పిచ్చెక్కించే లుక్‌లో రోహిత్‌ శర్మ.. వింబుల్డన్‌ మ్యాచ్‌లో ప్రత్యక్షం | TEAM INDIA CAPTAIN ROHIT SHARMA STUNS AT WIMBLEDON | Sakshi
Sakshi News home page

పిచ్చెక్కించే లుక్‌లో రోహిత్‌ శర్మ.. వింబుల్డన్‌ మ్యాచ్‌లో ప్రత్యక్షం

Published Fri, Jul 12 2024 8:22 PM | Last Updated on Sat, Jul 13 2024 8:53 AM

TEAM INDIA CAPTAIN ROHIT SHARMA STUNS AT WIMBLEDON

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 వరల్డ్‌కప్‌ అనంతరం దొరికిన విరామాన్ని ఆస్వాదిస్తున్నాడు. హిట్‌మ్యాన్‌ తాజాగా ఓ వింబుల్డన్‌ మ్యాచ్‌కు హాజరయ్యాడు. కార్లోస్‌ అల్కరాజ్‌, డేనిల్‌ మెద్వెదెవ్‌ మధ్య జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన హిట్‌మ్యాన్‌ అదిరిపోయే డ్రెస్‌లో తళుక్కున మెరిశాడు. సూటు, బూటు, టై, కళ్ల జోడుతో రాయల్‌గా కనిపించిన రోహిత్‌.. వింబుల్డన్‌ రాయల్‌ బాక్స్‌లో ప్రత్యక్షమయ్యాడు. 

రోహిత్‌ రాయల్‌ లుక్‌కు సంబంధించిన ఫోటోలను వింబుల్డన్‌ తమ ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేసింది. "రాయల్‌ బాక్స్‌లో టీ20 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌" అని ఇందుకు క్యాప్షన్‌ జోడించింది. పిచ్చెక్కించే లుక్‌లో ఉన్న రోహిత్‌ ఫోటోలు సోషల్‌మీడియాలో క్షణాల్లో వైరలయ్యాయి. హిట్‌మ్యాన్‌ అభిమానులు ఈ ఫోటోలు చూసి తెగ సంబరపడిపోతున్నారు. హిట్‌మ్యాన్‌ బ్యాట్‌ నుంచి జాలువారే సిక్సర్లలా కామెంట్ల వర్షం కురుస్తుంది.

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో రోహిత్‌ సేన సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. వరల్డ్‌కప్‌ అనంతరం రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు.

ప్రస్తుతం భారత్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. నాలుగో మ్యాచ్‌ జులై 13న జరుగనుంది. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు యువ జట్టును ఎంపిక చేశారు. శుభ్‌మన్‌ గిల్‌ ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement