Film Federation of India
-
వారికి ఆ హక్కు ఉంది.. 'ఛెల్లో షో' అభ్యంతరాలపై స్పందించిన నిర్మాత
ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలను వెనక్కి నెట్టి అస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆస్కార్ వేడుకల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్'( ఉత్తమ అంతర్జాతీయ చిత్రం) విభాగంలో పోటీకి ఎంపికైంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఈ సినిమాపై చర్చ మొదలైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా ఎంపికను ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సైతం తప్పుబట్టింది. విదేశీ చిత్రానికి రీమేక్ కావడం వల్ల ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి ఎలా అర్హత సాధిస్తుందని ప్రశ్నించింది. తాజాగా వీటిపై 'ఛెల్లో షో' ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ' మేము దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మా సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఎంపిక చేసింది. దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు అదే గౌరవం. సినిమాపై ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంటుంది. అందువల్ల ఇతరుల మాటలను మేం పట్టించుకోం. ఈ దేశంలోని ప్రతి తమ అభిప్రాయం వెల్లడించేందుకు హక్కు ఉంది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అభ్యంతరం చెప్పడంలో అందులో తప్పేమీ లేదు. అది వారి అభిప్రాయం మాత్రమే' అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఛెల్లో షో గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉన్న గలాలా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు కథతో తెరకెక్కించారు. పాన్ నలిన్ దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో భవిన్ రాబరి, భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావెల్ ప్రధానపాత్రల్లో నటించారు. -
'ఛెల్లో షో' ఇండియా సినిమానే కాదు.. ఆస్కార్ ఎంపికపై అభ్యంతరం
అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో'. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఆస్కార్ వేడుకల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్'( ఉత్తమ అంతర్జాతీయ చిత్రం) విభాగంలో పోటీకి ఎంపికైంది ఈ చిత్రం. ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్‌తో పోటీపడి మరీ రేసులో నిలిచింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అందరిచూపు ఈ సినిమావైపు మళ్లింది. ఆస్కార్‌కు భారత అధికారిక ఎంట్రీగా 'ఛెల్లో షో'ను పంపాలని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు ఈ చిత్రం భారతీయ చిత్రమే కాదని ఆరోపించింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) తన నిర్ణయాన్ని పునరాలోచించాలని సూచించింది. ఛెల్లో షో హాలీవుడ్లో 'లాస్ట్ ఫిల్మ్ షో'గా విడుదలైందని తెలిపింది. విదేశీ చిత్రం కావడం వల్ల ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి ఎలా అర్హత సాధిస్తుందని ప్రశ్నించింది. ఈ అంశంపై ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రెసిడెంట్ బీఎన్ తివారీ మాట్లాడుతూ.. 'ఛెల్లో షో భారతీయ సినిమానే కాదు.. ఈ ఎంపిక సరైంది కాదు. పోటీలో ఇంకా ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ లాంటి భారతీయ చిత్రాలు ఉన్నాయి. సిద్ధార్థ్ రాయ్ కపూర్ కొనుగోలు చేసిన విదేశీ చిత్రం కావడం వల్లే జ్యూరీ ఎంపిక చేసింది. మేము ప్రస్తుత జ్యూరీని రద్దు చేయాలని కోరుతున్నాం. జ్యూరీ సభ్యుల్లో సగం మంది ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. వారిలో చాలా వరకు సినిమా చూడకుండానే ఓటేశారు.'లాస్ట్ ఫిల్మ్ షో'ఆస్కార్‌కు పంపితే, భారతీయ చిత్ర పరిశ్రమకే చెడ్డపేరు. దీనిపై కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు లేఖ రాస్తాం' అని తెలిపారు. ఆస్కార్ల ఎంపిక కమిటీకి గతంలో అధ్యక్షునిగా పనిచేసిన దర్శకుడు టీఎస్ నాగభరణ ఈ అంశంపై మాట్లాడారు. 'మార్కెటింగ్, వినోదం విలువ, మాస్, కలెక్షన్స్ మాత్రమే ప్రమాణాలు కాదు ఆస్కార్‌లో గుర్తింపు తెచ్చేది. నేను కూడా భారతీయుడ్నే. సినిమా కేవలం అనేది ప్రజాదరణ మాత్రమే కాదు. మీ హృదయాన్ని హత్తుకుంటే చాలు' అన్నారు. ఛెల్లో షో గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉన్న గలాలా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు కథతో తెరకెక్కించారు. పాన్ నలిన్ దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో భవిన్ రాబరి, భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావెల్ ప్రధానపాత్రల్లో నటించారు. -
ఆస్కార్ అవార్డ్‌ను దున్నుతుందా?
పోటీ మొదలయింది. ఆస్కార్ పరుగులోకి ఒక్కొక్కటిగా సినిమాలను ప్రకటిస్తున్నాయి ఆయా దేశాలు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న 93వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం తరఫున మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ను ఎంట్రీగా పంపుతున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. లీజో జోస్ పెలిసెరీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’. ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న దున్నపోతు చుట్టూ తిరిగే కథ ఇది. ఆ ఊరి మొత్తాన్ని ఆ దున్న ఎలా ఇబ్బంది పెట్టింది, ఈ క్రమంలో అందర్నీ ఎలా మార్చేసింది? అన్నది కథాంశం. ఈ సినిమాకు కెమెరా, ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్.. ఇలా అన్ని డిపార్ట్మెంట్లకు మంచి పేరు లభించింది. 2019, అక్టోబర్ 4న ‘జల్లికట్లు’ విడుదలైనప్పటి నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. టొరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడి ట్రోఫీను అందుకున్నారు లిజో. ప్రతీ ఏడాది మన దేశం నుంచి పంపే సినిమాయే మన రేసు గుర్రం. ఆ గుర్రం గెలుపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం. ఈ ఏడాది మన రేసు గుర్రం, ఈ దున్న. ఆస్కార్ జ్యూరీ ఎంపిక చేసే తుది జాబితాలో మన సినిమా ఉండాలని, ఆస్కార్ తీసుకురావాలని అందరం చీర్ చేద్దాం. హిప్ హిప్ బర్రె! ఎంట్రీగా పోటీపడ్డ సినిమాలు ఈ ఏడాది మన దేశం తరఫు నుంచి ఆస్కార్ ఎంట్రీగా వెళ్లేందుకు పలు సినిమాలు ఇవే అని ఓ జాబితా బయటకు వచ్చింది. ఆ జాబితాలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’, హన్సల్ మెహతా ‘చాలెంజ్’, ‘ది డిసైపుల్’, ‘మూతాన్’, ‘కామ్యాబ్’, ‘షికారా’, ‘బిట్టర్ స్వీట్’ వంటి సినిమాలు ఉన్నాయి. విశేషం ఏంటంటే ‘జల్లికట్టు’ మొత్తం దున్నపోతు చుట్టూ తిరిగినా, ఈ సినిమాలో నిజమైన దున్నను ఉపయోగించలేదు. యానిమేట్రానిక్స్ ద్వారా దున్న బొమ్మలను తయారు చేశారు. సుమారు మూడు నాలుగు దున్నలను తయారు చేశారు ఆర్ట్ డైరెక్టర్ గోకుల్ దాస్. ఒక్కో దున్నను తయారు చేయడానికి సుమారు 20 లక్షలు అయిందట. -
ఆస్కార్ బరిలో ‘విలేజ్ రాక్ స్టార్స్’
సినిమా పండగల్లో అతి పెద్ద పండగ ఆస్కార్ అవార్డుల పండగ. ప్రపంచంలో అన్ని ప్రాంతాల సినిమాలను కొలమానంగా భావించే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు. ఈ సంబరాలు జరిగేది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అయినా హడావిడి సెప్టెంబర్ అక్టోబర్ నెలల నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే.. ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీకి బరిలో నిలిచే సినిమాలను ఆయా దేశాలు అనౌన్స్ చేస్తుంటాయి. ఈసారీ స్టార్ట్ అయింది. 2018కిగాను ఇండియన్ సినిమా తరఫున ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’ అని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఒక అస్సామీ సినిమా. కొత్త దర్శకురాలు. పొదుపైన బడ్జెట్. సినిమా తీసింది చిన్న కెమెరాతోనే. మొత్తం దర్శకురాలు రీమా దాస్ స్వగ్రామమే. దాదాపు 28 సినిమాలు ఉన్న లిస్ట్‌లో, వచ్చే ఏడాది జరిగే ఆస్కార్స్‌కి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం తరఫున అఫీషియల్‌గా పంపబోతున్న సినిమా ‘విలేజ్ రాక్‌స్టార్స్’. ఈ సినిమా విషయానికి వస్తే.. రీమా దాస్ స్వీయ దర్శకత్వం వహించి, ఎడిటింగ్ చేసిన అస్సామీ చిత్రం. రీమా దాస్ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ కూడా కాదు. సెల్ఫ్ మేడ్ ఫిల్మ్ మేకర్. ఈ ఏడాది వచ్చిన నేషనల్ అవార్డ్లోనూ ‘విలేజ్ రాక్‌స్టార్స్’ సత్తా చాటింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, చైల్డ్ ఆర్టిస్ట్, ఎడిటింగ్ వంటి పలు విభాగాల్లో అవార్డ్స్ గెలుచుకుంది. అంతేనా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా మంచి ప్రశంసలు పొందింది. కథ : ‘విలేజ్ రాక్‌స్టార్స్’ సినిమా కథ చాలా సింపుల్ లైన్స్‌లో ఉంటుంది. దును అనే చిన్నారి చయాగాన్ గ్రామంలో తన తల్లి, తమ్ముడుతో కలిసి ఉంటుంది. సంతలో అమ్మకు స్నాక్స్ అమ్మే పనిలో సాయంగా ఉంటుంది. ఒకసారి గ్రామంలో జరిగిన బ్యాండ్ పర్ఫార్మెన్స్ చూసి మంత్రముగ్ధురాలైన దును ఎలా అయినా గిటార్ కొనుక్కోవాలనుకుంటుంది. అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్దైనా ఫర్వాలేదనుకుంటుంది. కామిక్ బుక్స్ చదివి తను కూడా ఓ బ్యాండ్ ఏర్పాటు చేయాలనుకుంటుంది. రూపాయి రూపాయి పోగేసుకుంటుంది. ఇంతలో వరదలు వారి పంటను పూర్తిగా నాశనం చేస్తాయి. అప్పుడు దునుకి తనకు ముఖ్యమైనదేంటో ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సందర్భంలో దును తెలివిగా ఏం చేసిందనేదే సినిమా కథ. దునుగా ప్లే చేసిన బన్నితా దాస్ ‘బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్’గా అవార్డు పొందింది. ఈ విలేజ్ రాక్‌స్టార్స్ మొత్తం దేశాన్నే తమ గ్రామం వైపు తిరిగేలా చేసింది. ఈ కథ ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. విశేషం ఏంటంటే.. అస్సామీ పరిశ్రమలో దాదాపు 29 ఏళ్ల తర్వాత జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం ఇది. ఆ రకంగా అస్సామీ పరిశ్రమకు ఈ సినిమా ఓ తీయని అనుభూతిని పంచితే, ఇప్పుడు ఏకంగా ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి ఎంపిక కావడం మరో మంచి అనుభూతిని మిగ్చిలింది. ‘‘ఓ వైపేమో ఆనంద భాష్పాలు మరోపక్క మనసు గర్వంతో నిండిపోయి ఉంది. చాలా వినయంగా ఈ ఎంట్రీని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ విషయం జీర్ణించుకోవడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు దర్శకురాలు రీమా దాస్. మరి మన దేశం తరఫున ఆస్కార్‌కు వెళ్తున్న ఈ చిత్రం ఆస్కార్ బృందాన్ని మెప్పించి, నామినేషన్ దక్కించుకుని, చివరికి అవార్డునూ సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఏది ఏమైనా అంత దాకా వెళ్లడమే గొప్ప విషయం. టైటిల్ విలేజ్ రాక్‌స్టార్స్ అయినా మొత్తం గ్లోబల్ విలేజ్ సెలబ్రేట్ చేసుకునే ఈ పండగలో తన సత్తా చాటితే మాత్రం చరిత్రే అవుతుంది. ఫారిన్ క్యాటగిరీలో హిందీ చిత్రం ‘మదర్ ఇండియా’ నుంచి ఆస్కార్ వైపు ఆశగా చూస్తున్న మనకు ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. గతేడాది ఆస్కార్‌కు అఫీషియల్ ఎంట్రీగా వెళ్లిన హిందీ చిత్రం ‘న్యూటన్’ నామినేషన్ దక్కించుకోలేకపోయింది. పోటీలో నిలిచిన 28 సినిమాలు ఆస్కార్ నామినేషన్స్‌కు భారతదేశం నుంచి ఫిల్మ్ ఫెడరేషన్ పరిగణనలోకి తీసుకున్నవి సుమారు 28 సినిమాలు ఉన్నట్టు సమాచారం. అందులో మన ‘మహానటి’, సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్’, నందితా దాస్ ‘మంటో’, సూజిత్ సర్కార్ ‘అక్టోబర్’, లవ్సోనియే’ ప్యాడ్‌మ్యాన్, తుమ్బాద్ హల్కా, పీకు వంటి సినిమాలు ఫారిన్ క్యాటగిరీలో జరిగిన రేసులో పోటీపడ్డాయి. అవార్డు ఆస్కారం ఎప్పుడు? మన దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి సినిమాలను పంపడం మొదలైంది 1957లో. అప్పటి నుంచి కేవలం మూడు సినిమాలు (మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్) మాత్రమే నామినేషన్ దక్కించుకున్నాయి. 1986లో నామినేషన్స్‌కు కె.విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ రేస్ వరకూ వెళ్లింది కానీ నామినేషన్ దక్కించుకోలేదు. అంతదాకా వెళ్లి, నామినేషన్ దక్కించుకున్నా అవార్డు వరకూ రాలేకపోతున్నాం. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి.. ఇలా మనవాళ్లు ఆస్కార్ తెచ్చినా, అది మన దేశం సినిమా కాదు. బ్రిటిష్ ఫిల్మ్ కింద వస్తుంది. రీమా దాస్ -
ఆస్కార్‌కు మన కోర్ట్
భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌కు ఏ సినిమా నామినేటవుతుంది? ఈ ఉత్కంఠకు బుధవారం తెరపడింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం నుంచి మరాఠీ చిత్రం ‘కోర్ట్’ను ‘ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఐ) నామినేట్ చేసింది. నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ నేతృత్వంలోని పదిహేడు మంది సభ్యులతో కూడిన జ్యూరీ దేశంలో వివిధ భాషల్లో రూపొందిన 30 చిత్రాలను వీక్షించింది. వీటిలో తెలుగు నుంచి ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’, హిందీ నుంచి ‘పీకే’, ‘అగ్లీ’, ‘హైదర్’, ‘మేరీ కోమ్’, తమిళం నుంచి ‘కాక్కా ముట్టయ్’ తదితర చిత్రాలున్నాయి. అన్ని చిత్రాలనూ వీక్షించిన అనంతరం మరాఠీ ‘కోర్ట్’ను ఎంపిక చేసింది. ‘‘భారతీయ న్యాయవ్యవస్థను ఈ చిత్రం కళ్లకు కట్టింది. అందుకే మన దేశం పక్షాన ఈ చిత్రాన్ని ఎంపిక చేశాం’’ అని బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అమోల్ పాలేకర్, ఎఫ్ఎఫ్ఐ సెక్రటరీ జనరల్ సుప్రాణ్ సేన్ తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాత సి. కల్యాణ్ కూడా పాల్గొన్నారు. వృద్ధ జానపద కళాకారుడి కథతో... జానపద గీతాల ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేసే ఓ వృద్ధ సామాజిక కార్యకర్త కథ - ‘కోర్ట్’. ఈ పాటలను స్ఫూర్తిగా తీసుకుని ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణతో ఆ సామాజిక కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసు నేపథ్యంలో ‘కోర్ట్’ సాగుతుంది. దర్శకుడు చైతన్యా తమ్హాణెకు ఇది తొలి చిత్రమైనప్పటికీ, ఇప్పటికే ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో సత్తా చాటుకుంది. మరి, వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఫైనల్‌గా పోటీపడే 5 చిత్రాల్లో మన ‘కోర్ట్’ నామినేషన్ దక్కించుకుంటుందో లేదో? ఒకవేళ నామినేషన్ దక్కితే, ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకుని తన సత్తా చాటుతుందో లేదో చూడాలి. -
ఆస్కార్‌కు మన ఎంట్రీగా లయర్స్ డైస్
వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో జరిగే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో పోటీ పడేందుకు మన దేశం నుంచి అధికారిక ఎంట్రీగా హిందీ చిత్రం ‘లయర్స్ డైస్’ (2013) ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన సినీ ప్రముఖులతో నియమించిన 12 మంది సినీ ప్రముఖుల జ్యూరీ మంగళవారం నాడు ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం’ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచేందుకు ‘లయ్యర్స్ డైస్’ చిత్రం అర్హమైనదంటూ జాతీయ అవార్డు చిత్రాల దర్శకుడు టి. హరిహరన్ నేతృత్వంలోని జ్యూరీ అభిప్రాయపడింది. మొత్తం 30 భారతీయ చిత్రాలను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా చూసిన జ్యూరీ చివరకు ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఎఫ్.ఎఫ్.ఐ. డిప్యూటీ సెక్రటరీ ప్రకటించారు. ఎఫ్.ఎఫ్.ఐ. ఉపాధ్యక్షుడైన సి. కల్యాణ్‌కు జ్యూరీ తన సిఫార్సును అందజేసింది. ప్రముఖ మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రయాణంలో సాగే నాటకీయ ఘట్టాలతో నడుస్తుంది. నగరాలకు వలస పోవడం వల్ల మానవ జీవితంలో తలెత్తిన సంక్షోభాన్ని ఈ చిత్రం ప్రస్తావిస్తుంది. చాలా కాలం క్రితం పని కోసం వెళ్ళిన భర్త కనిపించకుండా పోవడంతో ఓ మారుమూల గ్రామంలోని ఓ యువకురాలైన తల్లి పడే బాధలను ఈ చిత్రం ప్రతిఫలించింది. నవాజుద్దీన్ సిద్దిఖీ, గీతాంజలీ థాపా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులు (ఉత్తమ నటి - గీతాంజలీ థాపా, ఉత్తమ ఛాయాగ్రహణం - రాజీవ్ రవి) అందుకుంది. విమర్శకుల ప్రశంసలందుకొన్న ఈ చిత్రం ఆస్కార్ బరిలో మన ఆశలు పండిస్తుందా అన్నది వేచిచూడాలి.