flemingo
-
ధోని పక్కా వ్యూహం.. వారి వయసు 35 ఏళ్లకు పైనే..
సాక్షి క్రీడా విభాగం: ‘మేం వచ్చేసారి బలంగా తిరిగొస్తాం... అభిమానులకు ఇదే నా సందేశం’... గత ఏడాది ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ధోని చేసిన వ్యాఖ్య ఇది. జట్టుపై, తనపై ఎంత నమ్మకముంటే ధోని ఇలాంటి మాటలు చెప్పగలడు. ఎందుకంటే అతను ధోని కాబట్టి! చూస్తుంటే టీమ్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. వయసు పెరిగిపోయి, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఆటగాళ్లతో ఈసారే కాలేదు, వచ్చే ఏడాది ఏమవుతుంది అని అన్ని వైపుల నుంచి వ్యంగ్య స్పందనలు. కానీ ఇలాంటి స్థితి నుంచి టీమ్‌ను నిజంగా విజేతగా నిలపడం అంటే అసాధారణం. సీఎస్కేకు తొలి సీజన్ నుంచి కర్త, కర్మ, క్రియ అన్నీ ధోనినే. జట్టు గెలిచినా, ఓడినా, చాంపియన్‌షిప్‌లు సాధించినా అంతా అతని సారథ్యం అనడంలో సందేహం లేదు. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే నమ్మింది. ఇన్నేళ్ల విజయాల్లో భిన్న ఆటగాళ్లు తమదైన పాత్ర పోషించారు. కానీ మారనిది ధోని, అతని వ్యూహ చతురతే! సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్లో 40 ఏళ్ల ధోని బ్యాటింగ్ చూస్తే సూపర్ కింగ్స్ పది మంది ఆటగాళ్లు, ఒక కెప్టెన్‌తో ఆడినట్లు ఉంది. కేవలం నాయకత్వం కారణంగానే అతను టీమ్‌లో ఉన్నాడనేది వాస్తవమైతే అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టే టీమ్ ఇలా పురోగమించిందనేది కూడా అంతకంటే వాస్తవం! చెన్నై టీమ్‌లో ఐదుగురు ఆటగాళ్లు 35 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. టి20లు అనగానే ఈ విషయంలో కాస్త సంశయం కనిపిస్తుంది. అయితే బరిలోకి దిగి అద్భుతాలు చేసేందుకు వారికి వయసు అడ్డు రాలేదు. వీరంతా టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 37 ఏళ్ల డు ప్లెసిస్ ఏకంగా 633 పరుగులతో సత్తా చాటి ఓపెనర్‌గా శుభారంభాలు అందించాడు. 38 ఏళ్ల బ్రావో 14 కీలక వికెట్లు తీసి తాను చెన్నై బృందంలో సుదీర్ఘ కాలంగా ఎందుకు కొనసాగుతున్నాడో చూపించాడు. 34 ఏళ్ల సీనియర్, అత్యంత విజయవంతమైన చెన్నై ఆటగాడు సురేశ్ రైనా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుంటే మరో 35 ఏళ్ల రాబిన్ ఉతప్పను తుది జట్టులోకి తీసుకొని చేసిన వ్యూహం సూపర్‌గా పేలింది. తొలి క్వాలిఫయర్‌లో మెరుపు బ్యాటింగ్ చేసిన ఉతప్ప, ఫైనల్లో జట్టు ఒత్తిడిలోకి వెళుతున్న సమయంలో 3 సిక్సర్లతో ఆట మార్చేశాడు. 36 ఏళ్ల రాయుడు కూడా కీలక సమయంలో రెండు అర్ధ సెంచరీలతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక ఐపీఎల్ గెలిచిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచిన 34 ఏళ్ల మొయిన్ అలీని కూడా ధోని సమర్థంగా వాడుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు అతని చక్కటి ఫీల్డింగ్ జట్టుకు ఎంతో పనికొచ్చాయి. ఎప్పటిలాగే రవీంద్ర జడేజా తనదైన శైలిలో అన్ని రంగాల్లో రాణించడం చెన్నై బలాన్ని పెంచింది. ఇక టీమ్ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ పేరు రుతురాజ్ గైక్వాడ్. గత ఏడాది ఐపీఎల్ సమయంలో అనూహ్యంగా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఆరంభంలో విఫలమైనా... చివరి మ్యాచ్‌లలో సత్తా చాటాడు. ఈసారి తనలోని పూర్తి స్థాయి ఆటను చూపిస్తూ సెంచరీ సహా 635 పరుగులు సాధించడం చెన్నై టైటిల్ విజయంలో కీలకంగా మారింది. వీరందరినీ సమర్థంగా వాడుకుంటూ ధోని నడిపించిన తీరు నాయకుడిగా అతని వన్నె ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. చివరగా... వచ్చేసారి ఐపీఎల్లో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఇంకా నియమ నిబంధనలు ఏమిటనేది బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే విజేతలుగా నిలిచిన ఈ టీమ్‌లోని సభ్యుల్లో కూడా ఎంత మంది మళ్లీ ఐపీఎల్లో కనిపిస్తారనేది వేర్వేరు కారణాలతో సందేహమే. ఒకవేళ ఆడినా ఇదే సక్సెస్ఫుల్ టీమ్ ఒక్క చోటికి చేరడం సహజంగానే కష్టం. ఈ నేపథ్యంలో వీరు సాధించిన విజయపు ఘనత చిన్నదేమీ కాదు. చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు, సగటు క్రికెట్ అభిమాని కూడా... ఏం ఆడిందిరా ఈ టీమ్ అనేలా ఘనంగా చెన్నై ముగింపు పలికింది. -
కనువిందు చేస్తున్న దృశ్యాలు..
కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా కాలుష్యం తగ్గి నదులు తేటపడుతున్నాయి. గాలి నాణ్యత పెరుగుతోంది. అల్లంతదూరాన ఠీవీగా నిలుచుని ఉన్న పర్వతాలను చూసే అవకాశం ప్రజలకు దక్కుతోంది. ఇక ఇన్నాళ్లు అడవులకే పరిమితమైన జంతువులు, పక్షులు బయటకు వస్తున్నాయి. ప్రకృతి ఒడిలో స్వేచ్చగా విహరిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. తాజాగా ముంబైలో పింక్ ఫ్లెమింగోలు ఒక్కచోట చేరిన ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. (నింగి నాట్యమాడుతోంది. నేల విహంగమౌతోంది) గురువారం ఉదయం నవీ ముంబైలోని ఓ సరస్సు వద్ద వందలాది ఫ్లెమింగోలు ఒక్కచోట చేరి కనువిందు చేశాయి. సరస్సును గులాబీమయం చేశాయి. కాగా బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వివరాల ప్రకారం గతేడాది కంటే ఈ ఏడాది 25 శాతం ఎక్కువ సంఖ్యలో ఫ్లెమింగోలు ఇక్కడికి వలస వచ్చాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే దాదాపు లక్షన్నర పక్షులు ఇక్కడికి చేరుకున్నాయి. వీటిలో కొన్ని రాజస్తాన్‌లోని సాంబార్ సరస్సు నుంచి.. ఇంకొన్ని గుజరాత్ రాణా ఆఫ్ కచ్.. మరికొన్ని పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి వలస వచ్చాయి. -
అయ్యో! అవి కొట్టుకోవడం లేదు.. కానీ
-
అయ్యో! అవి కొట్టుకోవడం లేదు..
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్‌కు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయన తన ట్విటర్లో చాలాసార్లు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ సంబంధించినవి చాలానే షేర్ చేసుకొన్నాడు. తాజాగా కస్వాన్ షేర్ చేసిన వీడియో ఒకటి చాలా ఆసక్తికరంగా ఉండి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఒక ఫ్లెమింగో పక్షి తన ముక్కుతో మరో ఫ్లెమింగో తలపై రక్తం వచ్చేలా పొడుస్తూనే ఉంది. ఫ్లెమింగోకు రక్తం దారలా పోతున్నా అది మాత్రం తన మిత్రునిపై ఎటువంటి ప్రతిదాడి చేయకపోవడం ఏంటనే చిన్న డౌటు వచ్చింది. అయితే మనం అనుకుంటున్నట్టుగా వీడియోలో అవి కొట్టుకోవడం లేదట.. వాటి పిల్లలకు ఆహారం అందించేందుకు అలా చేసాయని వీడియో చూస్తే గానీ అర్థం కాలేదు. అసలు విషయం ఏంటంటే.. ఫ్లెమింగోలు తన పిల్లలకు ఆహారాన్ని అందించేందుకు తలపై భాగంలో ఉన్న ఎలిమెంటరీ కెనాల్లో క్రాప్ మిల్క్ రూపంలో నిల్వ చేసి పెడుతుంది. ఫ్లెమింగో తన తిన్న ఆహారంలో జీర్ణం కాకముందే కొంతభాగాన్ని ఎలిమెంటరీ కెనాల్‌లోనే క్రాప్ మిల్క్ రూపంలో ఉంచుకుంటుంది. ఆ క్రాప్ మిల్క్లోనే తన పిల్లలకు కావాల్సిన ప్రొటీన్,ఫాట్ పదార్థాల మిశ్రమం కలిసి ఉంటాయి. ఫ్లెమింగో తన పిల్లలు సొంతంగా ఆహారాన్ని సంపాదించుకునే వరకు వాటికి ఈ క్రాప్ మిల్క్ ద్వారానే ఆహారం అందిస్తుంది. అయితే తన పిల్లలకు ఆహారం అందించడానికి తనతో జత కట్టిన పక్షి ముక్కు సహాయంతో తలపై పొడవడం ద్వారా రక్తం రూపంలో క్రాప్ మిల్క్‌ను తన పిల్లలకు అందిస్తుంది. అయితే వీడియోనూ నిశితంగా పరిశీలిస్తే రక్తం ద్వారా బయటకు వచ్చే క్రాప్ మిల్క్‌ను బుల్లి ఫ్లెమింగో ఆహారాన్ని తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. పర్వీన్ కస్వాన్ షేర్ చేసిన ఈ వీడియానూ దాదాపు 35వేల మందికి పైగా వీకక్షించడం విశేషం. No they are not fighting. This is one of the most amazing thing in nature. Parent flamingos produce crop milk in their digestive tracts & regurgitate it to feed young ones. See how together they are doing it. Source: Science Channel. pic.twitter.com/GrJr4irGox — Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 20, 2020 -
ఒంటికాలి జపం అందుకేనట!
వాషింగ్టన్ : ఫ్లెమింగోలు..రెండు కాళ్లపై కాకుండా ఒంటికాలిపైనే ఎందుకు నిలబడతాయో తెలుసా. వాటికి రెండు కాళ్లపై నిలుచోవడం కంటే ఒకదానిపై నిలబడడమే తేలిక. అంతేకాకుండా ఈ భంగిమలో నిలబడడం వల్ల వాటికి తమ శక్తి ఆదా అవుతుందట, ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒంటికాలిపై నిలబడిన సమయంలో కండర సంబంధమైన పనులేవీ అవి చేయవని, పనిలో పనిగా ఓ కునుకు సైతం తీయగలుగుతాయని తెలిపారు. ఈ భంగిమ వల్ల వాటికి కండరాల అలసట ఉండదని గతంలో అంతా భావించేవారు. అందుచేతనే అవి కాలు మార్చుకుంటాయే తప్ప రెండుకాళ్లను ఏకకాలంలో వినియోగించడానికి ఇష్టపడవని తెలిపారు. ఈ తరహా ప్రవర్తనద్వారా అవి తమ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయని జార్జియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ,. ఎమోరి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఈ ట్రిక్కు వెనుకగల అనేక యాంత్రిక రహస్యాలను వారు వెలుగులోకి తీసుకొచ్చారు. -
ఫ్లెమింగోలు ఎంత పిరికివో!
అరణ్యం ఫ్లెమింగోలు నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరోప్‌లలో వీటి సంఖ్య అధికం! ఫ్లెమింగోలు పుట్టినప్పుడు బూడిదరంగులో ఉంటాయి. కానీ వాతావరణంలోని మార్పులు, కెరోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వంటి కారణాల వల్ల వాటి శరీరం ముదురు ఆరెంజ్, గులాబి రంగుల్లోకి మారుతుంది! ఇవి నీటిలో ఎప్పుడూ ఒంటికాలి మీదే నిలబడతాయి. ఎక్కువసేపు నీటిలో ఉండటం వల్ల తమ శరీరంలోని ఉష్ణత బయటకు పోకూడదని అలా చేస్తాయి! ఇవి అద్భుతంగా ఈత కొడతాయి. కాకపోతే నీరు బాగా లోతుగా ఉండాలి. లేదంటే ఈదలేవు. కానీ ఎగరడంలో ఇవి దిట్టలు. గంటకు ముప్ఫై అయిదు కిలోమీటర్లు ఎగరగలవు! ఫ్లెమింగోల గుంపును ఫ్లాక్ అంటారు. ఎప్పుడూ గుంపులు గుంపులుగానే ఉంటాయి. దానికి కారణం... భయమే. ఇవి నీటిలో వేటాడేటప్పుడు గంటలపాటు తమ తలను నీటిలోపల పెట్టి ఉంచుతాయి. ఆ సమయంలో శత్రువులు దాడి చేస్తుంటాయి. అందుకే కొన్ని వేటాడుతూ ఉంటే, కొన్ని కాపలా కాస్తుంటాయి! ఇవి చాలా పిరికివి. ఇవి శత్రువులతో పోరాడవు, పోరాడలేవు. భయంతో ఎగిరిపోయి తమను తాము కాపాడుకుంటాయి... అంతే! వీటి మెడ నిర్మాణం చాలా విచిత్రంగా ఉంటుంది. పొడవుగా, పాములాగా ఉండే ఈ మెడలో మొత్తం 19 ఎముకలు ఉంటాయి! ఆడ ఫ్లెమింగోలు సంవత్సరానికి ఒకే ఒక్క గుడ్డు పెడతాయి. పొరపాటున ఈ గుడ్డుకు ఏదైనా అయినా కూడా మరో గుడ్డు పెట్టేందుకు ప్రయత్నించవు! వీటికి పరిశుభ్రత చాలా ఎక్కువ. రోజులో ఎక్కువభాగం ఇవి తమ శరీరాన్ని శుభ్రపరచుకోవడానికే ఉపయోగిస్తాయి! ఇవి తమ కాళ్లను వెనక్కి మడిచి, మనుషుల మాదిరి మోకాళ్ల మీద కూర్చోగలవట! మూగజీవే... కానీ మనసున్న జీవి! మే 18, 2003. యూకే. ఓ నది ఒడ్డున షెరిల్ స్మిత్ తన వీల్ చెయిర్లో కూర్చుని ఉంది. సాయంత్రపు చల్లదనాన్ని ఆస్వాదిస్తోంది. ఆమె పెంపుడు కుక్క ఓర్కా అటూ ఇటూ పరుగులు తీస్తూ అల్లరి చేస్తోంది. దాని తుంటరి వేషాలు చూస్తూ నవ్వుతోంది షెరిల్. తన వీల్ చెయిర్ని అటూ ఇటూ తిప్పుతూ ఓర్కాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అంతలోనే జరిగింది ఓ ఊహించని సంఘటన. షెరిల్ వీల్ చెయిర్ చక్రం బలంగా ఓ రాయిని ఢీకొని పట్టు తప్పింది. షెరిల్ అంతెత్తున ఎగిరి నదిలోకి పడిపోయింది. ఈదలేదు. నీరు చల్లగా గడ్డ కట్టించేలా ఉంది. అందులోనే కొట్టుమిట్టాడసాగింది షెరిల్. ఎవరైనా వచ్చి కాపాడితే బాగుణ్ను అనుకుంది కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇక తన పని అయిపోయింది అనుకుంది. కానీ ఆమెనలా చూసిన ఓర్కా ఆగలేకపోయింది. పరుగు పరుగున వెళ్లింది. ఆ చుట్టుపక్కలంతా తిరిగింది. ఆ దారిన పోతున్న ఓ వ్యక్తిని అడ్డగించింది. అతడి ప్యాంటు పట్టుకుని లాగి, తనతో రమ్మంటూ మారాం చేసింది. ఏదో జరిగిందని అర్థమై ఆ వ్యక్తి దాన్ని అనుసరించాడు. ప్రమాదం నుంచి షెరిల్ని కాపాడాడు. తన జీవితం ఓర్కా పెట్టిన భిక్ష అని ఇప్పటికీ అంటూ ఉంటుంది షెరిల్!