family counselling
-
OCD Wife: నావల్లకాదు మహప్రభో.. దయచేసి విడాకులిప్పించండి!
A software professional in Bengaluru wants divorce from his wife over her obsession with cleanliness: ఈ ఇల్లాలు శుభ్రతకు బ్రాండ్ అంబాసిడరయ్యి ఉంటుంది. భర్త ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌ను చక్కగా వాషింగ్ పౌడర్ వేసిమరీ శుభ్రంగా కడిగింది. పాపం సాఫ్ట్వేర్ భర్త విసిగి వేసారిపోయి ఇక నా వళ్లకాదని విడాకులిప్పించమని పోలీసులను ప్రాధేయపడిన సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. బెంగుళూరులోని ఆర్టీ నగర్ కాలనీకి చెందిన రాహుల్, సుమనా (పేర్లు మార్చాం) 2009లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వివాహానంతరం వృత్తిరిత్యా ఇంగ్లాండ్, యూకేకు వెళ్లాడు. తిరిగొచ్చేనాటికి వాళ్లు కాపురముంటున్న ఇల్లు అద్దంలా మెరిసిపోతుంది. రాహుల్ చూసి చాలా సంతోషించాడు కూడా! సరదాగా సాగిపోతున్నవీరి కాపురంలో రెండేళ్ల తర్వాత మొదటి సంతానం కలిగింది. ఇక అప్పటి నుంచి కాపురంలో కలతలు మొదలయ్యాయి. అప్పుడే ఆమెలో ఉన్న అబ్సెసీవ్ కంపల్సీవ్ డిజార్డర్ (ఓసీడీ) భయటపడింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన సుమనా అతిశుభ్రత అలవాట్లు భర్తను విపరీతంగా విసిగించాయి. ప్రతిరోజూ ఆఫీస్ నుంచి రాగానే బూట్లు, దుస్తులు, మొబైల్ ఫోన్లను శుభ్రం చేయమని భర్తను బలవంతం చేసేది. ఈ జంట తరచూ ఫామిలీ కౌన్సెలింగ్ తీసుకుంటూ ఉండేవారు. రెండో సంతానం కలిగాక పరిస్థితికాస్త మెరుగుపడినా కోవిడ్ లాక్డౌన్ కాలంలో ఆమె ఓసీడి సమస్య వారికాపురంలో మరోమారూ కలతలు రేపింది. ఇంట్లో ప్రతివస్తువును శానిటైజ్ చేయడం మొదలు పెట్టింది. లాక్డౌన్లో భర్త వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో అతని ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను డిజర్జెంట్‌తో శుభ్రం చేసింది. అంతేకాదు రోజుకు ఆరు కంటే ఎక్కువ సార్లు స్నానంచేసేదట, స్నానం సబ్బును శుభ్రం చేసేందుకు మరో మరో ప్రత్యేకమైన సబ్బును కూడా వాడేదని రిపోర్టులో భర్త పేర్కొన్నాడు. చదవండి: కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా? ఆశ్యర్యమేమంటే.. భర్త తల్లి (అత్తగారు) మరణిస్తే భర్త, పిల్లలను ఏకంగా 30 రోజులపాటు ఇంటిబయటే ఉంచి, ప్రతిరోజూ ఇంటిని శుభ్రంచేస్తూ ఉండేది. ఐతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల్ని కూడా యూనీఫాం, బూట్లు, బ్యాక్ ప్రతిరోజూ శుభ్రం చేయవల్సిందిగా పోరు పెట్టడంతో తాజాగా ఈ విషయం వెలుగుచూసిందని కౌన్సిలర్ బీఎస్ సరస్వతి చెప్పారు. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన టెక్కీ తన పిల్లలతో పాటు తల్లిదండ్రుల ఇంటికి మారాడు. అతని భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయాన్ని పరిహార్‌కు బదిలీ చేశారు. నవంబర్‌లో మూడు సార్లు కౌన్సెలింగ్‌లు నిర్వహించినా ఫలితంలేకపోయింది. సుమనాకు ఓసీడీ ఉందని, తన ప్రవర్తనను సరిచేసుకోమని కౌన్సెలర్ ఆమెకు తెల్పగా.. ‘ఇది చాలా సాధారణం నాకు అలాంటిదేమీ లేదని' కొట్టిపారేసింది. అంతేకాదు భర్త తనను వదిలించుకొని మరో వివాహం చేసుకోవలనుకుంటున్నట్లు, అతనిపై వేధింపుల ఫిర్యాదును కూడా నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. చదవండి: వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా? -
Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
Sree Lakshmi Reddy: Social Worker Mobile Counselling In Hyderabad: ‘పని చేసే చేతికి తీరిక ఉండదు... పని చేయని మనిషికి పని కనిపించదు’ ఈ నానుడిని నిజం చేస్తోంది లక్ష్మక్క. సామాజిక కార్యకర్తగా దశాబ్దాల సేవ ఆమెది. కష్టంలో ఉన్న మహిళలకు సహాయం చేయడానికి ఇప్పుడామె... స్వయంగా కదలి వెళ్తోంది. ‘శ్రీలక్ష్మి స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్’ తో 1997లో మొదలైన శ్రీలక్ష్మిరెడ్డి సోషల్ సర్వీస్ మొబైల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ రూపంలో విస్తరించింది. ఇన్నాళ్లూ ఆమె హైదరాబాద్, హిమాయత్ నగర్లో ఆఫీస్‌లో ఉండి, వచ్చిన వాళ్లకు ఉచితంగా సర్వీస్ ఇచ్చారు, స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడే వరకు చేయూత అయ్యారు. కొంతమంది ఆమె ఫోన్ నంబరు తెలుసుకుని ఫోన్ చేస్తారు. తమ కష్టమంతా చెప్పుకుంటారు. వాళ్లలో తాము నివసించే కాలనీ దాటి శ్రీలక్ష్మి దగ్గరకు రావడం కూడా చేతకాని అమాయకులు, దారి ఖర్చులకు డబ్బులు లేని వాళ్లు ఎందరో! ‘వాళ్లను అలా వదిలేస్తే నేను ఇస్తున్న సర్వీస్‌కి పరిపూర్ణత ఎలా వస్తుంది?... అని చాలా సార్లు అనిపించేది. అందుకే మా అమ్మ ఆరవ వర్థంతి సందర్భం గా నవంబర్ 26వ తేదీన ‘అల్లారెడ్డి కమలమ్మ – వెంకు రెడ్డి మొబైల్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్’ పేరుతో సంచార కుటుంబ సలహా కేంద్రాన్ని ప్రారంభించాను’ అని చెప్పారు శ్రీలక్ష్మి. పెళ్లికి ముందే కౌన్సెలింగ్! ‘‘కలహాలు లేని కాపురం ఉండబోదు. కలహం వస్తే విడిపోవడమే పరిష్కారం కాదు. చక్కదిద్దుకోవడానికి ఉన్న అన్ని దారులనూ అన్వేషించాలి. కలిసి ఉండడానికి అన్ని ప్రయత్నాలూ చేయాలి. విడిపోవడం అనేది విధిలేని పరిస్థితుల్లో చివరి ఎంపిక కావాలి తప్ప తొలి ఎంపిక కాకూడదు... అని సమాధాన పరచాల్సి వస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలకు రూట్కాజ్కు వైద్యం చేయాలనుకుని, ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ కూడా మొదలుపెట్టాను. పెళ్లయిన తర్వాత భార్యగా నీ బాధ్యతలను మర్చిపోకూడదు, అలాగే భర్తగా అతడి బాధ్యతల గురించి హెచ్చరించగలగాలి... అని అమ్మాయిలకు పాఠంలా చెప్పాల్సి వస్తోంది. ఇంట్లో పెద్దవాళ్లకు ఇవన్నీ చెప్పే తీరిక ఉండడం లేదు. అలాగే ఇంట్లో వాళ్లు అన్నింటినీ చెప్పలేరు కూడా. అందుకే ఆ బాధ్యతను నేను తీసుకున్నాను’’ అని చెప్పారు శ్రీలక్ష్మి. నేర్చుకున్నాను... నేర్పిస్తున్నాను! ‘మహిళలు స్వయం సమృద్ధి సాధించాలంటే వాళ్లకు ఏదో ఒక పనిలో నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఫినాయిల్ తయారీ నుంచి, ఫ్యాషన్ డిజైనింగ్ వరకు పాతిక రకాలలో శిక్షణ తీసుకున్నాను. మహిళలకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నాను’ అని కూడా చెప్పారామె. ఫ్యామిలీ కౌన్సెలింగ్ గదికి పక్కనే ఉన్న మరో గదిలో మహిళలకు జాక్ మెషీన్ల మీద ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులు జరుగుతున్నాయి. వారిలో ఓ యువతి తన రెండేళ్ల బిడ్డను ఒక సోఫాలో పడుకోబెట్టి తాను పని నేర్చుకుంటోంది. అమ్మ వంటి అక్క ఉంది మొబైల్ కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌లో చార్మినార్, దోమల్‌గూడ, నారాయణగూడ వెళ్లాను. సమస్యలకు దగ్గరగా వెళ్లినకొద్దీ ఇలాంటి సర్వీస్ ఎంత అవసరం ఉందో అర్థమవుతోంది. నేను ఒక్కదాన్ని ఎంత చేసినా నూరోవంతు కూడా పూర్తికాదు. నాకిప్పుడు యాభై ఆరేళ్లు. నేను సర్వీస్ నుంచి రిటైర్ అయ్యే లోపు నాలాగ ఉచితంగా సర్వీస్ ఇచ్చే మరికొందరిని తయారు చేస్తాను. నాకు రామకృష్ణ మఠంలో అలవడిన సమాజసేవ ఇది. కుటుంబ బంధాలు పటిష్టంగా ఉంటే సమాజం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని నమ్మే స్కూల్లో శిక్షణ పొందాను. అందుకే నా సర్వీస్ అంతా కుటుంబ బంధాలను పటిష్టం చేయడం కోసమే సాగుతుంది. – శ్రీలక్ష్మి రెడ్డి, సామాజిక కార్యకర్త చదవండి: Yamini Mazumdar: ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో బెంగళూరులో లాండ్రీ వ్యాపారం చేస్తూ.. -
భార్యాభర్తలపై సినిమాలు, సీరియళ్ల ప్రభావం
నేరేడ్మెట్: అనుమానాలు..అపార్థాలు..మనస్పర్థలతో పోలీసు కేసులతో వీడిపోవాలనుకునే దంపతుల మధ్య రాజీ కుదిర్చి వైవాహిక బంధం పటిష్టానికి కుటుంబ సహాయ కేంద్రాలు (ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు) దోహదపడుతున్నాయని రాచకొండ సీపీ మహేష్‌భగవత్ అన్నారు. 2016 గాంధీజయంతి రోజున రాచకొండ పోలీసుల సహకారంతో ఎన్జీవో సంస్థ ‘అంకురం’కుషాయిగూడ ఠాణాలో కుటుంబ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. బుధవారానికి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్‌లో తృతీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో సఖితోపాటు అంకురం, భూమిక సంస్థల ఆధ్వర్యంలో భువనగిరి, సరూర్‌నగర్, ఉప్పల్, నేరేడ్మెట్ పాకరంతాల్లో ఐదు కుటుంబ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత మూడేళ్లలో వివిధ కారణాల నేపథ్యంలో 1273 జంటలు కుషాయిగూడ ఫ్యామిలీ సహాయ కేంద్రాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం కేసులను ఉపసంహరించుకొని 468 జంటలు రాజీ పడి, సంతోషంగా జీవిస్తున్నట్లు సీపీ వివరించారు. 491 దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాజీ పడిన జంటలు తిరిగి గొడవ పడి ఠాణాలకు వెళ్లకపోవడం వివాహ వ్యవస్థ బలోపేతానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు చేస్తున్న కృషికి నిదర్శమన్నారు. ఈ సెంటర్ల నిర్వాహకులు ,కౌన్సెలర్లు దంపతులను వేర్వేరుగా కౌన్సెలింగ్ చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి సూచనలు అందిస్తున్నందున కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. గృహహింస కేసులకు వరకట్నం ఒక్కటే కారణం కాదని, భర్తలకు మద్యం అలవాటుతోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు సీపీ వివరించారు. 2016–19 వరకు వరకట్న సమస్యపై 223 కేసులు నమోదు కాగా, మద్యం కారణంగా 335 కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. సినిమాలు, సీరియళ్ల ప్రభావం సినిమాలు, టీవీ సీరియల్స్, సోషల్‌మీడియా ప్రభావం భార్యాభర్తల మధ్య విభేదాలకు దారితీస్తోందని సీపీ అభిప్రాయపడ్డారు. అపార్ట్మెంట్ సంస్కృతి పెరగటం, ఉమ్మడి కుటుంబాలు తగ్గటం కూడా ఇందుకు కారణమన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. షీ టీంలు, ఫ్యామిలీ, సఖి కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటుతోపాటు ఐటీ కంపెనీల ప్రతినిధులతో మార్గదర్శక్‌లను నియమించడం జరిగిందని ఆయన వివరించారు. మై ఆటో, క్యాబ్ సేఫ్ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. చిన్నచిన్న కారణాలతో కేసులుపెట్టుకొని భార్యభర్తలు వీడిపోరాదని సీపీ సూచించారు. దంపతులు దూరమైతే వారి పిల్లలు, కుటుంబం రోడ్డు పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చార్జిషీట్ దాఖలైన తర్వాత కూడా కలిసి ఉండటానికి అవకాశం ఉంటుందన్నారు. ‘అర్థరాత్రి మహిళలు స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని’ మహాత్మగాంధీ కలను సాకారం చేసేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు. కౌన్సెలింగ్ అనంతరం రాజీపడిన డీఆర్డీఏ శాస్త్రవేత్త సురేష్‌తోపాటు లక్ష్మి, ఉదయ్, ఉష, ఓంప్రకాష్, స్వాతి, శివశంకర్ దంపతులు తమ అనుభవాలను వివరించారు. సమావేశంలో మల్కాజిగిరి ఇన్‌ఛార్జి డీసీపీ నారాయణరెడ్డి, షీటీం డీసీపీ సలీమా, అంకురం సంస్థ డైరెక్టర్ సుమిత్ర, ఎస్సీఎస్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు మమత, పలువురు కౌన్సిలర్లు, మార్గదర్శక్‌లు పాల్గొన్నారు. సెంటర్ ప్రతినిధులు,పోలీసులకు సీపీ అవార్డులు అందజేశారు. కౌన్సెలింగ్‌తో మార్పు వచ్చింది.. నా పేరు లక్ష్మి, కూలి పనులు చేస్తాను. భర్త పేరు ఉదయ్ డ్రైవర్. ఆరు నెలల క్రితం మా మధ్య చిన్న గొడవ జరిగింది. వీడిపోవాలనుకున్నాం. పోలీసులు కౌన్సెలింగ్ సెంటర్‌కు పంపించారు. అక్కడ కౌన్సిలర్ శ్యామల కౌన్సెలింగ్ చేయడం వల్ల మాలో మార్పు వచ్చింది. ఇద్దరం రాజీ పడ్డాం. ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నాం. -
భర్త వేధిస్తున్నాడు
-ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పిలిపించినందుకు.. – పోలీసు ప్రజాదర్బార్‌ను ఆశ్రయించిన నందికొట్కూరు విజయకుమారి కర్నూలు: మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌కు పిలిపించినందుకు భర్త వేధిస్తున్నాడని నందికొట్కూరుకు చెందిన విజయకుమారి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనపై ఇష్టం లేక పెళ్లి జరిగినప్పటినుంచి భర్తతో పాటు అత్త, కుటుంబ సభ్యులు అపనిందలు మోపి విడిపించుకోవాలని చూస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. హత్యాప్రయత్నం కూడా చేశారని ఎస్పీకి ఇచ్చిన వినతిపత్రంలో ఆమె పేర్కొన్నారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీస్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 94407 95567 సెల్ నంబర్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు నేరుగా వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... – తన భర్త కనిపించడం లేదని, ఒక మహిళపై అనుమానమున్నదని, ఆమె నుంచి వివరాలు రాబట్టి భర్త ఆచూకీ తెలపాలని కర్నూలు బాలాజీనగర్‌కు చెందిన హర్షియా బేగం ఎస్పీని వేడుకున్నారు. – తన తల్లి ప్రతిరోజూ మానసికంగా వేధిస్తోందని హోళగుంద గ్రామానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. – ప్రగతి మహిళా పరస్పర సహాయక సహకార పొదుపు సంఘంలో ఫిక్స్డ్ డిపాజిట్ వేయించుకుని, దానిని వాడుకున్నారని కర్నూలు నగరం ఎస్.నాగప్ప వీధికి చెందిన రసూల్, షాన్లాజ్తో పాటు మరికొంతమంది సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఎస్పీ, పోలీస్ ప్రజాదర్బార్ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. -
కాపురాల్లో చిచ్చుపెట్టుకోవద్దు
ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లో పలువురు దంపతులకు కౌన్సెలింగ్ గుంటూరు క్రైం: మనస్పర్థల కారణంగా పచ్చని కాపురాలను విచ్ఛిన్నం చేసుకోవద్దని విశ్రాంత ఏఎస్పీ తుపాకుల వెంకటేశ్వర్లు చెప్పారు. స్థానిక నగరంపాలెంలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లో శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి పలువురు భార్యాభర్తలను ఒక్కటి చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఏఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చిన్నచిన్న కారణాలతో జీవితాలను అంధకారం చేసుకుంటున్నవారు సమాజంలో ఎక్కవగా వున్నరన్నారు. ఒకరికి కోపం వస్తే మరొకరు ప్రశాంతంగా వుంటే గొడవలు లేకుండా సజావుగా కాపురం చేసుకోవచ్చని తెలిపారు. పిల్లల భవిష్యత్తును ప్రతి తల్లిదండ్రలు గుర్తుంచుకొని సర్దుకుపోవడం అలవరుచుకోవాలని హితవు పలికారు. క్షణికావేశ కారణాల వల్ల కొన్ని కాపురాల్లో సమస్యలు వస్తుంటే, మరికొన్ని కాపురాల్లో ఒకరి కంటే మరొకరు గొప్ప అనే భావనతో సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన కౌన్సెలర్లు భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాల్లో ఇద్దరికీ సర్దిచెప్పి ఒక్కటి చేయడంలో నిమగ్నమయ్యారు. మంగళగిరికి చెందిన వెంకటేశ్వరమ్మ తన భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తన భర్త కట్నం వేధింపులకు పాల్పడుతున్నాడని నెహ్రూనగర్‌కు చెందిన నాగమణి ఫిర్యాదుచేయగా.. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని చక్కదిద్దారు. కౌన్సెలర్లు రిటైర్డ్ ఏఎస్పీ ఠాగూర్, రెహమాన్, శ్రీనివాసరావు, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ పూర్ణచంద్రరావు, సీతామహాలక్ష్మి, సంజయ్, నూర్జహాన్, సుజాత, హనుమంతరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఏఎస్పీ అకస్మిక తనిఖీ.. ఫామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏఎస్పీ జె.భాస్కరరావు అకస్మికంగా తనిఖీచేశారు. కౌన్సెలింగ్ కోసం వేచివున్న బాధితులు, వారి బంధువుల వివరాలు అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌన్సెలింగ్ సెంటర్లో కౌన్సెలర్ల సూచనలు పాటిస్తూ కాపురాలను చక్కదిద్దుకోవాలని ఏఎస్పీ సూచించారు. కౌన్సెలింగ్ ద్వారా సమస్యలు పరిష్కారం కాకుంటే సంబంధిత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిజమైన నిందితులను అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేస్తామని ఏఎస్పీ భాస్కరరావు హామీఇచ్చారు.