Fake stamp scam
-
ఆధారాలు లేవు.. కాబట్టి వారంతా నిర్దోషులే!
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం నిందితులంతా నిర్దోషులేనని నాసిక్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీ, మరో ఏడుగురికి వ్యతిరేకంగా సరైన ఆధారాలు లభించలేదని పేర్కొంది. 2004లో నకిలీ స్టాంపుల రాకెట్ నడుపుతున్నాడన్న ఆరోపణలపై తెల్గీని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సుమారు రూ.32 వేల కోట్ల మేర స్టాంపుల విక్రయం జరిగింది. కాగా, వేరే కేసుల్లో దోషిగా తేలడంతో కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెల్గీ గతేడాది బెంగళూరులోని జైలులో చనిపోయాడు. జైలు జీవితం నేర్పిన ఫోర్జరీ పాఠాలు సాధారణ రైల్వే ఉద్యోగి కుమారుడైన కరీం తెల్గీ 2001లో అరెస్టయ్యే వరకూ రాజకీయ నాయకులు, పోలీసుల సాయంతో అనేక రాష్ట్రాల్లో అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతడి నకిలీ అక్రమాల విలువ దాదాపు రూ.20వేల కోట్లు. దేశ ఆర్థిక మార్కెట్లను కుదిపేసిన ఈ అక్రమాల తీవ్రత దాదాపు రూ.33వేలకోట్లు. కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్‌కు చెందిన తెల్గీ చిన్నతనంలో రైళ్లలో కూరగాయలు, పళ్లు అమ్మేవాడు. బెలగావి కాలేజీ నుంచి బీకాం డిగ్రీ సంపాదించాక సౌదీకి వెళ్లాడు. అక్కడ దాదాపు ఏడేళ్లు గడిపి తిరిగి ముంబైకి చేరాక అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు. యువకులను దుబాయ్ పంపిస్తానని మోసగించిన కేసులో ముంబై పోలీసులు 1991లో తెల్గీని అరెస్ట్ చేశారు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. నకిలీ షేర్ల కేసులో శిక్ష పడ్డ రామ్ రతన్ సోనీ నుంచి తెల్గీ ఫోర్జరీ మెళకువలు నేర్చుకున్నాడు. జైలునుంచి బయటికొచ్చేందుకు అధికారులకు లంచమిచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. తెల్గీ అక్రమ సామ్రాజ్య విస్తరణ రాజకీయ నాయకులు, సెక్యూరిటీ ప్రెస్ అండతో 1994లో స్టాంప్ పేపర్ లైసెన్స్ సంపాదించిన తెల్గీ ముంబై మింట్ రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. రెవెన్యూ శాఖ, స్టాంప్ కార్యాలయం, నాసిక్ సెక్యూరిటీ ప్రెస్‌లోని అధికారులతో స్నేహం పెంచుకున్నాడు. తనకున్న రాజకీయ సాన్నిహిత్యంతో నాసిక్ ప్రెస్‌లో యంత్రాల్ని పనికిరానివిగా ప్రకటించేలా చేసి వాటిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిని కొని ముంబైలోని తన కార్యాలయంలో స్టాంపు పేపర్ల ముద్రణ ప్రారంభించాడు. నాసిక్ ప్రెస్ భద్రతా అధికారుల సాయంతో స్టాంపుల ముద్రణ రంగుల్ని సంపాదించిన తెల్గీ... 350 మంది ఏజెంట్ల సాయంతో భారీ స్థాయిలో నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని కొనసాగించాడు. వారు బ్యాంకులు, బీమా కంపెనీలు, స్టాక్ బోక్రరేజ్ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలకు పెద్ద మొత్తంలో నకిలీ స్టాంపుల్ని విక్రయించేవారు. అధికారంలో ఉన్న నేతలు, పోలీసు అధికారుల సహకారంతో తెల్గీ ఈ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. నార్కో పరీక్షల్లో అతడు అనేకమంది ప్రముఖుల పేర్లను కూడా వెల్లడించాడు. -
కరీం తెల్గీ మృతి
-
కరీం తెల్గీ మృతి
సాక్షి, బెంగళూరు: సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీ(56) గురువారం మృతిచెందాడు. మెనింజైటిస్, బహుళ అవయవ వైఫల్యంతో వారం రోజులుగా తెల్గీ బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, గురువారం గుండెపోటు రావడంతో పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు చెప్పారు. జైలులో ప్రత్యేక మర్యాదలు పొందిన వారిలో తెల్గీ ఉన్నారని అప్పటి కర్ణాటక డీఐజీ ఆరోపించడంతో ఆయన మళ్లీ వార్తల్లోకెక్కారు. నకిలీ స్టాంప్ పేపర్ల కేసులో తెల్గీ 2001లో అజ్మీర్‌లో అరెస్టయ్యాడు. 2006లో కోర్టు ఆయనకి 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.202 కోట్ల జరిమానా విధించింది. గత 16 ఏళ్లుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో ఉన్న సమయంలో తెల్గీకి హెచ్ఐవీ సిరంజి ఎక్కించారని ఆయన తరఫు లాయర్ గతంలో కోర్టుకు చెప్పారు. నాయకులు, సెక్యూరిటీ ప్రెస్ అండతోనే.. 1994లో స్టాంప్ పేపర్ లైసెన్స్ సంపాదించిన తెల్గీ ముంబై మింట్ రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. రెవెన్యూ శాఖ, స్టాంప్ కార్యాలయం, నాసిక్ సెక్యూరిటీ ప్రెస్‌లోని అధికారులతో స్నేహం పెంచుకున్నాడు. తనకున్న రాజకీయ సాన్నిహిత్యంతో నాసిక్ ప్రెస్‌లో యంత్రాల్ని పనికిరానివిగా ప్రకటించేలా చేసి వాటిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిని కొని ముంబైలోని తన కార్యాలయంలో స్టాంపు పేపర్ల ముద్రణను ప్రారంభించాడు. నాసిక్ ప్రెస్ భద్రతా అధికారుల సాయంతో స్టాంపుల ముద్రణ రంగుల్ని సంపాదించాడు. 350 మంది ఏజెంట్ల సాయంతో భారీ స్థాయిలో నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని కొనసాగించాడు. వారు బ్యాంకులు, బీమా కంపెనీలు, స్టాక్ బోక్రరేజ్ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలకు పెద్ద మొత్తంలో నకిలీ స్టాంపుల్ని విక్రయించేవారు. అధికారంలో ఉన్న నేతలు, పోలీసు అధికారుల సహకారంతో తెల్గీ ఈ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. నార్కో పరీక్షల్లో అనేకమంది ప్రముఖుల పేర్లను వెల్లడించాడు. మలుపు తిప్పిన జైలు జీవితం సాధారణ రైల్వే ఉద్యోగి కుమారుడైన అతను 2001లో అరెస్టయ్యే వరకూ రాజకీయ నాయకులు, పోలీసుల సాయంతో అనేక రాష్ట్రాల్లో అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నకిలీ తెల్గీ అక్రమాల విలువ దాదాపు రూ.20వేల కోట్లు. దేశ ఆర్థిక మార్కెట్లను కుదిపేసిన ఈ అక్రమాల తీవ్రత దాదాపు రూ.33వేలకోట్లు. కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్‌కు చెందిన తెల్గీ చిన్నతనంలో రైళ్లలో కూరగాయలు, పళ్లు అమ్మేవాడు. బెలగావి కాలేజీ నుంచి బీకాం డిగ్రీ సంపాదించాక సౌదీకి వెళ్లాడు. అక్కడ దాదాపు ఏడేళ్లు గడిపి తిరిగి ముంబైకి చేరాక అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు. యువకులను దుబాయ్ పంపిస్తానని మోసగించిన కేసులో ముంబై పోలీసులు 1991లో తెల్గీని అరెస్ట్ చేశారు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. నకిలీ షేర్ల కేసులో శిక్ష పడ్డరామ్ రతన్ సోనీ నుంచి తెల్గీ ఫోర్జరీ మెలకువలు నేర్చుకున్నాడు. జైలునుంచి బయటికొచ్చేందుకు అధికారులకు లంచమిచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. -
కరీం తెల్గీ కన్నుమూత
-
కరీం తెల్గీ కన్నుమూత
సాక్షి, బెంగళూర్ : నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీ కన్నుమూశాడు. గత కొంత కాలంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో తెల్గీ బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే అతన్ని బెంగళూర్ లోని విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందజేస్తున్నారు కూడా. కాగా, వేల కోట్లకు సంబంధించిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో నిందితుడిగా ఉన్న తెల్గీని అజ్మీర్ లో నవంబర్ 2001లో తెల్గీని అరెస్ట్ చేశారు. దోషిగా తేలటంతో కోర్టు 30 సంవత్సరాల కఠిన శిక్ష విధించగా.. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆయన్ను ఉంచారు. అంతేకాదు రూ. 202 కోట్ల జరిమానాను విధించింది కూడా. ఆ మధ్య ఈయనకు జైల్లోనే చికిత్స అందించారంటూ జైళ్ల మాజీ డీఐజీ రూప ఆరోణలు చేసిన విషయం తెలిసిందే. -
కరీం తెల్గీ పరిస్థితి విషమం
-
తుది ఘడియల్లో తెల్గీ
సాక్షి, బెంగళూర్ : దేశాన్ని ఆర్థికంగా కుదిపేసిన నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం ప్రధాన సూత్రధారిగా అబ్దుల్ కరీం తెల్గీ ఆరోగ్యం విషమించినట్లు సమాచారం. ప్రస్తుతానికి బతికే ఉన్నప్పటికీ.. వెంటిలేటర్‌పై ఉన్నట్లు కరీం తరపు న్యాయవాది ఎంటీ నన్నయ్య మీడియాకు తెలిపారు. సుదీర్ఘ అనారోగ్యంతో కరీం బాధపడుతుండగా.. పరిస్థితి విషమించటంతో నాలుగు రోజుల క్రితం బెంగళూర్‌లోని విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు. నరాల సంబంధిత వ్యాధితో కరీం బాధపడుతున్నాడని నన్నయ్య చెప్పారు. మరికాస్త ముందే కరీంను ఆస్పత్రికి తీసుకొచ్చి ఉంటే ఇలా ఉండేది కాదని ఆయన చెబుతున్నాడు. కాగా, గత 20 ఏళ్లుగా డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులతో సతమతమవుతున్న ఆయన.. ఎయిడ్స్ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెదడు నుంచి వెన్నెముకకు దారితీసే కండరాలు, రక్తనాళాలు బలహీనపడ్డాయని, దీంతో ఆయన కదల్లేని స్థితిలో ఉన్నారని చెబుతున్నారు. కాగా, వేల కోట్లకు సంబంధించిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో నిందితుడిగా ఉన్న తెల్గీని అజ్మీర్ లో నవంబర్ 2001లో తెల్గీని అరెస్ట్ చేశారు. దోషిగా తేలటంతో కోర్టు 30 సంవత్సరాల కఠిన శిక్ష విధించగా.. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆయన్ను ఉంచారు. అంతేకాదు రూ. 202 కోట్ల జరిమానాను విధించింది కూడా. ఆ మధ్య ఈయనకు జైల్లోనే చికిత్స అందించారంటూ జైళ్ల మాజీ డీఐజీ రూప ఆరోణలు చేసిన విషయం తెలిసిందే. -
తెరపైకి మళ్లీ కృష్ణయాదవ్
గ్రేటర్ టీడీపీలో కృష్ణయాదవ్ పేరు మళ్లీ తెర మీదకు వచ్చింది. గ్రేటర్ అధ్యక్షుడుగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ దిగి కారు ఎక్కుతుండటంతో అదే సామాజిక వర్గానికి చెందిన కృష్ణయాదవ్ కు హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి వరించింది,. తలసాని, తీగల కృష్ణారెడ్డి పార్టీకి దూరం కావటంతో వెనువెంటనే ఆయనకు పార్టీ పగ్గాలు ఇచ్చారు. దాంతో తలసానికి గట్టిగా ఎదుర్కొనేందుకే కృష్ణయాదవ్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. పాతబస్తీకి చెందిన కృష్ణయాదవ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. తెలుగు విద్యార్థి నాయకుని నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 1994లోహిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విప్‌గా పనిచేశారు. చంద్రబాబు హయాంలో కార్మిక శాఖ, పశు సంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. అయితే నకిలీ స్టాంపుల కుంభకోణంలో 2003లో టిడిపి ప్రభుత్వ హయాంలోనే కృష్ణయాదవ్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత టిడిపిలో చేరేందుకు ప్రయత్నించినా ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు అధ్యక్షుడి అనుమతితో ఏడాదిన్నర క్రితం ఆయన టీడీపీలో చేరారు. ఇక కృష్ణాయాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరూ ఒకే సారి శాసనసభలో కలిసి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీలో నగరం నుంచి బలమైన నాయకులుగా ముద్రపడ్డారు. అర్ధబలం, అంగబలంలోనూ వారిద్దరు సమఉజ్జీలే. అయితే ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య రాజకీయ వైరం నెలకొంది. ఎంతలా అంటే ఒకరి నీడను మరొకరు సహించలేనంతగా. ఆ తర్వాత నకిలీ స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కుని కృష్ణాయాదవ్ పార్టీ నుంచి బహిష్కృతుడు కావడంతో తలసానికి పార్టీలో మరింత ప్రాధాన్యత పెరిగింది. ఓ దశలో తలసాని... పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారారు కూడా. అనుకున్నది సాధించుకునేందుకు తలసాని పార్టీ మారే అస్త్రాన్ని కూడా పలుమార్లు ఉపయోగించుకున్నారు.