expo mela
-
హైదరాబాద్ : హైటెక్స్ లో 'గ్రీన్ వాహనాల ఎక్స్పో-2024' ప్రారంభం (ఫొటోలు)
-
కోడిగుడ్లతో ఏటా 7,500 కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గిట్టుబాటు ధర లేకపోవటం, మొక్కజొన్న, సోయాబిన్ లభ్యత తక్కువగా ఉండటం, దాణ ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల దేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిదారులు ఏటా రూ.7,500 కోట్లు నష్టపోతున్నట్లు పౌల్ట్రీ పరిశ్రమ చెబుతోంది. ఏటా దేశంలో 8,800 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ప్రెసిడెంట్ చక్రధర రావు పొట్లూరి చెప్పారు. గుడ్ల ఉత్పత్తితో ప్రపంచంలో చైనా తర్వాతి స్థానం మనదే అయినా... సరైన ప్రోత్సాహం లేక కోళ్ల ఫామ్స్‌ని మూసేస్తున్నారని ఆయన వాపోయారు. ఈ నెల 27–29 తేదీల్లో హెచ్ఐసీసీలో 13వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో జరగనున్న నేపథ్యంలో సోమవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం.. దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ వార్షిక పరిమాణం ప్రస్తుతం రూ.1.1 లక్షల కోట్లు. వృద్ధి రేటు 7 శాతం. పరిశ్రమలో తెలుగు రాష్ట్రాల వాటా 45 శాతం వరకూ ఉన్నట్లు వెంకటేశ్వర హ్యాచరీస్ జీఎం కేజీ ఆనంద్ చెప్పారు. దేశంలో రోజుకు 25 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తయితే... దాన్లో 4 కోట్లు తెలంగాణలో, 4.5 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతున్నాయన్నారు. తెలంగాణలో 2 వేల మంది గుడ్ల ఉత్పత్తిదారులు, లక్ష మంది బ్రాయిలర్ రైతులు ఉన్నారని, రోజుకు 2 కోట్ల బ్రాయిలర్స్ ఉత్పత్తి అవుతున్నాయని తెలియజేశారు. అమెరికన్ కాళ్లను దించొద్దు.. అమెరికాలో అమ్ముడుపోని, కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న చికెన్ లెగ్స్‌ను భారత్‌కు పంపేందుకు యూఎస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని చక్రధర రావు చెప్పారు. దీన్ని అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘గతంలో అమెరికా.. పక్కనే ఉన్న హైతీ దేశంలోకి చికెన్ లెగ్స్‌ను ఎగుమతి చేసింది. దీంతో హైతీ పౌల్ట్రీ పరిశ్రమ 70 శాతం వరకు కనుమరుగైపోయింది. భారీగా చికెన్ లెగ్స్‌ను తక్కువ ధరకు పంపితే స్థానిక కంపెనీలు పోటీని తట్టుకోలేవు. ఈ పరిస్థితి మనకూ వస్తుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. -
డిఫెన్స్ ఎక్స్పో అదుర్స్
చెన్నైలో ప్రారంభమైన డిఫెన్స్ ఎక్స్‌పోలో ‘అర్జున్ మార్క్–2’ యుద్ధ ట్యాంకు విన్యాసం. భారత్, అమెరికా, రష్యా, ఇంగ్లండ్ తదితర 47 దేశాలకు చెందిన ప్రముఖ రక్షణ రంగ సంస్థలు ఇక్కడ స్టాళ్లను ఏర్పాటుచేశాయి. ఎక్స్పోను నేడు ప్రధాని మోదీ సందర్శించనున్నారు. -
16న రూప్‌టాప్ సోలార్ ఎక్స్ పో మేళా
దానవాయిపేట(రాజమహేంద్రవరం): ఏపీఈపీడీసీఎల్ ఆధ్వరంలో నవంబర్ 16వ తేదీన రూప్ టాప్ సోలార్ ఎక్స్ పో మేళాను నిర్వహిస్తున్నట్టు రాజమహేంద్రవరం డివిజనల్ ఇంజనీర్ జి.శ్యాంబాబు, నెడ్‌క్యాప్ డీఎం జి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం గోదావరి గట్టు వద్ద గల ఆపరేష¯ŒS సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోలార్ ఎక్స్ పో మేళాకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. సర్కిల్ కార్యాలయంలో ఆవరణలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించే ఈ ఎక్స్పో లో రూప్‌టాప్ సోలార్ ఉత్పత్తి, నెట్ మీటరింగ్ వ్యవస్థపై ఆవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. .ఈ కార్యక్రమానికి సంస్థ సీఎండీ ఎం.ఎం.నాయక్, సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మేయర్ పంతం రజనీ శేషసాయి ముఖ్య అతిథులుగా హజరవుతారని, ఎగ్జిబిష¯ŒSలో మొత్తం పది స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వాటిలో 2 స్టాల్స్ బ్యాంక్ అధికారులకు కేటాయించగా, మిగిలిన 8 స్టాల్స్ వివిధ సోలార్ పానల్స్ ఉత్పత్తిదారులు, డిస్ట్రిబ్యూటర్లకు కేటాయిం చినట్టు తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ పరిధికి 85 మేగా ఓల్ట్్సను కేటాయిం చగా, జిల్లాకు 15 మేగా ఓల్ట్్సను అందిస్తున్నట్టు వివరించారు. గృహ వినియెగదారులకు ఒక కిలో వాట్‌కు సోలార్ ఉత్పాదనకు 10 చదరపు అడుగుల కనీస పై కప్పు స్థలం ఉండాలి. దీనికి అయ్యే ఖర్చు రూ.89,998 కాగా 50 శాతం సబ్సిడీ ఉం టుందన్నారు. ఒక యూనిట్‌కు రూ.5.60 పైసలు ఖర్చు అవుతుందని తెలిపారు. గృహ, వాణిజ్య వినియోగదారులకు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. సమావేశంలో రాజమహేంద్రవరం టౌ¯ŒS –1 ఏడీఈ శ్రీధర్ వర్మ పాల్గొన్నారు.