extra marital affaire
-
ప్రేమపెళ్లి..భార్యపై అనుమానంతో కిరాతకంగా..
కేవీబీపురం: అనుమానంతో భార్యను కిరాతంగా కత్తితో గొంతుకోసి హతమార్చిన సంఘటన కేవీబీపురంలో మంగళవారం చోటుచేసుకుంది. పుత్తూరు రూరల్ సీఐ ఈశ్వర్ తెలిపిన వివరాల మేరకు.. కేవీబీ పురానికి చెందిన సూరిబాబు, సుభాషిణి (32) పద్నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి యామిని(14), దేవిక(12), గాయత్రి (10) కుమార్తెలు ఉన్నారు. సూరిబాబు టైలర్ షాపు నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న అతను తరచూ గొడవపడి వేధించేవాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసినా అతని ప్రవర్తన మారలేదు. ఈ క్రమంలో మంగళవారం కిరాణాషాపుకు వెళ్లి తిరిగి వస్తున్న సుభాషిణిని వెంబడించి కత్తితో గొంతుకోసి హతమార్చాడు. అనంతరం కేవీబీపురం పోలీసులకు లొంగిపోయాడు. సీఐ ఈశ్వర్, ఎస్ఐ హరినాథ్, పిచ్చాటూరు ఎస్ఐ దస్తగిరి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సుభాషిణి తండ్రి సుబ్రమణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్టు సీఐ తెలిపారు. మానాన్నను ఉరి తీయండి.. తల్లిని హతమార్చిన తమ తండ్రిని తక్షణం ఉరితీయాలని కోరుతూ వారి ముగ్గురు కుమార్తెలు పోలీసుల ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు సూరిబాబును తమకు అప్పగించాలని పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. -
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, జైపూర్(చెన్నూర్): అభం శుభం తెలియని పసివాడిని కన్నతల్లే కడతేర్చింది. అక్రమ సంబంధం కొనసాగించడానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఆ కసాయి తల్లి అమ్మతనాన్నే మరిచింది. పేగుపంచుకు పుట్టిన కుమారుడి గొంతు నులిమేసింది. మూడేళ్ల బాబును తిరిగిరాని లోకాలకు పంపింది. నూతన సంవత్సరం వేళ జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో మంగళవారం ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన దుర్గం శంకరయ్య–దీప అలీయాస్ దుర్గకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. శంకరయ్య గ్రామంలో పశువుల కాపరిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి మూడేళ్ల కిందట ఇద్దరు ఆడపిల్లలు పుట్టి కొద్దిరోజులకే మరణించారు. తదనంతరం..బాబు జన్మించాడు. అప్పటికే దీప మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పర్చుకుంది. పుట్టిన బాబు అంజన్నను కూడా సక్రమంగా చూడకపోయేది. బంధువుల దగ్గర పెరిగిన అంజన్నకు మూడేళ్లు వచ్చాయి. పశువుల కాసేందుకు భర్త ఉదయం వెళ్తే సాయంత్రం వచ్చేవాడు. ఇక తన అక్రమ సంబంధం కొనసాగించడానికి ప్రధాన అడ్డంకిగా భావించిన కొడుకును అడ్డు తొలగించుకోవాలని భావించింది. మంగళవారం ఉదయం శంకరయ్య రోజువారి పనిలో భాగంగా పశువులను తోలుకుని వెళ్లాడు. పాపం..ఆ పసివాడికి తెలియదు కన్నతల్లి ఇలా చేస్తుందని. రోజుమాదిరిగానే తల్లి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో దీప కొడుకు గొంతు నులిమి శ్వాస ఆడకుండా చేసి చంపివేసి మంచంలో పడుకోబెట్టింది. ఏం జరిగిందో తెలియకుండా ఉండేందుకు జాగ్రత్తపడింది. అయితే చుట్టు పక్కలవారు, తండ్రి శంకరయ్య వెంటనే ఇంటి వద్దకు చేరుకొని చనిపోయిన పసివాడిని చూసి ఆవేదనవ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో శ్రీరాంపూర్ సీఐ నారాయణనాయక్, ఎస్సై విజేందర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలపై ఆరాతీశారు. కాగా, తానే చంపినట్లు తల్లి ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం: దొరికిపోయిన ఎస్సై!
-
వివాహేతర సంబంధం: దొరికిపోయిన ఎస్సై!
హైదరాబాద్: ఫేస్బుక్లో పరిచయమైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఎస్సై పోలీసులకు దొరికిపోయాడు. ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం టూటౌన్ ఎస్సైగా విజయ్ పనిచేస్తున్నాడు. అతనికి ఫేసుబుక్ ద్వారా ఓ మహిళ పరిచయమయింది. వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. నగరంలోని మోతీనగర్ కామధేను అపార్ట్మెంట్లో వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా సదరు మహిళ భర్త గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్సార్ నగర్ పోలీసులు వారిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై విజయ్‌ని అరెస్టు చేశారు.