expresses interest
-
బంగ్లాదేశ్ సంక్షోభంపై అవిముక్తేశ్వరానంద ఏమన్నారంటే..
బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఆమె ఢాకా వదిలి ఇండియా వచ్చారు. ఇక్కడి నుంచి షేక్ హసీనా ఇప్పుడు లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ సంక్షోభంపై ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బంగ్లాదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆ దేశంలో సైనిక పాలన నడుస్తోంది. పౌరులను రక్షించే బాధ్యతను సైన్యం కచ్చితంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. బంగ్లాదేశ్‌లో దాదాపు 10 శాతం మంది హిందువులు నివసిస్తున్నారు. వారి భద్రత ఎంతో ముఖ్యం. హిందువుల భద్రత కోసం బంగ్లాదేశ్ ఆర్మీ పాటుపడాలి’ అని కోరారు.కాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో సహా అనేక ఇతర నగరాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. గత రెండు రోజులుగా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో వందల సంఖ్యలో జనం మృతిచెందారు. -
వైరల్ ప్రధాని మెచ్చారు!
జాతీయోద్యమ కాలంలో పాట చూపించిన ప్రభావం తక్కువేమీ కాదు. ఊరూరు తిరిగింది... ఉర్రూతలూగించింది. అణువణువులో దేశభక్తి నింపుకొని కదం తొక్కింది.... పాట బలమైన ఆయుధం అయింది. అలాంటి తమిళ దేశభక్తి గీతం ఒకటి ఇప్పుడు సామాజిక వేదికలలో వైరల్ అయింది. ‘అద్భుతం’ అనిపించిన ఆ పాటను ఆలపించింది తమిళులు కాదు... అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు... అశప్‌మై, కుమారి బెహల్టీలు స్వాతంత్య్ర సమరయోధుడు, మహాకవి సుబ్రహ్మణ్య భారతి రాసిన తమిళ దేశభక్తి గేయం ‘పారుక్కుళ్లే నల్ల నాళ్ ఎంగళ్ భారతినాడు’ను ఆలపించారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటిసారి ఈ వీడియోను అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ ట్విట్టర్లో పోస్ట్ చేసి ప్రశంసావాక్యాలు రాశారు. 24 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు. ‘ఈ వీడియోను చూసి చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది. ఈ షైనింగ్ స్టార్స్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. అరుణాచల్ సిస్టర్స్ గొంతులో వినిపించిన తమిళదేశభక్తి గీతం ఏక్ భారత్, శ్రేష్ఠభారత్ స్ఫూర్తిని చాటుతుంది’ అని ట్వీట్ చేశారు ప్రధాని. ఇక సోషల్ మీడియా ‘కామెంట్ సెక్షన్’లో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ‘అచ్చం తమిళ సిస్టర్స్ పాడినట్లుగానే ఉంది’ అని ఎంతోమంది అరుణాచల్ ప్రదేశ్ సిస్టర్స్‌ను ఆకాశానికెత్తారు. ‘మా అమ్మాయిలు కూడా అరుణాచల్‌ప్రదేశ్‌లోని గొప్పదేశభక్తి పాటలు పాడడానికి సిద్ధం అవుతున్నారు’ అని ఒక తమిళియన్ కామెంట్ పెట్టాడు. ‘మన దేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో దేశభక్తి గీతాలు ఉన్నాయి. అవి ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై పోకుండా, అందరికీ సుపరిచితమై పోవాలంటే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి’ అని ఒకరు స్పందించారు. మంచిదే కదా! -
ఎయిర్ ఇండియా రేసులో ఇండిగో
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థను ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రయివేటు ఎయిర్‌లైన్స్ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న ఎయిర్ ఇండియాపై దేశీయ ఎయిర్‌లైన్స్ , బడ్జెట్ క్యారియర్ ఇండిగో ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఇండిగో లేఖ రాసినట్టు సమాచారం. ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినెట్ ఇలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో (24గం.ల్లోపే) అలా సంస్థలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్ వాటా పరంగా అతిపెద్ద ఎయిర్‌లైన్స్ ఇండిగో ఈ రేసులో ముందు వరసలో ఉండటం విశేషం. ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఇండిగో ఆసక్తిగా ఉందని సెంట్రల్ ఏవియేషన్ సెక్రటరీ ఆర్ఎన్ చౌబే గురువారం ప్రకటించారు. వీటితోపాటు ఇతర దేశీయ, అంతర్జాతీయ విమాన సంస్థల ద్వారా అనధికారికంగా ప్రకటించాయని చెప్పారు. దీనిపై క్యాబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. అలాగే టాటా గ్రూపు నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదన్నారు. మరోవైపు ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేయవచ్చని మీడియా నివేదికలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై టాటా ఇంకా స్పందించలేదు.కాగా ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం గత రాత్రి (బుధవారం) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.