A software professional in Bengaluru wants divorce from his wife over her obsession with cleanliness: ఈ ఇల్లాలు శుభ్రతకు బ్రాండ్ అంబాసిడరయ్యి ఉంటుంది. భర్త ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌ను చక్కగా వాషింగ్ పౌడర్ వేసిమరీ శుభ్రంగా కడిగింది. పాపం సాఫ్ట్‌వేర్ భర్త విసిగి వేసారిపోయి ఇక నా వళ్లకాదని విడాకులిప్పించమని పోలీసులను ప్రాధేయపడిన సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే..
బెంగుళూరులోని ఆర్టీ నగర్ కాలనీకి చెందిన రాహుల్, సుమనా (పేర్లు మార్చాం) 2009లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వివాహానంతరం వృత్తిరిత్యా ఇంగ్లాండ్, యూకేకు వెళ్లాడు. తిరిగొచ్చేనాటికి వాళ్లు కాపురముంటున్న ఇల్లు అద్దంలా మెరిసిపోతుంది. రాహుల్ చూసి చాలా సంతోషించాడు కూడా! సరదాగా సాగిపోతున్నవీరి కాపురంలో రెండేళ్ల తర్వాత మొదటి సంతానం కలిగింది. ఇక అప్పటి నుంచి కాపురంలో కలతలు మొదలయ్యాయి. అప్పుడే ఆమెలో ఉన్న అబ్సెసీవ్ కంపల్సీవ్ డిజార్డర్ (ఓసీడీ) భయటపడింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన సుమనా అతిశుభ్రత అలవాట్లు భర్తను విపరీతంగా విసిగించాయి.
ప్రతిరోజూ ఆఫీస్ నుంచి రాగానే బూట్లు, దుస్తులు, మొబైల్ ఫోన్‌లను శుభ్రం చేయమని భర్తను బలవంతం చేసేది. ఈ జంట తరచూ ఫామిలీ కౌన్సెలింగ్ తీసుకుంటూ ఉండేవారు. రెండో సంతానం కలిగాక పరిస్థితికాస్త మెరుగుపడినా కోవిడ్ లాక్‌డౌన్ కాలంలో ఆమె ఓసీడి సమస్య వారికాపురంలో మరోమారూ కలతలు రేపింది. ఇంట్లో ప్రతివస్తువును శానిటైజ్ చేయడం మొదలు పెట్టింది. లాక్‌డౌన్‌లో భర్త వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో అతని ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లను డిజర్జెంట్‌తో శుభ్రం చేసింది. అంతేకాదు రోజుకు ఆరు కంటే ఎక్కువ సార్లు స్నానంచేసేదట, స్నానం సబ్బును శుభ్రం చేసేందుకు మరో మరో ప్రత్యేకమైన సబ్బును కూడా వాడేదని రిపోర్టులో భర్త పేర్కొన్నాడు.
చదవండి: కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా?
ఆశ్యర్యమేమంటే.. భర్త తల్లి (అత్తగారు) మరణిస్తే భర్త, పిల్లలను ఏకంగా 30 రోజులపాటు ఇంటిబయటే ఉంచి, ప్రతిరోజూ ఇంటిని శుభ్రంచేస్తూ ఉండేది. ఐతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల్ని కూడా యూనీఫాం, బూట్లు, బ్యాక్ ప్రతిరోజూ శుభ్రం చేయవల్సిందిగా పోరు పెట్టడంతో తాజాగా ఈ విషయం వెలుగుచూసిందని కౌన్సిలర్ బీఎస్ సరస్వతి చెప్పారు.
ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన టెక్కీ తన పిల్లలతో పాటు తల్లిదండ్రుల ఇంటికి మారాడు. అతని భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయాన్ని పరిహార్‌కు బదిలీ చేశారు. నవంబర్‌లో మూడు సార్లు కౌన్సెలింగ్‌లు నిర్వహించినా ఫలితంలేకపోయింది. సుమనాకు ఓసీడీ ఉందని, తన ప్రవర్తనను సరిచేసుకోమని కౌన్సెలర్ ఆమెకు తెల్పగా.. ‘ఇది చాలా సాధారణం నాకు అలాంటిదేమీ లేదని' కొట్టిపారేసింది. అంతేకాదు భర్త తనను వదిలించుకొని మరో వివాహం చేసుకోవలనుకుంటున్నట్లు, అతనిపై వేధింపుల ఫిర్యాదును కూడా నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.
చదవండి: వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా?
Comments
Please login to add a commentAdd a comment