Fact Checker
-
నోబెల్ శాంతి బహుమతి రేసులో భారతీయులు!?
న్యూయార్క్: నోబెల్ బహుమతుల ప్రకటనల నడుమ.. ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో శాంతి బహుమతి ఎవరికి వెళ్లబోతోందా? అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తోంది. ఈ క్రమంలో.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు ప్రముఖ మ్యాగజైన్ టైమ్ ఒక కథనం ప్రచురించింది. భారత్‌కు చెందిన ఫ్యాక్ట్ చెకర్స్ మొహమ్మద్ జుబేర్, ప్రతీక్ సిన్హాలు నోబెల్ శాంతి బహుమతి కమిటీ పరిశీలనలో ఫేవరెట్‌గా ఉన్నట్లు టైమ్ మ్యాగజీన్ కథనం ప్రచురించడం గమనార్హం. ఆల్ట్ న్యూస్ సైట్ తరపున ఫ్యాక్ట్ చెకర్స్గా ఈ ఇద్దరూ పని చేస్తున్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం.. నార్వేజియన్ చట్టసభ సభ్యులు, బుక్మేకర్ల నుండి వచ్చిన అంచనాలు, పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓస్లో (PRIO) ద్వారా ఆధారంగా రేసులో సిన్హా, జుబేర్ ప్రముఖంగా నిలిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు శాంతి బహుమతి కమిటీ ఫేవరెట్‌గానూ ఈ ఇద్దరూ ఉన్నట్లు టైమ్ కథనంలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. జూన్ నెలలో 2018కి సంబంధించిన ట్వీట్ విషయంలో అరెస్టైన జుబేర్.. నోబెల్ శాంతి బహుమతి పరిశీలనలో ఉండడం గమనార్హం. నెల తర్వాత అతను జైలు నుంచి సుప్రీం కోర్టు బెయిల్ ద్వారా విడుదల అయ్యాడు. ఇక.. జుబేర్ అరెస్ట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా. ‘‘భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అధ్వాన్నంగా ఉంది, జర్నలిస్ట్‌లకు ఇక్కడి ప్రభుత్వం ప్రతికూల, అసురక్షిత వాతావరణాన్ని సృష్టించింది’’ అంటూ అమెరికాలోని జర్నలిస్ట్ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం. నోబెల్ శాంతి బహుమతి 2022 కోసం.. 341 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 251 మంది, 92 సంస్థలు ఉన్నాయి. సాధారణంగా నోబెల్ కమిటీ నామినీల పేర్లను మీడియాకుగానీ, అభ్యర్థులకుగానీ అసలు తెలియజేయదు. అయితే.. కొన్ని మీడియా హౌజ్‌లు మాత్రం సర్వేల ద్వారా అభ్యర్థులను, అర్హత ఉన్నవాళ్లను పేర్లు.. వివరాలతో సహా అంచనా వేస్తుంటాయి. ఇక ఈ ఇద్దరు ఫ్యాక్ట్ చెకర్స్‌తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఐరాస శరణార్థ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవెల్నీ, బెలారస్ ప్రతిపక్ష నేత స్వియాత్లానా, ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ డేవిడ్ అటన్‌బోరఫ్ తదితరులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 7వ తేదీన ప్రకటిస్తారు. ఇదీ చదవండి: ఈసారి టార్గెట్ జపాన్? -
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జుబేర్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. కాగా, మహ్మాద్ జుబేర్‌కు ప్రాణ హాని ఉందని, ఆయనకు పలువురి నుంచి బెదిరింపులు వస్తున్నాయని భద్రతపై ఆందోళన చెందుతున్నామని జుబేర్ న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొన్‌సేల్వ్స్ సుప్రీంకోర్టుకు గురువారం విన్నవించారు. ఈ నేపథ్యంలో బెయిల్ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టన ధర్మాసనం.. జుబేర్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. యూపీ కేసులో జుబేర్ బెయిల్ పిటిషన్‌ను సీతాపూర్ కోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జస్టిస్ ఇందిరా బెనర్జీ యూపీ ప్రభుత్వం, యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ జుబేర్‌కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్టు తెలిపారు. జుబేర్ ఎలాంటి ట్వీట్లు చేయరాదని, ఆధారాలు తారుమారు చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సోషల్ మీడియా వేదికగా జుబేర్ మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. జూన్ 1న నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించే మధ్యంతర బెయిల్ మంజూరైందని చెప్పారు. విచారణను నిలిపివేయడం, ఈ అంశంలో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని సర్వోన్నత న్యాయస్ధానం తేల్చిచెప్పింది. మధ్యంతర ఉత్తర్వులను సోమవారం వరకూ నిలిపివేయాలని యూపీ పోలీసుల తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. ఇక, నాలుగేళ్ల కిందట ఆయన షేర్ చేసిన ఓ ట్వీట్ పట్ల తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ ట్వీట్ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేదిగా ఉందని, విద్వేషాలను రగిల్చేదిగా ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు.. జుబేర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం యూపీలోని సీతాపూర్ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. -
చంపేస్తామంటూ బెదిరింపులు.. కోర్టును ఆశ్రయించిన జుబేర్
న్యూఢిల్లీ: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. కాగా, మహ్మద్ జుబేర్ బెయిల్ కోసం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే, మహ్మాద్ జుబేర్‌కు ప్రాణ హాని ఉందని, ఆయనకు పలువురి నుంచి బెదిరింపులు వస్తున్నాయని భద్రతపై ఆందోళన చెందుతున్నామని జుబేర్ న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొన్‌సేల్వ్స్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వెంటనే.. జుబేర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని న్యాయవాది కోరారు. కాగా, న్యాయవాది విజ్ఞప్తి మేరకు.. రిజిస్ట్రీలో బెయిల్ పిటిషన్ అంశం రిజిస్టర్ అవడంతో రేపు(శుక్రవారం) విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక, నాలుగేళ్ల కిందట ఆయన షేర్ చేసిన ఓ ట్వీట్ పట్ల తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ ట్వీట్ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేదిగా ఉందని, విద్వేషాలను రగిల్చేదిగా ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు.. జుబేర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం యూపీలోని సీతాపూర్ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇది కూడా చదవండి: రైల్వే ట్రాక్‌పై ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు.. వీడియో వైరల్ -
అది నకిలీ లింక్.. క్లిక్ చేస్తే అంతే!
న్యూఢిల్లీ: కంటికి కనిపించని కరోనా వైరస్‌పై ప్రపంచం యావత్తు పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో కోవిడ్-19పై వస్తున్న నకిలీ వార్తలు, తప్పుదోవ పట్టించే సమాచారంపై మరో పోరాటం చేయాల్సి వస్తోంది. కష్టకాలంలోనూ కేటుగాళ్లు కల్తీ సమాచారంతో జనాన్ని గందోరగోళానికి గురిచేస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి నకిలీ మెసేజ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రతి భారతీయుడికి ప్రధాని నరేంద్ర మోదీ రూ.15 వేలు ఇస్తున్నట్టు నకిలీ మెసేజ్ సృష్టించారు. అంతేకాదు డబ్బులు తీసుకోవాలంటే ఈ లింకుపై క్లిక్‌చేసి, అందులోని దరఖాస్తును నింపాలని సూచించారు. అయితే ఇది నకిలీ సమాచారం అని, ఈ లింక్‌పై క్లిక్ చేయొద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) సూచించింది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని, మోసపోవద్దని పీఐబీ పేర్కొంది. కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, ఆన్లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. ఎండలో నిలుచుంటే కోవిడ్-19 సోకదని కొద్దిరోజుల క్రితం ప్రచారం సాగింది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొట్టిపారేసింది. దీనికి ఎటువంటి ప్రయోగపూర్వక ఆధారం లేదని వివరణ ఇచ్చింది. (ఇది చదవండి: మతం ఆధారంగా ‘కరోనా’ వార్డులు) दावा : कठिन परिस्तिथियों के बीच, पीएम हर भारतीय को 15 हजार रुपय की मदद दे रहे हैं जिसे प्राप्त करने के लिए दिए गए लिंक पर क्लिक करके फॉर्म भरना होगा। तथ्य :यह दावा बिलकुल झूठ है,व दिया गया लिंक फर्जी है| कृप्या अफवाहों और जालसाज़ों से दूर रहें| pic.twitter.com/BrgEJYeUCW — PIB Fact Check (@PIBFactCheck) April 14, 2020 -
లాక్డౌన్ గురించి ఫేక్ న్యూస్ వైరల్
సోషల్ మీడియాలో షికారు చేసే వార్తల్లో ఏవి వాస్తవాలో ఏవి అవాస్తవాలో అర్థం కాకుండా ఉన్నాయి. అయితే అందులో ఎక్కువగా ఫేక్ వార్తలే వీరవిహారం చేస్తున్నాయని, కేవలం 10 శాతం మాత్రమే నిజమైనవి ఉంటున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. అంతేకాక ఇప్పటికీ చాలామంది పత్రికలనే విశ్వసిస్తున్నారని, అందులో వచ్చే వార్తలపైనే ఆధారపడుతున్నారని వివరించింది. ఇదిలా ఉండగా మరో అసత్య వార్త వాట్సాప్‌ను ఊపేస్తోంది. ఇప్పటికే భారత ప్రభుత్వం జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత 21 రోజుల పాటు లాక్డౌన్ విధించగా.. నెక్స్ట్ ఏంటి? అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేస్తారా లేదా అన్న గందరగోళంలో ఉన్నారు. అయితే లాక్డౌన్ ఎత్తివేయడం లేదని, పైగా దశల వారీగా పొడిగించాలంటూ ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సూచిస్తున్నట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన సదరు సంస్థ అది అసత్య ప్రచారమని, నిరాధారమైనదని కొట్టిపారేసింది. లాక్డౌన్ గురించి అలాంటి ప్రత్యేక పద్ధతిని ఏదీ మేము తయారు చేయలేదని స్పష్టం చేసింది. Messages being circulated on social media as WHO protocol for lockdown are baseless and FAKE. WHO does NOT have any protocols for lockdowns. @MoHFW_INDIA @PIB_India @UNinIndia — WHO South-East Asia (@WHOSEARO) April 5, 2020 ఫేక్ న్యూస్ ఏం చెప్తోందంటే... లాక్డౌన్ అమలు చేయడానికి ముందుగా ఒకరోజు ట్రయల్(మార్చి 21) నిర్వహిస్తారు. తర్వాత మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు (21 రోజులు) లాక్డౌన్ విధిస్తారు. ఆ తర్వాత ఐదు రోజులు ప్రభుత్వం విరామం ప్రకటిస్తుంది. అనంతరం ఏప్రిల్ 20 నుంచి మే 18 వరకు(28 రోజులు) రెండోసారి లాక్డౌన్ అమలు చేస్తారు. కరోనా తీవ్రత తగ్గకపోతే ఐదురోజులు బ్రేక్ ఇచ్చి తిరిగి మూడోసారి లాక్డౌన్ అమలు చేయక తప్పదు. అంటే.. మే 25 నుంచి జూన్ 10 వరకు(15 రోజులు) ఆఖరుసారిగా లాక్డౌన్ అమల్లో ఉంటుంది. (లాక్డౌన్ వేళ నగరంలోనయా ట్రెండ్..) #PIBFactCheck Claim : A so-called circular, said to be from WHO is floating around on whatsapp, saying that it has announced a lockdown schedule. Fact : @WHO has already tweeted it as #Fake ⬇️https://t.co/GB7rQ0t9lJ pic.twitter.com/3M5RBLoA3i — PIB Fact Check (@PIBFactCheck) April 5, 2020 -
ఇది.. ఇన్ఫోడెమిక్ !
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా విశ్వవ్యాప్త మహమ్మారి(పాన్‌డెమిక్)గా విజృంభిస్తుంటే.. మరోవైపు, ఆ ప్రాణాంతక వైరస్‌పై నకిలీ వార్తలు ‘సమాచార మహమ్మారి(ఇన్ఫోడెమిక్)’గా మారి ప్రజలను మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు వార్తలు, సలహాలు, భయంకర వీడియోలతో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. పలు అధికార సంస్థలు, వాస్తవాలను నిర్ధారించే అనధికార సంస్థలు(ఫ్యాక్ట్ చెకర్స్) ఈ నకిలీ వార్తల పనిపట్టే పనిలో ఉన్నప్పటికీ.. కరోనా కన్నా వేగంగా ఈ నకిలీ మహమ్మారి విస్తరిస్తోంది. తప్పుడు వార్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలని స్వచ్ఛంద సంస్థలను ప్రధాని మోదీ కూడా కోరాల్సిన స్థాయికి ఈ ఇన్ఫోడెమిక్ చేరింది. కాగా, ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ విధించబోతున్నారన్న వార్తను ఆర్మీ ఖండించింది. కరోనాను ఎదుర్కొనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘పీఎం కేర్స్’ ఫండ్‌కు విరాళాలు పంపే వారిని మోసం చేసేందుకు రూపొందించిన నకిలీ యూపీఐ ఐడీని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం శిక్షార్హమైన నేరమని కేంద్ర హోం శాఖ నిర్ధారించిందన్న వార్తను కూడా అధికారులు ఖండించారు. కరోనా లక్షణాలకు సంబంధించి తొమ్మిది రోజుల టైమ్‌లైన్‌తో వేలాది పోస్ట్‌లు పలు ఫేస్బుక్ అకౌంట్లలో సర్క్యులేట్ కావడాన్ని ప్రైవేట్ ఫాక్ట్ చెకర్ ‘బూమ్ ఫాక్ట్‌చెక్’ గుర్తించింది. ఆ ఇన్ఫోగ్రాఫిక్ సరైంది కాదని నిర్ధారించింది. -
ప్రపంచంలోనే ధనవంతుడు మృతి! నిజమెంత?
సాక్షి, ఇంటర్నెట్ డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కువైట్‌కు చెందిన నాస్సి అల్ ఖార్కి మృతి చెందాడన్న పోస్ట్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంతో ఆస్తి, బంగారం, నగదు, వజ్రాలు ఉన్నా అతను తనతోపాటు ఏ ఒక్కటీ తీసుకెళ్లలేకపోయాడన్నది ఆ పోస్ట్ సారాంశం. బంగారంతో చేసిన శవపేటికలో అతని మృతదేహం ఉండగా, బంగారు మంచాలు, పచ్చలు, వజ్రాలు, ఇంట్లో బంగారు మెట్లు, బంగారు బాత్రూం వంటివి చూపిస్తూ దాదాపు తొమ్మిది ఫోటోలను ఈ పోస్ట్‌కు జోడించారు. అయితే ఇదంతా అబద్ధమని తేలింది. బంగారు శవపేటికలో ఉన్న వ్యక్తి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందిన మిలీయనీర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి షెరాన్ సుఖేడో(33)గా గుర్తించారు. ఇతను కాల్పుల్లో చనిపోగా, అంత్యక్రియలకు ముందు లక్ష డాలర్లకు సమానమైన బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ విషయాన్ని అనేక అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయిచ కూడా.. ఇక, నాస్సి అల్ ఖార్కి అనే వ్యక్తి పేరుతో కువైట్‌లో ఎవరూ లేరు. నాస్సి అల్ ఖరాఫీ అనే వ్యక్తి కువైట్‌లో 2011లో ఫోర్బ్స్ పత్రికలో ధనవంతుడిగా నమోదయ్యాడు. ఖరాఫీ అదే సంవత్సరం చనిపోయాడు. ప్రస్తుతం కువైట్‌లో అత్యంత ధనవంతుడిగా 2019 ఫోర్బ్స్ పత్రిక ప్రకారం కుతాబయా అల్ఘానిమ్ ఉన్నాడు. వేర్వేరు ఫోటోలను ఒక దగ్గర పేర్చి ఒకే వ్యక్తికి చెందినవిగా చూపిస్తూ వైరల్ అయిన ఈ పోస్ట్‌ను సూరజ్ కిరణ్ ట్రావెల్స్ అనే ఫేస్బుక్ అకౌంట్లో మొదట పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నిజమని నమ్మిన చాలామంది యూజర్లు పలు రకాలుగా కామెంట్లు చేశారు. అంతేకాక, జెట్ విమానం, వజ్రాల కారు, బంగారు కడ్డీలకు సంబంధించిన ఫొటోలు వేర్వేరు వెబ్సైట్ల నుంచి సేకరించారు. ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టుల పట్ల నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీదీ నిజమని నమ్మేయకుండా, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అసలు ఇప్పుడీ ఈ నిజం ఎలా బయటపడిందంటే అంతర్జాలంలో ఏదైనా ఒక ఫొటో కానీ, వీడియో కానీ పెడితే దాన్ని ఎవరు, ఎప్పుడు పోస్ట్ చేశారు? ఆయా ఫోటోలు, వీడియోలు ఎక్కడివి అనేవి తెలుసుకునే రివర్స్ ఇమేజ్ సెర్చ్ అనే టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా వాస్తవ పరిస్థితులను నిర్ధారణ చేసుకోవచ్చు. -
మార్ఫింగ్ ఫొటోలతో సోనియాపై దుష్ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అలనాటి శృంగార దృశ్యాలంటూ సోషల్ మీడియా ‘ఫేస్బుక్’లో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘వియ్ సపోర్ట్ నరేంద్ర మోదీ 2019’ పేరిట వెలిసిన ఫేస్బుక్ పేజీ వీటిని ఎక్కువగా ప్రచారం చేస్తోంది. వాస్తవానికి ఆ ఫొటోలు సోనియా గాంధీవి కావు. మొట్టమొదటి జేమ్స్ బాండ్ చిత్రం ‘డాక్టర్ నో’లో హీరోయిన్గా నటించిన స్విస్ తార ‘ఉర్సులా ఆండ్రెస్’ వి. ఆ చిత్రంలో ఆమె మొదటి జేమ్స్ బాండ్ హీరో స్కాటిష్ నటుడు ‘సయాన్ కానరీ’తో కలిసి నటించారు. ‘డాక్టర్ నో’ చిత్రం వర్కింగ్ స్టిల్స్‌ను లైట్‌గా మార్ఫింగ్ చేసి ‘సోనియా గాంధీ అలనాటి శృంగార దృశ్యాలు’ అంటూ ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో ఎక్స్‌పోజింగ్‌లో ఉర్సులా ఆండ్రెస్ పెట్టింది పేరవడంతో నాటి కుర్రకారు ఆమెను ముద్దుగా ‘ఉర్సులా అన్‌డ్రెస్’ అని పిలుచుకునేవారు. ఆ మాటకొస్తే సోనియా గాంధీ ఫొటోలంటూ తప్పుడు ఫొటోలలో దుష్ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఓ మగవాడి తొడపై కూర్చున్న అలనాటి ‘బార్ వెయిట్రెస్’ సోనియా గాంధీ అంటూ ఇటీవల కూడా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాస్తవానికి ఆ ఫొటో హాలివుడ్ నటి ‘రీస్ విథర్స్పూన్’ది. ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోనియా ఫొటోగా ప్రచారం చేశారు. 2004లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి సోనియా గాంధీ ప్రధాని అవుతారని ప్రచారం జరిగినప్పుడు కూడా సోనియా ‘బార్ డ్యాన్సర్’గా పనిచేసినప్పటి ఫొటో అంటూ ఓ ఫొటో ప్రచారంలోకి వచ్చింది. నాటి హాలివుడ్ అందాల నటి మార్లిన్ మాన్రో ఫొటో మార్ఫింగ్ చేశారు. వాస్తవానికి సోనియా గాంధీకి ‘బార్ వెయిట్రెస్ గానో బార్ డ్యాన్సర్’గానో పనిచేయాల్సిన అవసరం లేదు, రాలేదు. ఆమె తండ్రి స్టెఫానో ఇటలీలో భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేశారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో సోనియా గాంధీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సు చేస్తున్నప్పుడు రాజీవ్ గాంధీ పరిచయం అవడంతో వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. -
వైరల్ ఫోటో : క్షమాపణలు చెప్పిన నేత
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఏదైనా అంశం వైరల్‌గా మారితే చాలు.. అది వాస్తవమో.. కాదో తెలుసుకోకుండానే దాన్ని మరో నలుగురికి షేర్ చేయడం.. దాని గురించి తోచిన కామెంట్ పెట్టడం.. ఆనక అది కాస్తా వాస్తవం కాదని తెలిశాక క్షమాపణలు చెప్పడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురయ్యింది సీపీఐ(ఎమ్ఎల్) నేత కవితా కృష్ణన్‌కి. మంగళవారం ‘గాంధీ జయంతి’ సందర్భంగా తమ సమస్యల పరిష్కారానికి రైతులు ‘కిసాన్ క్రాంతి యాత్ర’ చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ యాత్రను అడ్డుకోవాడానికి పోలీసులు రైతుల మీద లాఠీచార్జీ చేశారు. ఈ దాడికి సంబంధించినదిగా భావిస్తున్న ఒక ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో భద్రతా అధికారి, ఓ రైతును అడ్డగించాడానికి తుపాకీతో బెదిరిస్తుండగా.. సదరు ముసలి రైతు ఏమాత్రం బెదరక ఓ చేతిలో ఇటుక, మరో చేతిలో లాఠీ పట్టుకుని అధికారి మీదే దాడి చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది ఫోటోలో. ఈ ఫోటోను కవితా కృష్ణన్ తన ట్విటర్లో షేర్ చేయడమే కాకుండా ‘ఈ ఫోటోలో ఆగ్రహంతో ఊగిపోతూ భద్రతాధికారి మీదకు రాయి ఎత్తిన ఈ రైతును ఉగ్రవాది అనలేమో అదే విధంగా ఉగ్రవాదుల మీద రాళ్లతో దాడి చేసే కశ్మీరి బాలలను కూడా ఉగ్రవాదులగా పరిగణించరాదు’ అంటూ ట్వీట్ చేశారు. కవిత చేసిన ట్వీట్‌ను దాదాపు 2500 మంది రిట్వీట్ కూడా చేశారు. అయితే కవిత ఈ ఫోటోను తన ట్విటర్లో షేర్ చేసిన తరువాత దీనికి సంబంధించి అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. Look at the farmer with a brick in his hand, facing a cop with a gun. If you don't think the farmer is a terrorist - and I hope you don't - if you empathise with his anger, I hope you'll think again before you call a Kashmiri kid with a stone in his hand a terrorist. pic.twitter.com/7Omxax3sWj — Kavita Krishnan (@kavita_krishnan) October 2, 2018 అది ఏంటంటే ఈ ఫోటో ‘కిసాన్ క్రాంతి యాత్ర’కు సంబంధించనది కాదని, అసలు ఈ మధ్య కాలంలో తీసినది కాదని తెలిసింది. ఈ ఫోటో దాదాపు ఐదేళ్ల క్రితం 2013 మీరట్, ఖేరా గ్రామంలో మహాపంచయత్ గొడవల సందర్భంగా తీసిందిగా నిర్ధారించబడింది. దాంతో ట్విటర్ జనాలు కవితను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇలా ట్రోల్ చేసిన వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ రెబల్ కపిల్ మిశ్రా కూడా ఉన్నారు. ఆయన ఈ ఫోటోతో పాటు దీనికి సంబంధించిన కథనాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి తన ట్విటర్లో షేర్ చేశారు. pic.twitter.com/3WsVs1p3VI — Kapil Mishra (@KapilMishra_IND) October 3, 2018 అసలు విషయం తెలుసుకున్న కవితా కృష్ణన్ తన పొరపాటును గుర్తించి క్షమాపణలు చెప్పారు. కానీ తాను వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని మాత్రం సమర్ధించుకున్నారు. -
మోదీ హామీల అమలు ఎంతవరకు?
గత పంద్రాగస్టున ఇచ్చిన 8 హామీలపై ‘ఫ్యాక్ట్ చెకర్’ పరిశీలన * జన్‌ధన్ యోజన ప్రయోజనంపై అస్పష్టత * మరుగుదొడ్ల నిర్మాణం నామమాత్రమే * ఉత్తమంగా సామాజిక భద్రత కార్యక్రమాలు న్యూఢిల్లీ: గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీల్లో కొన్ని మాత్రమే కార్యరూపం దాల్చాయని ‘ఫ్యాక్ట్ చెకర్’ సంస్థ పేర్కొంది. అందులోనూ కొన్ని అంశాల్లోనే మెరుగైన ప్రయోజనం కనిపించిందని.. మరిన్ని అంశాల్లో అస్పష్టత నెలకొందని తెలిపింది. ప్రధానమైన 8 అంశాల అమలుతీరుపై ‘ఫ్యాక్ట్ చెకర్’ పరిశీలన జరిపింది. వివరాలు.. 1. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన నిరుపేదలందర్నీ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. తద్వారా దేశంలో బ్యాంకు ఖాతాల సంఖ్య ఈ ఏడాది ఆగస్టు 3 నాటికి 22.8 కోట్లకు చేరింది. గత ఏడాది (17.4 కోట్ల ఖాతాలు)తో పోల్చితే.. ఖాతాల సంఖ్య 31 శాతం పెరగడం గమనార్హం. ఖాతాల్లోని సొమ్ము రూ.22,033 కోట్ల నుంచి రూ.40,795 కోట్లకు.. అంటే 85 శాతం పెరిగింది. 2. స్వచ్ఛ విద్యాలయ అభియాన్.. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బాలబాలికలకు మరుగుదొడ్ల సదుపాయం కల్పించేందుకు ‘స్వచ్ఛ విద్యాలయ అభియాన్’ను మోదీ ప్రకటించారు. కానీ ఈ లక్ష్యాన్ని ఏ మాత్రం చేరుకోలేకపోయారు.ఢిల్లీ సహా మారుమూల ప్రాంతాల వరకు కూడా స్కూళ్లలో సరైన సంఖ్యలో టాయిలెట్లు లేవని తేలింది. . 3. గివ్ ఇట్ అప్.. ధనికులు పొందుతున్న వంటగ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకునేందుకు ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. 1.04 కోట్ల మంది ఎల్పీజీ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోగా, 17.6 లక్షల మంది మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు. 4. డీబీటీఎల్తో సబ్సిడీ భారం తగ్గింపు పక్కదారి పడుతున్న ఎల్పీజీ సబ్సిడీ అడ్డుకట్టకు ‘ఎల్పీజీకి ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీఎల్)’ తెచ్చారు. గతేడాదిలో రూ.20 వేల కోట్లు సబ్సిడీ భారం తగ్గిందని కేంద్రం చెప్పింది. అయితే తగ్గిన భారం సుమారు 2 వేల కోట్లేనని కాగ్ పేర్కొంది. 5. అన్ని గ్రామాలకు విద్యుత్.. దేశంలో 98.1 శాతం గ్రామాల్లో విద్యుదీకరణ జరిగిందని కేంద్రం పేర్కొనడం వాస్తవ దూరమని ‘ఫ్యాక్ట్ చెకర్’ పేర్కొంది. దేశంలోని 5,97,464 గ్రామాలకుగాను ఈ జూన్ 30 నాటికి 5,87,569 గ్రామాల్లో విద్యుత్ సరఫరా అందుతోందని కేంద్రం చెబుతోంది. అంటే కేవలం 9,895 గ్రామాలకే విద్యుత్ సరఫరా లేదు! 6. సామాజిక భద్రత.. సామాజిక భద్రత కార్యక్రమం కింద కేంద్రం ప్రధానంగా మూడు పథకాలను ప్రవేశపెట్టింది. ఈ జూన్ 14 నాటికి అటల్ పెన్షన్ యోజన కింద 27 లక్షల మంది, ప్రధాని సురక్షా బీమా యోజన కింద 9.45 కోట్ల మంది, ప్రధాని జీవన్ జ్యోతి బీమా యోజన కింద 2.97 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. 7. గ్రామీణాభివృద్ధి.. 2015-16లో వ్యవసాయానికి కేటాయించిన రూ. 24,909 కోట్లతో పోల్చితే ఈసారి 44 శాతం అదనంగా రూ.35,984 కోట్లు బడ్జెట్ కేటాయించింది. కానీ దేశంలోని మొత్తం సాగుభూమిలో 32 % కేవలం 5 శాతం మంది పెద్ద రైతుల చేతుల్లోనే ఉంది. వ్యవసాయేతర అవసరాలకు మళ్లించడం, పట్టణీకరణ కారణంగా సాగు చేసే భూమి విస్తీర్ణం తగ్గిపోతోందని పేర్కొంది. 8. వన్ ర్యాంక్ వన్ పెన్షన్.. మాజీ సైనికోద్యోగులకు ఒక ర్యాంక్ ఒకే పెన్షన్ హామీ ఇచ్చిన మోదీ దానిని అమల్లోకీ తెచ్చారు. ఏటా రూ.7,488 కోట్లు భారం పడుతుందని, బకాయిల చెల్లింపునకు రూ.10,925 కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ 2016 మార్చి నాటికి రూ. 2,861 కోట్లే ఖర్చు చేశారు.