fishes hunt
-
మత్తడి దూకిన చెరువు.. రోడ్డు మీదే చేపల వేట
సాక్షి,కరీంనగర్: రెండు, మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల వల్ల జనజీవన అస్తవ్యస్తం కాగా.. చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఫలితంగా చెరువులో ఉండాల్సిన చేపలు రోడ్డు మీదకు కొట్టుకొచ్చాయి. వీటి కోసం జనాలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. భారీ వర్షాల కారణంగా జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. కథలాపూర్ మండలం సిరికొండలో చెరువు నిండి మత్తడి దూకింది. ఫలితంగా చేపలు రోడ్ల మీదకు కొట్టుకొచ్చాయి. వీటిని పట్టుకునేందకు గ్రామస్తులు భారీగా రోడ్ల మీదకు చేరుకున్నారు. ఎవరికి అందిన కాడికి వారు చేతపట్టుకుని ఇళ్లకు చేరారు. రానున్న 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావం వల్లే తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని.. ఇలాగే వర్షాలు పడతాయని వివరించారు. -
మత్స్యసిరి.. అలరారుతోంది
సాక్షి, నరసాపురం: నరసాపురం తీరం నెలరోజులుగా మత్స్యసిరితో అలరారుతోంది. రికార్డు స్థాయిలో మత్స్యసంపద దొరుకుతోంది. నిషేధం అనంతరం వేట ప్రారంభించిన మత్స్యకారుల పంట పండుతోంది. బోట్లు మత్స్యసిరితో నిండిపోతున్నాయి. సాదారణంగా వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లిన బోటు చేపలతో నిండడానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది. అయితే కొన్ని రోజులుగా ఇలా వేటకు వెళ్లినబోటు అలా నాలుగైదు రోజుల్లోనే తీరానికి చేరుకుంటోందని మత్ప్యకారులు చెబుతున్నారు. గత నెలరోజుల్లోనే తీరంలో దాదాపు రూ.300 కోట్ల విలువచేసే మత్స్యసంపద దొరికినట్టు అంచనా. గత ఏడాది కూడా జూన్, జూలై నెలల్లో పెద్ద ఎత్తున చేపలు దొరికాయి. కానీ గత ఏడాదికి మించి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎలాంటి విపత్తులూ లేకుండా ప్రకృతి కూడా కరుణించడంతో ముమర్మంగా వేటసాగుతోంది. ప్రస్తుతం తీరంలో వందల సంఖ్యలో మెకనైజ్డ్బోట్లు, ఫైబర్‌బోట్లు వేటసాగిస్తున్నాయి. మరెక్కడాలేని విధంగా.. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ తీరంతో సహా మరెక్కడా లేని విధంగా నరసాపురం తీరంలోనే అపార మత్స్య సంపద లభిస్తోంది. దీంతో ఇతర జిల్లాల నుంచి కూడా నరసాపురం తీరానికి బోట్లు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడటం వల్ల వరదనీరు సముద్రంలో కలుస్తుండడంతో నీటిపోటుకు మత్స్యసంపద పైకితేలుతోందని, అందుకే భారీగా వలలకు దొరకుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇదికాక ఎగువప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా, నరసాపురం తీరంలో ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల సముద్రగర్భం ఇబ్బందికరంగా మారడంతో జలచరాలు పైకితేలడం వల్లే సులువుగా వలలకు చిక్కుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 30 రోజుల్లో రూ 300 కోట్లపైనే వ్యాపారం కేంద్ర ప్రభుత్వం సముద్రంలో ఏటా 61 రోజులపాటు వేట నిషేధాన్ని అమలు చేస్తోంది. ఇటీవలే జూన్ 15వ తేదీతో వేట నిషేధ కాలం ముగిసింది. వేట నిషేధం గడువు ముగిసి నెల దాటింది. నరసాపురం తీరంలో ఈ నెల రోజుల్లో రూ.300 కోట్ల విలువైన మత్స్య సంపద లభించినట్టు సమాచారం. సందువా, సొర, మాగ, పండుగొప్ప రకాల చేపలు, గుడ్డు పీతలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక టైగర్ రకానికి చెందిన రొయ్యలూ దొరుకుతున్నాయి. ఈ రొయ్యిలను సీడ్ ఉత్పత్తి నిమిత్తం ముంబయ్, పూణెల్లోని పరిశోధనా కేంద్రాలకు పంపుతారు. దీంతో ఎగుమతిదారులు ఇటు నరసాపురం అటు అంతర్వేది రేవులకు చేరుకుని మత్స్యసంపదను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఇతర జిల్లాల బోట్లూ హల్చల్ నరసాపురం తీరంలో నిత్యం వేట ముమ్మరంగా సాగుతోంది. ఇక్కడ మత్స్యసంపద ఎక్కువగా దొరకడంతో ఇతర జిల్లాల నుంచి కూడా బోట్లు తరలి వస్తున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు, విశాఖపట్టణం, ప్రకాశం జిల్లాలకు చెందిన బోట్లు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుని వేట సాగిస్తున్నాయి. ప్రస్తుతం రోజూ తీరంలో 150 నుంచి 200 వరకూ బోట్లు వేట సాగిస్తున్నాయి. ఎగుమతులు పెరిగాయి మత్స్య ఎగుమతులు భారీగా పెరిగాయి. నెలరోజుల నుంచి నరసాపురం తీరంలో రూ.వందల కోట్లలో ఎగుమతులు జరుగుతున్నాయి. గత ఏడాది కూడా ఈ సీజన్లో పరిస్థితి ఇలాగే ఉంది. కాకపోతే గత సంవత్సరం కంటే రికార్డు స్థాయిలో దిగుబడి పెరిగింది. సందువా, సొర లాంటి రకాల ఎగుమతులు పెరిగాయి. – మేకల సతీష్, ఆక్వా వ్యాపారి ఇతర జిల్లాల బోట్లు వస్తున్నాయి నరసాపురం తీరంలో ముమ్మరంగా వేట సాగుతోంది. ఇక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతున్నాయని ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బోట్లు వస్తున్నాయి. ఇబ్బంది లేకుండా అన్ని బోట్లుకు చేపలు పడుతున్నాయి. సాధారణంగా జూలైలో తుపాన్ల ప్రమాదం ఉంటుంది. వేట సవ్యంగా సాగదు. ఆ ఇబ్బంది కూడా ఈ సారి లేకపోవడంతో వేట లాభసాటిగా మారింది. – పీతల ప్రసాద్, బోటు యజమాని -
చేపల వేటపై వివాదం
సాక్షి, మనుబోలు: మండలంలోని లక్ష్మీనరసింహపురంలో బంగారమ్మ చెరువుకు సంబంధించి చేపల వేట విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. దీంతో మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, గూడూరు రూరల్ సీఐ వంశీకృష్ణ, తహసీల్దార్ లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయంలో బంగారమ్మ చెరువు సొసైటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం బంగారమ్మ చెరువు చేపల సొసైటీని ఎల్‌ఎన్‌పురం, పిడూరు గ్రామాలకు వేర్వేరుగా విభజించి రెండు సొసైటీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 30 మంది సభ్యులతో ఎల్‌ఎన్‌పురం సొసైటీని ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా బంగారమ్మ చెరువులో చేపల వేట సాగిస్తున్నా తమకు రూపాయి కూడా పైకం చెల్లించ లేదని కొందరు సభ్యులు వాపోతున్నారు. ఈ ఏడాదైనా తమకు కూడా వాటా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొనడంతో ఓ వర్గం వారు తరచూ చేపల వేటను అడ్డుకుంటున్నారు. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. దీన్ని రెవెన్యూ కార్యాలయంలో పరిష్కరించుకోవాలని చెప్పడంతో స్పందించిన తహసీల్దార్ లక్ష్మీకుమారి సీఐ, మత్స్యశాఖ ఇన్స్పెక్టర్లను పిలిపించి తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. మత్స్య సంపదను కొల్లగొడుతున్న టీడీపీ నాయకుడు సమాశంలో కొందరు సభ్యులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు సొసైటీని తన గుప్పెట్లో పెట్టుకుని తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మత్స్య సంపదను కొల్లగొడుతున్నాడని ఆరోపించారు. కేవలం తనకు అనుకూలంగా ఉండే కొందరికి కొద్దిగా నగదు ఇచ్చి మిగిలినదంతా అతను దోచుకుంటున్నాడని తెలిపారు. అధికారులు స్పందించి చెరువులో చేపలపై అందరికీ హక్కు కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన తహసీల్దార్ లక్ష్మీకుమారి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చేపల వేటకు ఎవరికీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకూ కోడ్ ఉన్నందున ఎవరూ చెరువులో దిగవద్దని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వేట సాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నెలాఖరు వరకూ ఆగితే చెరువులో నీళ్లు తగ్గి చేపలు చనిపోతాయని కొందరు అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ చెరువులను పరిశీలించి నివేదక ఇవ్వాలని తహసీల్దార్ ఆదేశించారు. నివేదకను కలెక్టర్‌కు పంపించి అనుమతి ఇచ్చిన తరువాతే వేటకు దిగాలని సూచించారు. ఇరు వర్గాల ఘర్షణకు దిగితే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. -
ప్రాణం తీసిన చేప
కోటగిరి(బాన్సువాడ) : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్పూర్ గ్రామానికి చెందిన కూలీ షేక్ బషీర్(45) చేపలు పట్టేందుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు నిండాయి. ఈ నేపథ్యంలో షేక్‌బషీర్ మంగళవారం ఉద యం తన ఇంటి నుంచి కొందరు స్నేహితులతో కలిసి గ్రామ చెరువు సమీపంలోని వాగు వద్దకు వెళ్ళాడు. గ్రామ చెరువు అలుగు పారుతుండడంతో చెరువులోని చేపలు వాగులోకి కొట్టుకు రావడంతో గమనించిన షేక్‌బషీర్ కర్ర సహాయంతో చేపలను కొట్టాడు. చేప కిందపడడంతో దాన్ని పట్టుకునే ప్రయత్నంలో అదుపుతప్పి వాగులో పడిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు గమనించి గ్రామంలోకి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ సులోచన, జెడ్పీటీసీ పుప్పాల శంకర్, తహసీల్దార్ విఠల్, ఆర్ఐ కృష్ణదత్తు, అడీషనల్ ఆర్ఐ నజీర్, ఎస్ఐ రాజ్‌భరత్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి చెరువు వద్దకు చేరుకున్నారు. హంగర్గకు చెందిన మక్కయ్య అనే యువకుడు వాగులోకి వెళ్ళి గాలించగా మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చాడు. మక్కయ్య ప్రతిభను పలువురు అభినందించారు. మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు షేక్‌బషీర్ వాగులో పడి మృతి చెందాడనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషాదానికి గురయ్యారు. ప్రతిరోజు అందరితో కలుపు గొలుపుగా ఉండేవాడని క్షణాల్లో కళ్ళముందర ఉన్న వ్యక్తి మృతి చెందాడనే వార్త పలువురు జీర్ణించుకోలేక పోయారు. అక్కడికి చేరిన ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ధైర్యం చెప్పారు. మృతదేహం ఒడ్డుకు చేర్చే వరకు అక్కడే ఉన్నారు. -
చెరువును లూటీ చేశారు..
కురవి : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని వలల సాయంతో చేపలను పట్టుకెళ్లారు. అయితే మత్స్యకారులు చేపలు పట్టడం పూర్తయిందనే దష్ప్రచారంతోనే జనం తమ చెరువును లూటీ చేసినట్లు కార్మికులు ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవిలోని పెద్ద చెరువులో మత్స్యకార్మికులు కొన్నేళ్లుగా చేపలను పెంచుకుంటున్నారు. అయితే మత్స్యకార్మికులు చేపలు పట్టడం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో చెరువు వద్ద కాపలాగా ఉన్న కార్మికులపై వందలాది మంది దాడి చేసి చెరువులోకి దిగి చేపలను పట్టుకున్నారని మత్స్యకార్మికులు లింగరబోయిన శ్రీను, రేషబోయిన నారాయణ, కొణతం పెంటయ్య, మామిడి యాకన్న, వెంకన్న, వీరన్న, రాజు, కృష్ణ, వీరేందర్ తెలిపారు. చెరువులో చేపలు పుష్కలంగా ఉన్నాయని చెరువును వదిలిపెట్టలేదని వారు తెలిపారు. కురవికి చెందిన కొందరు వ్యక్తులు కుట్ర చేసి చెరువులో చేపలు పట్టడం పూర్తయిందని దుష్ప్రచారం చేశారని, దీంతో కురవి గ్రామస్తులు, తండా గిరిజనులతోపాటు సమీప గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వలలతో చేపలను పట్టుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయమై కురవి పోలీసులకు ఫిర్యాదు చేశామని కార్మికులు తెలిపారు. చేపలు అయిపోయాయనే.. చెరువులో చేపలు పట్టడం పూర్తయిందనే సమాచారంతో కురవితో పాటు చుట్టుపక్కల తండాలకు చెందిన గిరిజనులు, పలు గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని చెరువులో చేపలు పట్టుకున్నారు. దీంతో చెరువులో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. -
‘మీన్ తూటాల’తో ఉగ్ర దాడులు
* చేపల వేట పేలుడు పదార్థంతోనే పేలుళ్లు * హైదరాబాద్ సహా ఐదు చోట్ల పేలుళ్లకు ఐఎం వాడింది ఇవే * బెంగళూరు సీసీబీ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి బెంగళూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి శ్రీరంగం కామేష్: హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు ఇం డియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు ‘మీన్ తూటాల’ను వినియోగించినట్లు తాజాగా బయటపడింది. కర్ణాటకలోని తీర ప్రాంత మత్య్సకారులు చేపలవేటకు అక్రమంగా ఉపయోగించే పేలుడు పదార్థాన్నే ఉగ్రవాదులు వాడిన విషయం వెలుగులోకి వచ్చింది. 2010 నుంచి హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ సహా పుణే, ముంబై, బెంగళూరుల్లో జరిగిన ఐదు పేలుళ్లకు అవసరమైన బాంబుల తయారీకి ‘మీన్తూటా’లను సేకరించినట్లు బెంగళూరు సీసీబీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అఫాఖీ కీలక పాత్ర: దేశంలో విధ్వంసానికి కుట్రపన్నిన ఐఎం చీఫ్ రియాజ్ భత్కల్ ఇందు లో భాగంగా వివిధ నగరాల్లో పేలుళ్లకు వ్యూహ రచన చేశాడు. పేలుళ్లకు అవసరమైన పేలుడు పదార్థం సరఫరా బాధ్యతను 2010 నుంచి ఐఎం పేలుడు పదార్థం సరఫరా బృం దం (ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్) చీఫ్‌గా వ్యవహరిస్తున్న హోమియోపతి డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీకి అప్పగించాడు. అఫాఖీ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. 2009 వరకూ దేశంలో పేలుళ్లకు స్వయంగా అమ్మోనియం నైట్రేట్‌ను సేకరించిన రియాజ్ భత్కల్...తన కోసం తొమ్మిది రాష్ట్రాల పోలీసులు గాలిస్తుండటంతో మకాం పాకిస్తాన్‌కు మార్చాడు. ఈ నేపథ్యంలో పేలుడు పదార్థం సరఫరా బాధ్యతను అఫాఖీకి అప్పగించాడు. అఫాఖీ పాక్ యువతిని పెళ్లాడటం, తరచూ పాక్ వెళ్లొస్తుండటంతో అతన్ని ఈ‘పని’ కోసం ఎంచుకున్నాడు. ‘మీన్ తూటాల’పై కన్ను: భత్కల్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అఫాఖీ పేలుడు పదార్థాల సేకరణకు అనేక మార్గాలు అన్వేషించి చివరకు ‘మీన్ తూటాల’పై కన్నేశాడు. కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వలలతోపాటు ‘మీన్ తూటా’లను వినియోగిస్తుంటారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ ప్యాకెట్లో డిటోనేటర్ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్ వైర్ జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్నకుండలో పెట్టి కాస్త బరువుతో పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ పేలుడు ధాటికి వెలువడే షాక్ వేవ్స్ ప్రభావంతో చేపలన్నీ చనిపోయి పైకి తేలతాయి. దీన్నే మత్స్యకారులు ‘మీన్ తూటా’ అంటారు. ఇది నిషిద్ధం. స్క్రాప్ వ్యాపారి సద్దాం ద్వారా సరఫరా... కర్ణాటకలో మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)లో సభ్యుడైన స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్‌ను అఫాఖీ పావుగా వాడుకున్నాడు. అతని ద్వారా మీన్ తూటాలను తెప్పిం చుకునేవాడు. స్నేహితులతో కలసి చేపల వేట కు వెళ్లేందుకంటూ సద్దాం చేత ఉడిపి, రత్నగిరిల నుంచి ‘మీన్ తూటాలు’ తెప్పించేవాడు. ఈ జనవరి 26న భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన రియాజ్ భత్కల్ దాని కోసం అఫాఖీ ద్వారా 8 కేజీల పేలుడు పదార్థం, 100 డిటోనేటర్లు సమీకరించాడు. కానీ ఆలోపే అఫాఖీ సహా సద్దాం తదితరులు అరెస్టు కావడంతో పోలీ సులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.