Hygiene practices
-
ఈ బాధలు ఎప్పటికీ తీరేను.. పాలకులు పట్టించుకోరా?
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2013 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రపంచ టాయిలెట్ దినోత్సవం’ జరుపుకుంటున్నా నేటికీ ప్రపంచంలో 350 కోట్ల ప్రజలకు టాయిలెట్ (మరుగుదొడ్డి) సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. టాయిలెట్ సౌకర్యలేమి కారణంగా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, బాలికలు... తీవ్రమైన మానసిక, ఆరోగ్య, సామాజిక సమస్యలకు గురవుతున్నారు. అనేక పాఠశాలలు, పరిశ్రమలు, ఇతర పని ప్రదేశాల్లో సరైన టాయిలెట్ సదుపాయాలు, మంచినీటి సౌకర్యం వంటివి లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 41.9 కోట్లమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారనీ, సుమారు 220 కోట్లమంది ప్రజలకు మంచినీటి సౌకర్యం లేదనీ, 11.5 కోట్లమంది కుంటలూ, చెరువులు, బావులు వంటి వాటిలోని సురక్షితం కాని నీరు తాగుతున్నారనీ గణాంకాలు చెబుతున్నాయి. సరైన మంచినీరు, శానిటేషన్, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడంతో ప్రతిరోజూ వెయ్యి మంది ఐదేళ్ల లోపు పిల్లలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక మన భారతదేశంలో 2019–21లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం 69.3 శాతం మంది మాత్రమే మరుగుదొడ్ల సౌకర్యాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నేటికీ 19.4 శాతం మంది మనదేశంలో బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. 2014 అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్‘ ప్రారంభించినా నేటికీ అందరికీ టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు.చదవండి: మలబద్ధకంతో మహాబాధ... నివారణకు ఇలా చేయండి!మనదేశం త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఆవిర్భవించాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది. కనీసం ప్రజలందరికీ టాయిలెట్ సౌకర్యం కల్పించకుండా ఇది సాధ్యంకాదు. అందుకే ప్రభుత్వాలు ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.– ఐ. ప్రసాదరావు; ఉపాధ్యాయుడు, కాకినాడ (నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవం) -
ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తన వినియోగదారులకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. నిత్యం డెలివరీ చేసే ఆహారం పరిశుభ్రత, నాణ్యతను ధ్రువపరిచేలా ‘స్విగ్గీ సీల్’ పేరిట కొత్త సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం పుణెలో ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను 650 నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.రెస్టారెంట్లలో తయారు చేస్తున్న ఆహారం శుభ్రత పట్ల అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు పరిశుభ్రత పట్ల హామీ ఇచ్చేలా ‘స్విగ్గీ సీల్’ ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, మెరుగైన ప్యాకింగ్ ప్రమాణాలు అనుసరించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌కోర్టులకు ఈ స్విగ్గీసీల్ బ్యాడ్జ్‌ను జారీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పరిశుభ్రతకు సంబంధించి రెస్టారెంట్లో ఆడిట్ నిర్వహించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తింపు పొందిన ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని చెప్పారు. రెస్టారెంట్లకు అందుబాటు ధరలోనే ఈ ఆడిట్ సేవలు ఉంటాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!వివిధ రెస్టారెంట్లలో పరిశుభ్రతకు సంబంధించి 70 లక్షల మంది యూజర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ సేవలు ప్రారంభించినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ సీల్ గుర్తింపు తీసుకున్న ఫుడ్ తయారీదారులు నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో కస్టమర్ల నుంచి సదరు రెస్టారెంట్ సేవలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు వస్తే బ్యాడ్జ్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ సేవల వల్ల వినియోగదారులకు, రెస్టారెంట్లకు మేలు జరుగుతుందని వివరించింది. -
‘కరోనా’ అలవాట్లకు గుడ్‌బై.. భారీ దెబ్బే!
Hygiene Products Business Fall After Vaccination In India: కరోనా టైంలో అలవర్చుకున్న ఆరోగ్య సూత్రాలకు, శుభ్రతా అలవాట్లకు జనాలు గుడ్‌బై చెప్పేస్తున్నారా?!. కొవిడ్ పూర్వ అలవాట్లకు మళ్లుతున్నారు. తగ్గుతున్న హైజీన్, రోగ నిరోధక ఉత్పత్తుల అమ్మకాలు, ఆయా సెగ్మెంట్స్ నుంచి కంపెనీలు తప్పుకుంటున్న వైనం పరిస్థితి అదేనని చెప్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రజల్లో పరిశుభ్రత, ఆరోగ్య సూత్రాలు పాటించడం, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రాధాన్యమివ్వడం పెరిగింది. మాస్క్‌ల మొదలు.. శానిటైజర్లు, ఫ్లోర్ క్లీనర్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారోత్పత్తులు.. తదితర అమ్మకాలు భారీగా జరిగాయి. పాత తరం ఫుడ్డు, అలవాట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ప్రజలు కొత్త(పాత) జీవన విధానానికి క్రమంగా అలవాటు పడిపోతున్నారని, రానున్న రోజుల్లో ఇదే కొనసాగిస్తారనే అభిప్రాయం ఏర్పడింది. కానీ.. కొన్నాళ్లుగా టీకాల ప్రక్రియ వేగవంతమవుతుండటం, ఎకానమీలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి జోరందుకుంటూ ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు కోవిడ్ పూర్వ అలవాట్లకు క్రమంగా మళ్లుతున్నారు. హైజీన్ (పరిశుభ్రత), ఆరోగ్య సంరక్షణ, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ ప్రొడక్టుల ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్లో తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. దీనితో గంపెడు ఆశలు పెట్టుకున్న కంపెనీలు..ఈ విభాగాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడమో లేదా ఆయా ఉత్పత్తుల తయారీని తగ్గించుకోవడమో చేస్తున్నాయి. ఈ–కామర్స్ వంటి అత్యధిక వృద్ధి అవకాశాలు ఉండే మాధ్యమాల్లో కూడా అమ్మకాలు దాదాపు సున్నా స్థాయికి తగ్గిపోవడం మరో విశేషం. కంపెనీలు వెనక్కి.. శానిటైజర్లు, క్లీనర్ల ఉత్పత్తులకు సంబంధించి కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. డాబర్, పార్లే ప్రోడక్ట్స్, ఇమామి వంటి కంపెనీలు ఇప్పటికే హ్యాండ్ శానిటైజర్ విభాగం నుంచి తప్పుకున్నాయి. ఇమామీ నెమ్మదిగా డిస్ఇన్ఫెక్టెంట్ ఫ్లోర్ క్లీనర్లు, సర్ఫేస్ శానిటైజర్లు, డిష్ వాష్ జెల్ లాంటి సెగ్మెంట్ల నుంచి కూడా తప్పుకుంటోంది. ‘మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా ఈ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగానే ఉంటాయన్న అంచనాలు అన్నీ తప్పుతున్నాయి. వినియోగదారులు నెమ్మదిగా మల్లీ కోవిడ్ పూర్వ జీవన విధానాలకు మళ్లుతున్నారు. వీటి వినియోగం దారుణంగా తగ్గిపోయింది’ అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇక చ్యవన్‌ప్రాశ్ మినహా మిగతా ఉత్పత్తుల తయారీని గణనీయంగా తగ్గించుకున్నట్లు ఇమామి సంస్థ వర్గాలు వెల్లడించాయి. హెచ్‌యూఎల్ ఆశాభావం.. ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ కూడా హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌ల విక్రయాలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించింది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కొత్త అలవాట్లను కొనసాగించగలరని ఆశాభావం వ్యక్తం చేసింది. చిరువ్యాపారులకు తప్పట్లేదు బడా కంపెనీల విషయంలోనే కాదు.. చిరువ్యాపారులకు సైతం ఈ ఇబ్బందులు తప్పట్లేదు. పండ్లు, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసుల దుకాణాలు కరోనా టైంలో చేసిన భారీ బిజినెస్‌లో ఇప్పుడు సగం కూడా చేయట్లేదు. దీంతో చాలా వరకు దుకాణాలు మూతపడుతున్నాయి. రోడ్ సైడ్ వెండర్లదీ ఇంతకన్నా దీనస్థితి. మరోవైపు మాంసం అమ్మకాలు సైతం కిందటి ఏడాదితో పోలిస్తే 30 శాతానికి పడిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. చదవండి: దేశంలో భారీగా పెరిగిన ఆదాయ అసమానతలు -
OCD Wife: నావల్లకాదు మహప్రభో.. దయచేసి విడాకులిప్పించండి!
A software professional in Bengaluru wants divorce from his wife over her obsession with cleanliness: ఈ ఇల్లాలు శుభ్రతకు బ్రాండ్ అంబాసిడరయ్యి ఉంటుంది. భర్త ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌ను చక్కగా వాషింగ్ పౌడర్ వేసిమరీ శుభ్రంగా కడిగింది. పాపం సాఫ్ట్వేర్ భర్త విసిగి వేసారిపోయి ఇక నా వళ్లకాదని విడాకులిప్పించమని పోలీసులను ప్రాధేయపడిన సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. బెంగుళూరులోని ఆర్టీ నగర్ కాలనీకి చెందిన రాహుల్, సుమనా (పేర్లు మార్చాం) 2009లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వివాహానంతరం వృత్తిరిత్యా ఇంగ్లాండ్, యూకేకు వెళ్లాడు. తిరిగొచ్చేనాటికి వాళ్లు కాపురముంటున్న ఇల్లు అద్దంలా మెరిసిపోతుంది. రాహుల్ చూసి చాలా సంతోషించాడు కూడా! సరదాగా సాగిపోతున్నవీరి కాపురంలో రెండేళ్ల తర్వాత మొదటి సంతానం కలిగింది. ఇక అప్పటి నుంచి కాపురంలో కలతలు మొదలయ్యాయి. అప్పుడే ఆమెలో ఉన్న అబ్సెసీవ్ కంపల్సీవ్ డిజార్డర్ (ఓసీడీ) భయటపడింది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన సుమనా అతిశుభ్రత అలవాట్లు భర్తను విపరీతంగా విసిగించాయి. ప్రతిరోజూ ఆఫీస్ నుంచి రాగానే బూట్లు, దుస్తులు, మొబైల్ ఫోన్లను శుభ్రం చేయమని భర్తను బలవంతం చేసేది. ఈ జంట తరచూ ఫామిలీ కౌన్సెలింగ్ తీసుకుంటూ ఉండేవారు. రెండో సంతానం కలిగాక పరిస్థితికాస్త మెరుగుపడినా కోవిడ్ లాక్డౌన్ కాలంలో ఆమె ఓసీడి సమస్య వారికాపురంలో మరోమారూ కలతలు రేపింది. ఇంట్లో ప్రతివస్తువును శానిటైజ్ చేయడం మొదలు పెట్టింది. లాక్డౌన్లో భర్త వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో అతని ల్యాప్‌టాప్, సెల్ఫోన్లను డిజర్జెంట్‌తో శుభ్రం చేసింది. అంతేకాదు రోజుకు ఆరు కంటే ఎక్కువ సార్లు స్నానంచేసేదట, స్నానం సబ్బును శుభ్రం చేసేందుకు మరో మరో ప్రత్యేకమైన సబ్బును కూడా వాడేదని రిపోర్టులో భర్త పేర్కొన్నాడు. చదవండి: కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా? ఆశ్యర్యమేమంటే.. భర్త తల్లి (అత్తగారు) మరణిస్తే భర్త, పిల్లలను ఏకంగా 30 రోజులపాటు ఇంటిబయటే ఉంచి, ప్రతిరోజూ ఇంటిని శుభ్రంచేస్తూ ఉండేది. ఐతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల్ని కూడా యూనీఫాం, బూట్లు, బ్యాక్ ప్రతిరోజూ శుభ్రం చేయవల్సిందిగా పోరు పెట్టడంతో తాజాగా ఈ విషయం వెలుగుచూసిందని కౌన్సిలర్ బీఎస్ సరస్వతి చెప్పారు. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన టెక్కీ తన పిల్లలతో పాటు తల్లిదండ్రుల ఇంటికి మారాడు. అతని భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయాన్ని పరిహార్‌కు బదిలీ చేశారు. నవంబర్‌లో మూడు సార్లు కౌన్సెలింగ్‌లు నిర్వహించినా ఫలితంలేకపోయింది. సుమనాకు ఓసీడీ ఉందని, తన ప్రవర్తనను సరిచేసుకోమని కౌన్సెలర్ ఆమెకు తెల్పగా.. ‘ఇది చాలా సాధారణం నాకు అలాంటిదేమీ లేదని' కొట్టిపారేసింది. అంతేకాదు భర్త తనను వదిలించుకొని మరో వివాహం చేసుకోవలనుకుంటున్నట్లు, అతనిపై వేధింపుల ఫిర్యాదును కూడా నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. చదవండి: వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా? -
వరల్డ్ టాయిలెట్ డే: ఇలాంటి రోజు ఒకటుందా అనుకుంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం..వినడానికి వింతగా ఉన్నా ఇలాంటి ఒక రోజు ఉంది. శానిటైజేషన్ ప్రాముఖ్యతపై అవగాహనే దీని ఉద్దేశం.2001 నవంబర్ 19న సింగపూర్‌కు చెందిన జాక్ సిమ్ నేతృత్వంలోని వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రారంభించింది. తదనంతరం నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే ప్రకటించారు ఆయన. తరువాత నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే జరపాలని అధికారికంగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఈ మేకు 2013, జూలై 24న యూఎన్ జనరల్ అసెంబ్లీ 67వ సెషన్లో 122 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం 2021 థీమ్ “టాయిలెట్లకు విలువ ఇవ్వడం”. ఈ సందర్భంగా ఆసక్తికర వీడియో మీ కోసం.. -
ఆలయాల్లో... అందుకే... జ్వాలాతోరణం
సన్నిధి అద్వైతసిద్ధికి, అమరత్వ లబ్ధికి అసలైన విలాసం కార్తికం. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలోని ఎనిమిదో మాసంగా కార్తికం మానవాళికి కొంగుబంగారం. సకల చరాచర జగత్తును వృద్ధి చేసే లక్ష్మీపతి, లయం చేసే శంకరుడు - ఏకోన్ముఖులై జీవజాలాన్ని ఆదుకునే గొప్ప సమయమిది. శివకేశవులు అభేదమనే నినాదం... పర్యావరణమే ప్రపంచానికి రక్ష అనే విధానం... ఆరోగ్య సూత్రాలు పంచివ్వగల దివ్యసందేశం.. కార్తికం నిండుగా అల్లుకున్నాయి. అందుకే ఏ మాసానికీలేని ప్రత్యేకత దీనికే సొంతం. శివకేశవులిద్దరినీ ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు కార్తికం గొప్పవరం. పున్నమి చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపాన సంచరిస్తాడు గనుకే దీనికి కార్తికమాసం అని పేరొచ్చింది. కార్తికంలో శివుడు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య ముఖాలుగా ఉదయసంధ్య నుంచి ప్రదోష కాలం వరకూ 5 రూపాలతో భక్తుల్ని అనుగ్ర హిస్తాడు - బోళాశంకరుడు. పున్నమినాడు జ్వాలాతోరణం కార్తికమాసంలో పున్నమినాడు శివాలయాలలో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహించడం ఆచారం. ఇలా మండుతున్న జ్వాలాతోరణం కింది నుంచి భక్తులు ఆనందోత్సాహాలతో పరుగు పెడతారు. ఇలా చేయడం వల్ల సకల పాపాలూ నివారణ అవుతాయని విశ్వాసం. జ్వాలాతోరణం ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం. క్షీరసాగరమథన సమయంలో ముందుగా హాలాహలం వెలువడుతుంది. లోకాలనన్నింటినీ కబళించేలా ఆ హాలాహలం శరవేగంతో దూసుకుపోతుండడంతో దానిని ఉండగా చేసుకుని శివుడు మింగబోతాడు. అయితే దాన్ని తాను మింగితే ఉదరంలో ఉన్న లోకాలన్నీ నశిస్తాయి కాబట్టి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందుకే ఆయన నీలకంఠుడు, గరళకంఠుడు అయ్యాడు. అయితే పతి ఎంత శక్తిమంతుడైనప్పటికీ, సతికి తన భర్తకు ఏమైనా హాని కలుగుతుందేమోననే బాధే కాబట్టి పార్వతీ దేవి ఆ విషం తాలూకు వేడిబాధలను చల్లార్చమని అగ్నిదేవుణ్ణి ఆరాధించింది. తన జ్వాలలు పరమేశ్వరుడికి ఏ మాత్రం బాధ కలిగించకుండా అగ్నిదేవుడు చల్లారిపోయాడు. అందుకు ప్రతీకగా పార్వతీదేవి అగ్ని స్వభావం గల కృత్తికా నక్షత్రానికి సంకేతమైన కార్తిక మాసంలో పౌర్ణమినాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసి, దాన్ని భర్తతో కలిసి తాను దాటింది. ఆ మంటల నుంచి ఉపశమనం కలిగించడానికే శివుణ్ణి మనం నీటితోనూ, పంచామృతాలతోనూ అభిషేకిస్తుంటాం. మరో కథనం మేరకు శివుడి రేతస్సును అగ్నిదేవుడు భరించలేక, గంగానదిలో పడవేస్తాడు. దాన్ని గంగ కూడా భరించలేక, ఒడ్డున ఉన్న రెల్లు గడ్డిలో వదిలింది. ఆ రేతస్సు నుంచి కుమారస్వామి జన్మించి, శరవణ భవుడయ్యాడు. శివుడికి పుట్టిన కుమారుడి చేతిలో తప్ప ఇతరులెవరి చేతిలోనూ మరణం సంభవించకుండా వరం పొందిన తారకాసురుడు ఇది తెలుసుకుని, ముందు జాగ్రత్తగా ఆ రెల్లు వనాన్ని అంతా తగులబెట్టించాడు. అయితే కుమారస్వామికి ఏ హానీ జరగలేదు. కారణజన్ముడైన కుమారస్వామిని అగ్ని ఏమీ చేయకుండా సురక్షితంగా ఉంచాడు. దానికి గుర్తుగా శివాలయాలలో కుమారస్వామి జన్మనక్షత్రమైన కృత్తికా నక్షత్రం వస్తుంది కాబట్టి కార్తిక పున్నమినాడు జ్వాలాతోరణం జరుపుతారు. జ్వాలాతోరణం నుంచి మూడుసార్లు వెళితే మహాపాపాలు హరిస్తాయనీ, గ్రహాల అననుకూలతలు తొలగి, భగవంతుని అనుగ్రహం లభిస్తుందనీ భక్తుల విశ్వాసం. గౌరీశంకరుల పల్లకి జ్వాలా తోరణం కింది నుంచి మూడుసార్లు వెళ్లిన తరువాత ఆ తోరణానికి మిగిలిన ఎండుగడ్డిని, సగం కాలిన గడ్డిని కూడా రైతులు గడ్డివాములలో కలుపుతారు. ఆ వాములలోని గడ్డిని మేసిన పశుసంతతి బాగా అభివృద్ధి చెందుతుందనీ, ధాన్యానికి లోటుండదనీ నమ్మకం. శివకేశవుల చిత్తాన్ని గెలిచే ఉపాయం కార్తికదీపం పేరిట ఈ మాసంలో వెలిగించే ప్రతీ జ్యోతీ అజ్ఞాన తిమిరాలను ఆవలకు నెట్టి, విజ్ఞాన రేఖలను విరబూయిస్తుంది. ఈమాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం మోక్షప్రదం. ముత్తయిదువలంతా కార్తిక దీపాలతో తమ కుటుంబాల్లో వెలుగు నింపే పుణ్యకాలమిది. ఈ దీపాల్ని కృత్తికా నక్షత్రానికి ప్రతీకలుగా భక్తులు తలుస్తారు. శివాలయాల్లో ఆకాశదీపాలు, కార్తిక శుక్లపక్ష పున్నమి నాటి జ్వాలాతోరణాలు దర్శిస్తే జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయని ‘కార్తిక పురాణం’ చెబుతోంది. కార్తికమాసంలో తమిళనాడులోని అరుణాచలంలో కొన్ని వందల టన్నుల ఆవునేతిలో, లేదంటే నువ్వులనూనెలో కొన్ని వందల బేళ్ల పత్తిని, నూలు వస్త్రాలను తడిపి అరుణగిరిపై వెలిగించే దీపానికే కార్తీక జ్యోతి అని పేరు. ఈ జ్యోతి కొన్ని రోజులపాటు వెలుగుతూ గిరిప్రదక్షిణ చేసేవారికి దారి చూపుతుంది. ఈ కమనీయ దృశ్యం చూడడం కోసమే చాలామంది కార్తికపున్నమికి అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తుంటారు. కార్తిక పున్నమి నాడు ఏం చేయాలి? చాంద్రమానాన్ని అనుసరించి, ఏ మాసంలోనైనా ఆ మాసపు సంపూర్ణ శక్తి, మహత్తు పున్నమి నాడు ఉంటాయి. కాబట్టి, ఆ మాసమంతా చేయలేకపోయినా, కనీసం పున్నమినాడు సదాచారాన్ని పాటిస్తే మాసమంతా చేసిన ఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు. కార్తీకమాసంలో పౌర్ణమినాడు ప్రాతఃకాలానే లేచి, సముద్రం, నది, కాలువ, మడుగు, ఏరు, బావి, లేదా అందుబాటులో ఉన్న కుళాయి నీటిలో అయినా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, దీపారాధన చేసి, పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శివాలయానికి వెళ్లి, 365 వత్తులతో దీపారాధన చేసి, రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. స్నాన, దాన, దీప, అర్చన, ఉపవాస, ఆరాధన, అభిషేక విధులనేవి దేనికది ఫలప్రదం కాబట్టి కనీసం మనం చేయగలిగే కొన్నింటినైనా ఎంచుకుని, వాటిని నిష్ఠగా ఆచరించడం వల్ల కూడా పరమేశ్వరానుగ్రహానికి నోచుకోవచ్చు. - పూర్ణిమా భాస్కర్