BCI
-
సుప్రీం, హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయస్సును పెంచాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) కోరుతోంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రస్తుతం దిగువ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు వరుసగా 60, 62, 65 ఏళ్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హైకోర్టులు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సులను 65, 67 ఏళ్లకు పెంచాలని బీసీఐ కోరుతోంది. వివిధ కమీషన్లు, ఫోరంలకు చైర్ పర్సన్లుగా అనుభవజ్ఞులైన న్యాయవాదులను నియమించేందుకు వీలుగా నిబంధనలను సవరించాలని పార్లమెంట్‌ను కోరుతూ తీర్మానించినట్లు వెల్లడించింది. (చదవండి: పోలీసులకు రక్షణ కల్పిస్తున్న 'పాములు'!!.. ఎక్కడ.. ఎవరి నుంచి అంటే..) -
తెలంగాణకు బార్ కౌన్సిల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌ను విభజించి.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు విడివిడిగా బార్ కౌన్సిళ్లు ఏర్పాటు చేయాలని భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) తీర్మానించింది. ఏపీలో హైకోర్టు ఏర్పాటయ్యే వరకు నిరీక్షించకుండానే వీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం టీఎస్ అజిత్, దినేశ్ పాథక్లతో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనందున.. తమకు ప్రత్యేక బార్ కౌన్సిల్ కావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీసీఐ ఆ దిశగా చర్యలు చేపట్టింది. దీనిపై ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శికి అధికారికంగా సమాచారం ఇచ్చింది. -
‘ఆ నలుగురిపై ఎలాంటి చర్యలుండవు’
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు అంశాన్ని రాజకీయం చేయొద్దని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) విజ్ఞప్తి చేసింది. బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సోమవారమిక్కడ మాట్లాడుతూ...జడ్జీల మధ్య వివాదం ముగిసిందని, సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని ఆయన అన్నారు. కోర్టు వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అంగీకరించమని, అంతర్గతంగా అందరూ చర్చించుకున్నారని మనన్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. జడ్జిలందరూ విధులకు హాజరయ్యారని, కోర్టు కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ నలుగురు జడ్జిలపై ఎలాంటి చర్యలుండవని బీసీఐ స్పష్టం చేసింది. మరోవైపు కేసుల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనితీరు సక్రమంగా లేదంటూ వ్యాఖ్యలు చేసిన సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఇవాళ యథావిధిగా విధులకు హాజరు అయ్యారు. ఇక సుప్రీంకోర్టు జడ్జిల మధ్య తలెత్తిన సంక్షోభం ముగిసినట్లేనని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రకటించారు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారికంగా మీడియా ఎదుట ప్రకటించనుంది. -
పెరిగిన వ్యాపార విశ్వాసం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మెరుగుపడుతుందన్న ఆశాభావం కంపెనీల్లో వ్యక్తమైంది. సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్–డిసెంబర్ కాలానికి 59.7గా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో సూచీ 58.3 పాయింట్లుగానే ఉంది. త్రైమాసిక వారీ సీఐఐ అవుట్‌లుక్ సర్వే ఈ వివరాలను వెల్లడించింది. జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ కారణంగా వ్యాపారాలకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయన్న సంకేతాలతో మొత్తం మీద ఆర్థికరంగంపై అంచనాలు మెరుగుపడ్డాయి. ‘‘ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు క్షేత్రస్థాయిలో చూపించిన ప్రభావంతో ఆర్థిక రంగం స్థిరమైన పునరుద్ధరణ బాటలో ఉన్నట్టు ఈ సర్వే గుర్తించింది. సూక్ష్మ ఆర్థిక అంశాల పరంగా వృద్ధి పెరుగుదల నిలకడగా ఉంటుందన్న అంచనాలే వ్యాపార విశ్వాస సూచీ పుంజుకోవడానికి కారణం’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. -
లా అడ్మిషన్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్యలో ప్రవేశాలు ఏటా ఆలస్యం అవుతూనే ఉన్నాయి. న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకోసం వేల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కాలేజీలకు అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం చేస్తుండటంతో ప్రవేశాల్లో జాప్యం తప్పడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో న్యాయ విద్య ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ప్రవేశాలు ఇప్పటికే ఆలస్యం అయినందున ఈనెలలో ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్లను పూర్తి చేయాలన్న ఆలోచనకు కమిటీ సభ్యులు వచ్చారు. ఇందులో భాగంగా తాత్కాలిక షెడ్యూలును ఖరారు చేశారు. ఈనెల 13వ తేదీన ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీచేసి, 20 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. 21వ తేదీనుంచి 25వ తేదీవరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని, 28వ తేదీన సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. అయితే సీట్లను కేటాయించే 28వ తేదీ వరకు బీసీఐనుంచి కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉంది. అవి వస్తేనే సీట్లను కేటాయించనున్నారు. నాలుగు నెలలుగా ఎదురుచూపులే.. న్యాయ విద్యలో ప్రవేశాలకోసం లాసెట్‌ను గత మే 27న నిర్వహించారు. ఈ పరీక్షకు 40 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆ పరీక్ష ఫలితాలను జూన్ 10వ తేదీన విడుదల చేశారు. అందులో 18,546 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారికి అప్పటినుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చే విషయంలో బీసీఐ జాప్యం చేస్తూనే ఉంది. గత ఏడాది ఎల్ఎల్ఎంలో 524 సీట్లు, మూడేళ్ల లా కోర్సులో 2,590 సీట్లు, 5 ఏళ్ల లా కోర్సులో 1,176 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటికే కాకుండా మరిన్ని కొత్త కాలేజీలకు సైతం అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. అయితే అనుమతులపై మాత్రం బీసీఐ ఇంతవరకూ తేల్చలేదు. -
వ్యాపార వర్గాల్లో పెరిగిన విశ్వాసం
జీవితకాల గరిష్ట స్థాయికి సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల వ్యాపార వర్గాలు ఎంతో ఆశాభావంతో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక రంగ కార్యకలాపాలు పుంజుకుంటాయన్న విశ్వాసం వారిలో వ్యక్తమవుతోంది. దీన్ని ప్రతిఫలిస్తూ సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) జనవరి–మార్చి త్రైమాసికంలో జీవితకాల గరిష్ఠ స్థాయిలకు చేరింది. ‘‘2017 ఆగమనంతోనే వ్యాపార దృక్పథంలో స్వల్ప వృద్ధి నెలకొంది. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల చర్యలు కంపెనీలకు పెట్టుబడుల అవకాశాలు కల్పిస్తాయనే ఆశాభావం నెలకొంది’’ అని సీఐఐ పేర్కొంది. వ్యాపార సెంటిమెంట్ బలంగా ఉందని, తమ రంగాల్లో భవిష్యత్తు కార్యకలాపాల పట్ల కంపెనీలు ఆవాభావంతో ఉన్నాయని తెలిపింది. సీఐఐ దేశ వ్యాప్తంగా వ్యాపారుల అభిప్రాయాలను సేకరించి ఈ ఫలితాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా 98వ ఎడిషన్ ఫలితాలను వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో బీసీఐ 64.1గా నమోదు కాగా, ఇది అంతకు ముందు త్రైమాసికం (2016 అక్టోబర్–నవంబర్)లో 56.5గా ఉంది. 200 భారీ, మధ్య స్థాయి, చిన్న, సూక్ష్మ సంస్థల నుంచి అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా సేకరించారు. సర్వే ఫలితాలు జనవరి – మార్చి త్రైమాసికంలో 63 శాతం సంస్థలు విక్రయాలు పెరిగినట్టు చెప్పాయి. అంతకు ముందు మూడు నెలల కాలంలో ఇలా విక్రయాలు పెరుగుదల చూసిన సంస్థలు 39 శాతమే. కొత్త ఆర్డర్లు కూడా పెరగొచ్చన్న విశ్వాసం 60 శాతం సంస్థల నుంచి వ్యక్తమైంది. అంతకుముందు కాలంలో ఇది 41 శాతమే. -
నకిలీ లాయర్లెవరో తేల్చేస్తాం
న్యూఢిల్లీ: తొందర్లోనే నకిలీ లాయర్లెవరో తేల్చిపారేస్తామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు తేల్చాలంటే సాధ్యం కాని పని అని మరో ఏడు నెలల్లో నిజమైన లాయర్లెవరో, నకిలీ లాయర్లెవరో తెలుపుతామని పేర్కొంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నోత్తరాల సమయంలో బీసీఐ తరుపున కేంద్ర న్యాయశాఖమంత్రి డీవీ సదానంద గౌడ వ్రాత పూర్వక వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు నకిలీలాయర్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తేల్చాలన్న ఆలోచన బార్ కౌన్సిల్ చేయలేదని, ప్రస్తుతం మాత్రం అందుకోసం ఒక ప్రత్యేక మెకానిజాన్ని, కార్యచరణను ఏర్పాటుచేసి నకిలీ లాయర్ల సంఖ్య తేలుస్తామని చెప్పారు. గతంలో బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ దేశంలో 30శాతంమంది నకిలీ లాయర్లే ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి లెక్కలేమిటో తేల్చాలని కేంద్ర ప్రభుత్వం బీసీఐని కోరింది. -
తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటుపై వైఖరేమిటి..?
బీసీఐకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా బార్ కౌన్సిల్ ఏర్పాటు విషయంలో వైఖరి ఏమిటో తెలియజేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారి పేర్లను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేస్తున్నారని, రెండు రాష్ట్రాలకు ఒకే బార్ కౌన్సిల్ ఉండటం, ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమంటూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.ప్రభాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నవీన్‌రావు శనివారం విచారణ జరిపారు.