సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌ను విభజించి.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు విడివిడిగా బార్ కౌన్సిళ్లు ఏర్పాటు చేయాలని భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) తీర్మానించింది. ఏపీలో హైకోర్టు ఏర్పాటయ్యే వరకు నిరీక్షించకుండానే వీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం టీఎస్ అజిత్, దినేశ్ పాథక్‌లతో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనందున.. తమకు ప్రత్యేక బార్ కౌన్సిల్ కావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీసీఐ ఆ దిశగా చర్యలు చేపట్టింది. దీనిపై ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శికి అధికారికంగా సమాచారం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment