Faisal
-
లక్షద్వీప్ ఎంపీపై వేటు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: హత్యాయత్నం నేరంలో ఇటీవల దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ శుక్రవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కవరట్టిలోని సెషన్స్ కోర్టు ఆయన్ను దోషిగా ప్రకటించిన జనవరి 11వ తేదీ నుంచి ఆయన లోక్‌సభ సభ్యత్వ అనర్హత అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది . ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని ఆర్టికల్ 102(1)(ఇ) ప్రకారం ఈ మేరకు ప్రకటిస్తున్నట్లు వివరించింది. హత్యాయత్నం నేరం రుజువు కావడంతో లక్షద్వీప్‌లోని కోర్టు ఫైజల్ సహా నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. -
‘పుల్వామా దాడితో మసూద్‌కు సంబంధం లేదంటేనే’
ఇస్లామాబాద్ : ఉగ్రవాది మసూద్ అజహర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలంటూ భారత్.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాక కొన్ని రోజుల క్రితం బ్రిటన్ కూడా త్వరలోనే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తామని.. పాక్‌లోని ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో జైషే పాత్ర లేదని భారత్ ఒప్పుకుంటేనే.. మసూద్ అజహర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే అంశంపై చర్చిస్తామంటూ సదరు మంత్రి షరతులు విధించడం గమనార్హం. పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి మహ్మద్ ఫైజల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్రదాడిలో మసూద్ అజహర్ పాత్ర ఉన్నట్లు భారత్ దగ్గర ఏమైనా రుజువులున్నాయా. ఉంటే వాటిని ప్రపంచానికి చూపించాలి. ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకపోతే.. లేవని ఒప్పుకోవాలి. భారత్ అలా చేస్తేనే మసూద్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టే విషయం గురించి చర్చిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక ‘పుల్వామా దాడి అనేది ప్రత్యేక అంశం. దీన్ని.. మసూద్ అజహర్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. కానీ ఈ విషయంలో భారత్ తీరు ఏం బాగోలేదు. కశ్మీర్లో దేశీయ తిరుగబాటును అణచివేయడానికి భారత్ చేసే ప్రయత్నాల్లో ఈ ప్రచారం ఓ భాగమే. దీని గురించి మేం ఎంత చెప్పినా ఎవరూ నమ్మడం లేద’ని ఫైజల్ పేర్కొన్నాడు. ఓవైపు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెస్తుండగా.. చైనా మాత్రం అందుకు అడ్డుతగులుతున్న సంగతి తెలిసిందే. -
ఆటలో కొట్లాట.. బాలుడు మృతి
► ఆట కోసం గొడవపడిన ఫైజల్, అతని బావమరిది ► ఫైజల్‌కు గాయాలు.. చికిత్స పొందుతూ మృతి ► ఆస్పత్రి వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు హైదరాబాద్: బావా బావమరుదులైన ఇద్దరు మైనర్లు సరదాగా మొదలుపెట్టిన ఆట గొడవకు దారితీసింది. గెలుపోటముల్లో వివాదం ఇద్దరు తన్నుకునే స్థాయికి చేరింది. చివరికి ఇది ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. సోమవారం మీర్‌చౌక్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.శివభాస్కర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలోని శాలిబండ ఖిల్వత్ ప్రాంతానికి చెందిన ఖాలేద్ బిన్ మహ్మద్ ఆంజా, అమీనా బేగానికి కుమార్తె, కుమారుడు ఫైజల్ బిన్ ఖాలేద్(14) ఉన్నారు. ఫైజల్ ఆష్రఫుల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 2న అమీనా కుమారుడితో కలసి మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పంజేషా గుర్వాన్ గల్లీలో ఉండే తల్లిగారింటికి వచ్చింది. 6న రాత్రి 10 గంటలకు అమీనా సోదరుడు అలీ బిన్ మహ్మద్ సాధి కుమారుడి(11)తో ఫైజల్ లూడో ఆడుతున్నారు. ఇందులో ఫైజల్ ఓడిపోవడంతో.. ఇద్దరి మధ్య గొడవ జరిగి కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఫైజల్‌కు తీవ్ర గాయాలవడంతో స్పృహ తప్పి కిందపడిపోయాడు. శబ్ధం విని కుటుంబ సభ్యులు గదిలో చేరుకొని.. స్పృహ తప్పిన ఫైజల్‌ను ఆస్రా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఫైజల్ మృతి చెందాడు. ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
కెనరా బ్యాంకు వెబ్సైట్ హ్యక్
ముంబై: జాతీయ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకు వెబ్ సైటు ఈ నెల 2వ తేదిన హ్యాకింగ్ కు గురైంది. పాకిస్తాన్ కు చెందిన ఓ హ్యాకర్ బ్యాంకు వెబ్ సైట్ హోం పేజీ రూపాన్ని మార్చేశాడు. పేజీలో తన పేరు ఫైసల్ గా పేర్కొన్నాడు. భారత ప్రభుత్వానికి చెందిన వెబ్ సైట్ పై ఫైసల్ 1337 తన ముద్ర పడిందని రాశాడు. భద్రత కావాలంటే ఫేస్ బుక్ లో తనపేజీని సందర్శించాలంటూ.. పాకిస్తాన్ జిందాబాద్ అని కామెంట్లు పెట్టాడు. వెబ్ సైట్ హ్యాక్ కు గురవడంతో చర్యలు చేపట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్విఫ్ట్ ద్వారా అకౌంట్లలోని డబ్బును చెక్ చేసింది. స్విఫ్ట్ మెసేజింగ్ సర్వీసు ద్వారా ప్రతిరోజూ వేల కోట్ల డాలర్లు బ్యాంకుల మధ్య మారుతుంటాయి. వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ఫైసల్ ఈ-పేమెంట్లను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. వెబ్ సైట్ హ్యాంకింగ్ కు గురైందని తెలిసిన వెంటనే సర్వర్ ను నిలిపివేసినట్లు కెనరా బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. యూజర్లు వినియోగించేందుకు వీలుగా ప్రత్యేక స్టాండ్ బై సర్వర్ ను హ్యాక్ కు గురైన వెబ్ సైట్ స్థానంలో వినియోగించినట్లు చెప్పారు. బ్యాంకు వెబ్ సైట్ ను హ్యాక్ చేసి కొత్త పేజీని ఆ స్థానంలో ఉంచేందుకు కొత్త యూఆర్ఎల్ ను హ్యాకర్ వాడినట్లు వివరించారు. బ్యాంకుకు చెందిన సమాచారాన్ని వారు దొంగిలించలేదని వెల్లడించారు. కాగా స్వతంత్ర దినోత్సవానికి ముందు గతేడాది కూడా రెండు ప్రైవేట్ బ్యాంకులు, ఓ ప్రభుత్వ బ్యాంకు వెబ్ సైట్ లు హ్యాకింగ్ కు గురయ్యాయి.