final dividend
-
పీటీసీ ఇండియా తుది డివిడెండ్
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం పీటీసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరాని(2021–22)కి తుది డివిడెండును ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 5.80 చొప్పున చెల్లించనుంది. ఇందుకు వాటాదారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తాజాగా తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే షేరుకి రూ. 2 చొప్పున మధ్యంతర డివిడెండును చెల్లించింది. డిసెంబర్ 30న జరిగిన సాధారణ వార్షిక సమావేశంలో తుది డివిడెండుకు అనుమతి లభించినట్లు వెల్లడించింది. కాగా.. వర్ధమాన విభాగాలైన గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌లో గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలతో చేతులు కలపడం ద్వారా అవకాశాలను అన్వేషిస్తున్నట్లు కంపెనీ సీఎండీ రజిబ్ కె.మిశ్రా వివరించారు. మార్చితో ముగిసిన గతేడాది కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 552 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) రూ. 458 కోట్ల లాభం నమోదైంది. ఈ కాలంలో 9.3 శాతం అధికంగా 87.5 బిలియన్ యూనిట్ల రికార్డ్ పరిమాణాన్ని సాధించినట్లు పీటీసీ ఇండియా తెలియజేసింది. ఎన్ఎస్ఈలో పీటీసీ ఇండియా షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 85 వద్ద ముగిసింది. -
మ్యాజిక్ రిపీట్ చేసిన విశాల్..
ముంబై: ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సీఈవో విశాల్ సిక్కా తన మ్యాజిక్ ను కంటిన్యూ చేశారు. పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ వరుస లాభాలతో సంస్థను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదల చేసిన 2016 త్రైమాసికంలో రూ 3,597 కోట్లు లాభంతో మరోసారి తన సత్తాను చాటుకున్నారు. దీంతోపాటుగా భారీ డివిడెండును ప్రకటించి ఇన్వెస్టర్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. 2016 ఆర్థిక సంవత్సరానికి గాను ఈక్విటీ షేరుకు రూ 14.25 ఫైనల్ డివిడెండ్ ను , రూ .5 ముఖ విలువ గల షేరుకుగాను షేర్ హోల్డర్స్ కు 285 శాతం తుది డివిడెండ్ చెల్లించనుంది. జూన్ 20 తేదీకల్లా దీన్ని చెల్లించనున్నారు. దీనికి ముందు, గత ఏడాది అక్టోబర్ లో రూ .10 మధ్యంతర డివిడెండ్ ను ఇచ్చింది. ఈ తాజా ఫలితాల నేపథ్యంలో ఈ షేర్ కు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు.