Its Official: RRR Movie Final Release Date Confirmed By RRR Team - Sakshi
Sakshi News home page

RRR Final Release Date: ఇదే ఫైనల్ రిలీజ్ డేట్​​.. క్లారిటీ ఇచ్చిన 'ఆర్​ఆర్​ఆర్'​ టీమ్​

Published Mon, Jan 31 2022 6:05 PM | Last Updated on Mon, Jan 31 2022 6:53 PM

RRR Movie Officially Final Release Date Out By Makers - Sakshi

RRR Movie Officially Final Release Date Out By Makers: దర్శక ధీరుడు జక్కన్న, యంగ్ టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్ స్టార్​ రామ్​ చరణ్​ కాంబోలో భారీ మల్టీ స్టారర్​గా వస్తున్న చిత్రం చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్ఆర్‌). అయితే ఈ సినిమా ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదలై అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోవాల్సింది. కానీ అలా జరగకుండా కరోనా, ఒమిక్రాన్​, థియేటర్ ఆక్యుపెన్సీ వంటి పలు కారణాలతో వాయిదా పడింది. తర్వాత సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూసిన ప్రేక్షకులకు, అభిమానులకు మార్చి 18 లేదా ఏప్రిల్​ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అయితే ఇటీవల ఏదో ఒక తేదినే రిలీజ్ చేస్తారని అది మార్చి 18 అని ఒక రూమర్​, కాదు కాదు ఏప్రిల్​ 28నే అని మరొక పుకారు సోషల్ మీడియాలో హల్​చల్​ చేశాయి. ఈ పుకార్లన్నింటికి చెక్​ పెడుతూ తాజాగా ఏ తేదిన విడుదల చేయనున్నారో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇందులో ఎక్కువగా ఏప్రిల్​ 28న విడుదల కానుందని ప్రచారం జరిగినా  ఆ రెండు కాకుండా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్​ స్పష్టం చేశారు. ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు సార్లు ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది.

ప్రకటించిన రిలీజ్ డేట్స్
జూలై 30. 2020
జనవరి 8 2021
అక్టోబర్ 13 2021
జనవరి 7, 2022
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement