బీసీఐకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా బార్ కౌన్సిల్ ఏర్పాటు విషయంలో వైఖరి ఏమిటో తెలియజేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారి పేర్లను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ చేస్తున్నారని, రెండు రాష్ట్రాలకు ఒకే బార్ కౌన్సిల్ ఉండటం, ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమంటూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.ప్రభాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నవీన్‌రావు శనివారం విచారణ జరిపారు.