చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
Published Wed, Sep 7 2016 1:51 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
కొల్లాపూర్‌రూరల్: మండలపరిధిలోని పెంట్లవెల్లి శివారులో ఉన్న భీమా కాలువకు చేపల వేటకు ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. కటకల ఎల్లయ్య(57)నిత్యం చేపల వేటకు వెళ్లేవాడు. ఆదివారం భీమా కాలువకు చేపల వేటకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి, మునిగిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో మంగళవారం కాలువలో శవమై తేలాడు. మృతుడి భార్య గతంలోనే చనిపోయింది. ఒక కుమారుడు, ఓ కూతురు ఉండగా వారికి వివాహాలు అయ్యాయి.
మద్దూరు: పాముకాటుకు ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని పల్లెర్ల పంచాయతీ పరిధిలో చంద్య్రనాయక్ తండాలో చోటు చేసుకుంది. తండావాసుల కథనం ప్రకారం.. బద్య్రనాయక్ కుమారుడు రాజునాయక్(12) మద్దూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో తనకు ఏదో కరిచిందని తల్లిదండ్రులకు తెలిపారు. పాముకాటు వేసినట్లు గుర్తించివారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, రాజు స్పృహ తప్పిపోయాడు. బైక్‌పై మద్దూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో నారాయణపేటకు ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
Advertisement