
ఎయిర్ ఏషియా ప్రమాదం: 40 మృతదేహాలు లభ్యం
జకార్తా : సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం ప్రమాదం ఘటనలో మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 40కి పైగా మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల ఆచూకీ కనుగొనేందుకు చర్యలను వేగవంతం చేశారు.
విమానం కూలిపోయినట్టుగా ఇండోనేషియా ప్రభుత్వం నిర్ధారించిన ప్రాంతంలో తొలుత శకాలలను గుర్తించారు. ఆ ప్రాంతంలోనే కొన్ని మృతదేహాలు సముద్రంలో తేలియాడుతుండటంతో వాటిని వెలికితీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మృతదేహాలు బాగా ఉబ్బినా.. అవి పాడవ్వలేదని, వాటిని ఇండోనేషియా నౌకాదళానికి చెందిన ఓ నౌక నుంచి తీరానికి తీసుకొచ్చామని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ డైరెక్టర్ ఎస్.బి. సుప్రియాదీ తెలిపారు. ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్న 162 మందీ మరణించారా.. లేక ఎవరైనా ప్రమాదం బారి నుంచి బయటపడ్డారా అనే విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది.