fish hunter
-
చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో..
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన జరిగింది. కెన్నెడీ నదీ తీరంలో చేపల వేటకు వెళ్లిన కెవిన్ డార్మోడీ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతను కన్పించకపోవడానికి ముందు అరుపులు, కేకలు విన్పించినట్లు అక్కడున్న వాళ్లు తెలిపారు. దీంతో అధికారులు వెంటనే అతనికోసం సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఎలాంటి ఆనవాళ్లు కన్పించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. అయితే కెవిన్ అదృశ్యమైన ప్రాంతంలో రెండు భారీ రాక్షస మొసళ్లను గుర్తించారు అధికారులు. అవేమైనా అతడ్ని చంపి తిని ఉంటాయా అనే అనుమానంతో వాటిని షూట్ చేశారు. ఈ రెండు మొసళ్లలో ఒకటి 4.1 మీటర్ల పొడవు ఉండగా.. మరొకటి 2.8 మీటర్ల పొడవు ఉంది. వీటిలో ఓ మొసలి కడుపులో కెవిన్ మృతదేహం లభ్యమైంది. దీంతో అధికారులు అతడ్ని అధికారికంగా ధ్రువీకరించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇక్కడ ఇలాంటి ఘటన జరగడం రెండోసారి అని జాలర్లు తెలిపారు. గతంలోనూ ఓ వ్యక్తిని మొసళ్లు చంపాయని వెల్లడించారు. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. కెవిన్ వయసు 65 ఏళ్లు. ఓ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి చాలా కాలంగా చేపలు పట్టడం అలవాటని, ఇందులో ఎదురయ్యే ప్రమాదాల గురించి కూడా బాగా తెలుసుని స్నేహితుడు తెలిపాడు. కానీ కెవిన్ ఇలా చనిపోతాడని అసలు ఊహించలేదన్నాడు. చదవండి: మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్లోనే ఇద్దరూ మృతి -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
కొల్లాపూర్‌రూరల్: మండలపరిధిలోని పెంట్లవెల్లి శివారులో ఉన్న భీమా కాలువకు చేపల వేటకు ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. కటకల ఎల్లయ్య(57)నిత్యం చేపల వేటకు వెళ్లేవాడు. ఆదివారం భీమా కాలువకు చేపల వేటకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి, మునిగిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో మంగళవారం కాలువలో శవమై తేలాడు. మృతుడి భార్య గతంలోనే చనిపోయింది. ఒక కుమారుడు, ఓ కూతురు ఉండగా వారికి వివాహాలు అయ్యాయి. మద్దూరు: పాముకాటుకు ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని పల్లెర్ల పంచాయతీ పరిధిలో చంద్య్రనాయక్ తండాలో చోటు చేసుకుంది. తండావాసుల కథనం ప్రకారం.. బద్య్రనాయక్ కుమారుడు రాజునాయక్(12) మద్దూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో తనకు ఏదో కరిచిందని తల్లిదండ్రులకు తెలిపారు. పాముకాటు వేసినట్లు గుర్తించివారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, రాజు స్పృహ తప్పిపోయాడు. బైక్‌పై మద్దూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో నారాయణపేటకు ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.