fake seed
-
తెలంగాణలో యథేచ్ఛగా నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: మరో వారం పది రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మళ్లీ నకిలీ విత్తనాల బెడద మొదలైంది. దళారులు నేరుగా రైతుల వద్దకే వెళ్లి నకిలీ విత్తనాలను అంటగడుతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో తాజాగా 2.65 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల వద్దకు నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు చేరి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతియేటా కీలకమైన సమయంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారనే విమర్శలు విని్పస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తరలింపు.. రాష్ట్రంలో నూతన సాగు పద్ధతులను ప్రోత్సహించాలని, వరి, ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా పత్తి విస్తీర్ణాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈసారి 65 లక్షల ఎకరాల నుంచి 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయశాఖ రైతులకు సూచించింది. 75 లక్షల ఎకరాలకు సరిపోయేలా కోటిన్నర పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరా చేసేందుకు కంపెనీలు కూడా సన్నాహాలు చేసుకున్నాయి. అయితే పత్తిసాగు పెరగనుండటాన్ని అదనుగా భావించిన నకిలీ విత్తన కంపెనీలు రంగంలోకి దిగాయి. నిషేధిత హెచ్‌టీ కాటన్ (బీజీ–3) విత్తనాలను కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రల నుంచి తరలించి తమ దళారులకు అప్పగించాయి. రైతుల్ని మోసగిస్తున్న దళారులు వారికి నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. వర్షాలు ప్రారంభమైతే మొదటగా వేసేది పత్తే కాబట్టి మిగతా 8వ పేజీలో u ఇప్పటికే హెచ్‌టీ కాటన్ విత్తనాలు సరఫరా అయ్యాయి. గతేడాది నకిలీ విత్తనాలను పట్టుకునేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్ ఆ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలు పెద్దమొత్తంలో పట్టుకుంది. అయినప్పటికీ గతేడాది ఏకంగా ఆరేడు లక్షల ఎకరాల్లో హెచ్‌టీ కాటన్ సాగైనట్లు సమాచారం. బీజీ–3 అమ్మకాలతో లాభాలు.. సీజన్ ప్రారంభం కాగానే రైతులు చాలావరకు గ్రామంలోని షావుకార్ల వద్దనో, విత్తన వ్యాపారుల వద్దనో అప్పు కింద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. పంట వచి్చనప్పుడు అప్పు తీర్చేలా ఒప్పందం చేసుకుంటారు. ఎలాగూ అప్పు ఇస్తున్నారు కాబట్టి వ్యాపారి ఇచ్చిన విత్తనాలనే రైతులు తీసుకుంటారు. వీటికి ఎలాంటి రశీదులు ఉండవు. విత్తన డీలర్ నిబంధనల ప్రకారం ఒక పత్తి విత్తన ప్యాకెట్ (450 గ్రాములు) అమ్మితే రూ.25–30 లాభం వస్తుంది. కానీ అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను విక్రయిస్తే ఏకంగా రూ.500, అదే లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ.1,000కి పైగా ఆదాయం వస్తుంది. ఈ కారణంగానే ఏజెంట్లు రైతులకు అక్రమ విత్తనాలు అంటగడుతున్నారు. గ్రామాల్లో ప్రతి 100 మంది రైతుల్లో సగం మంది మండల కేంద్రాల్లోని అధికారిక విత్తన దుకాణల నుంచి విత్తనాలు తీసుకుంటుండగా.. మరో సగం మంది షావుకార్లు, ఇతర విత్తన వ్యాపారుల వద్ద అప్పు కింద విత్తనాలు తీసుకుంటున్నారు. బ్యాంకులు అవసరమైన సమయంలో రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు ఇలా వడ్డీ వ్యాపారులు, విత్తన వ్యాపారులను ఆశ్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బీజీ–1, బీజీ–2లకు మాత్రమే అనుమతి దేశంలో బీజీ–1, బీజీ–2 పత్తి విత్తనానికి మాత్రమే అనుమతి ఉంది. అయితే ప్రస్తుతం బీజీ–2 మాత్రమే ఎక్కువగా వినియోగంలో ఉంది. అయితే బీజీ–2 పత్తి విత్తనం వేస్తున్నా గులాబీ రంగు పురుగు ఆశిస్తుండటంతో బీజీ–3 రంగప్రవేశం చేసింది. అయితే ఇది అన్ని విధాలుగా హానికరం కావడంతో దేశంలో దీని వినియోగంపై నిషేధం ఉంది. అయితే బీజీ–2కు బీజీ–3 పత్తి విత్తనానికి మధ్య తేడా గుర్తించలేని పరిస్థితి ఉండటంతో దీన్నే అవకాశంగా తీసుకొని కంపెనీల నిరా>్వహకులు, వ్యాపారులు లాభాల కోసం నిషేధిత బీజీ–3ని రైతులకు అంటగడుతున్నారు. దీంతో ఏటా బీజీ–3 సాగు చాపకింద నీరులా పెరుగుతోంది. రీసైక్లింగ్‌తో దగా.. కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టి వారిని నిలువునా మోసం చేస్తున్నాయి. గడువు తీరిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్తవని చెప్పి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఆ విత్తనం... ఈ విత్తనం అనే తేడా లేకుండా దాదాపు అన్ని రకాల విత్తనాలనూ ఇలాగే విక్రయించి రైతన్నలను నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఒకసారి రూపొందించిన విత్తనాలనే మళ్లీ మళ్లీ రీసైక్లింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. నాణ్యత లేని విత్తనాల వల్ల సరైన దిగుబడి రాకపోవడంతో రైతాంగం కుదేలవుతోంది. పత్తితో పాటు వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, ఆవాలు, బఠానీ సహా దాదాపు 30 రకాల పంటల విత్తనాలను కూడా కంపెనీలు రీసైక్లింగ్ చేస్తూ రైతన్నలను దగా చేస్తున్నాయి. ఈ రీసైక్లింగ్ కుంభకోణంలో కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా ఉండటం విస్మయం కలిగించే అంశం. కాగా రాష్ట్రం మొత్తానికి సరఫరా అయ్యే విత్తనాల్లో దాదాపు 15 నుంచి 20 శాతం వరకు రీసైక్లింగ్ విత్తనాలే ఉంటాయని అంచనా. గతంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని విజిలెన్స్ దాడుల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. అయినా ఈసారి ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతస్థాయిలో అండదండలు ఉండటం వల్లే నకిలీ విత్తన దందా యధేచ్ఛగా సాగిపోతోందనే ఆరోపణలు విని్పస్తున్నాయి. లైసెన్స్ ఉన్న షాపుల్లోనే కొనాలి రైతులు నకిలీ విత్తన ఉత్పత్తిదారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని మార్కెట్లోకి వచ్చి విక్రయిస్తున్న వారి నుంచి కొనొద్దు. లైసెన్స్ ఉన్న షాపుల్లోనే విత్తనాలు కొనుక్కోవాలి. కవర్‌పై ధర, ఎన్ని గ్రాములు ఉన్నాయి, గడువు తేదీ తదితర వివరాలు గమనించాలి. రశీదు తప్పకుండా తీసుకోవాలి. గ్రామాల్లోని రైతు వేదికల్లో నకిలీ విత్తనాలపై అవగాహన కలి్పస్తున్నాం. ఎరువుల దుకాణాల్లో ప్రత్యేక టాస్ట్ఫోర్స్ బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నాం. రైతులకు కావలసినన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా కొరత లేదు. – రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎన్ని మోసాలో.. నకిలీ విత్తన మాఫియా పలు రకాలుగా మోసాలకు పాల్పడుతోంది. గడువు ముగిసిన విత్తనాలను రీసైక్లింగ్ చేయడం, నకిలీ విత్తనాలను స్థానికంగా తయారు చేయడం, ప్యాక్ చేయకుండా విత్తనాలు అమ్మడం, జీఈఏసీ అనుమతి లేకుండా విక్రయించడం, లేబుళ్లు మార్చడం, స్టాక్ రిజిస్టర్లలో నమోదు చేయకపోవడం, అనధికారికంగా విత్తనాలను ప్యాక్ చేయడం లాంటి అక్రమాలకు నకిలీ కంపెనీలు పాల్పడుతున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. -
ఈ నకిలీ.. మహారాష్ట్ర మకిలి!
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్– మంచిర్యాల–రామగుండం–ఖమ్మం ఇది మన రాష్ట్రంలో ఒక రైలు మార్గం. అంతేకాదండోయ్... ఈ దారి పొడవునా నకిలీ విత్తనాల కేసులున్నాయి. అంటే, మహారాష్ట్ర నుంచి ప్రయాణికుల రాకపోకలే కాదు, నకిలీ విత్తనాలు కూడా ప్రవేశిస్తున్నాయన్నమాట. ఈ మహారాష్ట్ర మకిలీ మన రాష్ట్ర రైతుకు మిక్కిలి కష్టాలను, నష్టాలను మిగులుస్తోంది. ప్రతిఏటా ఇదే తంతు. రైతులు ఆరుగాలం చేసిన శ్రమ నకిలీ విత్తనాల కారణంగా మట్టిలోనే కలసిపోతోంది. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న కరెంటు, సాగునీరు, రైతుబంధు వంటి పథకాల ద్వారా ఖర్చు చేస్తున్న రూ.వేల కోట్ల రూపాయల ధనం నకిలీ విత్తనాల కారణంగా వృథాగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి రాష్ట్రంలో నకిలీ విత్తనాల బెడదలేకుండా చేయాలని ఇటీవల డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. వ్యవసాయ అధికారులతో కలసి ఈ టాస్క్‌ఫోర్స్‌కు రూపకల్పన చేశారు. ఈ నకిలీ విత్తనాలేవీ కూడా మన రాష్ట్రంలో తయారుకావు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాల రవాణాను అడ్డుకోవాలన్న సంకల్పంతో ప్రత్యేక వ్యూహం ఖరారు చేశారు. ఇందు కోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోలీసు– వ్యవసాయాధికారుల ప్రత్యేక సంయుక్త బృందాలను ఏర్పాటు చేసి అనుమానితులపై నిఘా పెట్టారు. పోలీసు, వ్యవసాయ అధికారుల మధ్య సమన్వయం, సంప్రదింపుల నిమిత్తం ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్ సభ్యులకు నకిలీ విత్తనాల గుర్తింపుపై శిక్షణ ఇవ్వనున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినవారిపై వెంటనే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. ఏ వ్యాపారి అయినా విత్తన ప్యాకెట్లను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా అధిక ధరలకు విక్రయించినా వెంటనే లైసెన్స్ రద్దయ్యేలా చర్యలు చేపడతారు. అధికంగా మహారాష్ట్ర నుంచే.. నకిలీ విత్తనాల్లో అధికశాతం మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరభారత దేశం వెళ్లే రైలు రూటే వీరికి ప్రధాన మార్గం. అందుకే, అధికారులు ఈసారి ప్యాసింజర్ రైళ్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఏపీలోని కర్నూలు కేంద్రంగా సాగుతున్న దందా కూడా గుట్టుచప్పుడు కాకుండా అనేక మార్గాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించినట్లు పోలీసులకు సమాచారం ఉంది. పీడీ యాక్ట్ కింద 27 కేసులు తెలంగాణలో 2016 నుంచి 2020 వరకు నకిలీ విత్తనాలపై పోలీసులు 27 పీడీ యాక్ట్ కేసులు పెట్టారు. వీటిలో అధికంగా ఖమ్మం(7), రాచకొండ(7), రామగుండం (4) కమిషనరేట్ల పరిధిలో ఉన్నాయి. అందులో 14 కేసులు కేవలం 2020లోనే నమోదవడం గమనార్హం. అనుమానం వస్తే ఫిర్యాదు చేయండి: ఐజీ నాగిరెడ్డి రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం. ఈ విత్తనాల వల్ల ఏ రైతు కుటుంబమూ ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయం. నకిలీ విత్తనాలపై మీ వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా డయల్ 100 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అధికధరలు, నకిలీ విత్తనాలపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. (చదవండి: తాగి రచ్చ చేసిన వరుడు.. పెళ్లికి నిరాకరించిన వదువు) -
ఉట్టి ముచ్చటే..!
► నకిలీ విత్తన నిరోధక చట్టంబిల్లుకు మొండిచేయి ► శాసనసభ సమావేశంలో పట్టించుకోని సీఎం కేసీఆర్ ► రైతులపై ప్రయోగాలు చేస్తున్న కంపెనీలు ► అన్నదాతలను మోసం చేస్తున్న వ్యాపారులు ► జిల్లాలో ఈ ఏడాది రెండుసార్లు మోసపోయిన కర్షకులు సాక్షి, వరంగల్ రూరల్: నకిలీ విత్తన కంపెనీల ప్రయోగాలతో అన్నదాతలు ఏటా నష్టపోతూనే ఉన్నారు. వ్యాపారులు సైతం ఆయా కంపెనీలతో కుమ్మక్కై, ఇతర రూపాల్లో రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి రక్షణ కల్పించాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవ హరి స్తున్నారు. నకిలీ విత్తనాలతో పంటలను సాగుచేసి నష్టపోయిన సమయంలో పరిహారం ఇప్పించే చట్టం లేకపోవడంతో వారు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. కొన్ని సందర్భాల్లో మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే నకిలీ విత్తన నిరోధక చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి అన్నదాతలకు అండగా నిలుస్తామని ఏడాది కాలంగా సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెబుతున్నా ఫలితం లేకుండాపోయింది. గత ఏప్రిల్ 30వ తేదీన భూసేకరణ చట్టసవరణ బిల్లుతో పాటు నకిలీ విత్తన నిరోధక బిల్లును కూడా శాసనసభలో ప్రవేశపెడుతామని వారు చెప్పినా అది కార్యరూపం దాల్చకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టం లేకపోవడంతో మోసాలు నకిలీ విత్తనాల నిరోధానికి, బాధిత రైతులకు పరిహారం అందించేందుకు ప్రత్యేక చట్టం లేకపోవడంతో మోసాగాళ్ల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. గత ఆగస్టులో జిల్లాలోని పరకాల, ఆత్మకూరు, నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, దుగ్గొండి మండలాలకు చెందిన సుమారు 900 మంది రైతులు నకిలీ మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయారు. అయితే సదరు విత్తనాలు విక్రయించిన బాధ్యులపై తూతూ మంత్రంగా కేసులు పెట్టడంతో వారు మళ్లీ బయట దర్జాగా తిరుగుతున్నారు. కాగా, చెన్నారావుపేట మండలంలోని కోనాపురం, జల్లి, ఎల్లాయగూడెం గ్రామానికి చెందిన రైతులు జీవా మిర్చి విత్తనాలు సాగుచేశారు. అవి ఏపుగా పెరిగినప్పటికీ కాయలు కాయకపోవడంతో దారుణంగా నష్టపోయారు. దీనిపై బాధితులు 300 మంది గత డిసెంబరు 24న నర్సంపేటలో విత్తన దుకాణాల ఎదుట ఆందోళన నిర్వహించినా నేటికి వారికి పరిహారం అందలేదు. చట్టం లేకపోవడంతో కంపెనీల ఇష్టారాజ్యం నకిలీ విత్తన నిరోధకంపై ప్రత్యేక చట్టం లేకపోవడంతో పలు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను మోసం చేస్తున్నాయి. నకిలీ విత్తన సమస్యను అరికట్టాలంటే ప్రభుత్వం కఠినమైన చట్టాలను అమలు చేయాలి. ఇలాంటి విత్తనాలను ఉత్పత్తి చేసినా, అమ్మినా వారిని కఠినంగా శిక్షించాలి. –పసుల భిక్షపతి, నాగారం(పరకాల) ప్రత్యేకచట్టం తీసుకురావాలి నకిలీ విత్తన నిర్మూలనతో పాటు నష్టపోయిన రైతులకు పరిహారం అందించే విధంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలి. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై పీడీ యాక్టు నమోదు చేయాలి. అప్పుడే రైతులకు భరోసా ఉంటుంది. –కోడెపాక సమ్మయ్య, మల్లక్కపేట (పరకాల) చట్టం వస్తేనే భరోసా నకిలీ విత్తన నిరోధక చట్టాన్ని అమలులోకి తీసుకొస్తేనే వ్యవసాయంపై రైతులకు భరోసా ఉంటుంది. నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం లేకపోవడంతో రైతులు పరిహారం పొందలేకపోతున్నారు. నకిలీ విత్తన నిరోధక చట్టం త్వరగా తీసుకురావాలి. –ఆళ్ల అమరలింగస్వామి, గాంధీనగర్, (సంగెం)