తెలంగాణలో యథేచ్ఛగా నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు | hyderabad: Fake Seeds Hulchul In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో యథేచ్ఛగా నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు

Published Sat, May 27 2023 5:11 AM | Last Updated on Sat, May 27 2023 11:11 AM

​hyderabad: Fake Seeds Hulchul In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరో వారం పది రోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో మళ్లీ నకిలీ విత్తనాల బెడద మొదలైంది. దళారులు నేరుగా రైతుల వద్దకే వెళ్లి నకిలీ విత్తనాలను అంటగడుతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో తాజాగా 2.65 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. దీంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల వద్దకు నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు చేరి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతియేటా కీలకమైన సమయంలో వ్యవసాయ శాఖ అధికారులు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారనే విమర్శలు విని్పస్తున్నాయి.  

ఇతర రాష్ట్రాల నుంచి తరలింపు.. 
రాష్ట్రంలో నూతన సాగు పద్ధతులను ప్రోత్సహించాలని, వరి, ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా పత్తి విస్తీర్ణాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈసారి 65 లక్షల ఎకరాల నుంచి 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని వ్యవసాయశాఖ రైతులకు సూచించింది. 75 లక్షల ఎకరాలకు సరిపోయేలా కోటిన్నర పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరా చేసేందుకు కంపెనీలు కూడా సన్నాహాలు చేసుకున్నాయి. అయితే పత్తిసాగు పెరగనుండటాన్ని అదనుగా భావించిన నకిలీ విత్తన కంపెనీలు రంగంలోకి దిగాయి.

నిషేధిత హెచ్‌టీ కాటన్‌ (బీజీ–3) విత్తనాలను కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రల నుంచి తరలించి తమ దళారులకు అప్పగించాయి. రైతుల్ని మోసగిస్తున్న దళారులు వారికి నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. వర్షాలు ప్రారంభమైతే మొదటగా వేసేది పత్తే కాబట్టి     మిగతా 8వ పేజీలో u
ఇప్పటికే హెచ్‌టీ కాటన్‌ విత్తనాలు సరఫరా అయ్యాయి. గతేడాది నకిలీ విత్తనాలను పట్టుకునేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్‌ ఆ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలు పెద్దమొత్తంలో పట్టుకుంది. అయినప్పటికీ గతేడాది ఏకంగా ఆరేడు లక్షల ఎకరాల్లో హెచ్‌టీ కాటన్‌ సాగైనట్లు సమాచారం.  

బీజీ–3 అమ్మకాలతో లాభాలు.. 
సీజన్‌ ప్రారంభం కాగానే రైతులు చాలావరకు గ్రామంలోని షావుకార్ల వద్దనో, విత్తన వ్యాపారుల వద్దనో అప్పు కింద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. పంట వచి్చనప్పుడు అప్పు తీర్చేలా ఒప్పందం చేసుకుంటారు. ఎలాగూ అప్పు ఇస్తున్నారు కాబట్టి వ్యాపారి ఇచ్చిన విత్తనాలనే రైతులు తీసుకుంటారు. వీటికి ఎలాంటి రశీదులు ఉండవు. విత్తన డీలర్‌ నిబంధనల ప్రకారం ఒక పత్తి విత్తన ప్యాకెట్‌ (450 గ్రాములు) అమ్మితే రూ.25–30 లాభం వస్తుంది. కానీ అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను విక్రయిస్తే ఏకంగా రూ.500, అదే లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ.1,000కి పైగా ఆదాయం వస్తుంది. ఈ కారణంగానే ఏజెంట్లు రైతులకు అక్రమ విత్తనాలు అంటగడుతున్నారు. గ్రామాల్లో ప్రతి 100 మంది రైతుల్లో సగం మంది మండల కేంద్రాల్లోని అధికారిక విత్తన దుకాణల నుంచి విత్తనాలు తీసుకుంటుండగా.. మరో సగం మంది షావుకార్లు, ఇతర విత్తన వ్యాపారుల వద్ద అప్పు కింద విత్తనాలు తీసుకుంటున్నారు. బ్యాంకులు అవసరమైన సమయంలో రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు ఇలా వడ్డీ వ్యాపారులు, విత్తన వ్యాపారులను ఆశ్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

బీజీ–1, బీజీ–2లకు మాత్రమే అనుమతి 
దేశంలో బీజీ–1, బీజీ–2 పత్తి విత్తనానికి మాత్రమే అనుమతి ఉంది. అయితే ప్రస్తుతం బీజీ–2 మాత్రమే ఎక్కువగా వినియోగంలో ఉంది. అయితే బీజీ–2 పత్తి విత్తనం వేస్తున్నా గులాబీ రంగు పురుగు ఆశిస్తుండటంతో బీజీ–3 రంగప్రవేశం చేసింది. అయితే ఇది అన్ని విధాలుగా హానికరం కావడంతో దేశంలో దీని వినియోగంపై నిషేధం ఉంది. అయితే బీజీ–2కు బీజీ–3 పత్తి విత్తనానికి మధ్య తేడా గుర్తించలేని పరిస్థితి ఉండటంతో దీన్నే అవకాశంగా తీసుకొని కంపెనీల నిరా>్వహకులు, వ్యాపారులు లాభాల కోసం నిషేధిత బీజీ–3ని రైతులకు అంటగడుతున్నారు. దీంతో ఏటా బీజీ–3 సాగు చాపకింద నీరులా పెరుగుతోంది. 

రీసైక్లింగ్‌తో దగా.. 
    కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టి వారిని నిలువునా మోసం చేస్తున్నాయి. గడువు తీరిన విత్తనాలను రీసైక్లింగ్‌ చేసి కొత్తవని చెప్పి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఆ విత్తనం... ఈ విత్తనం అనే తేడా లేకుండా దాదాపు అన్ని రకాల విత్తనాలనూ ఇలాగే విక్రయించి రైతన్నలను నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఒకసారి రూపొందించిన విత్తనాలనే మళ్లీ మళ్లీ రీసైక్లింగ్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. నాణ్యత లేని విత్తనాల వల్ల సరైన దిగుబడి రాకపోవడంతో రైతాంగం కుదేలవుతోంది. పత్తితో పాటు వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, ఆవాలు, బఠానీ సహా దాదాపు 30 రకాల పంటల విత్తనాలను కూడా కంపెనీలు రీసైక్లింగ్‌ చేస్తూ రైతన్నలను దగా చేస్తున్నాయి. ఈ రీసైక్లింగ్‌ కుంభకోణంలో కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా ఉండటం విస్మయం కలిగించే అంశం. కాగా రాష్ట్రం మొత్తానికి సరఫరా అయ్యే విత్తనాల్లో దాదాపు 15 నుంచి 20 శాతం వరకు రీసైక్లింగ్‌ విత్తనాలే ఉంటాయని అంచనా. గతంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని విజిలెన్స్‌ దాడుల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. అయినా ఈసారి ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతస్థాయిలో అండదండలు ఉండటం వల్లే నకిలీ విత్తన దందా యధేచ్ఛగా సాగిపోతోందనే ఆరోపణలు విని్పస్తున్నాయి.  

లైసెన్స్‌ ఉన్న షాపుల్లోనే కొనాలి 
    రైతులు నకిలీ విత్తన ఉత్పత్తిదారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని మార్కెట్‌లోకి వచ్చి విక్రయిస్తున్న వారి నుంచి కొనొద్దు. లైసెన్స్‌ ఉన్న షాపుల్లోనే విత్తనాలు కొనుక్కోవాలి. కవర్‌పై ధర, ఎన్ని గ్రాములు ఉన్నాయి, గడువు తేదీ తదితర వివరాలు గమనించాలి. రశీదు తప్పకుండా తీసుకోవాలి. గ్రామాల్లోని రైతు వేదికల్లో నకిలీ విత్తనాలపై అవగాహన కలి్పస్తున్నాం. ఎరువుల దుకాణాల్లో ప్రత్యేక టాస్ట్‌ఫోర్స్‌ బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నాం. రైతులకు కావలసినన్ని విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా కొరత లేదు. 
– రాష్ట్ర వ్యవసాయ శాఖ  

ఎన్ని మోసాలో..     
నకిలీ విత్తన మాఫియా పలు రకాలుగా మోసాలకు పాల్పడుతోంది. గడువు ముగిసిన విత్తనాలను రీసైక్లింగ్‌ చేయడం, నకిలీ విత్తనాలను స్థానికంగా తయారు చేయడం, ప్యాక్‌ చేయకుండా విత్తనాలు అమ్మడం, జీఈఏసీ అనుమతి లేకుండా విక్రయించడం, లేబుళ్లు మార్చడం, స్టాక్‌ రిజిస్టర్లలో నమోదు చేయకపోవడం, అనధికారికంగా విత్తనాలను ప్యాక్‌ చేయడం లాంటి అక్రమాలకు నకిలీ కంపెనీలు పాల్పడుతున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement