fanatic
-
ఇరాన్లో మతోన్మాదుల రాక్షసకాండ.. విషవాయువుల ప్రయోగం
నాగరిక ప్రపంచంలో వివక్షకు తావులేదు. ఆడ, మగ అనే తేడా చూపడం నైతిక సూత్రాల ప్రకారమే కాదు, చట్ట ప్రకారమూ ముమ్మాటికీ నేరమే. బాలికలకు విద్యను నిరాకరించడం, వారికి చదువుకొనే అవకాశాలు దూరం చేయడం రాక్షసత్వమే అనిపించుకుంటుంది. ఇస్లామిక్ దేశమైన ఇరాన్లో ఇప్పుడు అచ్చంగా అలాంటిదే జరుగుతోంది. కేవలం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకొని విష వాయువుల ప్రయోగానికి పాల్పడుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరనేది అంతుచిక్కడం లేదు. మరోవైపు దుండగుల దుశ్చర్యపై బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతోందో తెలియక వణికిపోతున్నారు. సమాజంలో అశాంతి నెలకొంటోంది. విష వాయువుల ప్రయోగాల గుట్టును రట్టు చేస్తామని, దోషులను కచ్చితంగా శిక్షిస్తామని ఇరాన్ ప్రభుత్వం హామీ ఇవ్వడం కొంత ఊరట కలిగిస్తోంది. రగిలిన ఉద్యమం.. ఇరాన్లో 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. బాలికలు, యువతులపై ఆంక్షలన్నీ దాదాపుగా తొలగిపోయాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి నిర్భయంగా చదువుకుంటున్నారు. పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్ తరహా పరిస్థితులు ఇరాన్లో లేవు. బాలికల విద్యాభ్యాసాన్ని, మహిళలు ఉద్యోగాలకు వెళ్లడాన్ని తాలిబన్ ప్రభు త్వం నిషేధించడం పట్ల ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్ధతి మార్చుకోవాలని, మహిళలపై ఆంక్షలు ఎత్తివేయాలని తాలిబన్ పాలకులను హెచ్చరించింది కూడా. అలాంటిది ఇరా న్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తలపై బురఖా సక్రమంగా ధరించనందుకు 22 ఏళ్ల మహసా అమీనీ అనే యువతిని గత ఏడాది సెప్టెంబర్‌లో ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధించారు. చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. మూడు రోజులపాటు కోమాలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన అమీనీ సెప్టెంబర్ 16న మృతి చెందింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు, యువతులు, బాలికలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. నైతిక నియమావళి పేరిట తమను అణగ దొక్కుతున్నారని, గొంతు నొక్కు తున్నారని, హక్కులు హరిస్తున్నారని ఆరోపిస్తూ నెలల తరబడి ఆందోళన కొనసాగించారు. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని నినదించారు. వారి ఆందోళన మహోగ్ర ఉద్యమంగా మారింది. మహిళల ఉద్యమం పట్ల ప్రభుత్వం దిగివచ్చింది. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మహిళలంతా శాంతించాలని కోరింది. ముష్కరుల ఉద్దేశం అదేనా! మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉద్యమించడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, దిగి వచ్చేలా చేయడం మతోన్మాదులకు, పిడివాదులకు కంటగింపుగా మారింది. బాలికలను విద్యాసంస్థ లకు వెళ్లకుండా, చదువుకోకుండా చేయడమే లక్ష్యంగా కుతంత్రానికి తెరలేపారు. భయభ్రాంతులకు గురిచేసి, ఇళ్లకే పరిమితం చేయడానికి విష వాయువుల ప్రయోగం అనే దొంగదారిని ఎంచుకున్నారు. విద్యార్థినులెవరూ రాకపోతే పాఠశాలలు మూతపడతాయన్నది వారి ఉద్దేశం. ముసుగులు ధరించి, తరగతి గదుల్లోకి హఠాత్తుగా ప్రవేశించడం, విష వాయువులు వదిలి, క్షణాల్లో మాయం కావడం.. కుట్ర మొత్తం ఇలా సాగింది. జరిగింది ఇదీ.. ► ఇరాన్లో 30 ప్రావిన్స్‌లు ఉండగా, 21 ప్రావిన్స్‌ల్లో 50కి పైగా పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు జరిగాయి. ► గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటిదాకా 50కి పైగా పాఠశాలల్లో 700 మంది విద్యార్థినులు ఈ ప్రయోగాల బారినపడినట్లు ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. అయితే, ఇప్పటివరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ► బాధితుల్లో శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ► తలనొప్పి, వికారం, వాంతులు, తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపించాయి. బాధితులు కాళ్లు, కడుపులో నొప్పితో విలవిల్లాడారు. ► కొందరిలో అవయవాలు తాత్కాలికంగా మొద్దుబారిపోయినట్లు వెల్లడయ్యింది. ► దుండుగులు ప్రయో గించిన వాయువులు ► కుళ్లిన నారింజ పండ్ల వాసన, క్లోరిన్ వాసన, టాయ్లెట్లు శుభ్రం చేసుకొనే రసాయనాల వాసన వచ్చినట్లు బాధితులు చెప్పారు. ► ఫాతిమా రెజై అనే 11 బాలిక విష ప్రయోగం కారణంగా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇన్ఫెక్షన్ వల్లే మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు, చికిత్స అందించిన డాక్టర్ చెప్పారు. క్షమించరాని నేరం ఇరాన్ పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు అంతర్జాతీయంగా సంచలనాత్మకంగా మారాయి. బాలికలపై విష వాయువులు ప్రయోగించడం క్షమించరాని నేరమని ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ చెప్పారు. గుర్తుతెలియని ముష్కరులు ఉద్దేశపూర్వ కంగానే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని, వారిని బంధించి, చట్టం ముందు నిలబెడతామని, కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. బాలికలపై ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏకంగా మానవత్వంపై జరిగిన నేరమేనని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తేల్చిచెప్పారు. డ్రెస్ కోడ్ ఉల్లంఘిస్తే శిక్షించాల్సిందే ఇరాన్ న్యాయ వ్యవస్థ అధినేత ఘోలామ్హుస్సేన్ మొహసెనీ ఏజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన మహిళలను కఠినంగా శిక్షించాలని అన్నారు. మహిళలు హిజాబ్ తొలగించడం ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల, దాని విలువల పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించడంతో సమానం అవుతుందని చెప్పారు. అలాంటి అసాధారణ చర్యలకు పాల్పడేవారు శిక్షకు గురికాక తప్పదని స్పష్టం చేశారు. -
మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ‘‘దేశంలో, రాష్ట్రంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి. సంకుచిత ప్రయోజనాల కోసం మనుషుల మధ్య ముళ్లకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి.. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చు కునే నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. నాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధం లేని ఈ అవకాశవాదులు చిల్లర రాజకీ యాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీక రించి మలినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. శనివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. కార్యక్రమంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. దుష్టశక్తుల యత్నాలను తిప్పికొట్టాలి ‘‘గత ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో ప్రగతిబాటలో పయనిస్తోంది. కానీ ఇప్పుడు మతతత్వ శక్తులు బయలుదేరి తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. మనుషుల మధ్య విభజన, మతం చిచ్చు సరికాదు. ఇవి ఈ విధంగా విజృంభిస్తే దేశం, రాష్ట్రాల జీవికనే కబళిస్తాయి. ఆ దుష్టశక్తుల యత్నాలను బుద్ధి కుశలతతో తిప్పికొట్టాలి. ఏ కొంచెం ఆదమరిచినా.. ఎంత బాధాకరమైన వస్తాయనేదానికి మన గత తెలంగాణే ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటుతో తెలంగాణ 58 ఏళ్లు శాపగ్రస్త జీవితం అనుభవించింది. అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. అటువంటి వేదన మళ్లీ రాకూడదు. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప.. అశాంతితో అట్టుడికిపోవద్దు. నాటి ప్రజలంతా భాగస్వాములే.. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నాం. తెలంగాణ సమాజం ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి నాడు అవలంబించిన వ్యూహాలు, జరిపిన పోరాటాలు, నెరిపిన త్యాగాల్లో.. నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. చిరస్మరణీయులైన యోధులను తలుచుకోవడం మన కర్తవ్యం. కొమురంభీం, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, చాకలి ఐలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి దంపతులు, సురవరం ప్రతాపరెడ్డి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్‌లకు శిరసు వంచి నమస్కరిస్తున్నా.. నాడు, నేడు తెలంగాణ అగ్రగామే! తెలంగాణ దేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రం హైదరాబాద్ స్టేట్‌గా వెలుగొందింది. మిగులు నిధులతో అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని అడుగులు వేసింది. తర్వాత పడిన తప్పటడుగుల నుంచి విముక్తి పొంది 2014 జూన్ 2న తెలంగాణ తిరిగి సాకారమైంది. అప్పుడూ, ఇప్పుడూ అన్నిరంగాల్లోనూ పురోగమిస్తూ దేశానికే దారిచూపే టార్చ్‌బేరర్‌గా నిలిచింది’’. ఇదీ చదవండి: కేంద్రం తీరుతో సమాఖ్య స్ఫూర్తి క్షీణిస్తోంది -
బైక్ మోజు.. వదులుతున్న చిలుము
సిరిసిల్ల : బైక్‌పై ఉన్న మోజును సొమ్ము చేసుకునేందుకు కొందరు సులభ వాయిదాల పేరిట మనీ సర్క్యూలేషన్ స్కీంల దందా చేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాలను ఆశగా చూపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వేములవాడ, సిరిసిల్ల కేంద్రాలుగా సాగుతున్న ఈ అక్రమ దందా కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాలకూ విస్తరించింది. ఇది స్కీం సులభ వాయిదాల్లో మీకు నచ్చిన వాహనం తీసుకోండంటూ ప్రచారం చేస్తున్నారు. స్కీం కా లపరమితి 36 నెలలు. ఒక్కో విభాగంలో 300 మందికి అవకాశం ఇస్తున్నారు. సభ్యత్వ రుసుముగా రూ.200 చెల్లించాలి. సభ్యుడు ప్రతినెలా రూ.1500 చొప్పున 36 నెలలు చెల్లించాలి. ప్ర తినెల మూడో ఆదివారం ఉత్తమ సభ్యుడు కో సం డ్రా తీస్తారు. లక్కీడ్రా పేరెత్తకుండా ఉత్తమ సభ్యుడు అనే పేరుతో లక్కీలాటరీని నిర్వహిస్తున్నారు. డ్రాలో పేరొచ్చిన సభ్యుడు ఇకపై డబ్బు లు కట్టన వసరం లేదని చెబుతారు. ఇదే ఆశతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సభ్యులు చేరుతున్నారు. ఇందులో సభ్యులను చేర్చే ఏజెంట ్లకు ఒక్కో సభ్యునికి రూ.వెయ్యి చొప్పున కమీషన్ ఇస్తున్నారు. ప్రతినెలా 300 మంది సభ్యుల నుంచి రూ.1500 చొప్పున రూ.4.50 లక్షలు వసూలు చేస్తున్నారు. డ్రాలో వచ్చిన సభ్యుడికి రూ.50వేల లోపు బైక్ ఇస్తున్నారు. ఒక్కో గ్రూ పులో 300 మంది ఉండగా, ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్ గ్రూపులుగా విభజించి ఆరు గ్రూపుల్లో మొత్తం 1800 మందితో దందా సాగిస్తున్నారు. ఇలా నెలనెలా రూ.27 లక్షల వరకు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అక్రమ మార్గంలో.. ఒక సభ్యుడిని చేర్పిస్తే రూ.వెయ్యి కమీషన్ ఇస్తూ అక్రమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ముప్పై మందిని చేర్పిస్తే బైక్ ఫ్రీ అంటూ ఆఫర్ ఇస్తున్నారు. లక్షల్లో డబ్బులు రావడంతో నిర్వాహకులు సొంతంగా బైక్ షోరూంలు నిర్వహి స్తూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. మరోవైపు వా యిదా డబ్బులు చెల్లించకుండా సదరు సభ్యు డు అప్పటివరకు చెల్లించిన సొమ్ములను తిరిగి ఇవ్వబడవని స్పష్టం చేస్తున్నారు. ఏ కారణం చేతనైనా 12వ తేదీలోపల డబ్బులు చెల్లించకుంటే అదనంగా రూ.100 వసూలు చేస్తున్నా రు. లక్కీడ్రాలో పేరు వచ్చినవారు మాత్రం సం తోషంగా బైక్ తీసుకెళ్తుండగా, మిగతావారికి మాత్రం డబ్బులు చెల్లిస్తూ అదృష్టాన్ని పరీక్షిం చుకుంటున్నారు. ముందే బైక్ కావాలనుకునేవారు బండి కాగితాలు కుదువబెట్టి హైర్‌పర్చేస్ ఒప్పందంలో వాహనాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేనివారు ఆశగా చేరి మధ్యలో డబ్బులు చెల్లించలేకపోతే అప్పటివరకు కట్టిన డబ్బులు జప్తు అవుతున్నాయి. రాజకీయ అండదండలు.. ఈ అక్రమ దందా సాగిస్తున్న వారికి రాజకీయ అండదండలు మెండుగా ఉన్నాయి. కొందరు నాయకులు అండగా ఉంటూ డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రజల నుంచి నేరుగా డబ్బులు వసూలు చేసినప్పుడు ఎంటర్‌ప్రైజెస్‌ను రిజిస్ట్రర్ చేయించుకొని చట్టబద్ధంగా పోలీసు అనుమతి తీసుకొని ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం మధ్యతరగతి ప్రజల ఆశే పెట్టుబడిగా అక్రమ వ్యాపారం సాగుతోంది. నెలనెలా కొత్తకొత్త గ్రూపులను తయారు చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ఈ విషయమై ఓ నిర్వాహకుడి వివరణ కోసం ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ల్యాండ్ ఫోన్‌కు ట్రై చేస్తే నేను మెకానిక్‌ను, నాకు సంబంధం లేదంటూ పేర్కొన్నారు.