fan club
-
2500 అభిమాన సంఘాలు ఉన్న ఏకైక నటుడు కృష్ణ
-
కరోనా ఎఫెక్ట్ : తన ఫ్యాన్స్ కోసం సూర్య ఏం చేశాడంటే...
చెన్నై : దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర సంక్షబాన్ని మిగిల్చింది. ఉపాధి కోల్పోయి చాలా మంది రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభిమానులకు సహాయం చేసేందుకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముందుకు వచ్చారు. తరుచూ ఫ్యాన్స్‌ను కలిసే సూర్య వారి కష్టాలను చూసి చలించిపోయారు. ఈ నేపథ్యంలో తన ఫ్యాన్ క్లబ్‌కు చెందిన 250 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5000 చోప్పున మొత్తం రూ.12.5లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఇక సూర్య తన అభిమానుల పట్ల చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూర్య మంచి మనసుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నారు. గత కొద్దిరోజలు క్రితమే కరోనాపై పోరాటానికి తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన తండ్రి, సోదరుడు కార్తీతో కలిసి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ఆకాశమే నీ హద్దురా సినిమాతో భారీ హిట్టు కొట్టిన ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 35 శాతం పూర్తయింది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమా కాకుండా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడీవాసల్’, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమాలు కమిట్ అయ్యారు సూర్య. చదవండి : తాళి కట్టేముందు 'రిషి' అడిగిన ప్రశ్నకు ఇప్పటికీ ఏడిపిస్తుంటాను.. వైరల్: అభిమాని పెళ్లిలో సూర్య సందడి -
అభిమాని పెళ్లికి హాజరైన సూర్య
కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించినప్పుడే సంతృప్తి. ఎంతో కష్టపడి తీసిన సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తేనే హీరోకు సంతోషం. తనను, తన సినిమాలను ఎప్పటికీ ఆదరిస్తూ ఉండే అభిమానులంటే హీరోలకు ఎనలేని ప్రేమాభిమానాలు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ తన ఫ్యాన్స్ మీద ప్రేమను చాటుకుంటూనే ఉంటాడు. తాజాగా ఆయన ఓ అభిమాని పెళ్లికి వెళ్లి ఆశీర్వదించాడు. సూర్య వీరాభిమాని, ఆలిండియా సూర్య ఫ్యాన్ క్లబ్ సభ్యుడు హరికి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న సూర్య వివాహ సమయానికి పెళ్లి మండపానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వధువు మెడలో కట్టే తాళిబొట్టును స్వయంగా తన చేతులతో పెళ్లి కొడుక్కు అందించాడు. అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు నిల్చొని పెళ్లి తంతును దగ్గరుండి జరిపించాడు. మీ ప్రయాణం సంతోషంగా సాగాలంటూ వధూవరులను మనసారా ఆశీర్వదించాడు. కాగా బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి మరీ తన పెళ్లికి విచ్చేయడంతో సదరు అభిమాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఇక పెళ్లి మండపంలో సూర్య సందడి చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: ‘ఆకాశమే నీ హద్దురా’ రివ్యూ) ఇదిలా వుంటే సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' ఓటీటీలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకురాలిగా పని చేసింది. గౌతమ్ మీనన్ 'నవరస' షార్ట్ ఫిల్మ్‌లోనూ సూర్య ప్రధాన పాత్ర పోషించనున్నాడు. తొమ్మిది కథలుండే ఈ చిత్రాన్ని తొమ్మది మంది దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు. వీళ్లందరూ ఈ చిత్రానికి ఒక్క పైసా తీసుకోకపోవడం విశేషం. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్న ఈ చిత్ర లాభాలను ఇండస్ట్రీలోని పది వేల మంది కార్మికులకు పంచి పెట్టనున్నారు. మరోవైపు సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలను చేస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: కూతురి గురించి చెప్తూ నాగబాబు భావోద్వేగం) -
కమల్, సూర్యల బాటలో పయనిస్తా
కమల్‌హాసన్, సూర్యల బాటలో పయనిస్తానని యువ సంగీత దర్శకుడు, వర్దమాన నటుడు జీవీ ప్రకాష్‌కుమార్ అన్నారు. అతిపిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా పరిచయమైన ఈయన తనకు 25 ఏళ్లు వచ్చే సరికే 25 చిత్రాలకు సంగీతాన్ని అందించి చరిత్రకెక్కారు. ప్రస్తుతం సంగీత దర్శకుడిగా బిజీగా ఉంటూనే నిర్మాతగా మారి హీరోగానూ అవతారమెత్తిన జీవీకి అభిమానగణం ఏర్పడడంలో ఆశ్చర్యమేమీ ఉండదు. ఈయన హీరోగా నటించిన పెన్సిల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా శుక్రవారం జీవీ ప్రకాష్‌కుమార్ తన పుట్టిన రోజు వేడుకను అభిమానుల మధ్య చెన్నైలో జరుపుకున్నారు. ఈ వేదిక జీవీ అభిమాన సంఘం ఆవిర్భావ వేడుకగా కూడా మారింది. అభిమానులు పది కిలోల కేకును ఏర్పాటు చేసి ఆయన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. జీవీకి పూలకిరీటాన్ని, వెండి కత్తిని ధరింపచేసి ఆనందించారు. అలాగే చెన్నై తిరువాన్మయూర్‌లోని కేక్కుం కరంగళ్ ఆశ్రమంలోని బాలలకు, ఓటేరిలోని ఆషా నివాస్ బాయ్స్ షల్టర్ హోమ్‌లోని పిల్లలకు అన్నదానం చేశారు. తప్పుడు అభిప్రాయం ఉంది ఫ్యాన్ క్లబ్ ఆ విర్భావం గురించి జీవీ ప్రకాష్ కుమార్ వెల్లడిస్తూ తన అభిమానుల్లో అధిక శాతం యువకులేనన్నారు. వారంతా ఫేస్బుక్, ట్విట్టర్ అంటూ కాలం గడిపేస్తున్నారన్నారు. అలాంటి వారినందర్నీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ఫ్యాన్ క్లబ్ ప్రారంభించడానికి కారణమన్నారు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైనది యువశక్తి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. చిన్న వయసులోనే తనకింత పేరుప్రఖ్యాతులను ఆర్జించిపెట్టిన తమిళ ప్రజలకు తాను ఏదైనా చెయ్యాలనుకుంటున్నట్లు తెలిపారు. అభిమాన సంఘాలంటే కొంత తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. అయితే మనల్ని అభిమానిస్తున్న యువత మానవత్వంతో మంచి మంచి కార్యాలను కచ్చితంగా నిర్వహించవచ్చన్నారు. కమల్‌హాసన్, సూర్యల అభిమాన సంఘాలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. తాను వారి బాటలో అడుగులు వేయడానికి సిద్ధమైనట్లు జీవీ ప్రకాష్ కుమార్ వెల్లడించారు. -
ఇళయ రాజా ఫ్యాన్ క్లబ్‌కు విశేష స్పందన
-
త్వరలో ఇళయరాజా అభిమాన సంఘం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా త్వరలోనే తన తండ్రి పేరుమీద ఓ అభిమాన సంఘం ఏర్పాటుచేయబోతున్నాడు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సంఘం ఏర్పాటుకానుంది. ఇళయరాజా విశేషాలతో కూడిన ఓ వారపత్రిక తీసుకురావడంతో పాటు సామాజిక కార్యకలాపాలలో కూడా ఈ సంఘం పాల్గొంటుంది. ఇది ఇతర నటీనటుల అభిమాన సంఘాల్లా ఉండబోదని, విభిన్నంగా ఉంటుందని కార్తీక్ చెప్పాడు. ఆ కళాకారుడి ద్వారా అభిమానులకు చేరువ కావడమే అభిమాన సంఘాల ఉద్దేశం అవుతుందని, దాన్ని తాము సాధిస్తామని అన్నాడు. 'ఇసైజ్ఞాని' అనే పేరుతో వారపత్రికను తీసుకొస్తున్నట్లు తెలిపాడు. ఇందులో ఇళయరాజా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, ఇతర విషయాలు అన్నీ ఉంటాయి. ఇళయరాజా వారసుడిగా సంగీత దర్శకత్వంలోకి అడుగుపెట్టిన కార్తీక్, ఇప్పటికి దక్షిణాదిలోని పలు భాషల్లో 50 సినిమాలకు సంగీతం అందించాడు. -
షుమాకర్ త్వరగా కోలుకోవాలి
గ్రెనోబ్లీ (ఫ్రాన్స్): స్కీయింగ్ చేస్తూ గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులతో పాటు సహచరులు ఆకాంక్షించారు. శుక్రవారం షుమాకర్ 45వ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు డ్రైవర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుని శుభాకాంక్షల బ్యానర్లను ప్రదర్శించారు. సహచర డ్రైవర్ ఫెలిప్ మసా కూడా షుమీకి శుభాకాంక్షలు తెలిపాడు. మరోవైపు షుమాకర్ పుట్టిన ఊరు కెర్పెన్లోని అతని ఫ్యాన్ క్లబ్ మాత్రం బర్త్ డే వేడుకలకు దూరంగా ఉంది. ఇలాంటి సమయంలో వేడుకలు జరుపుకోవడం సరైంది కాదని చెప్పింది. షుమాకర్ కోలుకోవడంలో అతని వయసు, ఫిట్నెస్ బాగా ఉపయోగపడుతున్నాయని వైద్య విభాగం వెల్లడించింది. మరోవైపు యాక్సిడెంట్ జరిగిన సమయంలో షుమాకర్ విపరీతమైన వేగంతో ఉన్నాడని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.