Fancy dress
-
ఒక్కొక్కరూ ఒక్కో వేషం..
సత్తెనపల్లి: పట్టణంలోని నాగార్జున నగర్లో గల నారాయణ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో సోమవారం ఫ్యాన్సీ డ్రస్సు కాంపిటేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో విద్యార్థులు వివిధ రకాల వేషధారణల్లో కనిపించి ఆకట్టుకున్నారు. పాఠశాల డీన్ పవన్‌కుమార్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విజేతలను ప్రకటించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎ.కళ్యాణ్‌కుమార్, ఏవో బాషా, అకడమిక్ డీన్ సుభాని, రాజు, సులోచన, మల్లేశ్వరి, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఫ్యాన్స్‌కు దూరంగా... ఫ్యాన్సీ డ్రెస్‌లో!
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టగలరా... పాప్‌స్టార్ పోలికలతో ఉన్న ఇతను ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడంటే ఆటకు వీరాభిమానులు కూడా కాస్త ఆలోచిస్తారేమో! ఎందుకంటే ఇది దాదాపు మూడు దశాబ్దాలనాటి చిత్రం. ఇక్కడ ఉన్నది దిగ్గజ ఆటగాడు బోరిస్ బెకర్. 1985లో బెకర్ 17 ఏళ్ల వయసులో వింబుల్డన్ గెలిచి సంచనలం సృష్టించిన తర్వాత తీసిన ఫోటో ఇది. ఈ గెలుపుతో ప్రపంచవ్యాప్తంగా హాట్‌స్టార్‌గా మారిపోయిన బెకర్ అభిమానులనుంచి తప్పించుకునేందుకు అలా చేయాల్సి వచ్చింది. నాడు స్వదేశం జర్మనీలో అయితే బెకర్ అంటే ఒక రకమైన పిచ్చి, క్రేజ్! వింబుల్డన్ విజయానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతను నాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. వింబుల్డన్ విజయంతో ఎక్కడకు వెళ్లినా జనం చుట్టుముట్టడంతో ఇలా అయితే స్వేచ్ఛగా తిరగలేనని భావించి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్సీ షాప్‌కు వెళ్లి కొత్త రకం డ్రెస్‌ను, రింగుల జుట్టు గల విగ్‌ను కొనుక్కున్నాడు. అలా వేసుకున్నప్పుడు తీసుకుందే ఈ ఫోటో. అయితే ఇంతా చేసినా కొంత మంది గుర్తు పట్టేసి మీద పడిపోయారట! -
ఆటాపాటలతో హోరెత్తిన బాలోత్సవ్
హాజరైన 8 వేల మంది చిన్నారులు కొత్తగూడెం: ‘ఆటలాడగలం.. పాట పాడగలం.. చిన్నారులమైన మామదిలో సంసృ్కతీ సంప్రదాయాలు పదిలం’ అంటూ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలతో తరగిపోతున్న సంప్రదాయాలను.. ప్రకృతిపై చిన్నారులకు ఉన్న అమితమైన ప్రేమను చాటుకున్నారు. కథలు రాయగలం.. నీతి పద్యాలు చెప్పగలమని నిరూపించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరుగుతున్న జాతీయస్థాయి బాలోత్సవ్-14 పోటీల్లో రెండో రోజైన శనివారం ఆరు రాష్ట్రాల నుంచి సుమారు 8 వేల మంది చిన్నారులు హాజరయ్యారు. మొత్తం 18 విభాగాల్లో పోటీలు జరిగాయి. రెండో రోజు పోటీలలో ప్రధానంగా ఫ్యాన్సీ డ్రెస్, సీనియర్స్, జూనియర్స్ జానపద నృత్యాల పోటీలను తిలకించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. రాముడు, రావణుడు, భీముడు, ఘటోత్కచుడు వంటి వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. వక్తృత్వం తెలు గు, ఇంగ్లిష్ పోటీలు, లేఖారచన పోటీలు అందరినీ ఆకర్షించాయి. వ్యర్థ పదార్ధాలు, వస్తువులతో విద్యార్థులు అద్భుతమైన కళాఖండాలను సృష్టించి ఆకట్టుకునే పోటీ ‘వ్యర్థంతో అర్థం’లో సైతం విద్యార్థులు ప్రతిభ కనపర్చారు. ఘల్లుమన్న జానపదం.. బాలోత్సవ్ -2014లో జానపదానికి ప్రత్యేక స్థానం కల్పించి, పోటీలు నిర్వహించారు. పిల్లలు సైతం అదే తరహాలో జానపద నృత్య పోటీల్లో పాల్గొని తమ ప్రతిభకు పదును పెట్టారు. కోయిలో కోయిల.. అంటూ హన్మకొండకు చెందిన తరుణిక రావ్ చేసిన నృత్యం అందరినీ హుషారెత్తించింది. ఈలవేసిండు పోరగాడు.. అంటూ వరంగల్‌కు చెందిన చందన చేసిన నృత్యం ప్రతీ ఒక్కరిచేత ఈల వేయించింది. ఆటోరిక్షా తోలేటోడా.. అంటూ కోదాడకు చెందిన సుమన చేసిన నృత్యానికి కేరింతలు, ఈలలతో ఆహుతుల హర్షధ్వానాలు మిన్నంటాయి. నా అందం చూడు బాబయ్యో... అంటూ కోదాడకు చెందిన సాహితి చేసిన నృత్యాన్ని తిలకించేందుకు వచ్చిన విద్యార్థులు కూడా నృత్యం చేస్తూ ఆనందించారు. తొలిసారిగా పేరిణి నృత్యం...: తెలంగాణ నృత్యంగా పేరుగాంచిన పేరిణి నృత్య పోటీలను తొలిసారిగా బాలోత్సవ్‌లో పొందుపరిచారు. ఈ పోటీలో 26 మంది విద్యార్థులు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఖమ్మంకు చెందిన దత్తు, పాల్వంచకు చెందిన వరుణ్, సూర్యాపేటకు చెందిన వినయ్ ప్రదర్శించిన పేరిణి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. -
పోటీపడుతున్నారా?
ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిషన్లో తమ చిన్నారులు పాల్గొనాల ని, బహుమతులు గెలుచుకోవాలని తల్లులు తపనపడుతుంటారు. పిల్లలు ఉత్సాహంగా పాల్గొనే ఈ షోలో పేరెంట్స్ చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిషన్ అంటేనే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకే డ్రెస్ డిజైనింగ్‌లో కాంతివంతమైన రంగులను ఎంచుకోవాలి. ఫ్యాన్సీ డ్రెస్ కాస్ట్యూమ్స్ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటున్నాయి. స్కూల్ టీచర్, డిజైనర్ సలహాలతో, టైలర్‌కి చెప్పి డిజైన్ చేయించుకోవచ్చు. ఎలాంటి డ్రెస్ ఎంచుకున్నా, వేదిక మీద క్యారెక్టర్‌కు తగ్గ లుక్ ఆహూతులను ఆకట్టుకునేలా వేషధారణ ఉండాలి. కాంపిటిషన్ సమయంలో చాలామంది పిల్లలు సీతాకోకచిలుకల్లా అందమైన డ్రెస్సులు ధరించి కనువిందు చేస్తుంటారు. ఈ సమయంలో న్యాయనిర్ణేతల దృష్టి హ్యాండ్ క్రాఫ్డ్ డ్రెస్‌ల మీదే అధికం గా ఉంటుంది. సొంతంగా డిజైన్ చేసిన డ్రెస్‌కు మరో డ్రెస్ ఎప్పుడూ పోటీ కాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని డ్రెస్‌ను డిజైన్ చేసుకోవాలి. పోటీలో చురుగ్గా పిల్లలు పాల్గొన్న విధానమూ పేరక్షకులను, న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంటుంది. అందుకని వారి లేత చర్మానికి హాని కలిగించని క్లాత్, డిజైన్స్ మాత్రమే డ్రెస్సులకు ఎంచుకోవాలి. పాత్రకు తగిన విధంగా కొన్ని పెయింటింగ్ డిజైన్స్, ఎంబ్రాయిడరీ, చమ్కీ.. వంటివి డ్రెస్సుల మీద ఉపయోగిస్తుంటారు. వీటితో పాటు అలంకరణలో వాడే రంగులు, లేసులు, ఐరన్ పిన్స్ ... వంటివి శరీరానికి గుచ్చుకునేలా ఉంటే పిల్లలు చిరాకుపడతారు. ఏ డ్రెస్‌కైనా లోపల మెత్తని కాటన్ లైనింగ్ తప్పనిసరి.