ దళనేత కేసీఆర్ వెంట నడిచిన పలువురి ఆశలు అడియాసలు అయ్యాయి. రెండోసారి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన నేపథ్యంలో చివరి నిమిషంలో అవకాశం చేజారడాన్ని ఆశావహులు ఇంకా జీర్ణించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనీసం రెండు మంత్రి పదవులన్నా దక్కుతాయని భావించగా... ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక్కరితోనే సరిపెట్టడంతో అమాత్య పదవి రేసులో ఉన్న నేతలకు చుక్కెదురు అయ్యింది. టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం, సీఎం కేసీఆర్‌పై విధేయత ఉన్నా... చివరి నిముషంలో చేజారిన బృహత్తర అవకాశాన్ని మరచిపోలేక పోతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల షెడ్యూల్ ఖరారు కాగా, ఆ సమావేశాలను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఉమ్మడి జిల్లా ప్రజాప్రతిని«ధులు భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కేబినెట్‌ను పోల్చుకున్న ఆశావహులు తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్లో జిల్లాకు స్పీకర్, రెండు మంత్రి పదవులు దక్కాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారికి అవకాశం దక్కింది. తర్వాత డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్య పదవి కోల్పోవడంతో ఆయన స్థానంలో కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా రెండోసారి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన సమయంలో మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ›ఫిబ్రవరి 19న జరిగిన విస్తరణలో మాజీ మంత్రితో పాటు మరొకరికైనా మంత్రి పదవులు వస్తాయని ఆశించారు. ఇందులో భాగంగానే కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ధరంసోత్ రెడ్యానాయక్ తదితరులు ఎవరికీ వారుగా మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆశించారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక్క ఎర్రబెల్లి దయాకర్‌రావుకే మంత్రి పదవి దక్కడంతో మిగతా నేతల ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. చివరి నిమిషం వరకు వస్తుందనుకున్నప్పటికీ రాకపోవడంతో పలువురు అసంతృప్తికి గురి కాగా... యువనేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగడంతో అసంతృప్తి నేతలు కలిసి నడుస్తున్నారు. ఇలా అసంతృప్తులపై ‘తారక’మంత్రం పని చేస్తోంది. మంత్రి ‘ఎర్రబెల్లి’ ఇంట్లో నేతల భేటీ కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హన్మకొండలోని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లితో పాటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపనేని నరేందర్, టి.రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, టీవీవీ చైర్మన్ వాసుదేవరెడ్డి, పార్టీ నాయకులు మార్నేని రవిందర్‌రావు, బీరెల్లి భరత్‌కుమార్, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేద్దాం.. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఈ నెల 7న వరంగల్ పర్యటనకు వస్తున్న కల్వకుంట్ల తారకరామారావు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలపై పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 7న ఉదయం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యకార్యకర్తలతో సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు నగరానికి వస్తున్నారని తెలిపారు. ఆయనకు ఘనస్వాగతం పలకడానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడువేల మంది ముఖ్యకార్యకర్తలు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది, స్వాగతం తోరణాలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన కమిటీలను వేసి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. -
నేడు కేసీఆర్ కేబినెట్ విస్తరణ
-
అమాత్యులెవరో..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జిల్లాలో ఉత్కంఠ రేపుతోంది. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించిన నేపథ్యంలో పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు, రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్న నేపథ్యంలో జిల్లా నుంచి ఎవరు అమాత్యులవుతారు.. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగగా.. ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగింది. జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయగా.. నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధించింది. ఇందులో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులు విజయం సాధించగా.. టీడీపీ అభ్యర్థులు సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. దీంతో జిల్లాలోని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎవరికి పట్టం కట్టాలనే అంశంపై టీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లా నుంచి టీఆర్ఎస్ తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్‌కుమార్ ఒక్కరే విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన లావుడ్యా రాములునాయక్ టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం జిల్లాలో రెండుకు చేరిన్నా.. పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్‌కుమార్ మాత్రమే గెలిచారు. దీంతో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఏకైక ఎమ్మెల్యేగా ఆయనకు మంత్రిగా అవకాశం లభిస్తుందని పువ్వాడ అనుచర వర్గం, పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. జిల్లా టీడీపీలో సీనియర్ నేతగా ఉండి.. వరుసగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్యను అధికార టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే మంత్రివర్గ విస్తరణలోపు సండ్ర టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. టీడీపీ శ్రేణులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా గత డిసెంబర్లో పోటీ చేసేందుకు అనువుగా ఆయన టీటీడీ బోర్డు సభ్యత్వ పదవికి రాజీనామా కూడా చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని పునరుద్ధరించినా.. ఆయన తిరిగి స్వీకరించలేదు. అధికార టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా టీటీడీ బోర్డు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వెంకటవీరయ్య రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నందున.. టీటీడీ బోర్డు సభ్యత్వం వంటి కీలక పదవిని సైతం వదులుకోవడం.. ఆయనకు తెలంగాణ మంత్రివర్గంలో స్థానంపై భరోసా లభించడమే కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో సండ్ర వెంకటవీరయ్య తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. జిల్లా నుంచి టీఆర్ఎస్ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని, కేసీఆర్ తనయుడు కేటీఆర్‌తో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు అందలం ఎక్కిస్తాయని ఆయన అభిమానులు విశ్వసిస్తున్నారు. దీంతో జిల్లాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది? అసలు తొలి మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం ఉందా? లేదా? అనే అంశంపై రాజకీయ వర్గాలు ఎవరికి తోచిన విధంగా వారు తమ అనుకూల.. ప్రతికూల వాదనలు వినిపిస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను టీఆర్ఎస్లో చేర్చుకుని.. మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా రాష్ట్రంలో టీడీపీని బలహీన పరచడంతోపాటు శాసనసభలో ఆ పార్టీ తరఫున గళమెత్తే బలమైన నేత లేకుండా అవుతారనే వ్యూహంతో పార్టీ అధిష్టానం పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై ఆచితూచి స్పందిస్తున్న సండ్ర.. భవిష్యత్ వ్యూహంపై మాత్రం నోరు మెదపడం లేదని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సానుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వంలో తాము కీలకంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదని సండ్ర అభిమానులు వ్యాఖ్యానిస్తుండడం విశేషం. సామాజిక రాజకీయ అంశాలను, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలిపించగలిగే సమర్థతను సైతం పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని టీఆర్ఎస్లోని మరికొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక జిల్లా టీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్‌పై సైతం పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
19న తెలంగాణ కేబినెట్ విస్తరణ
-
కౌన్ బనేగా మంత్రి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందని వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. హ్యాట్రిక్ వీరులు.. సీనియర్ ఎమ్మెల్యేలు తమకు మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని విశ్వసిస్తున్నారు. కేబినెట్ పరిమిత మోతాదులో ఉంటుందని సంకేతాలు వెలువడడంతో తమకు అవకాశాలు ఏ మేర కలిసివస్తాయని బేరీజు వేసుకుంటున్నారు. సుదీర్ఘ అనుభవం, సామాజిక సమీకరణలపై లెక్కలు వేసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ కూర్పులో జిల్లా నుంచి ఎవరికి చాన్స్ దక్కుతుందనే అంశం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, కేపీ వివేకానంద, చామకూర మల్లారెడ్డిలు మంత్రిపదవి రేసులో ఉన్నారు. ఎవరి లెక్కలు వారివే.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ముహూర్తం ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డిని ఓడించిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మంత్రి పదవిపై గంపెడాశ పెట్టుకున్నారు. మంత్రిగా వ్యవహరించిన సోదరుడు మహేందర్‌రెడ్డి పరాజయం పాలుకావడంతో ఆయన కోటాలో తనకు బెర్త్ ఖాయమనే భరోసాలో నరేందర్‌రెడ్డి ఉన్నారు. అయితే, కొడంగల్ సెగ్మెంట్‌ను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో తీసుకుంటారా? లేక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా పరిగణిస్తారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. మూడుసార్లు వరుసగా విజయం సాధించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కూడా మంత్రి పదవిపై గట్టినమ్మకం పెట్టుకున్నారు. మృదుస్వభావిగా పేరున్న ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నికల ముందు జరిగిన ప్రగతి నివేదన సభతో ఇది మరింత బలపడింది. ఈ నేపథ్యంలో తన పనితీరును ఏంటో సీఎంకు తెలుసని భావిస్తున్న కిషన్‌రెడ్డి.. మంత్రి పదవి వ్యవహారం కూడా ముఖ్యమంత్రే చూసుకుంటారనే ధీమాలో ఉన్నారు. మరో హ్యాట్రిక్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. తన సామాజికవర్గానికే చెందిన వివేకానంద, శ్రీనివాస్‌గౌడ్, పద్మారావులు మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తుండడం ప్రకాశ్‌కు ప్రతిబంధకంగా మారింది. ఇక, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కూడా అమాత్య యోగంపై ఆశలు పెట్టుకున్నారు. మల్కాజిగిరి ఎంపీ పదవిని వదులుకొని ఎమ్మెల్యేగా పోటీచేసిన చామకూర.. తనకు కేబినెట్లో బెర్త్ ఖాయమని భావిస్తున్నారు. మంత్రి పదవి ఇస్తామనే హామీతోనే శాసనసభ్యుడిగా రంగంలోకి దిగానని సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా మంత్రివర్గ విస్తరణలో లక్కీచాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగియుండడ తనకు ప్లస్‌పాయింట్ కాగలదని అంచనా వేస్తున్నారు. పద్మారావుకు గనుక బెర్త్ దక్కకపోతే.. ఆయన స్థానే తనకు పదవి ఖాయమనే లెక్కల్లో వివేకానంద ఉన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా మినిస్టర్ గిరిపై ఆశలు పెట్టుకున్నా.. ఆయన సామాజికవర్గానికి సరిపడా పదవులు ఉన్నందున ఆయన పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయి. ఏదీఏమైనా మంత్రివర్గ విస్తరణ ప్రచారంపై అధికార పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. -
నేడో రేపో మంత్రివర్గ కూర్పు
న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్‌ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకంపై ఉత్కంఠకు తెరపడనుంది. సోమ లేదా మంగళవారానికి మంత్రిత్వ శాఖల కేటాయింపులపై నిర్ణయం వెలువడుతుందని కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ ఆదివారం చెప్పారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైద్య చికిత్స నిమిత్తం, ఆమె కొడుకు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి విదేశాలకు వెళ్లారు. వారు తిరిగి రావడానికి కనీసం వారం పడుతుందనీ, అప్పటివరకు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని తొలుత ఊహాగానాలు వెలువడ్డాయి. వీటిపై కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, సోనియా, రాహుల్‌ల విదేశీ పర్యటన మంత్రివర్గ కూర్పుకు ఆటంకం కాబోదని స్పష్టం చేశారు. ఫోన్లో సంప్రదించడానికి రాహుల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకం ఇంకా పూర్తికాకపోవడం తెలిసిందే. రాష్ట్ర నేతలతో సంప్రదించి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకున్న అనంతరం తుది ఆమోదం కోసం ఆ జాబితాను అధిష్టానానికి పంపుతామని వేణుగోపాల్ చెప్పారు. ఆర్థిక, హోం, ప్రజా పనులు, విద్యుత్తు, నీటిపారుదల, పట్టణాభివృద్ధి తదితర కీలక మంత్రిత్వ శాఖల పంపకాలపై కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య విభేదాలు తలెత్తడం తెలిసిందే. ముఖ్యమంత్రిగా జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పరమేశ్వర ఇప్పటికే ప్రమాణం చేశారు. ఒప్పందం ప్రకారం ఇంకా కాంగ్రెస్‌కు 21, జేడీఎస్‌కు 11 మంత్రిపదవులు దక్కాల్సి ఉంది. యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలను ఆమోదించారా? బీజేపీకి చెందిన ఎంపీలు బీఎస్ యడ్యూరప్ప, బి.శ్రీరాముల రాజీనామాలపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ లోక్‌సభ సెక్రటేరియట్‌ను కోరారు. కర్ణాటకకు చెందిన ఎంపీలు బీఎస్ యడ్యూరప్ప, బి.శ్రీరాములు ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో వారిద్దరూ లోక్‌సభకు రాజీనామాలు సమర్పించినట్లు ప్రకటించారు. వారి రాజీనామాలను వెంటనే ఆమోదించినట్లు ప్రకటించిన లోక్‌సభ సెక్రటేరియట్.. వెబ్సైట్ లో మాత్రం ఆ స్థానాలను ఖాళీగా చూపడం లేదని అహ్మద్ పటేల్ చెప్పారు. ఈనెల 17వ తేదీన ఆ ఇద్దరూ రాజీనామా చేయగా 27 వరకు వారిని ఎంపీలుగానే వెబ్సైట్ చూపుతోందనీ, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. -
మళ్లీ తుస్‌స్‌స్..
మంత్రి వర్గ విస్తరణ వాయిదాతో కాంగ్రెస్‌లో అసంత ృప్తి సెగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న ఆశావహులు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఊరించి...ఊరించి..ఉసూరుమనిపించిన మంత్రి వర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడడంపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంటోంది. విస్తరణను వాయిదా వేయాలన్న తన పంతాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నెగ్గించుకున్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవి వద్దంటూ అధిష్టానాన్ని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌లతో ఆయన వరుసగా సమావేశమయ్యారు. మంత్రి వర్గంలో నాలుగే స్థానాలు ఖాళీ ఉండగా, 20 మంది పోటీ పడుతున్నందున ప్రస్తుతానికి మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేయడమే మంచిదని ఆయన సూచించినట్లు సమాచారం. ముందుగా బోర్డులు, కార్పొరేషన్ల నియామకాలను పూర్తి చేస్తే, మంత్రి పదవుల ఆశావహుల నుంచి ఒత్తిడి కాస్త తగ్గుతుందని ముఖ్యమంత్రి చెప్పడంతో, అధిష్టానం కూడా వాయిదాకే సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం దసరా తర్వాత విస్తరణ ఉంటుందని చెబుతున్నప్పటికీ, అప్పుడు కూడా అనుమానమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన తర్వాత...అంటే వచ్చే ఏడాది మేలో మాత్రమే విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి తన సన్నిహితుల వద్ద చెబుతున్నారని ఆశావహులు వాపోతున్నారు. పట్టు వదలని విక్రమార్కులు మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని తెలిసినప్పటికీ ఢిల్లీలో మకాం వేసిన అనేక మంది ఆశావహులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకులను కలుసుకుని చర్చిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ అమెరికా పర్యటనలో ఉన్నందున, ఆయన తిరిగి వచ్చేంత వరకు విస్తరణ గురించి ఆలోచించేది లేదని సీఎం ఢిల్లీలోనే స్పష్టం చేసినప్పటికీ, ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగి తేలుతున్నారు.