express wifi
-
ఫేస్బుక్ టార్గెట్ ఏంటి..?
గతంలో ఫ్రీ బేసిక్స్ పేరిట సామాన్యుడికి కూడా ఇంటర్నెట్ అందిస్తామంటూ విమర్శలపాలైన ఫేస్బుక్.. మళ్లీ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్తో కలిసి ‘ఎక్స్‌ప్రెస్ వైఫై’ అంటూ దూసుకొస్తోంది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ వైఫైతో మొబైల్‌కి, సిస్టంకి అత్యంత తక్కువ ధరల్లో కనెక్ట్ కావచ్చంటూ ప్రచారం చేస్తోంది. దాదాపు 125 లొకేషన్లలో ఈ ఎక్స్‌ప్రెస్ వైఫై ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు అందుబాటులోకి రానప్పటికీ డిజిటల్ వోచర్స్ ద్వారా వినియోగదారులు డేటా ప్యాక్‌లు కొనాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా స్థానిక ఇంటర్నెట్ ప్రొవైడర్లను మరింత బలోపేతం చేయడంతోపాటు స్థిరమైన రాబడికి తోడ్పడుతుందన్నది ఫేస్బుక్ వాదన. అయితే ధరల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. -
భారత్‌లోనూ ఫేస్బుక్ ఎక్స్‌ప్రెస్ వైఫై..
గ్రామాల్లో చౌక ఇంటర్నెట్ టెల్కోలతో కలిసి సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ మరోసారి వార్తల్లోకెక్కింది. చవక, నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు ఎక్స్‌ప్రెస్ వైఫై పేరుతో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ‘ఎక్స్‌ప్రెస్ వైఫై సేవలను ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెల్కోలు, స్థానిక వ్యాపారులతో కలిసి పరీక్షిస్తున్నాం. ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కనెక్టివిటీ విస్తరణకు నడుం బిగించాం. ఇతర ప్రాంతాలకు త్వరలో అడుగుపెడతాం’ అని కంపెనీ తన వెబ్సైట్లో వెల్లడించింది. కంపెనీ తొలుత గ్రామీణ ప్రాంతాల్లో సేవలను ప్రారంభిస్తుంది. గతంలో రిలయన్స కమ్యూనికేషన్‌సతో కలిసి ఫ్రీ బేసిక్స్ (ఇంటర్నెట్.ఓఆర్జీ) పేరుతో బేసిక్ ఇంటర్నెట్ సర్వీసులు అందించాలని భావించిన ఫేస్బుక్ ప్రణాళిక బెడిసి కొట్టిన సంగతి తెలిసిందే. ఫేస్బుక్ అన్నీ తానై.. పబ్లిక్ వైఫై సేవలు ఫ్రీ బేసిక్స్ మాదిరిగా కొన్ని వెబ్సైట్లకే పరిమితం అవుతుందా? లేదా ఏవైనా పరిమితులు ఉన్నాయా అన్న విషయాన్ని ఫేస్బుక్ తన వెబ్సైట్లో వెల్లడించలేదు. కొత్త ప్రాజెక్టులో భాగంగా స్థానిక వ్యాపారులతో ఫేస్బుక్ చేతులు కలుపుతుంది. సమీపంలో ఉన్నవారికి ఇంటర్నెట్ అందించడం ద్వారా వ్యాపారులకు స్థిర ఆదాయం వస్తుందని కంపెనీ తెలిపింది. ప్రాజెక్టుకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను ఫేస్బుక్ సమకూరుస్తోంది. డిజిటల్ వోచర్లు కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్లు అతి తక్కువ వ్యయానికే వేగవంతమైన ఇంటర్నెట్ను ఆస్వాదిస్తారని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. భాగస్వాములందరి కోసం స్థిరమైన ఆర్థిక విధానంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని చెప్పారు. ఈ విధానంలో భారతీయులందరినీ ఆన్‌లైన్‌లోకి తీసుకు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎక్స్‌ప్రెస్ వైఫైని పరీక్షిస్తోన్న ఫేస్బుక్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యుత్తమ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఫేస్బుక్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఫ్రీ బేసిక్స్ ఇవ్వడం ద్వారా నెట్ న్యూట్రాలిటీని దెబ్బతీస్తోందనే ఆరోపణలను ఎదుర్కొన్న ఫేస్బుక్ తాజాగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్ వైఫై సేవలను అందించేందుకు ప్రయత్నాలు చేస్తోం ది. ఇందుకోసం ఇంటర్నేట్ సర్వీస్ ప్రోవైడర్లు, స్థానిక మొబైల్ కంపెనీలతో కలిసి పనిచేస్తామని ఫేస్బుక్ తమ పేజీలో పేర్కొంది. ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, ఆయా కంపెనీలకు అందిస్తామని, ఇందుకోసం లేజర్ డ్రోన్లను ఉపయోగిస్తామని తెలిపింది. ఎక్స్‌ప్రెస్ వైఫై వినియోగదారులకు వివిధ డేటా ప్యాక్‌లు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని ఫేస్బుక్ ప్రతినిధి వెల్లడించారు. భారత్‌లో కూడా ఈ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు సుస్థిర ఆర్థిక వ్యవస్థ కలిగిన వాటాదారుల కోసం చూస్తోన్నట్లు చెప్పారు. ఫేస్బుక్ ఈ సంవత్సరం మొదట్లో ప్రవేశపెట్టిన ఇంటర్నేట్ ఫ్రీ బెసిక్స్ ప్రోగ్రామ్ వివాదస్పదం అయిన సంగతి తెలిసిందే.