సిరిసిల్ల : బైక్‌పై ఉన్న మోజును సొమ్ము చేసుకునేందుకు కొందరు సులభ వాయిదాల పేరిట మనీ సర్క్యూలేషన్ స్కీంల దందా చేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ద్విచక్ర వాహనాలను ఆశగా చూపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వేములవాడ, సిరిసిల్ల కేంద్రాలుగా సాగుతున్న ఈ అక్రమ దందా కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకూ విస్తరించింది.
ఇది స్కీం
సులభ వాయిదాల్లో మీకు నచ్చిన వాహనం తీసుకోండంటూ ప్రచారం చేస్తున్నారు. స్కీం కా లపరమితి 36 నెలలు. ఒక్కో విభాగంలో 300 మందికి అవకాశం ఇస్తున్నారు. సభ్యత్వ రుసుముగా రూ.200 చెల్లించాలి. సభ్యుడు ప్రతినెలా రూ.1500 చొప్పున 36 నెలలు చెల్లించాలి. ప్ర తినెల మూడో ఆదివారం ఉత్తమ సభ్యుడు కో సం డ్రా తీస్తారు. లక్కీడ్రా పేరెత్తకుండా ఉత్తమ సభ్యుడు అనే పేరుతో లక్కీలాటరీని నిర్వహిస్తున్నారు. డ్రాలో పేరొచ్చిన సభ్యుడు ఇకపై డబ్బు లు కట్టన వసరం లేదని చెబుతారు.
ఇదే ఆశతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సభ్యులు చేరుతున్నారు. ఇందులో సభ్యులను చేర్చే ఏజెంట ్లకు ఒక్కో సభ్యునికి రూ.వెయ్యి చొప్పున కమీషన్ ఇస్తున్నారు. ప్రతినెలా 300 మంది సభ్యుల నుంచి రూ.1500 చొప్పున రూ.4.50 లక్షలు వసూలు చేస్తున్నారు. డ్రాలో వచ్చిన సభ్యుడికి రూ.50వేల లోపు బైక్ ఇస్తున్నారు. ఒక్కో గ్రూ పులో 300 మంది ఉండగా, ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్ గ్రూపులుగా విభజించి ఆరు గ్రూపుల్లో మొత్తం 1800 మందితో దందా సాగిస్తున్నారు. ఇలా నెలనెలా రూ.27 లక్షల వరకు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
అక్రమ మార్గంలో..
ఒక సభ్యుడిని చేర్పిస్తే రూ.వెయ్యి కమీషన్ ఇస్తూ అక్రమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ముప్పై మందిని చేర్పిస్తే బైక్ ఫ్రీ అంటూ ఆఫర్ ఇస్తున్నారు. లక్షల్లో డబ్బులు రావడంతో నిర్వాహకులు సొంతంగా బైక్ షోరూంలు నిర్వహి స్తూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. మరోవైపు వా యిదా డబ్బులు చెల్లించకుండా సదరు సభ్యు డు అప్పటివరకు చెల్లించిన సొమ్ములను తిరిగి ఇవ్వబడవని స్పష్టం చేస్తున్నారు.
ఏ కారణం చేతనైనా 12వ తేదీలోపల డబ్బులు చెల్లించకుంటే అదనంగా రూ.100 వసూలు చేస్తున్నా రు. లక్కీడ్రాలో పేరు వచ్చినవారు మాత్రం సం తోషంగా బైక్ తీసుకెళ్తుండగా, మిగతావారికి మాత్రం డబ్బులు చెల్లిస్తూ అదృష్టాన్ని పరీక్షిం చుకుంటున్నారు. ముందే బైక్ కావాలనుకునేవారు బండి కాగితాలు కుదువబెట్టి హైర్‌పర్చేస్ ఒప్పందంలో వాహనాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేనివారు ఆశగా చేరి మధ్యలో డబ్బులు చెల్లించలేకపోతే అప్పటివరకు కట్టిన డబ్బులు జప్తు అవుతున్నాయి.
రాజకీయ అండదండలు..
ఈ అక్రమ దందా సాగిస్తున్న వారికి రాజకీయ అండదండలు మెండుగా ఉన్నాయి. కొందరు నాయకులు అండగా ఉంటూ డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రజల నుంచి నేరుగా డబ్బులు వసూలు చేసినప్పుడు ఎంటర్‌ప్రైజెస్‌ను రిజిస్ట్రర్ చేయించుకొని చట్టబద్ధంగా పోలీసు అనుమతి తీసుకొని ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం మధ్యతరగతి ప్రజల ఆశే పెట్టుబడిగా అక్రమ వ్యాపారం సాగుతోంది.
నెలనెలా కొత్తకొత్త గ్రూపులను తయారు చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ఈ విషయమై ఓ నిర్వాహకుడి వివరణ కోసం ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ల్యాండ్ ఫోన్‌కు ట్రై చేస్తే నేను మెకానిక్‌ను, నాకు సంబంధం లేదంటూ పేర్కొన్నారు.
బైక్ మోజు.. వదులుతున్న చిలుము
Published Sat, Nov 15 2014 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement