Expired goods
-
యూజ్బై, ఎక్స్పైరీ డేట్, బెస్ట్ బిఫోర్ మధ్య తేడా ఇదే..
కిరాణా దుకాణం, రిటైల్‌స్టోర్ వంటి సూపర్మార్కెట్లకు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలు చేసేప్పుడు ప్రధానంగా దాని ఎక్స్పైరీ తేదీ గమనిస్తాం కదా. ఒక్కో ప్రోడక్ట్‌పై ఒక్కో విధంగా ఈ ఎక్స్పైరీ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు వివిధ కంపెనీలు తయారు చేసే ప్రతి ప్రోడక్ట్‌పై యూజ్బై, ఎక్స్పైరీ డేట్, బెస్ట్ బిఫోర్ వంటి లేబుళ్లతో తేదీని నిర్ణయించడం గమనిస్తుంటాం. అందులో ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. కంపెనీ లేబుల్‌పై ప్రచురించిన డేట్ ముగిసినా కొన్ని పదార్థాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవచ్చని కొందరు చెబుతున్నారు. అయితే అలాంటి లేబుల్ ఉన్న ఉత్పత్తులను గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం.ఇదీ చదవండి: ‘టాటా సుమో’.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..ఎక్స్పైరీ డేట్: ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ లేబుల్‌పై ఎక్స్పైరీ డేట్ ఉంటే అందులోని వస్తువులు, పదార్థాలు కచ్చితంగా ఆతేదీ లోపే వినియోగించాల్సి ఉంటుంది. తేదీ ముగిసిన వాటిని అసలు ఉపయోగించకూడదు.యూజ్బై: కొన్ని వస్తువులు, పదార్థాల ప్యాకేజీ లేబుల్‌పై యూజ్బై తేదీ ఉంటుంది. ఎక్స్పైరీ తేదీలాగే ఆలోపే అందులోని పదార్థాలను ఉపయోగించుకోవాలి.బెస్ట్బిఫోర్: ఈ లేబుల్ ఉత్పత్తికి సంబంధించిన అత్యుత్తమ నాణ్యత తేదీని సూచిస్తుంది. ఈ తేదీ నాణ్యత, భద్రతకు సంబంధించిందని గమనించాలి. ‘బెస్ట్ బిఫోర్’ తేదీ తర్వాత ప్యాకేజీలోని పదార్థాలు తాజాగా, రుచిగా ఉండకపోవచ్చు. పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. బెస్ట్బిఫోర్ తేదీ ముగిసిన తర్వాత పదార్థాలు వాడకపోవడమే మంచిదని ఇంకొందరు చెబుతున్నారు. -
బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...
సాక్షి, పశ్చిమ గోదావరి: చిన్నారి ఎంతగానో ఇష్టపడి తిన్న ఆ చాక్లెట్ అతని ప్రాణాలను తీస్తుందని ఊహించలేదు. అతనితో పాటు ఆ చాక్లెట్స్ తిన్న మరో ఇద్దరు చిన్నారులు కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. ఈ విషాద సంఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోయరాజమండ్రి పంచాయతీ కి చెందిన రావిగూడెం అనే గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది ... బాలుడి తల్లి తెలిపిన వివరాలప్రకారం .. కురసం అభయ్ చరణ్ తేజ్ (5) అనే బాలుడు ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం తన ఇంటికి సమీపంలోని ఓ కొట్టు వద్ద నుండి తెచ్చిన చాక్లెట్స్ ని తన స్నేహితులతో కలసి తిన్నాడు. అనంతరం ఇంట్లో వండిన చేపల కూరతో భోజనం చేసి ఆడుకోడానికి బయటకు వెళ్ళాడు కొద్దిసేపటికి ఒక్కసారిగా నోట్లో నుంచి నురగలు వస్తూ పడిపోయాడు, బాలుడు ఏమి మాట్లాడలేని స్థితిలో ఉండటంతో చేపల కూరలో చేప ముల్లు గొంతులో అడ్డుపడిందేమో నని తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ స్థానికుల సహాయంతో బుట్టాయగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఏలూరు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మార్గ మద్యంలో అభయ్ చరణ్ తేజ్ మృతి చెందినట్లుగా తెలిపారు. ఇదిలా ఉండగా అభయ్ చరణ్ తేజ్ చాక్లెట్ తింటూ ఆడుకుంటున్న సమయంలో మాకు పెట్టమని అడిగి తీసుకుని తిన్నామరో ఇద్దరు చిన్నారులు కట్టం సంతోష్(7),మడకం రాహుల్ వర్మ(6) లు కూడా అస్వస్థత కు గురికావడంతో వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి కి తరలించగా వారు అక్కడ చికిత్సపొందుతున్నారు. తల్లి పైనే స్థానికుల అనుమానం... ఆదివారం సాయంత్రం అభయ్ చరణ్ తేజ్ (5) తిన్న చాక్లెట్ లో ఎలుకల మందు కలిసిందని అది తిన్న బాలుడు మృతి చెందాడని తెలిపారు. దీనిపై బాలుడు తల్లిపైనే వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ధి కాలంగా భార్య భర్తలు ఇద్దరు దూరంగా ఉంటున్నారని,కొడుకు అభయ్ చరణ్ తేజ్ మాత్రం తల్లి వద్దే ఉంటున్నాడని ఈ క్రమంలో కొడుకును అడ్డు తొలగించుకోవడం కోసం తల్లి ఇలా ప్లాన్ చేసిందా అనే అనుమానం కలుగుతుందని స్థానికులు తెలిపారు. గతంలో కూడా ఇలాగే అస్వస్థకు గురి కావడంతో బుట్టాయగూడెం ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ప్రాణాపాయం తప్పిందని తిరిగి మళ్ళీ అదే విధంగా జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందని వారు తెలుపుతున్నారు. కాలం చెల్లిన చాక్ లెట్స్ అని ప్రచారం జరుగుతుందని ఇందులో నిజం లేదని అదే జరిగితే చాల మంది పిల్లలకు ఇలాగే జరగాలని వారు తెలిపారు. పలు అనుమానాలకు తావిస్తున్న చిన్నారి మరణం అసలు మిస్టరీ వీడాలంటే పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది. నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న బుట్టాయగూడెం పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్తున్నారు. -
బయట పడిన తిను'బండారం'
తణుకు టౌన్: పట్టణంలో కాలాతీతమైన తినుబండారాలు అమ్ముతున్న షాపుపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులు దాడి చేసి నిల్వ పదార్థాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సత్యవతి ఆస్పత్రి ఎదురుగా కిరాణా, కిళ్లీ షాపులను నిర్వహిస్తున్న పెరుమాళ్ల సాయి గుప్తా గడువు పూర్తయిన కుర్కురే, మ్యాగి, మూంగ్‌దాల్ వంటి చిరు తినుబండారాల ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో షాపును తనిఖీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ డెప్యూటీ తహసీల్దార్ డి.అశోక్ వర్మ తెలిపారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు షాపులో నిల్వ ఉన్న ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇదే షాపులో వంట గ్యాస్ సిలిండర్ ఉపయోగించడంతో సిలిండర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు డీటీ వర్మ తెలిపారు. బయట పడిందిలా... మంగళవారం రాత్రి తణుకులోని సత్యవతి ఆస్పత్రిలో ఒక మహిళకు రక్తం అవసరం కావడంతో రక్తదానం చేయడానికి భీమవరంలో బీఎల్ చదువుతున్న, పెనుగొండకు చెందిన కర్తాకులు కుమార్ ఆస్పత్రికి వచ్చాడు. అతను రక్తం ఇవ్వడానికి ఇంకా సమయం ఉందని, తర్వాత పిలుస్తాం అప్పుడు రండని చెప్పడంతో కుమార్ ఎదురుగా ఉన్న షాపులో రూ.5 విలువ చేసే మూంగ్‌దాల్ ప్యాకెట్లు మూడు కొని ఒక ప్యాకెట్‌ను అక్కడే ఓపెన్ చేశాడు. ప్యాకెట్ ఓపెన్ చేయగానే ప్యాకెట్ నుంచి దుర్వాసన రావడంతో మిగిలిన రెండుప్యాకెట్లు తీసుకుని వేరే ప్యాకెట్లు ఇవ్వాలని కుమార్ షాపు యజమానిని అడిగాడు. దీనికి అతను సరిగా సమాధానం చెప్పకపోగా.. దబాయించాడు. గత్యంతరం లేక మున్సిపల్, రెవెన్యూ అధికారులకు కుమార్ ఫిర్యాదు చేశాడు. వారు షాపులో తనిఖీలు నిర్వహించి నిల్వ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాగే అన్ని షాపులపై దాడులు చేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. అడిగితే ఘర్షణకు దిగారు మంగళవారం రాత్రి సత్యవతి ఆస్పత్రి వద్ద మూంగ్‌దాల్ ప్యాకెట్లు 3 కొని అక్కడే ఒక్కటి ఓపెన్ చేశా. ఓపెన్ చేయగానే దుర్వాసన రావడంతో వద్దని వేరే ప్యాకెట్లు ఇవ్వాలని షాపు యజమానిని అడిగా. అతను తన స్నేహితులతో కలిసి నాపై ఘర్షణకు దిగడంతో గత్యంతరం లేక రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశా.– కర్తాకుల కుమార్, బాధితుడు, పెనుగొండ -
కాలం చెల్లిన సరకులకు కొత్త ప్యాకింగ్
మర్రిపాలెం(విశాఖ ఉత్తర): కాలం చెల్లిన సరకులను కొత్తగా ప్యాకింగ్ చేసి సంక్షేమ శాఖ వసతి గృహాలకు సరఫరా చేస్తున్న కల్తీరాయుళ్ల గుట్టు విజిలెన్స్ దాడుల్లో బట్టబయలైంది. మాధవధార ప్రాంతంలో సూర్యకుమారి ఏజెన్సీస్ పేరుతో సరకులను గోదాంలో నిల్వ ఉంచారు. ఇక్కడ కాలం చెల్లిన ఉత్పత్తులు నిల్వలుగా ఉన్నట్టు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ఏజెన్సీకి చెందిన మాధవధార, శివాజీపాలెం, మధురవాడ ప్రాంతాల్లోని గోదాంలలో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. గోధుమ పిండి ప్యాకెట్లు, డెయిరీ ఉత్పత్తులు, ఎనర్జీ డ్రింక్స్‌ను కాలం చెల్లినవిగా గుర్తించారు. ఏజెన్సీ నిర్వాహకుడు ప్రభాకర్ నుంచి వివరాలు సేకరించారు. దీనికి సంబంధించిన ఎస్పీ కోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఆహార పదార్థాలు కాలం చెల్లిన తర్వాత వాటిని వినియోగంలోకి లేకుండా దహనం చేయాల్సి ఉంది. అయితే వాటిని ఓ ముఠా తిరిగి ప్యాకింగ్ చేసి ఎం.ప్రెష్ బ్రాండ్‌తో నాణ్యత లేని సరుకును మార్కెట్లో అమ్మకాలకు సిద్ధం చేస్తోంది. మాధవధారలోని సూర్యకుమారి ఏజెన్సీలో ఈ సరకు నిల్వ ఉందని విజిలెన్స్ అధికారులకు ముందస్తు సమాచారం అందడంతో శుక్రవారం అధికారులు దాడులు నిర్వహించారు. సరకు ఎక్కడెక్కడికి పంపించారో ఎస్పీ కోటేశ్వరరావు, బృంద సభ్యులు ఆరా తీసి.. శివాజీపాలెం, మధురవాడ ప్రాంతాల్లోని గోదాంలపై దాడులు చేశారు. శివాజీపాలెంలో వెంకటేశ్వర ట్రేడర్‌లో ఎం.ఫ్రెష్ పేరిట 60 బస్తాల గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ట్రేడర్ యజమానులు మాట్లాడుతూ సూర్యకుమారి ఏజెన్సీ నుంచి సరకులు తీసుకుంటున్నామని అధికారులకు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు సరకు పంపిణీ చేసేందుకు సూర్యకుమారి ఏజన్సీ కాంట్రాక్ట్ తీసుకుందని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రజలకు నాణ్యత లేని సరకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ సి.ఎం.నాయుడు, సీఐ మల్లికార్జునరావు, కమర్షియల్ టాక్స్ అధికారి రేవతి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
అంగన్వాడీకి కాలం చెల్లిన సరుకులు
పౌష్టికాహారం మాట దేవుడెరుగు... ఏకంగా ప్రాణాలమీదికొచ్చేలా ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు... బాలింతలు... గర్భిణులకు పోషకాలు కలిగిన ఆహారం అందివ్వాలని నిర్దేశించారు. ఇందుకోసం అవసరమైన సరకులు సరఫరాకు ఓ కాంట్రాక్టర్‌ను నియమించారు. కాసులకు కక్కుర్తిపడిన ఆయన కాస్తా కాలం చెల్లిన సరకులు ఇచ్చేసి వారందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పూసపాటిరేగ(నెల్లిమర్ల): చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించి వారికి తగిన విద్యాబుద్ధులు నేర్పించడానికి అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు సరఫరా చేసే సరకుల్లో అవినీతి చోటు చేసుకుంటోంది. కాలం చెల్లిన సరకులు సరఫరా చేయడం, నాసిరకం పప్పు అందించడం వంటివి జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కొంత కాలంగా పూసపాటిరేగ మండలంలో పలు కేంద్రాలకు కాలం చెల్లిన సరకులు, నాసిరకం పప్పులు సరఫరా చేస్తున్న విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కేంద్రాల్లో ప్రీస్కూల్ చిన్నారులు 1528 మంది, గర్భిణులు 543 మంది, బాలింతలు 441 మంది ఉన్నారు. కోనాడ గ్రామంలోని కేంద్రానికి 2016 సంవత్సరంలో తయారైన రజినీ రిఫైన్డ్ పామాయల్ సరఫరా చేశారు. అంతేకాదు. కామవరం, కనిమెల్ల, పేరాపురం గ్రామలకూ వాటినే అందించారు. వాస్తవానికి తయారైన ఆరునెలల్లోగానే సరకు వినియోగించాల్సి ఉంది. కానీ ఏడాది దాటినా వాటిని సరఫరా చేయడం విశేషం. పేరాపురం, గొల్లపేట కేంద్రాలకు కల్తీ అయిన కందిపప్పు సరఫరా చేయడంతో వెనక్కి పంపించినట్లు కార్యకర్త చిన్నమ్మలు తెలిపారు. ఈ కేంద్రాలకు సరఫరా చేసే సరుకులు నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు కూడా ఎందుకో ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. తక్షణమే చర్యలు తీసుకుంటాం పూసపాటిరేగ మండలంలోని పలు కేంద్రాలకు కాలం చెల్లిన నూనెప్యాకెట్లు, కంది పప్పు సరఫరా అయినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని పరిశీలించగా కాలం చెల్లినట్లు తేలింది. దీనిపై ఉన్నతాధికారులకు తెలియచేస్తాను. – ఎన్.ఆరుద్ర, ఏసీడీపీఓ,భోగాపురం ఐసీడీఎస్ సెక్టారు. కాలం చెల్లిన నూనె అందించారు అంగన్వాడీ కేంద్రానికి 2016లో తయారైన నూనెప్యాకెట్ను సరఫరా చేశారు. దీనిని నిశితంగా పరిశీలించగా ఆ విషయం బయటపడింది. దీనివల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. – కె.ఎస్.కె.దుర్గ, అంగన్వాడీ కార్యకర్త, కోనాడ -
217 మెట్రిక్ టన్నుల కాలం చెల్లిన సరుకులు
- ప్రభుత్వానికి రూ.1.43 కోట్ల నష్టం - ప్రభుత్వ పనితీరును తప్పుపట్టిన కాగ్ హైదరాబాద్ : దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్) లబ్దిదారులకు 'అమ్మ హస్తం' పథకం ద్వారా సరఫరా చేసే సరుకులను కమిషన్లకు కక్కుర్తిపడి అవసరానికి మించి కొనుగోలు చేయడంతో వాటిలో చాలా వరకు మిగిలిపోయి వాడుకోవడానికి వీలులేకుండా పనికి రాకుండా పోయాయి. అమ్మహస్తం పథకాన్ని 2013 ఏప్రిల్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని 2014 ఆగస్టులో రద్దు చేశారు. అమ్మహస్తం పథకం ద్వారా కిలో కందిపప్పు, లీటర్ పామోలిన్, కిలో గోధుమ పిండి, కిలో గోధుమలు, అర కిలో పంచదార, కిలో ఉప్పు, 250 గ్రాముల కారం పొడి, అరకిలో చింతపండు, 100 గ్రాముల పసుపుతో కూడిన తొమ్మిది నిత్యావసర సరుకులను ప్రత్యేక సంచిలో ఉంచి పౌరసరఫరాల శాఖ ద్వారా రూ.185లకే తెల్ల రేషన్ కార్డుదారులకు రాయితీపై అందించారు. అయితే అవసరానికి మించి సరుకులను కొనుగోలు చేయడంతో 217.44 మెట్రిక్ టన్నుల కాలం చెల్లిన సరుకులను బహిరంగంగా విక్రయించడం వల్ల రూ. 1.43 కోట్ల మేర పౌరసరఫరాల సంస్థకు నష్టం వాటిల్లిందని కాగ్ గుర్తించి ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. అదేవిధంగా ఈ పథకం కోసం ప్రత్యేకించి రూపొందించిన రూ.11.74 లక్షల విలువైన సంచులు పంపిణీ చేయకుండా నిరుపయోగంగా ఉన్నట్లు కాగ్ గుర్తించింది. రాష్ట్రంలో ఉన్న 1.30 కోట్ల కుటుంబాలకు సరఫరా చేసేందుకు ప్రతి సరుకు ఎంత మొత్తంలో అవసరమౌతోంది.. అందుకు ప్రతిగా వాస్తవంలో (2013 మే- 2014 ఆగస్టు మధ్య కాలంలో) ఎంత విడుదల చేశారు అన్న అంశాన్ని ఆడిట్లో విశ్లేషించగా తొమ్మిదిలో ఆరు సరుకులను (కందిపప్పు, పామోలిన్, పంచదార మినహా) తగు మొత్తంలో సరఫరా చేయలేదని కాగ్ పరిశీలనలో వెల్లడైంది.