five students
-
కాకినాడలో విషాదం: తీరానికి మృతదేహాలు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సూర్యారావుపేట బీచ్‌లో గత గురువారం గల్లంతైన ఐదుగురులో ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. యూ.కొత్తపల్లి మండలం సుబ్బంపేట తీరానికి వారి మృతదేహలు కొట్టుకు వచ్చాయి. అదేరోజు ముగ్గురి మృతదేహాలు వెలికితీయగా, నేడు మరో ఇద్దరి మృతదేహాలు తీరంలో కనిపించాయి. తాళ్లరేవు మండలం సుంకరపాలెం (కాపులపాలెం) పితానివారిపేటకు చెందిన పితాని గోవిందు, పితాని శ్రీను కుటుంబాలు, వారి చెల్లెలు శీలం తనుకులమ్మ కుటుంబం మొత్తం 18 మంది సభ్యులు టాటా ఏసు గూడ్స్ ఆటోలో పెద్దాపురం నియోజకవర్గంలోని కాండ్రకోట నూకాలమ్మతల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గురువారం సూర్యరావు పేట బీచ్ కి వచ్చారు. పితాని గోవిందు కుటుంబానికి చెందిన పితాని అనిత (16), పితాని రమ్య (18), పితాని వీరవంశీ (14), పితాని శ్రీను కుటుంబానికి చెందిన పితాని జయకృష్ణ (20), శీలం తనుకులమ్మ (30), శీలం దేవి (16) సముద్రంలోకి దిగిన వెంటనే ఓ రాకాసి అల వీరిని లోపలికి లాగేసుకుంది. సముద్రం ఒడ్డున ఉన్న కుటుంబ సభ్యులు చూస్తుండగానే వీరంతా మునిగిపోయారు. వారిని రక్షించేందుకు పితాని శ్రీను (36) సముద్రంలోకి దిగి సముద్రంలో కొట్టుకుపోయాడు. ఏడుగురిలో ఇద్దర్ని స్ధానికులు ఎలాగోలా కష్టపడి రక్షించారు. గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహలు ఆరోజే తీరానికి కొట్టుకువచ్చాయి. మిగిలిన ఇద్దరి మృదేహలు నాలుగురోజైన ఆదివారం తీరానికి కొట్టుకొచ్చాయి. సంబంధిత కథనాలు కాకినాడ బీచ్‌లో విషాదం కాటేసిన కడలి -
ఒకరికొకరం
హిందూపురంలోని కంసల పేటలో ఉన్న వివేకానంద మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఏడాది 1వ తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 2వ తరగతిలో ఒకరు, 3లో ఇద్దరు, 4లో ఒకరు, 5లో ఒకరు ఉన్నారు. గత విద్యాసంవత్సరంలో ఈ పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉండేవారు. వీరికి ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు అప్పట్లో పాఠ్యాంశాలు బోధించారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గింది... ఉపాధ్యాయుల సంఖ్య పెరిగింది. మున్సిపల్ పరిధిలోని ఇతర పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ అటుగా అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. -
కృష్ణమ్మ తీరంలో కన్నీటి ధార
* కృష్ణా జిల్లా నందిగామ వద్ద కృష్ణలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు * అందరూ జలసమాధి * తల్లిదండ్రులకు తీరని శోకం కృష్ణమ్మా.. పంట చేలకు ప్రాణం పోస్తున్నావనీ.. పచ్చని పసిరికల దాహం తీరుస్తున్నావనీ.. దేవాధిదేవులను అభిషేకిస్తున్నావనీ.. కవులకు కవన రీతులు నేర్పుతున్నావనీ.. కళాకారుల్లో నవ చైతన్యం రగిలిస్తున్నావనీ.. నిన్ను కల్పవల్లిగా కొలుస్తున్నారే..! కొంగు బంగారంగా నిన్ను కీర్తిస్తున్నారే.. మేమూ నిన్ను పూజించాం.. నిన్ను కొలిచాం.. మా ఇంటి దీపాలను నీలో ఐక్యం చేసుకున్నావు.. కన్నపేగునూ తెచ్చివ్వూ...! నందిగామ రూరల్/చందర్లపాడు: మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య కృష్ణా నదిలో జరిగిన ఈ ఘోరం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, నందిగామ, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో విషాదం నింపింది. చేతికంది వచ్చిన కుమారులను కోల్పోయి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతులంతా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే... రేపో మాపో తమ బిడ్డలు ఉద్యోగం చేస్తారు... తమను జీవితాంతం సంతోషంగా చూసుకుంటారని ఆశించిన తల్లిదండ్రుల ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. కళాశాల నుంచి సాయంత్రం కల్లా ఇంటికి తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు బిడ్డల చావు కబురు అందడంతో వారంతా ఒక్కసారిగా హతాశులయ్యారు. ఒకే కళాశాలలో, ఒకే బెంచ్‌లో కూర్చునే నలుగురు మిత్రులు కలసే మృత్యు ఒడిలోకి చేరుకోవడం సహచర విద్యార్థులను కలచివేసింది. ఘటనాస్థలానికి పరుగు పరుగున వచ్చి మిత్రుల కోసం గాలించారు. ఇకలేరని తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పుడూ సంతోషంగా, సరదాగా ఉండే మిత్రులను చూసి మృత్యువుకు కూడా కన్ను కుట్టిందని, అందుకే 20 ఏళ్లు కూడా నిండక ముందే తనలో కలిపేసుకుందని తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. సబ్ కలెక్టరు సృజన, రెండు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. హరీష్.. లే.. తండ్రీ! చందర్లపాడు మండలం, తోటరావులపాడు గ్రామానికి చెందిన ములకలపల్లి హరీష్‌ది మధ్య తరగతి కుటుంబం. తండ్రి ముకుందరావు చిన్న తరహా రైతు, కుటుంబ పోషణ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారమూ చేస్తున్నారు. ముగ్గురు సంతానంలో హరీష్ చిన్నవాడు కావడంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. నందిగామలోని చైతన్య కళాశాలలో బి.కాం ఫైనలియర్ విద్యార్థి. కలుపుగోలుగా ఉండే హరీష్‌ది సున్నిత మనస్తత్వం. హరీష్ మరణంతో తల్లిదండ్రులు, అక్క, అన్న శోక సంద్రంలో మునిగిపోయారు, గోపీ ఏమయ్యావయా.. చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పాశం గోపిరెడ్డిది తండ్రి వెంకటేశ్వర రెడ్డి,మామూలురైతు. గోపిరెడ్డి, ఒక చెల్లెలు సంతానం. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. చేతికంది వచ్చిన కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, తమలా కాకుండా మంచి ఉద్యోగం చేయాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టపడి చదివిస్తున్నామని, మంచి ఉద్యోగం చేస్తాడని అనుకుంటే తమపై విధికి కన్నుకుట్టిందని విలపించారు. హరీ ఆశలన్నీ నీపైనే..∙ నందిగామకు చెందిన కొమ్మవరపు హరిగోపి తండ్రి రమణారావు కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. శుభ కార్యాలకు డోలు సన్నాయి వాయిస్తూ బతుకు బండిని లాగుతున్నారు. మృతుడు హరిగోపికి చెల్లెలు కూడా ఉంది. కొడుకును ప్రయోజకుణ్ణి చేయాలన్న పట్టుదలతో కష్టమైనా శక్తికి మించి కొడుకును చదివిస్తున్నాడు. ఊహించని దుర్ఘటనతో తల్లిదండ్రులు కుమిలికుమిలి రోదిస్తున్నారు. లోకేషా.. అండగా ఉంటావనుకుంటే.. నందిగామ పట్టణానికి చెందిన కూచి లోకేష్ తండ్రి శ్రీనివాసరావు డ్రైవర్‌గా పనిచేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇరువురు మగ పిల్లల్లో లోకేష్ పెద్ద కుమారుడు. కొడుకులు ప్రయోజకులైతే శేష జీవితం హాయిగా, ఆనందంగా గడుస్తుందని భావించిన శ్రీనివాసరావుకు పెద్ద కుమారుడి మరణం అశనిపాతమైంది. కుమారుడి మృతదేహం వద్ద అతను రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. ఎంతపని చేశావ్ నగేషా.. వీరులపాడు మండలం, జయంతి గ్రామానికి చెందిన నందిగామ నగేష్‌ది సామాన్య మధ్య తరగతి కుటుంబం. నగేష్ తండ్రి రాజగోపాలాచారి వెల్డింగ్ వర్క్ చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయని. నగేష్‌కు అక్క కూడా ఉంది. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన కొడుకు తిరిగి రాని లోకాలకు తరలిపోవడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా బాధిత తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. పుష్కర స్నానానికి వచ్చి మృతిచెందగా, ఈతకు వచ్చి చనిపోరని పుకార్లు రావడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వచ్చి ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. సబ్ కలెక్టర్ సృజన తీరుపైనా అసహనం వ్యక్తం చేశారు. -
గేటు ముందు పోలీసులు.. గేటు లోపల విద్యార్థులు
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దేశ ద్రోహం పేరిట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్‌తో సహా ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కన్హయ్యతోపాటే వీరిని అరెస్టు చేయాల్సి ఉన్నప్పటికీ వారు ఆ సమయంలో తప్పించుకున్నారు. తాజాగా వారంతా క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలిసింది. అయితే, ఇటీవల తలెత్తిన పరిణామాల కారణంగా యూనివర్సిటీలోకి పోలీసులకు అనుమతి లేదు. దీంతో పోలీసులు ఆ విద్యార్థుల అరెస్టు కోసం గేటు బయటే పడిగాపులు కాస్తుండగా విద్యార్థులు మాత్రం గేటు అవతల క్యాంపస్‌లో ఉన్నారు. దీంతో ఆ ఐదుగురు విద్యార్థుల విషయం ఏం చేద్దామని జేఎన్‌యూ అధికారులు ప్రస్తుతం సమావేశమై చర్చిస్తున్నారు. కాగా, ఈ సమావేశం పూర్తయిన తర్వాత వర్సిటీ వీసీతో మాట్లాడి ఆ విద్యార్థులను తమకు సరెండర్ అవ్వాల్సిందిగా పోలీసులు కోరనున్నట్లు తెలిసింది. ఇక వర్సిటీ రిజిస్ట్రార్ భూపేందర్ జూషి మాట్లాడుతూ ఆ విద్యార్థులు క్యాంపస్ లోనే ఉన్నట్లు తనకు కూడా ఇప్పుడే తెలిసిందని అన్నారు. దానిపై స్పష్టత మాత్రం లేదని, మీడియా ద్వారానే తనకు ఆ సమాచారం తెలిసిందన్నారు. ఆ విద్యార్థులతో మాట్లాడుతారా? పోలీసులతో మాట్లాడతారా? విద్యార్థుల అరెస్టు కోసం పోలీసులను క్యాంపస్ లోకి అనుమతిస్తారా అనే విషయం మాత్రం సమాధానం దాట వేశారు.తమ సమావేశం పూర్తయ్యాక ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్తానని అన్నారు. -
ఐదుగురు విద్యార్థుల అదృశ్యం
మోపిదేవి (కృష్ణా): గురుకుల పాఠశాల వసతి గృహం నుంచి ఐదుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో నివసించే ఐదుగురు విద్యార్థులు శనివారం నుంచి కనిపించకుండా పోవడంతో ఆ హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
టీవీ సీరియళ్ల మాయకు విద్యార్థి బలి
బాలుడిని హత్య చేసిన ఐదుగురు విద్యార్థులు మాల్దా: టీవీ సీరియళ్ల ప్రభావం వారి జీవితాలను నాశనం చేసింది. సీరియల్‌ను చూసి అందులో చూపించినట్టుగా చేయడంవల్ల ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు విద్యార్థులు ఊచలు లెక్కపెడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాజిల్లా బామన్‌గోలా ప్రాంతంలో తొమ్మిదినుంచి పన్నెండో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు తమ స్కూల్‌కే చెందిన ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేశారని శుక్రవారం పోలీసులు తెలిపారు. గత మంగళవారం వీరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, మర్నాడు ఆ విద్యార్థి తండ్రికి ఫోన్‌చేసి రూ. 10 లక్షలు తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేశారని చెప్పారు. విద్యార్థి తండ్రి తమకు ఈ విషయం తెలపడంతో వారు చెప్పిన ప్రదేశానికి వెళ్లి ఇద్దరిని అరెస్టు చేశామని, అక్కడే ఆ విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నామని పోలీసులు వెల్లడించారు. ఓ టీవీ సీరియల్‌ను చూసి తాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వారు చెప్పారని పోలీసులు వివరించారు. అరెస్టయిన విద్యార్థులకు కోర్టు రిమాండ్ విధించింది.