flight disaster
-
మా నాన్నను తప్పుపట్టొద్దు
విమానం కుప్పకూలిపోవడంలో తమ తండ్రిని తప్పు పట్టొద్దని ఎయిర్ ఏషియా విమాన పైలట్ ఇర్యాంటో కూతురు ఏంజెలా చెబుతోంది. చిట్ట చివరి నిమిషం వరకు ఆయన విమానాన్ని, అందులో ప్రయాణికులను కాపాడేందుకే ప్రయత్నించారని, ఆమాటకొస్తే.. అసలు ఏ పైలట్ కూడా ప్రయాణికులకు హాని కలిగించాలని అనుకోరని ఆమె చెప్పింది. పైగా కెప్టెన్ ఇర్యాంటో కూతురిగా తాను ఆ విషయాన్ని అసలు ఒప్పుకోనని తెలిపింది. ఆయన కూడా ప్రమాదంలో మరణించారని, ఇప్పటికి ఇంకా అసలాయన మృతదేహం కూడా లభించలేదని.. దాంతో తమ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని చెప్పింది. జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం క్యూజడ్850లో సిబ్బంది సహా మొత్తం 162 మంది ఉండగా కేవలం 34 మృతదేహాలను మాత్రమే ఇంతవరకు వెలికితీశారు. బ్లాక్ బాక్స్ కూడా ఇంకా బయటపడలేదు. అది వస్తే తప్ప చివరి నిమిషంలో ఏం జరిగిందన్నది తెలుసుకునే అవకాశం లేదు. ఈలోపు పైలట్ ఇర్యాంటోను తప్పుబట్టడం సరికాదని ఆయన కుమార్తె ఏంజెలా చెప్పింది. -
ఎయిర్ ఏషియా ప్రమాదం: 40 మృతదేహాలు లభ్యం
జకార్తా : సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం ప్రమాదం ఘటనలో మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 40కి పైగా మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల ఆచూకీ కనుగొనేందుకు చర్యలను వేగవంతం చేశారు. విమానం కూలిపోయినట్టుగా ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించిన ప్రాంతంలో తొలుత శకాలలను గుర్తించారు. ఆ ప్రాంతంలోనే కొన్ని మృతదేహాలు సముద్రంలో తేలియాడుతుండటంతో వాటిని వెలికితీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మృతదేహాలు బాగా ఉబ్బినా.. అవి పాడవ్వలేదని, వాటిని ఇండోనేషియా నౌకాదళానికి చెందిన ఓ నౌక నుంచి తీరానికి తీసుకొచ్చామని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ డైరెక్టర్ ఎస్.బి. సుప్రియాదీ తెలిపారు. ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రమాదం బారి నుంచి బయటపడ్డారా అనే విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది. -
ఎయిర్ ఏషియా ప్రమాదం: మృతదేహాలు లభ్యం
ఎయిర్ ఏషియా విమానం కూలిపోయినట్లు ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించిన కొద్దిసేపటికే.. ఆ ప్రాంతంలోనే కొన్ని మృతదేహాలు సముద్రంలో తేలియాడుతున్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఇండోనేసియా అధికారులు తెలిపారు. మృతదేహాలు బాగా ఉబ్బినా.. అవి పాడవ్వలేదని, వాటిని ఇండోనేషియా నౌకాదళానికి చెందిన ఓ నౌక నుంచి తీరానికి తీసుకొచ్చామని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ డైరెక్టర్ ఎస్.బి. సుప్రియాదీ తెలిపారు. విమానం రాడార్ పరిధినుంచి తప్పిపోయిన ప్రాంతానికి సరిగ్గా పది కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను తొలుత గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేయగా.. కొన్ని మృతదేహాలు కూడా కనిపించాయి. దాంతో విమానం సముద్రంలోనే కూలిపోయిందని స్పష్టంగా తెలిసింది. ఇక ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రమాదం బారి నుంచి బయటపడ్డారా అనే విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది.