Farmer Day Celebrations
-
ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను
సాక్షి ప్రతినిధి, కడప: ‘పులివెందుల నియోజకవర్గంలో ఈ మేరకు చేయగలుగుతున్నామంటే దానికి దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలే కారణం. నాన్న చనిపోయినా నన్నెవరూ వదిలి పెట్టలేదు. నన్ను మీలో ఒకడిగా భావించి తోడుగా నిలబడ్డారు. పులివెందుల మాకు వదిలేయండి.. మేము చూసుకుంటాం. రాష్ట్రం వైపు కన్నుపెట్టి చూడండని మీరంతా దీవించి పంపారు. మీ దీవెనలతోనే ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మీ ఆప్యాయతకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరున హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ భావోద్వేగంతో పేర్కొన్నారు. అనంతపురం నుంచి గురువారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకున్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అదే వేదికపై పులివెందుల ప్రాంత అభివృద్ధి కోసం రూ.633.19 కోట్లతో చేపట్టిన 25 అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వివరాలు.. ఆ రోజులు గుర్తుకొచ్చాయి.. ► ఈ రోజు నాన్నగారి పుట్టిన రోజును రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవంగా నిర్వహించుకోవడం.. ఇదే రోజున మన ఊరిలో నా బంధువుల మధ్య, నా ఆత్మీయుల మధ్య, నా కుటుంబ సభ్యుల మధ్య ఈ పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ► పులివెందులలో అభివృద్ధి, వేగంగా జరుగుతున్న పనుల తీరును చూస్తే నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పనులు గుర్తుకు వచ్చాయి. నాన్న చనిపోయిన తర్వాత పులివెందుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత అంత వేగంగా పనులు జరగడం ఇప్పుడే చూస్తున్నా. ► పులివెందుల బస్టాండు సెంటర్లో రూ.76.68 కోట్లతో తలమానికం లాంటి సిటీ సెంట్రమ్ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.98.66 కోట్లతో రింగ్‌రోడ్డు, మెయిన్‌రోడ్ల బ్యూటిఫికేషన్ పనులతోపాటు మార్కెట్‌యార్డు నుంచి ఏపీ కార్ల్ వరకు ఫోర్‌లేన్‌ను వేస్తున్నాం. ► రాయలాపురం బ్రిడ్జిని ఫోర్‌లేన్ రోడ్డుకు అనుసంధానం చేస్తున్నాం. పేదలందరి కోసం నిర్మిస్తున్న జగనన్న మెగా కాలనీలో రోడ్లు, అండర్ గ్రౌండ్ తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మొదలైన సదుపాయాల కోసం రూ. 154.2 కోట్ల పనులకు ఈరోజు శంకుస్థాపన చేశాం. ఈ కాలనీకి సంబంధించి గిట్టనివారు కొందరు కోర్టులో కేసు వేశారు. నెలాఖరులోగా కోర్టు కేసు తెగిపోగానే ఆ పనులకు శ్రీకారం చుడతాం. ఇంకా అభివృద్ధి పనులు ఇలా.. ► మున్సిపల్ డిపార్టుమెంటు ద్వారా రూ.139.19 కోట్లతో మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌తోపాటు నాణ్యమైన తాగునీరు, క్లోరైడ్ సెన్సర్లు, సిటిజన్ సెంటర్ సర్వీసు, డిజిటల్ లైబ్రరీ, మెడిటేషన్ హాలు, సిటిజన్ మేనేజ్మెంట్ సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్, బయో మైనింగ్, ఐదు శ్మశాన వాటికలు. ► రూ.30 కోట్లతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 చోట్ల ఈ సెంటర్ల ఏర్పాటు. ► వాటర్ రిసోర్స్ డిపార్టుమెంట్ ద్వారా రూ.76.65 కోట్లతో ఉలిమెల్ల సరస్సు, గరండాల వంక అభివృద్ధి, వంక వెంబడి సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, మెడిటేషన్ సెంటర్. ► రాణిగారితోపు వద్ద 25 ఎకరాల్లో విద్యార్థుల కోసం బొటానికల్ గార్డెన్, బటర్ ఫ్లై పార్కు, ఇతర పార్కులు. కాలుష్యాన్ని నివారించేందుకు రూ.22.43 కోట్లతో టెరిషనరీ ట్రీట్మెంట్ ప్లాంట్, గ్రీనరీ అభివృద్ధి. ► పులివెందుల నియోజకవర్గంలో 109 గ్రామ పంచాయతీల్లోని 299 గ్రామాల్లో నిరంతరం తాగునీటి సరఫరా కోసం రూ.480 కోట్లతో వాటర్ గ్రిడ్. ఈ పనుల్లో భాగంగా 250 ఓవర్ హెడ్ ట్యాంకులు.. 2 వేల కిలోమీటర్ల మేర పైపులైన్‌తో పార్నపల్లె నీరు 44 వేల కుటుంబాలకు సరఫరా. ► ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా డాక్టర్ వైఎస్సార్ క్రికెట్ స్టేడియం నిర్మాణం. వేంపల్లెలో రూ.2 కోట్లతో రైతు బజార్ల ఏర్పాటు. 14 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ కోసం రూ.27 కోట్లతో 132 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభం. 8 రూ.500 కోట్లతో ప్రారంభించిన మెడికల్, నర్సింగ్ కళాశాలలు, ఆస్పత్రి పనులు 2023 డిసెంబర్ నాటికి పూర్తి. ఇదే తీరులో రాష్ట్ర వ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీ పనులు. ► జీఎన్ఎస్ఎస్ నుంచి గాలేరు–నగరికి సంబంధించిన ఎత్తిపోతల ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్కు నీరును లిఫ్ట్ చేసి పులివెందుల, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాలకు తరలింపు. కొన్నిచోట్ల సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల ఏర్పాటు. రూ.5,036 కోట్లతో చేపట్టే ఈ పనులు 2024 నాటికి పూర్తి.8 రూ.3,015 కోట్లతో గండికోట నుంచి 40 రోజుల్లో చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోసే పనులు 2023కి పూర్తయ్యేలా చర్యలు. ► చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎర్రబల్లి చెరువును నింపడం, వేముల మండలంలోని యురేనియం ప్రభావిత 7 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం రూ.1,113 కోట్లు ఖర్చుతో చురుగ్గా పనులు. ► రూ.17.5 కోట్లతో శాప్ ఆధ్వర్యంలో శరవేగంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు. పులివెందులలో రూ.34.2 కోట్లతో 12 ఎకరాల్లో కొత్త బస్సు డిపో నిర్మాణం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి. ► గండి వీరాంజనేయస్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులు 2023 జూన్ నాటికి పూర్తి. రూ.12.26 కోట్లతో చేపట్టిన శిల్పారామం పనులు డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశం. డిసెంబర్‌కు పైడిపాలెం వద్ద టూరిజం సౌకర్యాలు కల్పన. ► ఇడుపులపాయ వద్ద రూ.20 కోట్లతో చేపట్టిన పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ పనులు, పులివెందుల మార్కెట్ యార్డు అభివృద్ధి పనులు, రూ.13.21 కోట్లతో మండలానికి ఒకటి చొప్పున చేపట్టిన 7 గిడ్డంగుల నిర్మాణాలు డిసెంబర్‌కి పూర్తి. -
ఊరూవాడా రైతుల పండుగ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా పండుగ వాతావరణంలో ఈ వేడుకలు జరిగాయి. రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. వ్యవసాయ, సాగునీటి రంగాలకు మహానేత చేసిన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్రస్థాయి రైతు దినోత్సవం అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరగగా.. జిల్లా, నియోజకవర్గస్థాయిల్లోనే కాదు.. రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) స్థాయిల్లో కూడా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రస్థాయి వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. జిల్లాస్థాయి వేడుకల్లో మంత్రులు, నియోజకవర్గస్థాయి వేడుకల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన ఆర్బీకే భవనాలతో పాటు వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్, ఆక్వా ల్యాబ్స్, సీఏడీడీఎల్‌లు, ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ యంత్ర సేవాకేంద్రాలు (సీహెచ్‌సీలు), వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రైతుబజార్లను స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. పాడిరైతుల కోసం దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ టెలీమెడిసిన్ కాల్ సెంటర్‌ను విజయవాడలో ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న రైతుబజార్లతో పాటు ఆర్బీకేలకు అనుబంధంగా గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం, మార్కెట్ యార్డులు ఆధునికీకరణ, అదనపు సౌకర్యాల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్బీకేల వద్ద కోలాహలం వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఆర్బీకేలను పూలతో శోభాయమానంగా అలంకరించారు. ఆర్బీకేల్లో జరిగిన వేడుకల్లో పెద్దఎత్తున రైతులు పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఆర్బీకేల్లోని స్మార్ట్‌టీవీల ద్వారా ముఖ్యమంత్రి పాల్గొన్న రైతుదినోత్సవాన్ని వీక్షించారు. రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చదివి వినిపించారు. జిల్లా, మండల స్థాయిల్లో ఆదర్శరైతులను నగదు ప్రోత్సాహకాలతో ఘనంగా సత్కరించారు. ఆర్బీకేల్లో చేప, రొయ్యల ఫీడ్ పంపిణీతోపాటు పాడిరైతులకు సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు, పశువుల దాణా పంపిణీకి శ్రీకారం చుట్టారు. విశ్వవిద్యాలయాల్లో.. డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్, ఎన్జీ రంగా వ్యవసాయ, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీల ఆధ్వర్యంలో రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో జరిగిన వేడుకల్లో ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.జానకీరామ్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. గిరిజన రైతులకు జాజికాయ, మిరయం మొక్కలను పంపిణీ చేశారు. ఉద్యానపంటల్లో సేంద్రియ సాగుపద్ధతులు అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అభ్యుదయ రైతులను సత్కరించారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంలో జరిగిన వేడుకల్లో వీసీ ప్రొఫెసర్ వి.పద్మనాభరెడ్డి మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. పాడిరైతులను సత్కరించి పశువిజ్ఞాన కరదీపికను పంపిణీ చేశారు. గుంటూరులోని ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో జరిగిన వేడుకల్లో వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధనరెడ్డి మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
మా నీటిని తీసుకుంటే తప్పేంటి?
రైతు ఎక్కడున్నా రైతే. నీళ్లు ఎవరికైనా ప్రియమే. వాళ్లూ బతకాలి. మనం కూడా బతకాలి. కోటా మేరకు నీటిని వాడుకోవడంలో గొడవలు తగవు. నీటి విషయంలో రాజకీయాలు చూడలేకే మాట్లాడుతున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ, జగన్ కానీ కోరుకుంటున్నది ఒక్కటే. ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతో కూడా మాకు విభేదాలు వద్దు. పాలకుల మధ్య సఖ్యత ఉంటేనే అక్కడా, ఇక్కడా ప్రజలు చల్లగా ఉంటారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు మా రాష్ట్రానికి కేటాయించిన నీటిని మేం తీసుకోవడంలో తప్పేముందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. రైతు దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పట్టణంలోని విద్యార్థి పాఠశాలలో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పటి వరకు నీటి విషయం గురించి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడటం మొదలు పెట్టారు. తెలంగాణకు చెందిన కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారికీ, చంద్రబాబుకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా’ అంటూ వివరించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణాల కలయిక అని, దశాబ్దాల తరబడి మూడు ప్రాంతాల మధ్య నీటి కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు 298 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు.. మొత్తం 811 టీఎంసీల కేటాయింపులకు సంబంధించి 2015 జూన్ 19వ తేదీన కేంద్రం, ఏపీ, తెలంగాణ.. ముగ్గురం సంతకాలు చేశామని చెప్పారు. ఇవాళ రాయలసీమ పరిస్థితిని గమనించాలని చెబుతున్నా. పోతిరెడ్డిపాడు నుంచి కిందకు పూర్తి స్థాయిలో నీరు రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులకు పైగా నీళ్లు చేరాలన్నారు. బాగా వర్షాలు కురిసిన ఈ రెండేళ్లు మినహాయిస్తే శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగుల స్థాయిలో నీళ్లు ఉన్న రోజులు గత 20 ఏళ్లలో ఏడాదిలో 20 నుంచి 25 రోజులు కూడా లేవన్నారు. మరి అలాంటి సమయంలో పోతిరెడ్డిపాడుకు పూర్తి స్థాయిలో నీటిని తీసుకెళ్లలేని పరిస్థితి ఉంటే.. మరో వైపు పక్క రాష్ట్రంలో పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి సామర్థ్యం పెంచి 800 అడుగులలోపే నీటిని తీసుకునే వెసులుబాటు తెలంగాణాకు ఉందన్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, 800 అడుగులలోపు వారు నీటిని వాడుకుంటే తప్పులేనప్పుడు.. మేము కూడా 800 అడుగుల వద్దే మాకు కేటాయించిన నీటిని తీసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగిన వైఎస్సార్ రైతు దినోత్సవంలో ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. సభలో పాల్గొన్న ప్రజలు బూబూ ఆ రోజు మీరేం చేశారు? ‘అయ్యా.. చంద్రబాబూ.. ఇవాళ మీరు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు.. గతంలో మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువైపు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో అక్కడ పాలమూరు–రంగారెడ్డి, డిండి లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు కడుతుంటే మీరు గాడిదలు కాస్తున్నారా?’ అని సీఎం జగన్ నిలదీశారు. అప్పుడు గాడిదలు కాసిన ఈ పెద్దమనిషి ఇప్పుడు నీటి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిల్లో మనం కూడా ఇవాళ 800 అడుగుల్లో లిఫ్టు పెట్టి మనకు కేటాయించిన నీటిని మాత్రమే సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎవరి నీటిని తీసుకోవడానికి ఈ లిఫ్ట్ పెట్టడం లేదని స్పష్టం చేశారు. తమకు ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతో కూడా విభేదాలు వద్దని.. అక్కడా, ఇక్కడా ప్రజలు చల్లగా ఉండాలంటే పాలకుల మధ్య సఖ్యత ఉండాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. అందువల్లే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టలేదని, రాబోయే రోజుల్లో కూడా వేలు పెట్టనని తెలిపారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలని, సఖ్యతతో పరిష్కారాలు వెతుక్కోవాలని చెప్పారు. దేవుడి దయతో ఈ ఏడాది కూడా వర్షాలు బాగా పడాలని, రైతన్నలకు మంచి చేసే అవకాశం రావాలని ఆకాంక్షించారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఇది రైతు మేలు కోరే ప్రభుత్వం ► కోవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంలో రాష్ట్రమంతా అతలాకుతలమైన పరిస్థితులున్నా.. ఆదాయం పెను సవాలుగా మారినా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కష్టాలతో పోలిస్తే రైతులు, అక్కచెల్లెమ్మలు, పేదల కష్టాలే ఎక్కువ అని భావించి ఎక్కడా రాజీ డకుండా పని చేశాం. ► ఈ రోజు గ్రామాల రూపురేఖలను మార్చేశాం. రైతుల కోసం ఇంతగా మనసు పెట్టి ఆలోచన చేసిన సందర్భం ఎప్పుడూ, ఎక్కడా లేదు. 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో రైతన్నల కష్టాలు చూశాను.. విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ మాట ఇచ్చాను. ఆ మేరకు ఈ రెండేళ్లలో చేసి చూపించగలిగాను. ఎన్నికల ప్రణాళికలో చెప్పినవన్నీ చేస్తూ వస్తున్నాం. రైతు విప్లవానికి నాంది పలికిన నేత వైఎస్సార్ ► దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించినంత కాలం రైతుల గురించి ఆలోచించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా, వాచ, కర్మణా కోరుకున్నారు. ఈ రోజు ఆయన జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. ► ఆ రోజుల్లో ఆయన ఉచిత విద్యుత్ ఇవ్వాలని అంటే, నాన్నగారికి ముందున్న పాలకులు కరెంటు తీగలు చూపించి బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగపడతాయని అపహాస్యం చేశారు. అయితే వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేసి రాష్ట్రంలో రైతు విప్లవానికి నాంది పలికారు. ► ఇన్పుట్ సబ్సిడీ పెంపు, విత్తనాల ధరల తగ్గింపు, ఒక సంతకంతో కరెంటు బకాయిలు రద్దు.. ఇలా రైతుల కోసం ఎన్నో చేశారు. జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలు మార్చారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా రూపురేఖలను పూర్తిగా మార్చేసిన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని చెబుతున్నాను. అదే స్ఫూర్తితో ముందుకు అడుగులు ► దివంగత మహానేతను స్ఫూర్తిగా తీసుకుని ఈ రెండేళ్లూ మన పరిపాలన కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా సాగిందని సగర్వంగా పేర్కొంటున్నాను. అందుకే ఈ రెండేళ్లలో రైతుల కోసం రూ.83 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ ఒక్కరోజే రైతన్నల కోసం ఏకంగా రూ.1,570 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. ► ఎన్నికల ప్రణాళికలో రైతుల బాగోగుల కోసం పని చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగా అన్నీ చేసుకుంటూ వచ్చాం. పంట వేసే సమయంలో రైతన్నకు పెట్టుబడి ఖర్చుల వల్ల, పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల నేపథ్యంలో కష్టాలు వస్తాయి. ► పంట వేసిన తర్వాత, కరువు వల్లో, వర్షాల వల్లో పంట దెబ్బతిన్నప్పుడు రైతు తల్లిడిల్లుపోతున్న పరిస్థితి నా కళ్లారా చూశాను. వారి కష్టాలు తీర్చడంలో భాగంగా పెట్టుబడి సహాయంగా ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా రైతు భరోసా పథకం కింద రూ.13,500 చొప్పున మూడు విడతలుగా అందజేస్తున్నాం. దీనివల్ల దాదాపు 70 శాతం మంది రైతులకు పెట్టుబడి ఖర్చు ఇచ్చినట్లవుతుంది. ఈ రెండేళ్లలో 52.38 లక్షల మంది రైతన్నలకు రూ.17,029 కోట్లు ఇచ్చాం. ప్రతి అడుగులోనూ తోడుగా ఆర్బీకేలు ► రైతుల కోసం ఆలోచించాం కాబట్టి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. విత్తనం నుంచి అమ్మకం వరకూ ప్రతి సందర్భంలోనూ రైతును చేయి పట్టుకుని సహాయ సహకారాలు అందిస్తూ ఈ కేంద్రాలు తోడుగా ఉంటున్నాయి. ► ఆర్బీకేల ద్వారా రైతులకు ఎంతో మంచి జరుగుతోంది. ఇక్కడ నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను 48 గంటల్లో అందించే పరిస్థితి ఉంది. ఇదే అనంతపురం జిల్లాలో 2.33 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం ఎవరికీ కష్టం లేకుండా సులభంగా పంపిణీ చేయగలిగాం. ► వేరుశనగ విత్తనాల కోసం గతంలో పడిగాపులు పడే పరిస్థితి. మండల కేంద్రాల్లో రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. ఇదే ఆర్బీకేల ద్వారా ఈ–క్రాపింగ్ చేయిస్తున్నాం. ప్రతి పంట, విస్తీర్ణం సహా ఆర్బీకేల్లో నమోదు అవుతుంది. ఈ ఏడాది నుంచి ఫిజికల్‌గా రసీదులు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాం. ఈ–క్రాపింగ్ జరిగిన వెంటనే పంటల బీమా, వడ్డీలేని రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, చివరకు పంటల కొనుగోలు కూడా ఆర్బీకేల ద్వారా జరుగుతోంది. ► ప్రతి ఊళ్లో క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తున్నాం. ఖరీఫ్‌లో నష్టం జరిగితే.. తర్వాత ఖరీఫ్‌కల్లా పరిహారం అందుతుంది. ఏ సీజన్లో నష్టం వస్తుందో, ఆ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. గతంలో యూనిట్ రూ.3.84 ఉన్న కరెంటు రేటును రూ.1.50కే ఇచ్చి ఆక్వా రైతులకు కూడా అండగా నిలిచాం. ► ఆర్బీకేల పరిధిలో ఆ గ్రామానికి సంబంధించిన రైతులతో కూడిన వ్యవసాయ బోర్డు, మండల స్థాయిలో మరో బోర్డు, జిల్లా స్థాయిలో ఇంకో బోర్డు, రాష్ట్ర స్థాయిలో మరో బోర్డు సమావేశాలు జరుపుతున్నాయి. పంటల ప్రణాళికపై సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. ఏ సమయంలో ఏ పంట వేస్తే లాభాలు వస్తాయని క్రాప్ ప్లానింగ్ చేస్తున్నాయి. ► ఆర్బీకే స్థాయిలోనే రైతన్నలకు తక్కువ అద్దెకే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా పనిముట్లను అందజేస్తున్నాం. రైతన్నలు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్బీకేలను సంప్రదించవచ్చు. లేదంటే సీఎం యాప్ ద్వారా సమాచారం పంపినా ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధర ధర ప్రకారం ఆ పంటను కొనుగోలు చేస్తారు. ఈ రెండేళ్లలో రూ.6,600 కోట్లకుపైగా (ధాన్యం, పత్తి కొనుగోళ్లు కాకుండా) ఖర్చు పెట్టాం. కంది, బొప్పాయి, చీనీ, వేరుశనగ, చివరకు పొగాకు కూడా కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలిచాం. పాల విప్లవానికి నాంది ► కేవలం వ్యవసాయం మీదే ఆధారపడితే రైతుల ఆదాయాలు పెరగవని, అదనపు ఆదాయాలు కలిగినప్పుడే రైతులు బాగుపడతారని ఈ ప్రభుత్వం ఆలోచించింది. ఇందులో భాగంగా చేయూత, ఆసరా పథకాలు తీసుకు వచ్చాం. పాడిపశువుల కొనుగోలును ప్రోత్సహించాం. ► అమూల్‌ను తీసుకు వచ్చాం. రేటు పెంచి కొనుగోలు చేసేలా కార్యాచరణ చేశాం. ప్రస్తుతం 2 వేల చోట్ల ఈ కార్యక్రమం జరుగుతోంది. త్వరలో రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం ద్వారా పాల విప్లవానికి నాంది పలకబోతున్నాం. ఇదంతా అభివృద్ధి కాదా? అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని నేను అంటే గిట్టనివాళ్లు అంటున్నారు. బటన్ నొక్కి డబ్బులు మాత్రం ఇస్తున్నాడని అంటున్నారు. గ్రామాలకు వెళ్లి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో కనిపిస్తుంది. శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను నాడు–నేడు ద్వారా పూర్తిగా మార్చేశాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో సీబీఎస్ఈ సిలబస్‌తో బోధిస్తున్నాం. ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేశాం. అందులో అదే గ్రామం పిల్లలు 10–12 మంది పని చేస్తున్నారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్.. ఏ సేవ అయినా నేరుగా ఇంటి వద్దకే చేరుస్తున్నారు. అదే గ్రామంలో రెండడుగులు వేస్తే ఆర్బీకేలు రైతులకు అన్ని విధాలా తోడుగా ఉన్నాయి. విలేజ్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి. 91 రకాల మందులు అందులో ఉంటాయి. 24 గంటలూ పని చేస్తాయి. సిబ్బందీ అక్కడే కాపురం ఉంటారు. మరో నాలుగు అడుగులు వేస్తే.. అంగన్వాడీ కేంద్రాలు ప్రీప్రైమరీగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకో నాలుగు అడుగులు వేస్తే.. ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ తీసుకువచ్చి డిజిటల్ లైబ్రరీ కూడా అక్కడే కనిపించే పరిస్థితి. ఇదంతా అభివృద్ధి కాదా? శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను, ఆస్పత్రులను మార్చడం అభివృద్ధి అంటారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్న రైతులను చేయి పట్టుకుని నడిపిస్తూ.. కష్టాల నుంచి బయట వేసేందుకు పని చేస్తున్న ఆర్బీకేలను అభివృద్ధి అంటారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు రావడాన్ని లభివృద్ధి అంటారు. వివక్ష, అవినీతి లేకుండా.. నాకు ఓటు వేయని వారికి కూడా ఇవాళ మంచి జరుగుతోంది. నేనంటే గిట్టని వారందరికీ ఇదే చెబుతున్నా. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పండుగలా రైతు దినోత్సవం
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా రైతు దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర స్థాయి మొదలు ఆర్బీకే స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో పర్యటించి రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల అనంతరం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. రెండో రోజు శుక్రవారం బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని, ఆ తర్వాత కడప నగరంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా.. – రూ.413.76 కోట్లతో నిర్మించిన 1,898 రైతు భరోసా కేంద్రాలు – రూ.79.50 కోట్లతో ఏర్పాటైన 100 వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు, ఆక్వా ల్యాబ్‌లు, సీఏడీడీఎల్‌లు – ఆర్బీకేలకు అనుసంధానంగా రూ.96.64 కోట్లతో 611 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల (సీహెచ్‌సీలు)తో పాటు పాడిరైతుల కోసం ప్రత్యేకంగా 34 సీహెచ్‌సీల ప్రారంభోత్సవం – రూ.31.74 కోట్లతో నిర్మించిన 53 కొత్త వెటర్నరీ ఆసుపత్రుల ప్రారంభం – రూ.400.30 కోట్ల వ్యయంతో 1,262 గోదాముల నిర్మాణానికి శంకుస్థాపనలు – రూ.200 కోట్లతో పోస్ట్ హార్వెస్టింగ్ వసతుల కల్పన – రూ.212 కోట్లతో మార్కెట్ యార్డ్‌లలోనూ నాడు– నేడు పనులు – రూ.7.53 కోట్లతో విజయవాడలో పాడిరైతుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ – రూ.45 కోట్లతో 45 కొత్త రైతు బజార్లకు శంకుస్థాపనలు, 6 రైతు బజార్ల ప్రారంభోత్సవం – రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నగదు ప్రోత్సాహకాలతో రైతులకు సత్కారం 9వ తేదీ సీఎం పర్యటన ఇలా.. – 10.40 గంటలకు బద్వేలు చేరుకుంటారు. – 11.10 –12.45 వరకు బద్వేలు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. – మధ్యాహ్నం 1.45 గంటలకు కడప చేరుకుంటారు. – 2.05 గంటలకు సీపీ బ్రౌన్ గ్రంథాలయం చేరుకుని సీపీ బ్రౌన్ విగ్రహాన్ని, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. – 2.40 – 3.25 గంటలకు కడప మహావీర్ సర్కిల్లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. – 3.50– 4.20 గంటలకు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరిస్తారు. – సాయంత్రం 5 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం బయలుదేరతారు. నేడు సీఎం పర్యటన ఇలా.. ► ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు. ► 10.40 గంటలకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం 74 –ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ యూనిట్స్ పరిశీలిస్తారు. ► 11.20 గంటలకు రాయదుర్గం మార్కెట్ యార్డులో వైఎస్సార్ ఇంటిగ్రెటెడ్ అగ్రి ల్యాబ్ ప్రారంభించి, లబ్ధిదారులతో మాట్లాడతారు. ► 11.45 – 1.10 గంటలకు విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ► 2.10 గంటలకు వైఎస్సార్ జిల్లా పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. ► 2.50 – 3.20 గంటలకు పులివెందులలోని ఇంటిగ్రెటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. ► 3.55 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ చేరుకుంటారు. ► 4.10 – 4.55 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. -
రైతన్నకు అన్నీ చెబుదాం
సాక్షి, అమరావతి: ఈ నెల 8న రైతు దినోత్సవం నిర్వహిస్తున్నామని.. అలాగే 9 నుంచి ఈ నెల 23 వరకు రైతుభరోసా చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ చైతన్య యాత్రల్లో వ్యవసాయ, దాని అనుబంధ విభాగాల సిబ్బంది, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో కలిసి రైతులకు అవగాహన కలిగించాలన్నారు. అలాగే ఆర్బీకేల విధివిధానాలు, సీఎం యాప్ పనితీరు, ఇ–క్రాపింగ్ తదితర వ్యవసాయ సంబంధ అంశాలపై రైతుల్లో అవగాహన పెంచాలని ఆయన ఆదేశించారు. 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, వ్యవసాయ రంగం బాగుంటేనే వీరి జీవనోపాధి పెరుగుతుందని ఆయనన్నారు. అలాగే, వ్యవసాయ, సంబంధిత కార్యక్రమాలపై కలెక్టర్లు దృష్టి పెట్టాల్సిందిగా సీఎం సూచించారు. 94.84 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని ఖరీఫ్‌లో లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఖరీఫ్ సన్నద్ధత, ఇ–క్రాపింగ్ నమోదు, నకిలీ విత్తనాలపై నిఘా, వ్యవసాయ సలహా మండలి సమావేశాలు, కౌలు రైతులకు రుణాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. నకిలీలపై నిఘా కలెక్టర్లు, ఎస్పీలు రెండు వారాలకొకసారి కలిసి కూర్చుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకోవాలి. వీటిని పరిష్కరించడంలో ముందగుడు వేయాలి. వివిధ దుకాణాల ద్వారా అమ్ముతున్న విత్తనాల నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలించాలి. కచ్చితంగా దాడులు జరగాలి. నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకోండి. రైతులను కాపాడే అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చారు. అలాగే, ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేస్తున్నాం. వీటి నాణ్యతపై క్రమం తప్పకుండా దృష్టిపెట్టాలి. సబ్సిడీయే కాకుండా, సబ్సియేతర విత్తనాలు కొనుగోలు విషయంలోనూ రైతులు మోసపోకూడదు. సబ్సిడీయేతర విత్తనాలను కూడా ఆర్బీకేల ద్వారా అందుబాటులోకి తీసుకురండి. 38 కంపెనీలతో వ్యవసాయశాఖ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల అధికారులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇ–క్రాపింగ్‌పై పూర్తిగా ధ్యాస పెట్టండి ఇ–క్రాపింగ్‌పై పూర్తిగా ధ్యాస పెట్టండి. ఇన్పుట్ సబ్సిడీ, బీమా, సేకరణ, పంట రుణాలకు సున్నావడ్డీ వంటి వాటన్నింటికీ ఇ–క్రాపింగ్ వన్‌స్టాప్ సొల్యూషన్ అవుతుంది. రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ఆర్బీయూడీపీ) యాప్‌ను కూడా తీసుకొస్తున్నాం. రైతు దగ్గర నుంచి ఆర్బీకేల వద్ద బయోమెట్రిక్ ఇ–కేవైసీని తీసుకోవాలి. ఇ–క్రాపింగ్‌కు సంబంధించి రశీదు కూడా ఇవ్వాలి. సరైన రశీదులు ఇవ్వకపోతే రైతులకు నష్టం జరుగుతుంది. ఈ సమస్యలను తీర్చడానికే చేతికి రశీదులివ్వాలి. దీనిపై రైతు సంతకం, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంతకం ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు ఈ రశీదు ద్వారా క్లెయిమ్ చేసుకోవడానికి రైతు వద్ద అది ఒక ఆయుధంలా ఉంటుంది. జియో ఫెన్సింగ్ దీంతోపాటు మరో మార్పునూ తీసుకొస్తున్నాం. ప్రతి పంటనూ జియో ఫెన్సింగ్ చేస్తున్నాం. రైతులెవరికీ అన్యాయం జరగకుండా, నష్టం జరగకుండా ఇది తోడ్పడుతుంది. వీటికి అత్యంత ప్రాధాన్యత కల్పించాలి. ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి. సీజన్లతో సరిపెట్టకుండా.. రైతు ఏ సమయంలో పంట వేసినా దాన్ని ఇ–క్రాప్ చేయాలి. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లో ఉన్న క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిగా మార్గనిర్దేశం చేయండి. రైతు సాగుచేసిన భూమికి ఎలాంటి పత్రాలు లేకపోయినా.. ఇవ్వకపోయినా సరే ఇ–క్రాప్ చేయాలి. రైతు పంట వేస్తే చాలు.. దాన్ని ఇ–క్రాపింగ్ చేయండి. కనీసం 10 శాతం ఇ–క్రాప్ బుకింగ్స్‌ను కలెక్టర్ పర్యవేక్షించాలి. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు 20 శాతం ఇ–క్రాప్ బుకింగ్స్ తనిఖీ చేయాలి. మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు 30 శాతం ఇ–క్రాపింగ్‌ను పర్యవేక్షించాలి. రైతుకు శ్రీరామ రక్షగా ఇ–క్రాపింగ్ నిలుస్తుంది. విధిగా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు అలాగే, వ్యవసాయ సలహా మండలి సమావేశాలు తప్పనిసరిగా జరగాలి. ఖరీఫ్ సన్నద్ధత, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, క్రాప్ ప్లానింగ్ తదితర అంశాలపై కచ్చితంగా ఈ సమావేశాలు జరగాలి. ఏ రకాలు పండించాలి? ఏవి పండించకూడదన్నది నిర్ణయించాలి. మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద వరిసాగు చేపట్టకుండా చూడాలి. దీనిపై రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలి. ప్రతినెలా మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిల్లో, రెండో శుక్రవారం మండల, మూడో శుక్రవారం జిల్లా స్థాయ్లిలో ఈ సమావేశాలు కచ్చితంగా జరగాలి. అంతేకాక.. – కౌలు రైతులకూ రుణాలు అందేలా చూడాలి. ఆర్బీకేల్లో బ్యాంకుల ప్రతినిధులు ఉండేలా చూసుకోండి. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే బ్యాంకర్లతో మాట్లాడాం. – ఉపాధి హామీ పనుల విషయంలో కలెక్టర్లు అద్భుతంగా పనిచేశారు, అభినందనలు. జూన్ నెలాఖరు నాటికి 16 కోట్ల పనిదినాలను లక్ష్యంగా పెట్టుకుంటే 17 కోట్ల 18 లక్షలకు పైగా పనిదినాలు చేశారు. దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒకవైపు కోవిడ్‌తో పోరాడుతూనే మరోవైపు పేదవాడి ఉపాధికి లోటు రాకుండా చూడగలిగారు. – జగనన్న పచ్చతోరణం కింద ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 75వేల ఎకరాల్లో ప్లాంటేషన్ చేయాలన్నది లక్ష్యం. దీనిలో నాడు–నేడు కింద స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను కవర్ చేయాలి. మొక్కలు నాటే కార్యక్రమం ఆగస్టు 15 నాటికి పూర్తికావాలి. -
8న ఘనంగా రైతు దినోత్సవం
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన రాష్ట్ర స్థాయిలో మొదలు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) స్థాయి వరకు ఘనంగా రైతు దినోత్సవం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆదాయం పెంచడమే లక్ష్యంగా, రైతులకు సకల సౌకర్యాలు ఉన్న ఊరిలోనే కల్పించడమే ధ్యేయంగా రెండేళ్లుగా పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రైతు దినోత్సవం సందర్భంగా రూ.1,506.95 కోట్ల విలువగల పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రైతులకు వ్యవసాయానికి అవసరమైన విత్తనం నుంచి పంట విక్రయం వరకు చేదోడు వాదోడుగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,300 కోట్లతో 10,408 రైతు భరోసా కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటికే రూ.413.76 కోట్ల వ్యయంతో నిర్మాణాలు పూర్తయిన 1986 డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల భవనాలను సీఎం అనంతపురం జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో ప్రారంభిస్తారు. వీటితో పాటు 100 ఇంటిగ్రేటెడ్ ఆక్వా, వ్యవసాయ, పశుసంవర్థక ల్యాబ్‌లు, ఇతర ప్రాజెక్టుల ప్రారంభానికి శ్రీకారం చుట్టడంతో పాటు ఇతరత్రా ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. కాగా, 8వ తేదీ నాటికి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రెండడుగులు ముందుకే.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రైతుల కోసం ఉన్న ఊరిలోనే వ్యవసాయానికి అవసరమైన సకల వసతులు, సదుపాయాలను కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రైతుల గురించి గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆలోచించారని, ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్ ఇంకా సూక్ష్మ స్థాయిలో ఆలోచన చేసి రైతుల కోసం గ్రామాల్లోనే పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నారని చెబుతున్నాయి. వ్యవసాయానికి అవసరమైన విత్తనం మొదలు.. ఎరువులు, పురుగు మందులు నాణ్యమైనవి రైతు భరోసా కేంద్రాల నుంచే సరఫరా చేస్తున్నారని, దీంతో రైతులు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లే పని తప్పిందని వివరిస్తున్నాయి. రైతులు పండించిన పంటలను కూడా కనీస మద్దతు ధరకే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయిస్తున్నారని, రెండేళ్ల పాలనలోనే రైతులకు రైతు భరోసాతో పాటు వివిధ రంగాల ద్వారా 68 వేల కోట్ల రూపాయలకు పైగా సాయం అందించారని గుర్తు చేస్తున్నాయి. ప్రారంభోత్సవాలు వీటికే.. ►రూ.413.76 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయిన 1986 వైస్సార్ రైతు భరోసా కేంద్రాల శాశ్వత భవనాలు. ►రూ.79.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 100 వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్, ఆక్వా, సీఏడీడీఎల్ ల్యాబ్‌లు. ►రూ.96.64 కోట్లతో తొలి విడత నిర్మించిన 645 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు. ►రూ.31.74 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 53 కొత్త వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లు. ►పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రూ.7.53 కోట్ల వ్యయంతో టెలీ మెడిసిన్ కాల్ సెంటర్. రైతు భరోసా కేంద్రాల ద్వారా పశు సంవర్థక, ఆక్వా రంగాలకు ఇన్పుట్స్. ►రూ.మూడు కోట్ల వ్యయంతో ఆరు కొత్త రైతు బజార్లు. పశు–మత్స్య దర్శిని మ్యాగ్జైన్ ఆవిష్కరణ. వీటికి శంకుస్థాపనలు.. ►రూ.400.30 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాల స్థాయిలో 1,262 గోడౌన్ల నిర్మాణం. ►రూ.200.17 కోట్ల వ్యయంతో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రం. ►అనకాపల్లిలో బెల్లం, రాజమండ్రిలో అరటి, శ్రీకాకుళంలో జీడిపప్పు, చిత్తూరులో మామిడి, బాపట్లలో చిరుధాన్యాలు, వైఎస్సార్ కడపలో అరటి, హిందూపురంలో వేరుశనగ, కర్నూలులో టమాట ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం. ►రూ.212.31 కోట్ల వ్యయంతో మార్కెట్ యార్డుల్లో నాడు– నేడు కింద అభివృద్ధి పనులు. ►రూ.45 కోట్ల వ్యయంతో కొత్తగా 45 రైతు బజార్ల ఏర్పాటు. ►వైఎస్సార్ జిల్లా ఊటుకూరులో రూ.2 కోట్లతో కడక్ నాథ్ పౌల్ట్రి ఏర్పాటు. ►రూ.15 కోట్లతో నాబార్డు ప్రాజెక్టు. -
ఊరూరా అన్నదాతల వేడుక
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఊరూరా పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు ప్రత్యేకించి అన్నదాతలు రైతు శ్రేయోభిలాషి డాక్టర్ వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. సాగు రంగానికి ఆ మహానేత చేసిన సేవలను స్మరించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 10,641 డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో రోజంతా రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి. వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఆర్బీకేలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రణాళిక ప్రకారం రెండు విడతలుగా ఆర్బీకేలలో కార్యక్రమాలు జరిగాయి. మరోపక్క వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ యూనివర్సిటీలలోనూ రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించి పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయలో డాక్టర్ వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆర్బీకేలలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ► ప్రతి ఆర్బీకేలో 50 మంది రైతులు భౌతిక దూరాన్ని పాటిస్తూ వైఎస్సార్‌కు పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆర్బీకేలోని టెలివిజన్‌లో ప్రార్థనా గీతాన్ని వినిపించారు. ► జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు సంక్షేమానికి, వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, చూపిన చొరవ, రైతులకు ఇచ్చిన ప్రోత్సాహాలతో కూడిన ప్రకటనను గ్రామీణ వ్యవసాయ సహాయకులు కొన్ని చోట్ల, ఉద్యాన సహాయకులు చోట్ల చదివి వినిపించారు. ► పలుచోట్ల ఆదర్శ రైతులను సన్మానించారు. రాజశేఖరరెడ్డితో తమకున్న అనుభవాలను వారు గుర్తు చేసుకున్నారు. కియోస్క్‌లలో పేర్ల నమోదు ► కియోస్క్‌లలో నమోదు కాని రైతుల పేర్ల నమోదు జరిగింది. కియోస్క్‌ల ద్వారా రైతులు తమకు కావాల్సిన వ్యవసాయ ఉత్పాదకాలను ఎలా ఆర్డర్ చేయవచ్చో అవగాహన కల్పించారు. గ్రామ స్థాయి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికపై కూడా అక్కడక్కడా చర్చ జరిగింది. ► ఈ నెల పది నుంచి ప్రారంభమయ్యే ఇ–పంట నమోదుపై స్థానిక అధికారులు మాట్లాడారు. రైతులకు అవగాహన కల్పించారు. కొన్ని చోట్ల కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలను, వ్యవసాయ, పశు సంవర్థక రంగాలలోని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు (కేసీసీ) పంపిణీ చేశారు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించిన 9 రకాల పోస్టర్లను ఆర్బీకేలలో ప్రదర్శించారు. పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశుగ్రాస ప్రదర్శనలు జరిగాయి. ► మత్స్యశాఖ ఆక్వా బడి, ఉద్యాన శాఖ డాక్టర్ వైఎస్సార్ తోట బడి వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ► వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన కస్టమర్ హైరింగ్ సెంటర్లలో ఏయే పని ముట్లను ఉంచుతారో, వాటిని రైతులకు ఎలా అద్దెకు ఇస్తారో గ్రామ వ్యవసాయ సహాయకులు వివరించారు. తక్కువ ధరకు పని ముట్లు అద్దెకు దొరకడం పట్ల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లో.. ► ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ వర్సిటీలో రిజిస్ట్రార్ సుధాకర్ తదితరులు డాక్టర్ వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. డాక్టర్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడన్నారు. అపర భగీరథుడని కొనియాడారు. ► వైఎస్ జగన్ రైతు సంక్షేమానికి చేపడుతున్న చర్యలను వక్తలు కొనియాడారు. ► ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.జానకీరామ్ తదితరులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టినందుకు గర్విస్తున్నామన్నారు. ► కోవిడ్–19 కారణంగా రైతు దినోత్సవాన్ని జూమ్ యాప్ ద్వారా రాష్ట్రంలోని 20 పరిశోధనా కేంద్రాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. ► శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలోనూ రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. వర్సిటీ అధికారులు డాక్టర్ వైఎస్సార్‌కు ఘనంగా నివాళులు అర్పించి తమ యూనివర్సిటీ పురోభివృద్ధికి ఆయన ఎంతగానో తోడ్పడ్డారని శ్రద్ధాంజలి ఘటించారు. -
చెరకు రైతుల బకాయిలు తీర్చాలి
సాక్షి, అమరావతి: చెరకు రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.54.6 కోట్ల బకాయిలను ఈ నెల 8న రైతు దినోత్సవం సందర్భంగా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీని వల్ల దాదాపు 15 వేల మంది చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహకార చక్కెర ఫ్యాక్టరీలపై మరింతగా అధ్యయనానికి మంత్రుల బృందం ఏర్పాటు చేస్తున్నామని, ఈ బృందం లోతుగా అధ్యయనం చేసి ఆగస్టు 15వ తేదీలోగా సమగ్ర నివేదికను సమర్పించాలన్నారు. ఈ సమీక్ష వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. ► రాష్ట్రంలో సహకార చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలపై సీఎం ఆరా తీశారు. ► ప్రస్తుతం సహకార చక్కెర కర్మాగారాల వద్ద ఉన్న నిల్వలను ప్రభుత్వ పరంగా ఎంత వరకు వినియోగించగలమో ఆలోచించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీతో పాటు, ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు.. ఇలా ఎక్కడ వీలైతే అక్కడ వినియోగించుకునేలా ఆలోచించాలన్నారు. దీని వల్ల ఆ ఫ్యాక్టరీలకు కొంతైనా మేలు జరుగుతుంది. ► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రైతు బాగుంటేనే దేశం బాగు
రాజేంద్రనగర్: దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతు బిడ్డ కూడా రైతే కావాలని కోరుకునే రోజు రావాలన్నారు. రాజేంద్రనగర్‌లోని వాలంతరీలో సోమవారం జరిగిన జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం రైతులు తమ సంతానాన్ని రైతుగా చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాబోయే రెండేళ్లలో ప్రతి ఎకరాకు సాగునీరు అందనుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి, నీటి పారుదలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రయోగశాలలోని ఫలితాలు వ్యవసాయ క్షేత్రాలకు చేరాలని పేర్కొన్నారు. రెండు నెలల పాటు శిక్షణ పొంది సర్టిఫికెట్లు అందుకున్న రైతులు గ్రామాల్లో తిరుగుతూ సమగ్ర వ్యవసాయంపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, వాలంతరీ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’ జర్నలిస్టుకు అవార్డు.. సాక్షి దినపత్రిక జర్నలిస్టు పంతంగి రాంబాబుకు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అవార్డు అందించారు. రాంబాబు ‘సాక్షి’లో సాగుబడి శీర్షికపై వార్తలను అందిస్తున్నారు. అలాగే టీ న్యూస్‌లో చేను చెలక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విద్యాసాగర్‌రెడ్డికి కూడా అవార్డు అందించారు. -
గత ప్రభుత్వం వల్లే రైతులకు శిక్ష
పెనుగొండ: గత ప్రభుత్వం అస్తవ్యస్త పాలన వల్లే రైతులు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని, తక్షణం చెల్లించాల్సిన రూ.37వేల కోట్ల బకాయిల భారం మోపి ఆ సర్కారు గద్దె దిగిందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంత్యుత్సవం సందర్భంగా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా స్థానంలో జిల్లాస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్ల ప్రజలు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మిన పంటకు రైతులకు డబ్బులు అందకపోవడానికి ప్రధాన కారణం గత సర్కారు నిధులు మళ్లించడమేనని బోస్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.12,000 కోట్లు విడుదల చేస్తే, దానిలో రూ.4,800 కోట్లు పసుపు కుంకుమకు, ఇతర పథకాలకు మళ్లించిందని విమర్శించారు. ఇప్పుడు ఇదే రైతులకు శిక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సున్నా వడ్డీకి రుణాలను ఎన్టీఆర్ ప్రారంభిస్తే, వైఎస్ రాజశేఖరరెడ్డి మరింత మందికి వాటిని అందించారని గుర్తుచేశారు. ఈ పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం అమలు చేయకుండా రద్దు చేసిందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రతి పార్టీ తిరుపతి వెంకటేశ్వరస్వామి తరువాత ఎక్కువగా డాక్టర్ స్వామినాథన్ పేరునే తలుస్తుందని, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాటలు మరిచిపోతుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు లాభసాటి ధర కల్పించేందుకు వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. రైతు సంక్షేమం కోసం ఆయన ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉంటే, 45 లక్షల మంది కౌలు రైతులే ఉన్నారని, వీరి రక్షణ కోసం ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని పేర్కొన్నారు. చెరుకు సాగు పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ప్రజలు తినే ధాన్యాన్నే సాగు చేయాలి ప్రజలు తినే వరి వంగడాలనే రైతులు సాగు చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సూచించారు. తినడానికి పనికి రాని వరివంగడాల రూపకల్పన వల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. మార్టేరులో రూపొందించిన స్వర్ణ రకాన్ని జార్ఖండ్, చత్తీస్ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికంగా పండిస్తున్నారని, అటువంటి రకాలను శాస్త్రవేత్తలు రూపొందించాలని సూచించారు. ఇక నుంచి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తామని వివరించారు. దీనికోసం జిల్లానే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో రొయ్యల చెరువులవల్ల తాగునీరు కలుషితమైందని, కొత్తగా రొయ్యల చెరువులకు అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. విజ్జేశ్వరం నుంచి నేరుగా ప్రతి గ్రామానికీ గోదావరి జలాలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. జిల్లాలో సాగునీటి సమస్య మూడునాలుగు రోజుల్లో పరిష్కారమవుతుందని స్పష్టం చేశారు. రైతులు, కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందడుగు వేయాలని సూచించారు. రైతు సంక్షేమానికి కృషి చేస్తామని కలెక్టర్ రేవు ముత్యాల రాజు చెప్పారు. -
సమగ్ర విత్తన చట్టం కోసం కృషి
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్: రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం సమగ్ర విత్తన చట్టం తీసుకురావడానికి తనవంతుగా కృషి చేస్తా నని, ఈ విషయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి, ప్రధాన మంత్రితో చర్చిస్తానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీనిచ్చారు. తెలంగాణ భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని నారాయణగూడలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతుల భాగస్వామ్యంతోనే దేశం మరింత ప్రగతి సాధిస్తుందని, వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కల్తీ విత్తనాలను విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సాగునీరు, 24 గంటల కరెంట్ ఇస్తే కాలానుగుణంగా రైతులు అనేక పంటలను పండిస్తారని, దీంతో ఆత్మహత్యలనేవే ఉండవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఇప్పటి వరకు రూ.18 కోట్లు మంజూరు చేసిందన్నారు.