Federal Bank Q1
-
ఫెడరల్ బ్యాంక్ లాభం జూమ్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 601 కోట్లను తాకింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 367 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 1,605 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 3.22 శాతానికి చేరాయి. అయితే ఇతర ఆదాయం 30 శాతం క్షీణించి రూ. 453 కోట్లకు పరిమితమైంది. మరోవైపు ఫీజు ఆదాయం రూ. 255 కోట్ల నుంచి రూ. 441 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 373 కోట్లకు పరిమితమయ్యాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 444 కోట్లుకాగా.. స్థూల మొండిబకాయిలు 3.5 శాతం నుంచి 2.69 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 14.57 శాతంగా నమోదైంది. జేఎస్పీఎల్ లాభం హైజంప్ ప్రైవేట్ రంగ దిగ్గజం జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 2,771 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 14.2 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,643 కోట్ల నుంచి రూ. 13,069 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,234 కోట్ల నుంచి రూ. 10,567 కోట్లకు పెరిగాయి. కాగా.. క్యూ1లో స్టీల్ ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 1.99 మిలియన్ టన్నులకు పరిమితంకాగా.. అమ్మకాలు 1.61 ఎంటీ నుంచి 1.74 ఎంటీకి బలపడ్డాయి. పెల్లెట్ ఉత్పత్తి 2.16 ఎంటీ నుంచి 1.92 ఎంటీకి వెనకడుగు వేసింది. వీటి విక్రయాలు భారీగా క్షీణించి 0.03 ఎంటీకి చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్పీఎల్ షేరు 4.5 శాతం పతనమై రూ. 345 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐ సెక్ రికార్డ్ -ఫెడరల్ బ్యాంక్ జోరు
కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, బ్రోకింగ్, రీసెర్చ్ దిగ్గజం ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు 8 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 569కు చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. తదుపరి కొంత వెనకడుగు వేసింది. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 548 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ కౌటర్ 38 శాతం జంప్‌చేయడం విశేషం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో కంపెనీ పనితీరుపై అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నెల 22న క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలు వెల్లడించేందుకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బోర్డు సమావేశమవుతోంది. కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించాక అంటే మే 7 తదుపరి రూ. 361 స్థాయి నుంచి ఈ షేరు 53 శాతం దూసుకెళ్లడం గమనార్హం! ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు రూ. 54 సమీపానికి ఎగసింది. ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 52 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఫెడరల్ బ్యాంక్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 401 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 3,444 కోట్లను అధిగమించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.99 శాతం నుంచి 2.96 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ షేరుకి గ్లోబల్ రీసెర్చ్ సంస్థ సిటీ రూ. 74 టార్గెట్ ధరతో బయ్ రేటింగ్‌ను ప్రకటించింది. -
ఫలితాల్లో ఫెడరల్ అదుర్స్
ప్రైవేట్ రంగంలో దిగ్గజ బ్యాంకు ఫెడరల్ బ్యాంకు లాభాల్లో మార్కెట్ విశ్లేషకులు అంచనాలను అధిగమించింది. శుక్రవారం ప్రకటించిన 2016-17 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 18.3శాతం జంప్ అయి, రూ.167.3 కోట్లగా నమోదయ్యాయి. 2015-16 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ఈ లాభాలు రూ.141.4 కోట్లగా ఉన్నాయి. అదేవిధంగా నికర వడ్డీ ఆదాయంలో(అడ్వాన్సులపై వడ్డీ పొందటానికి, డిపాజిట్ లపై వడ్డీ చెల్లించడానికి తేడా) 15 శాతం ఎగిసి, ఏడాదికి ఏడాది రూ.693 కోట్లను ఆర్జించిందని కంపెనీ ప్రకటించిన ఫలితాల్లో పేర్కొంది. అయితే ఈ బ్యాంకు కేవలం రూ.156 కోట్ల నికరలాభాలను, రూ.680 కోట్ల నికర వడ్డీ ఆదాయాన్ని ఆర్జిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. అన్ని బ్యాంకులకు మాదిరిగా ఫెడరల్ బ్యాంకుకి కూడా కొంత నిరర్ధక ఆస్తుల బెడద తప్పలేదు. కానీ ఆస్తుల క్వాలిటీలో బ్యాంకు పట్టు సాధించినట్టు పేర్కొంది. జూన్ త్రైమాసికంలో స్థూల నిరర్ధక ఆస్తులు 5శాతం పెరిగి రూ.1,741 కోట్లను నమోదుచేశాయి. అదేవిధంగా నికర నిరర్థక ఆస్తులు సైతం మార్చి క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ కు 0.98 శాతం పెరిగి రూ.1.68 శాతంగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు 2016 జూన్ క్వార్టర్లో రూ.168.48కోట్లగా రికార్డు అయినట్టు కంపెనీ పేర్కొంది. 2015 జూన్ క్వార్టర్లో ఇవి రూ.153.10 కోట్లగా ఉన్నాయి. ఆస్తుల క్వాలిటీపై బ్యాంకు పట్టుసాధించినట్టు ప్రకటించడంతో, ఫెడలర్ బ్యాంకు షేర్లు ఒక్కసారిగా 5శాతం మేర జంప్ అయ్యాయి. ఫలితాల ప్రకటన అనంతరం ట్రేడింగ్ ముగిసే నాటికి బ్యాంకు షేరు 4.76 శాతం ఎగిసి, రూ.63.85గా నమోదైంది.