బాలుడిని హత్య చేసిన ఐదుగురు విద్యార్థులు
మాల్దా: టీవీ సీరియళ్ల ప్రభావం వారి జీవితాలను నాశనం చేసింది. సీరియల్‌ను చూసి అందులో చూపించినట్టుగా చేయడంవల్ల ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు విద్యార్థులు ఊచలు లెక్కపెడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాజిల్లా బామన్‌గోలా ప్రాంతంలో తొమ్మిదినుంచి పన్నెండో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు తమ స్కూల్‌కే చెందిన ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేశారని శుక్రవారం పోలీసులు తెలిపారు.
గత మంగళవారం వీరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, మర్నాడు ఆ విద్యార్థి తండ్రికి ఫోన్‌చేసి రూ. 10 లక్షలు తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేశారని చెప్పారు. విద్యార్థి తండ్రి తమకు ఈ విషయం తెలపడంతో వారు చెప్పిన ప్రదేశానికి వెళ్లి ఇద్దరిని అరెస్టు చేశామని, అక్కడే ఆ విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నామని పోలీసులు వెల్లడించారు. ఓ టీవీ సీరియల్‌ను చూసి తాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వారు చెప్పారని పోలీసులు వివరించారు. అరెస్టయిన విద్యార్థులకు కోర్టు రిమాండ్ విధించింది.
టీవీ సీరియళ్ల మాయకు విద్యార్థి బలి
Published Sat, Feb 15 2014 2:45 AM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM
Advertisement
Advertisement