ఎక్స్‌ప్రెస్ వైఫైని పరీక్షిస్తోన్న ఫేస్‌బుక్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యుత్తమ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఫేస్‌బుక్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఫ్రీ బేసిక్స్ ఇవ్వడం ద్వారా నెట్ న్యూట్రాలిటీని దెబ్బతీస్తోందనే ఆరోపణలను ఎదుర్కొన్న ఫేస్‌బుక్ తాజాగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్ వైఫై సేవలను అందించేందుకు ప్రయత్నాలు చేస్తోం ది. ఇందుకోసం ఇంటర్నేట్ సర్వీస్ ప్రోవైడర్లు, స్థానిక మొబైల్ కంపెనీలతో కలిసి పనిచేస్తామని ఫేస్‌బుక్ తమ పేజీలో పేర్కొంది. ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, ఆయా కంపెనీలకు అందిస్తామని, ఇందుకోసం లేజర్ డ్రోన్లను ఉపయోగిస్తామని తెలిపింది.
ఎక్స్‌ప్రెస్ వైఫై వినియోగదారులకు వివిధ డేటా ప్యాక్‌లు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని ఫేస్‌బుక్ ప్రతినిధి వెల్లడించారు. భారత్‌లో కూడా ఈ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు సుస్థిర ఆర్థిక వ్యవస్థ కలిగిన వాటాదారుల కోసం చూస్తోన్నట్లు చెప్పారు. ఫేస్‌బుక్ ఈ సంవత్సరం మొదట్లో ప్రవేశపెట్టిన ఇంటర్నేట్ ఫ్రీ బెసిక్స్ ప్రోగ్రామ్ వివాదస్పదం అయిన సంగతి తెలిసిందే.