fake loan
-
బనశంకరీదేవి అమ్మవారిని దర్శించుకున్న నటుడు
బనశంకరి: సినీ నిర్మాత ఉమాపతి సతీసమేతంగా బుధవారం బనశంకరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. నటుడు దర్శన్ పేరుతో తప్పుడు పత్రాల కేసులో తప్పు ఒప్పులను బనశంకరీదేవి చూసుకుంటుందని ఉమాపతి అన్నారు. ఈ కేసుకు సంబంధించి దర్శన్, ఉమాపతి బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ కేసులో ఆరోపి అరుణాకుమారి.. ఉమాపతిపై ఆరోపణలు చేయడం తెలిసిందే. -
ఎవరినీ వదలను: ది బాస్ హెచ్చరిక..
మైసూరు(కర్ణాటక): సినిమాల్లో వీరోచిత సాహసాలతో విలన్లను మట్టికరిపించే ప్రముఖ నటుడు దర్శన్ నిజ జీవితంలో మోసగాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వారు సాదాసీదా చీటర్లు కాదు ఏకంగా రూ.25 కోట్లకు ఎసరు పెట్టారు. ఆదివారం బయటపడిన ఈ బాగోతంపై సోమవారం దర్శన్ ఘాటుగా స్పందించారు. నా ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రూ. 25 కోట్లను పొందాలని చూసి, నాపై కుట్ర చేసినవారు ఎంతటి సన్నిహితులైనా వదిలిపెట్టేది లేదు. చట్టపరంగా పోరాడుతా అని ప్రకటించారు. తెరపై ఆ మహిళ.. మైసూరులో మీడియా సమావేశంలో దర్శన్ మాట్లాడారు. వివరాలు.... జూన్ 6వ తేదిన నా మిత్రుడు, కన్నడ సినిమా నిర్మాత ఉమాపతి నాకు ఫోన్ చేసి రూ.25 కోట్ల బ్యాంకు రుణానికి మీరు ష్యూరిటీ సంతకం చేశారా? అని అడిగారు. నేను అయోమయానికి గురయ్యాను. ఏం జరిగిందని ఉమాపతిని అడగ్గా ఏమీ చెప్పలేదు. జూన్ 16వ తేదీన అరుణాకుమారి అనే మహిళను నిర్మాత ఉమాపతి నా ఇంటికి తీసుకొచ్చారు. ఆమె నా స్నేహితుల పేర్లను చెబుతూ కొన్ని దాఖలాలు చూపించారు. అందులో నా ఆధార్ నంబర్ తప్ప ఇంకేమీ లేదు. నేను పుట్టిన ప్రాంతం, జిల్లా పేరును ఆమె చెప్పగా అనుమానం పెరిగింది. నేను ఆమె ముందే నాగు, హర్ష అనే నా మిత్రులకు కాల్ చేసి లోన్‌కు దరఖాస్తు పెట్టారా అని అడిగా, లేదు అని చెప్పారు. మరోసారి అరుణతో నందీష్, మదుకేష్ అనే ఇద్దరు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు. లోన్ ఇవ్వడానికి ముందు మీ తోటను చూడాలని అడగ్గా, సరే అన్నాను. నా తరఫున లోన్ కోసం హర్ష రికార్డులు ఇచ్చారని అరుణ చెప్పారు. చివరకు నా స్నేహితులందరినీ ఆరా తీయగా ఎవరూ రుణం కోసం దరఖాస్తు చేయలేదని తెలిపారు. అరుణపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశా... అని ది బాస్ వివరించారు. సూత్రధారులు, పాత్రధారుల గురించి పోలీసుల విచారణలో బయటికి వస్తుందని దర్శన్ అన్నారు. డీసీపీతో భేటీ.. నకిలీ పత్రాలను తయారుచేసిన వంచకులు వాటిని దర్శన్ స్నేహితులకు చూపి మాట వినకపోతే దుష్ప్రచారం చేస్తామని బెదిరించినట్లు తెలిసింది. దర్శన్, ఉమాపతి తదితరులు మైసూరు డీసీపీ ప్రదీప్ గుంటిని కలిసి ఫిర్యాదు చేశారు. మైసూరు హెబ్బాల పోలీసులు అరుణాకుమారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
అయ్యో.. ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం..!
వరంగల్: తప్పుడు వ్యక్తులకు లోన్లు ఇచ్చాననే బాధతో ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం ఆత్మహత్య చేసుకున్న సంఘటన బ్యాంకింగ్ వర్గాల్లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా హన్మకొండలోని ఆంధ్రాబ్యాంకులో ఏజీఎంగా పనిచేస్తున్న కేఎం నాగరాజన్(59).. సోమవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది కిందటే కోల్ కతా నుంచి హన్మకొండకు బదిలీపై వచ్చిన ఆయన ఇవ్వాళ ఉదయం ఇంటి నుంచి కారులో బయటికొచ్చారు. వరంగల్ రైల్వేగేట్ వద్ద కారు పక్కకు ఆపి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే, సివిల్ పోలీసులకు నాగరాజన్ మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది. కోల్ కతా బెల్లిగ్యాంగ్ పార్కు బ్రాంచ్ లో పనిచేసిన సమయంలో కొందరికి లోన్లు(రుణాలు) మంజూరు చేశానని, కానీ ఆ వ్యక్తులు తప్పుడస్తులని, ఇంత అనుభవం ఉండికూడా పొరపాటు చేసినందుకు బాధపడుతున్నట్లు నాగరాజన్ లేఖలో పేర్కొన్నాడు. బాధ తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, కొడుకులు కోడళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా భార్యకు సూచనలు చేశాడు. నాగరాజన్ మృతి అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాము చెన్నైలోని మందెవైల్లి ప్రాంతానికి చెందినవారమని, కుటుంబపరంగా ఎలాంటి సమస్యలు లేవని, అయితే బ్యాంక్ లోన్లకు సంబంధించి తన భర్త బాధపడుతూ ఉండేవాడని నాగరాజన్ భార్య రాధారాజన్ తెలిపారు. తమ ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారని పేర్కొన్నారు. నాగరాజన్ ఆత్మహత్యపై కేసు నమోదుచేసినట్లు వరంగల్ జీఆర్పీ రెండో ఎస్సై శ్రీనివాస్ చెప్పారు.