Factory worker
-
ఈశ్వరమ్మతో ‘నాకు వివాహేతర బంధం’ ఉంది.. గట్టిగా కేకలు వేయడంతో
సాక్షి, విశాఖపట్నం: జింక్ ఫ్యాక్టరీ సమీపంలోని పొదల్లో జూలై 25న లభించిన టీఏఎస్ ఇంజినీరింగ్ కంపెనీ సూపర్వైజర్ సిద్ధార్థ శంకర్ పట్నాయక్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్థారించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న తల్లి, కుమారుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో కుమారుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి క్రైం డీసీపీ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం... టీఏఎస్ ఇంజినీరింగ్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న సిద్ధార్థ శంకర్ పట్నాయక్ మింది గ్రామం ఎస్సీ కాలనీలో నివసించేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న యడ్ల ఈశ్వరమ్మతో పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఈశ్వరమ్మ దగ్గర శంకర్ రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. మొత్తంగా చీటీలకు చెల్లించాల్సిన సొమ్ముతో కలిపి రూ.7లక్షల వరకు బాకీ పడ్డాడు. అయితే ఈశ్వరమ్మతో వివాహేతర సంబంధం కారణంగా బాకీ తీర్చకుండా జాప్యం చేశాడు. విషయం తెలుసుకున్న ఈశ్వరమ్మ పెద్ద కుమారుడు యడ్ల గౌరీ శంకర్, చిన్న కుమారుడు (బాలుడు) డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడగడంతో... ఇవ్వను అని శంకర్ చెప్పేశాడు. అక్కడితో ఆగకుండా ఈశ్వరమ్మతో తనకు వివాహేతర బంధం ఉందని కించపరుస్తూ గట్టిగా కేకలు వేస్తూ తిట్టడంతో ఆమె కుమారులు తట్టుకోలేకపోయారు. శంకర్‌ను హతమార్చాలని నిర్ణయించుకుని ప్రణాళిక ప్రకారం మాట్లాడాలని జూలై 25న తమ ఇంటికి పిలిచారు. తాగిన మైకంలో ఉన్న శంకర్ గొంతు, చేతి మణికట్టుపై కోసి ఈశ్వరమ్మ, గౌరీ శంకర్, అతని తమ్ముడు కడతేర్చారు. అనంతరం మృతదేహాన్ని అర్ధరాత్రి బైక్ మీద తీసుకెళ్లి జింక్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న పొదల్లో పడేశారు. అర్ధరాత్రి ఇల్లు కడగడంతో దొరికేశారు... జింక్ ప్యాక్టరీ సమీపంలోని పొదల్లో శంకర్ మృతదేహం జూలై 26న కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజు అతని సహచర ఉద్యోగి, మల్కాపురం గాంధీజీ వీధికి చెందిన పాండా జితేంద్ర మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తమ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసే సిద్ధార్థ శంకర్ పట్నాయక్ జూలై 25న విధులకు హాజరుకాలేదని, మరుసటి రోజు జింక్ ప్యాక్టరీ సమీపంలోని పొదల్లో చనిపోయి కనిపించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో క్రైం ఏడీసీపీ డి.గంగాధరం పర్యవేక్షణలో గాజువాక సీఐ భాస్కరరావు, ఎస్ఐ కె.సతీష్ బృందం దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో మింది గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులను విచారించగా... యడ్ల ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులతో శంకర్ గొడవపడ్డాడని తెలిపారు. దీంతో పరిసర ప్రాంతాల వారితో మాట్లాడగా జూలై 25న అర్ధరాత్రి ఈశ్వరమ్మ ఇల్లు కడిగిందని స్థానికులు చెప్పారు. ఆ విషయం ఆధారంగా విచారించగా తామే శంకర్‌ను హతమార్చామని, రక్తపు మరకలను కడిగేశామని నిందితులు అంగీకరించారు. సమావేశంలో క్రైం ఏడీసీపీ గంగాధరం, శ్రావణ్‌కుమార్, సీఐ ఎల్.భాస్కర్‌రావు, ఎస్ఐ కె.సతీష్ తదితరులు పాల్గొన్నారు. వివాహేతర బంధంతో హత్యాయత్నం తన భార్యతో వివాహేతర బంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హతమార్చాలని దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గంట్యాడ సమీప యారాడ గ్రామానికి చెందిన మొల్లి శ్రీను కూలి పనులు చేసుకుంటూ నివసించేవాడు. 2007లో మేనమామ కూతురుతో వివాహం జరిగింది. ఈ క్రమంలో తన భార్యకు, ఎస్బీసీ డాలి్ఫన్ హిల్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మొల్లి తాతారావుకు వివాహేతర బంధం ఏర్పడడాన్ని జీరి్ణంచుకోలేకపోయాడు. తాతారావును హతమార్చాలని శ్రీను నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న రాత్రి బీ షిప్ట్ ముగించుకుని తన సూపర్వైజర్ ఎస్.ప్రవీణ్‌తో కలిసి తాతారావు ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి 8.40 గంటలకు వారు డాలి్ఫన్ హిల్స్ గేటు ఎదురుగా రాగానే మొల్లి తాతారావుపై శ్రీను కారం చల్లి, ఇనుపరాడ్డు, కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయాలపాలైన తాతారావు ఈ నెల 18న మల్కాపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ లూథర్‌బాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో శ్రీను దాడి చేసినట్లు తేలడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చాకు, ఇనుపరాడ్డు స్వా«దీనం చేసుకున్నారు. -
మొదటి ఓలా స్కూటర్ ఇదే... ఓ లుక్కేయ్యండి !
ప్రీ బుకింగ్స్‌తోనే వరల్డ్ రికార్డు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ లుక్‌ని ఆ కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ రివీల్ చేశారు. తమిళనాడులో ఉన్న ఫ్యాక్టరీలో తయారైన మొట్ట మొదటి ఓలా మొదటి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఫిబ్రవరిలో స్కూటర్ తయారీ పనులు మొదలు పెట్టామని, కంపెనీ ఉద్యోగులు ఎంతో శ్రమించి ఈ స్కూటర్ని తయారు చేశారని ఆయన వెల్లడించారు. పెట్రోలు ధరల పెరుగుదలతో ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్న వారికి ఓలా ఊరట ఇచ్చింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ స్కూటర్‌కి సంబంధించిన ఒక్కో ఫీచర్‌ని ట్విట్టర్ ద్వారా భవీష్ అగర్వాల్ వెల్లడిస్తూ వస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ స్కూటర్‌కి సంబంధించిన అన్ని వివరాలను ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నారు. Built the first scooter in our Futurefactory today! From barren land in Feb to this in under 6 months despite a pandemic!! The @OlaElectric team is just amazing❤️👍🏼 pic.twitter.com/B0grjzWwVC — Bhavish Aggarwal (@bhash) August 14, 2021 -
కదిలిన యంత్రాలు
బొబ్బిలి: కార్మికుల ఆకలి కేకలు తగ్గే తరుణం వచ్చేసింది. ఆంక్షల సడలింపుతో జిల్లాలోని పరిశ్రమలు తెరచుకుంటున్నాయి. మళ్లీ సైరన్ మోతలు వినిపి స్తున్నాయి. యంత్రాల హోరు ఆ ప్రాంతాల్లో ప్రతిధ్వనిస్తోంది. కరోనా వైరస్‌ప్రభావంతో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో అన్ని పరిశ్రమలు మూత పడిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వం కొన్నింటికి సడలింపులు ఇవ్వడంతో కొంత ఊరట లభించింది. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ, ఆహారం, మందులు తదితర పరిశ్రమలు తెరవటానికి అవకాశం కలగడంతో అందులో పనిచేసే కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్‌వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్మికులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. మంగళవారం నుంచి పునఃప్రారంభం జిల్లాలో పరిశ్రమలు మంగళవారం నుంచి పునఃప్రారంభమ ఆ్యయి. 750 మంది కార్మికులు, ఉద్యోగులు విధులకు వస్తున్నారు. హాజరవుతున్న కార్మికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. పని ప్రదేశంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. బొబ్బిలిలో 21 యూనిట్లు ప్రారంభించారు. ఇందులో 450 మంది, వీటీ అగ్రహారంలోని 11 పరిశ్రమల్లో వంద మంది సిబ్బంది వస్తున్నారు. కంటకాపల్లిలోని మూడు యూనిట్లు ప్రారంభించడంతో అక్కడి నుంచి వంద మంది, నెల్లిమర్ల 20 యూనిట్లలో 6 ప్రారంభించారు. ఇక్కడ వంద మంది వరకూ పనులు చేసేందుకు బుధవారం నుంచి వస్తున్నారు. ఇంకా పూసపాటిరేగలోని రెండు కంపెనీలు మొదలయ్యాయి. అనుమతులు ఇలా... మొదట స్థానిక తహసీల్దార్లు కంపెనీ యజమానుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారికి అనుమతులు ఇవ్వొచ్చని జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేస్తున్నారు. అనంతరం కలెక్టర్ ఆయా పరిశ్రమల్లో శానిటైజర్లు, మాస్కుల వినియోగంతోపాటు సోషల్ డిస్టెన్స్ పాటించి ఉంటున్నారని చూసి సంతృప్తి చెందితే అనుమతులు ఇస్తున్నారు. మానిటరింగ్ అధికారులుగా ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, డీఐసీ జీఎం, కార్మిక శాఖ ఏసీ వ్యవహరిస్తున్నారు. అనుమతులు ఇచ్చిన కంపెనీలు నడుస్తున్న సమయాల్లో ముగ్గురు పర్యవేక్షక అధికారులు ఆయా కంపెనీలకు ఇన్స్పెక్షన్కు వెళ్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే వారిపై చర్యలు తీసుకోవడమే గాకుండా, అనుమతులను రద్దు చేసేందుకు సిఫారసు చేస్తారు. ఇవి గాకుండా జాగ్రత్తలు తీసుకుని పరిశ్రమలను పునఃప్రారంభిస్తామని ఆన్‌లైన్‌లోనూ ఆయా యజమానులు దరఖాస్తు చేసుకుంటున్నారు. పరిశ్రమలు తెరచుకున్నాయి బొబ్బిలిలోని గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు తెరచుకున్నాయి. బెర్రీ వంటి పలు పరిశ్రమలు తెరచుకోవడంతో కార్మికులు, ఉద్యోగులు తిరిగి కంపెనీల్లో అడుగు పెడుతున్నారు. బొబ్బిలిలో 21 పరిశ్రమలు ప్రారంభించాం. దీంతో పాటు జిల్లాలోని నెల్లిమర్లలో కూడా పూర్తి స్థాయిలో అన్ని పరిశ్రమల్లోనూ ప్రభుత్వం సూచించిన నిష్పత్తి ప్రకారం యూనిట్లు ప్రారంభమయ్యేలా జోనల్ మేనేజర్ సుధాకర్ చర్యలు తీసుకుంటున్నారు. – బడగల హరిధరరావు, ఐలా కమిషనర్, గ్రోత్ సెంటర్, బొబ్బిలి -
కనికరం లేని సర్కారు.. కార్మికుల కన్నీరు
సాక్షి, కొవ్వూరు: టీడీపీ సర్కారు కార్మికుల ఉసురుపోసుకుంది. వారి జీవితాలతో దాగుడుమూతలాడింది. చాగల్లు సుగర్ ఫ్యాక్టరీ మూసివేతతో వందలాది కుటుంబాలు రోడ్డున పడినా పట్టించుకోలేదు. జమాన్యానికి కొమ్ముగాస్తూ.. కార్మికుల పొట్టకొట్టింది. తమకు రావాల్సిన బకాయిలైనా ఇప్పించాలని కార్మికులు వేడుకున్నా.. పోరుబాట పట్టినా కనీసం కనికరించలేదు. ఫలితంగా శ్రమజీవుల ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. జిల్లాలోనే అత్యధిక చెరకు క్రషింగ్ సామర్థ్యం కలిగిన చాగల్లులోని జైపూర్ చక్కెర కర్మగారం మూతపడడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీ మూతపడి 26 నెలలు పూర్తయినా.. జీతాలు, ఇతర రాయితీ బకాయిలు అందక ఆకలి కేకలు పెడుతున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలోనే ఈ దుస్థితి నెలకొన్నా.. టీడీపీ సర్కారు పట్టించుకున్న దాఖలా లేదు. ఇతర పరిశ్రమలూ మూత ఫ్యాక్టరీకి అనుబంధంగా నడుస్తున్న చాగల్లు డిస్టిలరీ, జంగారెడ్డిగూడెంలోని రమా మొలాసిస్ పరిశ్రమలూ మూతపడ్డాయి. ఇదే యాజమాన్యం పోతవరంలో నిర్మించిన మరో చక్కెర కర్మాగారం చెరకు పంట లేకపోవడంతో ట్రయిల్రన్తోనే మూతపడింది. దీంతో సీజన్ కార్మికులతో కలిపి 750 మంది శ్రమజీవులు, ఉద్యోగులు ఉపాధికి దూరమయ్యారు. పోరుబాట పట్టినా ఫలితం శూన్యం ఫ్యాక్టరీ మూతతో దాని ఎదుటే 86 రోజులపాటు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఫ్యాక్టరీ తెరిపించాలని మంత్రులు, ప్రభుత్వ పెద్దల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా ఫలితం శూన్యం. దీంతో కుటుంబాలతో రోడ్డెక్కి ర్యాలీలు, ధర్నాలు చేసినా టీడీపీ సర్కారు వారి గోడు పట్టించుకోలేదు. ఆరుగురు కార్మికులు మృతి ఫలితంగా జీతాలందక, కుటుంబాల పోషణ భారమై, ఆర్థిక ఇబ్బందుల బారిన పడి ఏకంగా ఆరుగురు కార్మికులు ప్రాణాలు కొల్పోయారు. ఫీల్డ్మేన్ నల్లూరి శ్రీనివాసరావు, ఫిట్టర్లుగా పనిచేసే ఆలపాటి వెంకటేశ్వరరావు, వీవీఎల్ఎన్ ఆచార్యులు, క్లర్క్‌లు వల్లభనేని సత్యనారాయణ, ఎం.దుర్గారావు ఆరోగ్య సమస్యలతో, మనోవేదనతో మృతి చెందారు. ఆత్కూరి కృష్ణమూర్తి రిటైర్డు అయినా పింఛన్ పొందకుండానే మృతి చెందారు. అసలు కథ ఇదీ.. చాగల్లు ప్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతులకు రూ.70.05 కోట్ల మేర బకాయి పడింది. ఈ బకాయిలు రాబట్టడం కోసం కలెక్టర్ 2016 జనవరి 20న రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించి ఫ్యాక్టరీని సీజ్ చేశారు. దీని అనుబంధంగా ఉండే పరిశ్రమలు మూతపడడంతో సీజనల్ కార్మికులతో కలిపి 750 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అమలుకాని హామీ మంత్రి జవహర్ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు దీక్షలు విరమించారు. ఇంత వరకు ఒరిగిందేమీ లేదు. జిల్లాకు చెందిన కార్మిక శాఖ మంత్రిని, కార్మిక శాఖ కమిషనర్ని కలిసి గోడు వెళ్లబుచ్చుకున్నా.. సర్కారులో చలనం లేదు. కార్మికులకు జీతాలు, ఇతర అలవెన్స్‌లు అందలేదు. రెండేళ్లు నుంచి కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. రిటైర్డు అయిన వాళ్లకు అందాల్సిన సోమ్ములు అందడం లేదు. బతుకు భారమై కార్మికులు విలవిల్లాడుతున్నారు. చైర్మన్‌ను కలిసినా ఫలితమేదీ! కార్మిక సంఘం నాయకులు గత ఏడాది అక్టోబర్ 24న ఫ్యాక్టరీ చైర్మన్‌ని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. నెలలో పీఎఫ్ బకాయిలు జమచేస్తామని, మెడికల్ ప్రీమియం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాలేదు. దీంతో ఈ ఏడాది ఫ్రిబవరి 3న మరోసారి కలిశారు. రాయగఢ్‌లో ఆస్తులను అమ్ముతున్నామని త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు సొమ్ములు అందలేదు. ఇప్పుడు కొత్తగా నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ వాళ్లు సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఫ్యాక్టరీని తమ అధీనంలోకి తీసుకున్నామని, ఫ్యాక్టరీని అమ్మి అయినా సరే మూడు నెలల్లో కార్మికులు, ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నారని, ఇది ఎప్పటికి జరిగేనో అని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పరిస్థితి మరింత దైన్యం ఫ్యాక్టరీ మూతతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలో నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం నియోజకరవర్గాల రైతులు ఈ ఫ్యాక్టరీ పరిధిలోనే చెరుకు సాగు చేసేవారు. మొదట్లో సుమారు 90 వేల ఎకరాల్లో చెరకుపంట సాగయ్యేది. ఫ్యాక్టరీ మూత పడడంతో రైతులు చెరుకుసాగుకు దూరమయ్యారు. బెల్లం తయారు చేసే రైతులు మాత్రమే చెరుకు సాగు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి చెరుకుకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్నారు. ఈ బకాయిల మాటేంటి ? ∙2017 జనవరి 20న ఫ్యాక్టరీ మూతపడడంతో కార్మికులు, ఉద్యోగులకు 26 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. ∙2017 జనవరి నుంచి ఇప్పటి వరకు కార్మికులకు యాజమాన్యం పీఎఫ్ బకాయిలు చెల్లించలేదు. ఒక్కో కార్మికుడికి ఏడాదిగా యాజమాన్యం చెల్లించాల్సిన వైద్య ఖర్చులు రూ.10వేలు, బోనస్‌లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఓవర్ టైమ్(ఓటీ), ఫీల్డ్ సిబ్బందికి ఆదివారం సెలవు దినాల్లో చెల్లించే అలవెన్స్‌లు తదితర పాత బకాయిలు 2014–15 నుంచి చెల్లించడం లేదు. సుమారు రూ.3 కోట్ల మేర ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ∙ఫ్యాక్టరీ నడవని కాలంలో కార్మికులు, ఉద్యోగులకు చెల్లించే రిటర్నింగ్ అలవెన్స్‌లు చెల్లించడం లేదు. ∙2014 మార్చి నుంచి యాజమాన్యం కోటా కింద చెల్లించాల్సి ప్రావిడెంట్ ఫండ్ వాటా చెల్లించడం లేదు. – ఉద్యోగులు, కార్మికుల తరుఫున చెల్లించే ఫీఎఫ్ మాత్రం 2014 మార్చి నుంచి 2016 ఆగస్టు వరకు మాత్రమే చెల్లించారు. దీంతో రిటైర్డు ఉద్యోగులకు పీఎఫ్ రావడం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించే మొత్తం చెల్లిస్తే తప్ప పీఎఫ్ చెల్లించే వీలులేదు. ∙కార్మికులు, ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న కో–ఆపరేటివ్ క్రిడెట్ సోసైటీ లో ఉన్న నిల్వ లో రూ.90లక్షలు యాజమాన్యం వినియోగించుకుంది. దీంతో కార్మిక సంఘం నాయకులు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్‌కి ఫిర్యాదు చేశారు. నెలకు రూ.10 లక్షలు చొçప్పున 2016 నవంబర్ నుంచి 2017 నవంబర్ వరకు ఆ సొమ్ములు తిరిగి జమ చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. దీనిలో కేవలం రూ.10 లక్షలు జమచేసింది. ఇంకా రూ.80లక్షలు బకాయిలు రావాలి. ∙ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో కో–ఆపరేటివ్ సోసైటీ సొమ్మును కార్మికులు, ఉద్యోగులు రుణాలుగా తీసుకునే అవకాశం ఉంది. యాజమాన్యం తీసుకున్న సొమ్ములు జమ చేయకపోవడంతో కార్మికులకు ఆ అవకాశం కుడా లేకుండాపోయింది. మా గోడు పట్టించుకునేవారేరీ వేతనాలు, ఇతర బకాయిలు చెల్లించాలని కోరుతూ 86 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాం. మంత్రి కేఎస్ జవహర్ మా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఏమీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపలేదు. తక్షణం బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఫ్యాక్టరీ తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలి. కో–ఆపరేటివ్ క్రిడెడ్ సోసైటీ నుంచి యాజమాన్యం తీసుకున్న రూ.80లక్షల సొమ్ములు తక్షణం తిరిగి జమచేయాలి. – నీరుకొండ కృష్ణారావు,ది.జైపూర్ సుగర్స్ అండ్ డిస్టిలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు,చాగల్లు -
ఫ్యాక్టరీలో కార్మికురాలు ఆత్మహత్య
బెంగళూరు, న్యూస్‌లైన్: కార్మికురాలు ఫ్యాక్టరీలో నిప్పం టించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మైసూరు రోడ్డులోని హొసగుడ్డదహళ్లిలో జనార్దన్, పుట్టమ్మ (37) దంపతులు నివాసం ఉంటున్నారు. పిణ్యా సెకండ్ స్టేజ్‌లోని 14వ క్రాస్‌లో ఉన్న స్పాన్ సిల్క్ కంపెనీలో దంపతులు పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం దంపతులిద్దరూ విధులకు హాజరయ్యారు. ఉదయం టీ తాగే సమయంలో పుట్టమ్మ ఓ గదిలోకి వెళ్లి శరీరపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. సిబ్బంది గుర్తించి అదుపు చేసినప్పటికీ రక్షించలేక పోయారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కంపెనీ మేనేజర్ మురళి వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త జనార్ధన్ ఆరోపించగా వ్యక్తిగతంగా పుట్టమ్మపై తనకు ఎలాంటి కక్షలు లేవని మురళి మీడియాకు చెప్పాడు. పోలీసులు మురళిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో వైపు ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.