
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ప్రారంభమైంది. దీంతో ఆశావహుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సారి కేబినెట్‌లోకి ఎవరిని తీసుకుంటారనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా, అంతకు ముందున్న మంత్రులే 7 నుంచి 11 మంది వరకూ కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, 14 నుంచి 17 మంది వరకూ కొత్త మంత్రులు కేబినెట్‌లో చేరనున్నారు. అయితే, సామాజిక సమతూకం, జిల్లా అవసరాల దృష్ట్యా కొత్త మంత్రులు ఉండే అవకాశం ఉంది.
ఇది చదవండి: ఏపీలో 24 మంది మంత్రుల రాజీనామా