Faheem Ashraf
-
మున్రో విధ్వంసం.. చెలరేగిన ఆజమ్ ఖాన్, ఆఖర్లో ఫహీమ్ మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో లాహోర్ ఖలందర్స్ తర్వాత ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన రెండో జట్టుగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్‌పై గెలుపుతో ఖలందర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. నిన్న (మార్చి 5) జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్‌పై ఇస్లామాబాద్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్.. మహ్మద్ నవాజ్ (44 బంతుల్లో 52; 6 ఫోర్లు), నజీబుల్లా (34 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆఖర్లో ఉమర్ అక్మల్ (14 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో గ్లాడియేటర్స్ ఈ స్కోర్ సాధించగలిగింది. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ 3 వికెట్లు పడగొట్టగా.. ఫహీమ్ అష్రాఫ్ 2, రయీస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కొలిన్ మున్రో.. 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేయగా.. ఆజమ్ ఖాన్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (31 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) హ్యాట్రిక్ బౌండరీలు బాది ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో ఉమైద్ ఆసిఫ్ 3, మహ్మద్ నవాజ్ 2, నసీం షా, నవీన్ ఉల్ హక్, ఇఫ్తికార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్‌లో ఇవాళ జరిగే మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్.. కరాచీ కింగ్స్‌తో తలపడనుంది. -
County Championship: శుబ్‌మన్ గిల్ ర్యాంప్ షాట్.. వీడియో వైరల్
టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2022లో గ్లామోర్గాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గిల్.. తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ససెక్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గిల్ సెంచరీకి చేరువయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి గిల్ 91 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. కాగా అతడి ఇన్నింగ్స్‌ను వన్డే మ్యాచ్‌ను తలపించేలా సాగింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో గిల్ ఆడిన ఓ షాట్ తొలి రోజు ఆటకే హైలట్‌గా నిలిచింది. గ్లామోర్గాన్ ఇన్నింగ్స్‌లో ఫహీమ్ అష్రాఫ్ వేసిన ఓ బౌన్సర్ బంతిని గిల్ అద్భుతమైన ర్యాంప్ షాట్ ఆడాడు. బంతి నేరుగా వెళ్లి బౌండరీ అవతల పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను గ్లామోర్గాన్ క్రికెట్ ట్విటర్ షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం గిల్ స్వదేశానికి తిరిగి రానున్నాడు. ఆక్టోబర్ 6 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు గిల్ ఎంపికయ్యే అవకాశం ఉంది. Shubman Gill, that is 𝗼𝘂𝘁𝗿𝗮𝗴𝗲𝗼𝘂𝘀 🤯 Glamorgan 217/3 𝗪𝗮𝘁𝗰𝗵 𝗹𝗶𝘃𝗲: https://t.co/7M8MBwgNG2#SUSvGLAM | #GoGlam pic.twitter.com/FtMX1c7cue — Glamorgan Cricket 🏏 (@GlamCricket) September 26, 2022 చదవండి: Ind Vs Aus- Viral: వద్దంటున్నా ట్రోఫీ డీకే చేతిలోనే ఎందుకు పెట్టారు?! మరి అందరికంటే.. -
SL Vs Pak: ఇది టెస్టు మ్యాచ్.. టీ20 కాదు.. వాళ్లిద్దరిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?
SL Vs Pak 1st Test- “It’s a Test match, not a T20 game” - Kamran Akmal: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో శనివారం(జూలై 16) గాలే వేదికగా మొదటి మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ బౌలర్లు షాహిన్ ఆఫ్రిది మూడు వికెట్లు, హసన్ అలీ రెండు, యాసిర్ షా రెండు వికెట్లతో చెలరేగారు. నసీమ్ షా, మహ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. దీంతో మూడో సెషన్ సమయానికి లంక 9 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. మహీశ్ తీక్షణ, కసున్ రజిత క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ తుదిజట్టులో ఫవాద్ ఆలం, ఫాహీమ్ అష్రఫ్‌లకు చోటు ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. ఇదేమీ టీ20 మ్యాచ్ కాదు.. టెస్టు క్రికెట్ అంటూ మేనేజ్మెంట్ను విమర్శించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా.. ‘‘ఇది టెస్టు మ్యాచ్.. టీ20 గేమ్ కాదు... చాలా మంది ఆల్‌రౌండర్లు ఆడుతున్నట్లున్నారు.. నిజానికి టెస్టు క్రికెట్కంటూ కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు. ఫవాద్ ఆలం, ఫాహీమ్ అష్రఫ్‌లను శ్రీలంకతో మ్యాచ్‌కు ఎందుకు తప్పించడం నన్ను విస్మయానికి గురిచేసింది’’ అని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు. It’s a test match not a T20 game…too many Allrounders playing and what i think is test match game is all about specialists…its pretty shocking why @iamfawadalam25 and @iFaheemAshraf both have been dropped 🤔 #PAKvsSL — Kamran Akmal (@KamiAkmal23) July 16, 2022 కాగా ఆలం ఇప్పటి వరకు 18 టెస్టులాడి 986 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ ఆల్‌రౌండర్ ఫాహీమ్ 14 టెస్టు మ్యాచ్‌లలో 24 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 636 పరుగులు సాధించాడు. ఇలా ఇద్దరూ టెస్టు క్రికెట్లో సత్తా చాటారు. ఈ నేపథ్యంలో కమ్రాన్ అక్మల్ ఈ మేరకు ట్వీట్ చేయడం గమనార్హం. శ్రీలంకతో మొదటి టెస్టు ఆడుతున్న పాక్ జట్టు: అబ్దుల్లా షఫిక్, ఇమామ్ ఉల్ హక్, అజర్ అలీ, బాబర్ ఆజం(కెప్టెన్), ఆఘా సల్మాన్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, యాసిర్ షా, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, నసీమ్ షా. శ్రీలంక తుదిజట్టు: ఒషాడో ఫెర్నాండో, దిముత్ కరుణరత్నె(కెప్టెన్), కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనుంజయ డి సిల్వా, దినేశ్ చండిమాల్, నిరోషన్ డిక్విల్లా(వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, మహీశ్ తీక్షణ, ప్రభాత్ జయసూర్య, కసున్ రజిత. చదవండి: Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్‌ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్! చివరికి ఇలా! Sri Lanka won the toss and elected to bat first: 🔴 LIVE | 1st Test - Day 1 | #SLvPAK https://t.co/oru4bTD9it — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 16, 2022 -
PAK VS AUS 2nd Test: పాక్ జట్టులో కరోనా కలకలం
ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని కీలక ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఫహీమ్ కరాచీ వేదికగా ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కు దూరం కానున్నాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా తొలి టెస్ట్‌కు కూడా ఆడని ఫహీమ్ను ఐదు రోజుల ఐసోలేషన్‌కు తరలించినట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఫహీమ్ కంటే ముందు పాక్ పేసర్ హరీస్ రౌఫ్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో అతను తొలి టెస్ట్ ద్వారా అరంగేట్రం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాగా, 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఆసీస్.. పర్యటనలో భాగంగా 3 టెస్ట్‌లు, 3 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా జరిగిన తొలి మ్యాచ్ నిర్జీవమైన పిచ్ కారణంగా పేలవ డ్రాగా ముగిసింది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై ఇరు జట్ల ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలి టెస్ట్‌లో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఇమామ్ ఉల్ హక్ (157; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజహర్ అలీ (185; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు భారీ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 476/4 వద్ద డిక్లేర్ చేసింది అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆతిధ్య జట్టుకు ధీటుగా బదులిచ్చింది. ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు నలుగురు ( ఉస్మాన్ ఖ్వాజా (97), వార్నర్ (68), లబూషేన్ (90), స్టీవ్ స్మిత్ (78) అర్ధ సెంచరీలతో రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో 459 పరుగులకే ఆలౌటైంది. పాక్ బౌలర్లలో నౌమాన్ అలీ 6 వికెట్లు, షాహీన్ అఫ్రిది 2, నసీమ్ షా, సాజిద్ ఖాన్లు తలో వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (242 బంతుల్లో 136 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్), ఇమామ్ ఉల్ హాక్ (223 బంతుల్లో 111 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విజృంభించడంతో ఆఖరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 252 పరుగులు చేసింది. చదవండి: PAK Vs AUS: రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన పాక్ ఓపెనర్ -
మరో 241 బంతులు మిగిలుండగానే..
బులవాయో : ఆతిథ్య జింబాబ్వే జట్టు పేలవ ప్రదర్శన మరోసారి కొనసాగించగా.. పాకిస్తాన్ మరో భారీ విజయాన్ని సాధించింది. పాక్ పేసర్ ఫహీమ్ అష్రఫ్ 5/22 తో చెలరేగడంతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు వన్డేలు మిగిలుండగానే 3-0తో ఆ జట్టు కైవసం చేసుకుంది. జింబాబ్వే నిర్దేశించిన 68 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.5 ఓవర్లలోనే పాక్ ఛేదించింది. లక్ష్యఛేదనకు దిగిన పాక్ ఖాతా తెరవకుండానే ఓపెనర్ ఇనాముల్ హక్ వికెట్ కోల్పోయింది. అయితే స్వల్ప లక్ష్యం కావడంతో ఎలాంటి ఓత్తిడికి లోనుకాకుండా మరో ఓపెనర్ ఫకర్ జమాన్ (43 నాటౌట్ ; 24 బంతుల్లో 8 ఫోర్లు), బాబర్ అజమ్ (19 నాటౌట్ ; 34 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి జట్టును గెలిపించాడు. తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే ఆరంభం నుంచే తడబాటుకు లోనైంది. అరంగేట్ర క్రికెటర్ మసవావురే (1)ని ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఉస్మాన్ ఖాన్ ఔట్ చేసి తొలి వికెట్‌ను అందించాడు. మరో ఓపెనర్ చిబాబా (16) వన్‌డౌన్ ప్లేయర్ మసకద్జా(10)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాలని చూసినా పాక్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ ఓటయ్యాక జింబాబ్వే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన పాక్ పేసర్ ఫహీమ్ అష్రఫ్ తన తొలి ఓవర్లోనే మూర్‌ను ఓట్ వేశాడు. బాబర్ అజమ్ క్యాచ్ పట్టడంతో 4వ వికెట్‌గా మూర్ నిష్క్రమించాడు. ఆపై ఏదశలోనూ జింబాబ్వే కోలుకోలేదు. ఫహీమ్ తన వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును వణికించాడు. షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో ముజ్రాబని (4) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఆపై 26వ ఓవర్ తొలి బంతికి ఎంగరవ(1)ని బౌల్డ్ చేయడంతో 67 పరుగుల స్వల్ప స్కోరుకే జింబాబ్వే చాపచుట్టేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో ఫకీమ్ అష్రఫ్ 5/22 సంచలన ప్రదర్శనతో కేవలం ముగ్గురు జింబాబ్వే ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జింబాబ్వే నిర్దేశించిన 68 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ కోల్పోయిన పాక్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో వన్డేతో పాటు 5 వన్డేల సిరీస్‌ను 3-0తో పాకిస్తాన్ కైవసం చేసుకుంది.