ఫ్యాన్స్‌కు దూరంగా... ఫ్యాన్సీ డ్రెస్‌లో! | boris becker Fancy Dress | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌కు దూరంగా... ఫ్యాన్సీ డ్రెస్‌లో!

Published Sun, Jun 14 2015 2:41 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

ఫ్యాన్స్‌కు దూరంగా... ఫ్యాన్సీ డ్రెస్‌లో!

ఫ్యాన్స్‌కు దూరంగా... ఫ్యాన్సీ డ్రెస్‌లో!

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తిని గుర్తుపట్టగలరా... పాప్‌స్టార్ పోలికలతో ఉన్న ఇతను ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడంటే ఆటకు వీరాభిమానులు కూడా కాస్త ఆలోచిస్తారేమో! ఎందుకంటే ఇది దాదాపు మూడు దశాబ్దాలనాటి చిత్రం. ఇక్కడ ఉన్నది దిగ్గజ ఆటగాడు బోరిస్ బెకర్. 1985లో బెకర్ 17 ఏళ్ల వయసులో వింబుల్డన్ గెలిచి సంచనలం సృష్టించిన తర్వాత తీసిన ఫోటో ఇది. ఈ గెలుపుతో ప్రపంచవ్యాప్తంగా హాట్‌స్టార్‌గా మారిపోయిన బెకర్ అభిమానులనుంచి తప్పించుకునేందుకు అలా చేయాల్సి వచ్చింది.

నాడు స్వదేశం జర్మనీలో అయితే బెకర్ అంటే ఒక రకమైన పిచ్చి, క్రేజ్!  వింబుల్డన్ విజయానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతను నాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. వింబుల్డన్ విజయంతో ఎక్కడకు వెళ్లినా జనం చుట్టుముట్టడంతో ఇలా అయితే స్వేచ్ఛగా తిరగలేనని భావించి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్సీ షాప్‌కు వెళ్లి కొత్త రకం డ్రెస్‌ను, రింగుల జుట్టు గల విగ్‌ను కొనుక్కున్నాడు. అలా వేసుకున్నప్పుడు తీసుకుందే ఈ ఫోటో. అయితే ఇంతా చేసినా కొంత మంది గుర్తు పట్టేసి మీద పడిపోయారట!  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement