fake lawyers
-
అతి తెలివి.. నకిలీ కోర్టు పెట్టి కలెక్టర్ కే షాక్
-
నకిలీ వకీలు: కోర్టులో ప్రశ్నలకు తడబడటంతో..
అనకాపల్లి టౌన్: విశాఖ జిల్లా అనకాపల్లిలో న్యాయస్థానాన్ని మోసగించబోయిన ఓ నకిలీ వకీలు న్యాయమూర్తి అప్రమత్తతతో అడ్డంగా దొరికిపోయాడు. ఇద్దరు వ్యక్తుల బెయిల్ పిటిషన్ వాదించడానికి వచ్చిన తానే కటకటాలపాలయ్యాడు. పట్టణ ఎస్ఐ ఎల్.రామకృష్ణ అందించిన వివరాలు.. విశాఖ డాబాగార్డెన్స్‌కు చెందిన సంపంగి చినబంగారి దుర్గా సురేష్‌కుమార్ న్యాయవాదిలా నల్లకోటు వేసుకొని అనకాపల్లి 11వ మెట్రోపాలిటన్ జడ్జి ఎస్.విజయచందర్ ముందు గురువారం బెయిల్ పత్రాలు దాఖలు చేశాడు. కోర్టు ప్రశ్నలకు తడబడడంతో న్యాయమూర్తికి అనుమానం వచ్చి అతని పూర్తి వివరాలు చెప్పాలని కోరారు. సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పలాయనం చిత్తగించే ప్రయత్నం చేయగా, అక్కడున్న న్యాయవాదులు అతన్ని పట్టుకున్నారు. సురేష్‌కుమార్ వద్ద ఉన్న గుర్తింపు కార్డును పరిశీలిస్తే.. దానిపై టి.దేవేందర్ అనే అడ్వకేట్ పేరు ఉండగా, ఫొటో మాత్రం సురేష్కుమార్ది ఉంది. దీంతో న్యాయమూర్తి కోర్టు సూపరింటెండెంట్‌ను పిలిచి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. నకిలీ వకీల్‌ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ముందు శుక్రవారం ప్రవేశపెట్టగా, 14 రోజులు రిమాండ్ విధించారు. -
న్యాయవాదినంటూ మోసం చేశాడు
గుంటూరు: నకిలీ న్యాయవాది మాటలు నమ్మి మోసపోయామంటూ ఓ బాధితురాలు సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో రూరల్ ఎస్పీ సిహెచ్.వెంకటప్పలనాయుడు వద్ద కన్నీటి పర్యంతమైంది. బాధితురాలి కథనం ప్రకారం... నరసరావుపేట కూరగాయల మార్కెట్ సెంటర్లో నలుమోలు లక్ష్మీప్రసన్న టిఫిన్ బండి నడుపుకుంటూ జీవిస్తున్నారు. 2016లో ఆమె భర్త స్నేహితుడు గిరికి అతని అవసరాల నిమిత్తం విడతలవారీగా రూ. లక్ష అప్పుగా ఇచ్చారు. అదేవిధంగా ఆమె భర్త సోదరుడు సుధీర్ కూడా విడతల వారీగా రూ. 2.50 లక్షలు గిరికి అప్పుగా ఇచ్చారు. ఏడాది గడిచినా డబ్బు ఇవ్వకపోవడంతో గిరి ప్రవర్తనపై అనుమానం కలిగిన బాధితులు న్యాయవాదినంటూ చెప్పుకొని తిరిగే అట్లూరి విజయకుమార్‌ను ఆశ్రయించారు. మీ డబ్బు వీలైనంత త్వరలో తిరిగి ఇప్పిస్తానని విజయకుమార్ నమ్మబలికి న్యాయవాది ఫీజు రూ. 30 వేలు తీసుకోవడంతోపాటు, గిరి రాసి ఇచ్చిన ప్రామిసరీ నోటును బాధితుల నుంచి స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం గిరితో మాట్లాడి బాధితులకు రూ. 50వేలు ఇప్పించాడు. గిరి కొంత సమయం కోరవడంతో అందుకు విజయకుమార్ సలహా మేరకు అంగీకరించారు. చెప్పిన సమయానికి డబ్బు ఇవ్వకపోవడంతో గిరిని నిలదీస్తే అసలు విషయం బయటపడింది. తాను ఇవ్వాల్సిన రూ. 3 లక్షలను విజయకుమార్ తీసుకెళ్లాడని చెప్పాడు. బాధితులకు విజయకుమార్ తీరుపై అనుమానం కలిగి విచారిస్తే అసలు అతను న్యాయవాది కాదని తేలింది. దీంతో తాము మోసపోయామని భావించి గిరి వద్ద తీసుకున్న డబ్బులు ఇవ్వాలని విజయకుమార్‌ను పలు మార్లు కోరినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయినా న్యాయం జరగకపోవడంతో ఎస్పీని ఆశ్రయించారు. సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంటనే నరసరావుపేట –2 టౌన్ సీఐకు ఫోన్ చేసి విచారించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
నకిలీ లాయర్లెవరో తేల్చేస్తాం
న్యూఢిల్లీ: తొందర్లోనే నకిలీ లాయర్లెవరో తేల్చిపారేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు తేల్చాలంటే సాధ్యం కాని పని అని మరో ఏడు నెలల్లో నిజమైన లాయర్లెవరో, నకిలీ లాయర్లెవరో తెలుపుతామని పేర్కొంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నోత్తరాల సమయంలో బీసీఐ తరుపున కేంద్ర న్యాయశాఖమంత్రి డీవీ సదానంద గౌడ వ్రాత పూర్వక వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు నకిలీలాయర్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తేల్చాలన్న ఆలోచన బార్ కౌన్సిల్ చేయలేదని, ప్రస్తుతం మాత్రం అందుకోసం ఒక ప్రత్యేక మెకానిజాన్ని, కార్యచరణను ఏర్పాటుచేసి నకిలీ లాయర్ల సంఖ్య తేలుస్తామని చెప్పారు. గతంలో బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ దేశంలో 30శాతంమంది నకిలీ లాయర్లే ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి లెక్కలేమిటో తేల్చాలని కేంద్ర ప్రభుత్వం బీసీఐని కోరింది. -
మన లాయర్లలో 30 శాతం నకిలీలే!
భారతదేశంలోని లాయర్లలో 30 శాతం మంది నకిలీ పట్టాలతోనే ప్రాక్టీసు చేసేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయానా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మానన్ కుమార్ మిశ్రా తెలిపారు. బార్ కౌన్సిల్ ఏర్పాటుచేసిన ఓ మెగా లాయర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పుచేసిన లాయర్ల మీద చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉంది. దాంతో ఇలాంటి నకిలీలు అందరినీ ఏరిపారేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మిశ్రా చెప్పారు. బార్ కౌన్సిల్ అంచనా ప్రకారం 20 శాతం మంది లాయర్లు అసలు ఎలాంటి డిగ్రీలు లేకుండానే ప్రాక్టీసు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ కూడా నకిలీ డిగ్రీతో దొరికిపోయిన సంగతి తెలిసిందే. నకిలీ లాయర్లతో పాటు.. న్యాయవాద డిగ్రీ చేసి కూడా ప్రాక్టీసు చేయకుండా మానేసిన వాళ్లు వృత్తిని అవమానించినట్లేనని మిశ్రా చెప్పారు. ఇక చిన్నచిన్న కారణాలకు కూడా న్యాయవాదులు సమ్మెలు చేయడం, కోర్టులను బహిష్కరించడంపై కూడా మిశ్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇలా న్యాయవాదులు తరచు సమ్మెలు, కోర్టు బహిష్కరణలు చేస్తున్నారని ఆయన అన్నారు.