తొందర్లోనే నకిలీ లాయర్లెవరో తేల్చిపారేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: తొందర్లోనే నకిలీ లాయర్లెవరో తేల్చిపారేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు తేల్చాలంటే సాధ్యం కాని పని అని మరో ఏడు నెలల్లో నిజమైన లాయర్లెవరో, నకిలీ లాయర్లెవరో తెలుపుతామని పేర్కొంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నోత్తరాల సమయంలో బీసీఐ తరుపున కేంద్ర న్యాయశాఖమంత్రి డీవీ సదానంద గౌడ వ్రాత పూర్వక వివరణ ఇచ్చారు.
ఇప్పటి వరకు నకిలీలాయర్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తేల్చాలన్న ఆలోచన బార్ కౌన్సిల్ చేయలేదని, ప్రస్తుతం మాత్రం అందుకోసం ఒక ప్రత్యేక మెకానిజాన్ని, కార్యచరణను ఏర్పాటుచేసి నకిలీ లాయర్ల సంఖ్య తేలుస్తామని చెప్పారు. గతంలో బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ దేశంలో 30శాతంమంది నకిలీ లాయర్లే ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి లెక్కలేమిటో తేల్చాలని కేంద్ర ప్రభుత్వం బీసీఐని కోరింది.