finalised
-
మిగతా స్థానాలు 20 తర్వాతేనా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికి నాలుగు లోక్‌సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, తెలంగాణలోని మిగిలిన స్థానాలకు ఈ నెల 20వ తేదీ తర్వాతే లైన్‌క్లియర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 11 లేదా 14, 15 తేదీల్లో మరోమారు కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరిగే అవకాశమున్నా ఆ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ ఉండకపోవచ్చని సమాచారం. తదుపరి భేటీలో తెలంగాణలోని మిగిలిన అభ్యర్థిత్వాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఈ భేటీ ఈ నెల 20 తర్వాత జరిగే అవకాశముందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఇటీవల జరిగిన సీఈసీ భేటీ ఎజెండాలో రాష్ట్రం నుంచి 9 పార్లమెంటు స్థానాలపై నిర్ణయం తీసుకునే అంశం ఉన్నప్పటికీ, కేవలం ఐదింటిపైనే చర్చించారని తెలిసింది. కానీ అనూహ్యంగా నాలుగింటిని మాత్రమే ఏఐసీసీ ప్రకటించింది. చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారైందని, మలి జాబితాలో ఆమె పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఒకటి రిజర్వుడ్, మూడు జనరల్ తాజాగా ప్రకటించిన నాలుగు స్థానాల్లో ఒకటి రిజర్వుడ్ కాగా, మూడు జనరల్ స్థానాలు. ఇందులో మహబూబాబాద్ (ఎస్టీ) నుంచి పాతకాపు పోరిక బలరాం నాయక్‌కే మరోమారు అవకాశమిచ్చారు. ఇక్కడ టికెట్ కోసం విజయాబాయి, బెల్లయ్య నాయక్‌లు శతవిధాలా ప్రయత్నించినా హైకమాండ్ బలరాం నాయక్‌వైపే మొగ్గుచూపింది. ఇక మహబూబ్‌నగర్‌లో అందరూ ఊహించినట్టుగానే వంశీచంద్‌రెడ్డి పేరు ఖరారయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం మేరకు జహీరాబాద్ స్థానాన్ని బీసీ నేత సురేశ్ షెట్కార్‌కు కేటాయించారు. మరోవైపు నల్లగొండలో సీనియర్ నేత జానారెడ్డి మరోమారు తన పట్టు నిలుపుకున్నారు. ఈ స్థానం విషయంలో చాలా ఊహాగానాలు వచి్చనప్పటికీ తన కుమారుడు రఘువీర్‌కు టికెట్ ఇప్పించుకోవడంలో జానా సఫలీకృతులు కావడం గమనార్హం. ఇక, నాలుగు ప్రకటిత స్థానాల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి బీసీకి, మరొకటి ఎస్టీకి కేటాయించారు. -
హైదరాబాద్ మెట్రో విస్తరణ: ఏయే రూట్లో అంటే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు భవిష్యత్ రవాణా అవసరాలను, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని మెట్రోరైలు రెండో దశ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 70 కిలోమీటర్ల పొడవుతో రూపొందించిన ఫేజ్–2 మెట్రో రూట్‌మ్యాప్‌ను ఖరారుచేశారు. రెండో కారిడార్ పొడిగింపుతోపాటు నాలుగు కొత్త కారిడార్లు కలిపి కొత్త రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. దీనికి ప్రభుత్వపరంగా ఆమోదముద్ర పడితే తదుపరి ప్రక్రియ మొదలవుతుందని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికలను పక్కనబెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్‌ను డిజైన్ చేశారు. హైదరాబాద్ పాత నగరంతోపాటు కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేలా రూపొందించడం విశేషం. రెండోదశ మెట్రో రూట్ మ్యాప్ ఇదీ... హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కి.మీ. మేర అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకున్న రెండో కారిడార్‌ను ఫేజ్–1లో ప్రతిపాదించిన ఫలక్‌నుమా వరకు పొడిగించి, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్ వరకు మొత్తంగా 7 కి.మీ. పొడిగించాలని కొత్త రూట్‌మ్యాప్‌లో ప్రతిపాదించారు. కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు (మొత్తం 29 కి.మీ.), అలాగే మైలార్దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు వరకు (4 కి.మీ.) ఉంటుంది. కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్) వరకు (8 కి.మీ.) కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు (14 కి.మీ.) కారిడార్ 7: ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కి.మీ.) -
సెట్స్‌పై స్పష్టత దిశ గా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి ప్రవేశ పరీ క్షల (సెట్స్)పై త్వరలోనే స్పష్ట త రానుంది. ఇప్పటికే విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతాధికారులు స మీక్ష చేపట్టి వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఓ నివేదిక రూపొందించారు. సెట్స్‌కు కన్వీనర్లను నియమించే అంశాన్ని, ఏ పరీక్ష ఏ యూనివర్శిటీకి ఇవ్వాలనే దానిపై ప్రాథమిక అవగాహనకు వచ్చారు. వాస్తవానికి డిసెంబర్ చివరి నాటికే ఉమ్మడి ప్రవేశ పరీ క్షలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మ న్ను ప్రభుత్వం తొలగించడం, ఇంకా కొత్తవారి నియామకం జరగకపోవడంతో విశ్వవిద్యాల యాల అధికారులు సెట్స్‌పై తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి: ఉన్నత విద్య పరిధిలో ఎంసెట్ ప్రధానమైంది. ఆ తర్వాత ఎడ్‌సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్ ఇలా అనేక ప్రవేశ పరీక్షలుంటాయి. ఎంసెట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఎంసెట్ షెడ్యూల్‌ను ఖరారు చేసిన తర్వాత యూనివర్శిటీలు కాలేజీల అనుబంధ గుర్తింపుపై దృష్టి పెడతాయి. కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ వంటి అంశాలను పరిశీలిస్తాయి. గతంలో ఈ ప్రక్రియ ఆలస్యమవ్వడం వల్ల కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది అనేక ఇబ్బందులకు దారి తీస్తోంది. జేఈఈ కౌన్సెలింగ్ పూర్తయిన వెంటనే ఆఖరి దశ కౌన్సెలింగ్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. వీలైనంత వరకూ మే మొదటి వారంలోనూ ఎంసెట్ నిర్వహణ పూర్తి చేయాలని, సరిగ్గా 15 రోజుల్లో ఫలితాలు వెల్లడించాలనే యోచనలో ఉన్నారు. ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలోనే... ఉన్నత విద్యా మండలి చైర్మన్, సభ్యుల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్, ఇతర సెట్స్‌పై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయి. పరీక్షల నాటికి నియామకాలు జరుగుతాయనీ, అప్పటి వరకూ నిర్ణయాలన్నీ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో ఉంటాయని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి. కాగా, త్వరలోనే విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే అధికారులు శాఖాపరమైన పూర్తి సమాచారంతో సిద్ధమయ్యారు. సీఎం సమీక్షా సమావేశంలో సెట్స్‌పై స్పష్టత వస్తుందనీ, వచ్చే వారంలో సెట్స్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖరారు!?
New Chief Ministers: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాలను నమోదు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లను కూడా బీజేపీ హైకమాండ్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఖరారైన ముఖ్యమంత్రుల పేర్లను బీజేపీ ఇంకా వెల్లడించలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బీజేపీ రికార్డ్ స్థాయిలో సీట్లు గెలుపొందింది. మధ్యప్రదేశ్‌లో 163 సీట్లు, రాజస్థాన్‌లో 115 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 54 సీట్లు గెలిచి కాషాయ పార్టీ చరిత్ర సృష్టించింది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సీఎం అభ్యర్థులు వీళ్లే..? మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని ప్రముఖ నాయకులలో ఒకరిగా ఉన్నారు. అక్కడ బీజేపీ అఖండ విజయంలో ఆయన పాత్ర గణనీయంగా ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే మరోసారి కొనసాగించే అవకాశం ఉంది. బుద్ని నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శివరాజ్ చౌహాన్.. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ మస్టల్ శర్మపై 1,04,974 ఓట్ల బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం 2006 నుంచి ఆయనకు కంచుకోటగా ఉంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోనూ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు మరోసారి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక్కడ బీజేపీ సీనియర్ నాయకుడు, అల్వార్ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ యోగి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేలలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. -
కొత్త ప్రయాణం ఆరంభం
రైలు ప్రయాణం మొదలు పెట్టారు విజయ్ సేతుపతి. ఆయనతో జర్నీ షేర్ చేసుకుంటున్నారు డింపుల్ హయతి. విజయ్ సేతుపతి హీరోగా డింపుల్ హయతి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌కు ‘ట్రైన్’ టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం ప్రారంభమైంది. రైలు ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషన్, లుక్‌ను కొత్తగా డిజైన్ చేశారు మిస్కిన్. -
తెలంగాణ గ్రూప్-2 పరీక్షల తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 29,30న గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం ముందు నుంచే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెల్లడించింది. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షా తేదీని నిర్ణయించామని అధికారులు పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో గ్రూప్-2 పోస్టులకు సంబంధించి 783 పోస్టులకు గానూ 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. జనవరి 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా.. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. చదవండి: నవీన్ హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన హసన్ -
ఇదే ఫైనల్ రిలీజ్ డేట్.. క్లారిటీ ఇచ్చిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
RRR Movie Officially Final Release Date Out By Makers: దర్శక ధీరుడు జక్కన్న, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్‌గా వస్తున్న చిత్రం చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). అయితే ఈ సినిమా ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగకుండా కరోనా, ఒమిక్రాన్, థియేటర్ ఆక్యుపెన్సీ వంటి పలు కారణాలతో వాయిదా పడింది. తర్వాత సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూసిన ప్రేక్షకులకు, అభిమానులకు మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఏదో ఒక తేదినే రిలీజ్ చేస్తారని అది మార్చి 18 అని ఒక రూమర్, కాదు కాదు ఏప్రిల్ 28నే అని మరొక పుకారు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ పుకార్లన్నింటికి చెక్ పెడుతూ తాజాగా ఏ తేదిన విడుదల చేయనున్నారో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇందులో ఎక్కువగా ఏప్రిల్ 28న విడుదల కానుందని ప్రచారం జరిగినా ఆ రెండు కాకుండా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు సార్లు ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది. ప్రకటించిన రిలీజ్ డేట్స్ జూలై 30. 2020 జనవరి 8 2021 అక్టోబర్ 13 2021 జనవరి 7, 2022 #RRRonMarch25th, 2022... FINALISED! 🔥🌊 #RRRMovie pic.twitter.com/hQfrB9jrjS — RRR Movie (@RRRMovie) January 31, 2022 -
‘టెట్’ గైడ్‌లైన్స్ ఖరారు
-
రాష్ట్రపతి శీతాకాల విడిది పర్యటన ఖరారు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది పర్యటన ఖరారైంది. వచ్చే నెల 18న ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. అప్పటి నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్‌లోనే ఉంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించే మహాచండీయాగానికి ప్రణబ్ హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. ప్రతి ఏడాది వేసవి, శీతాకాల విడిదికి రాష్ట్రపతి హైదరాబాద్‌కు రావడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది వేసవిలో ప్రణబ్ హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది శీతాకాల విడిదిని ఆయన అనారోగ్య కారణాల వల్ల రద్దు చేసుకున్నారు. రాష్ట్రపతి పర్యటన కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో ఆయనను పలు రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అవుతారు. -
మీడియాతో సునీతా లక్ష్మారెడ్డి
-
సచివాలయంలో తుదిదశకు విభజన
-
తుది దశకు రాష్ట్ర విభజన ప్రక్రియ